1. శుభోదయం మిత్రులారా! నేను బినోద్ మిశ్రా. మీరు ఆన్ లైన్ సాఫ్ట్ స్కిల్స్ ఉపన్యాసాలు వింటున్నారు. 2. ఈ రోజు మనము సమూహ సమ్యూనికేషన్ నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. 3. దీనికంటే ముందు నివేదికలు, మేమోల గురించి చర్చించుదాం. 4. పాజిటీవ్ తింకింగ్ ఉపన్యాసంలో చెప్పినట్లుగా, పూర్వపు ఉపన్యాసాల్లోని ముఖ్య విషయాల్ని గుర్తుంచుకోవాలి. 5. ఈవేళ మనం సమూహ నైపుణ్యాల గురించి చర్చిద్దాం. 6. మిత్రులారా, మనందరం మానవులం. కాబట్టి ఎక్కడ ఉన్నా అంటే ఒక సంస్థలో లేదా సమాజంలో, సమూహాలుగా ఏర్పడే నైజం ఉంటుంది. మనం ఏదైనా భారీ ఎత్తున చేయాలనుకుంటే అది ఒంటరిగా చేయలేమని తెలుసు కాబట్టి మనకి ఒక సమూహం కావాలి. అయితే సమూహం అంటే ఏమిటి. ఒకోసారి మనం సమూహాలు, జట్లు అనేవి తారుమారుగా ఉపయోగిస్తాం. రెండిటికీ దాదాపు అర్థం ఒక్కటే. 7. అయితే మనం జట్లకి, సమూహానికి ఉన్న తేడా తెలుసుకుందాం. ఆ సమూహాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. వాటిని మీరు ఒంటరిగా కాకుండా సమూహాల్లో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షణాలు మన సమూహాలు, వ్యక్తుల కంటే ముఖ్యమైనవి. 8. ప్రస్తుత కాలంలో మనమంతా మన బాధ్యతలను నెరవేర్చాలనుకుంటాం. మన పనులను తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనుకుంటాం. 9. వీటన్నికీ మనకి సమూహ కృషి అవసరం. 10. చాలా సందర్భాలలో సమూహాలే వ్యక్తుల కంటే ఉత్తమమైన పని చేయగలవని తెలుసుకుంటాం. 11. సమూహ లక్షణాల గురించి తెలుసుకునే ముందు దాని నిర్వచనం అర్థం చేసుకుందాం. 12. మీరు ఒక సంస్థలో వ్యక్తిగా చేరినప్పటికీ ఏదో ఒకచోట మీరు ఒక సమూహంతో జోడించబడతారు. ఎందుకంటే మీరు చాలా పెద్ద, ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. 13. ఒక వ్యక్తిగా మీకు ఒక పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయగల సరైన అనుభవం, విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు. 14. సమూహాన్ని ఎలా నిర్వచించవచ్చో చూద్దాం. 15. నిజానికి సమూహం అంటే వ్యక్తుల సమాహారం. అనేక మంది వ్యక్తులు ఒక దగ్గర చేరి పనిచేస్తూ, ప్రతిస్పందిస్తూ, సహకరిస్తూ నిర్ణీత సమయంలో ఒక లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయడమే ఒక సమూహం. 16. సమూహాంలో వ్యక్తులు స్వంత గుర్తింపు కలిగి ఉంటారు. 17. సభ్యులందరూ సమాచారాన్ని, వనరులని ఇతర బృంద సభ్యులతో పంచుకుంటారు. 18. ఉదాహరణకి మీరు కళాశాలలో 3 లేదా 4వ సంవత్సరం విద్యార్థి అయితే చెప్పండి.  19. కళాశాలలో జరిగే వివిధ ఉత్సవాలు అంటే స్పోర్ట్స్, సాంస్కృతిక లేదా ఇతర విభాగాల్లో కార్యక్రమాలు చూస్తుంటారు. 20. అవన్నీ ఒకరే స్వంతంగా చేయగలరా, చేయలేరు కదా! ఈ ఉత్సవాల గురించి ప్రణాళిక చేసి తయారవడం కోసం కేవలం 2-3 రోజులు మాత్రమే ఇస్తారు. ఒక నెల సమయం ఇవ్వరుకదా. 21. 2-3 నెలల సమయమిస్తే ఆ కళా ఉత్సవాన్ని ప్రజలందరూ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేంత అద్భుతంగా చేయాలి. 22. దాని కోసం మీరు ఒక సమూహాన్ని ఏర్పాటు చేయటం ప్రారంభిస్తారు. 23. అందులో ఏ సభ్యులు ఏ పనిని చక్కగా నిర్వర్తించగలరో తెలుసుకోవాలి. 24. మొట్టమొదట ఎవరికీ ప్రతి ఒక్కరి నైపుణ్యత, లక్షణాలు, స్వభావాలు, ప్రతిభ, గొప్పదనం, సామర్థ్యం అందరికీ తెలియదు కాబట్టి కొంత సమస్య, గందరగోళం ఏర్పడవచ్చు. 25. కాని సమూహంలో అందరూ ఇతరుల గురించి తెలుసుకున్న తర్వాత, మీ పని తేలికై వేగాన్ని పుంజుకుంటుంది. కొంత సమయం తరువాత పరిచయం, దగ్గరితనం ఏర్పడితే సభ్యులందరూ కలసి మెలసి ఉంటారు. 26. సమూహం వ్యక్తుల మిశ్రమం. 27. వీరంతా సమూహ కృషి చేస్తే ఏ పనైన మెరుగ్గా చేస్తారు. విజయవంతంగా ముగిస్తారు. 28. కొన్నిసార్లు మనం సమూహాలు, జట్ల గురించి తారుమారుగా మాట్లాడతాం. 29. మనం సమూహాలు, జట్ల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం గురించి తెలుకోవాలి. 30. సమూహ సభ్యులకు ఒక కామన్ లక్ష్యం, ఉద్దేశం ఉంటుందని తెలుసుకున్నాం. 31. జట్టు కూడా వ్యక్తుల కూడికే. ఒక సమూహంలో అనేక జట్లుంటాయి. ఒక స్పోర్ట్స్ ఉత్సవాన్ని తీసుకుందాం. ఆ పనిని తేలికగా పూర్తి చేయడానికి ఆ సభ్యులను జట్లుగా విభజించాలి. 32. ఒక సమూహంలో సభ్యులు ఒక కామన్ లక్ష్యం, నిర్ణీత సమయంలో సాధించాలని ప్రయత్నిస్తారు. 33. ఒక పనిని తక్కువ సమయంలో పూర్తి చేయాలి అని  అనుకుంటారు. 34. విజయవంతంగా అవదు. 35. ఆ పనిని తేలికగా పూర్తి చేయడానికి ఆ సభ్యులను జట్లుగా విభజించాలి. 36. సమూహ కమ్యూనికేషన్ అంటే సమూహంలో సభ్యులందరూ ఒకరితో ఒకరు కలిసిపోయి పనిచేయాలి. 37. భవిష్యత్తులో మీ ఉద్యోగంలో వచ్చే అసైన్మెంట్ చేయడానికి సమూహాలు, జట్లతో పనిచేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే పని తేలికవుతుంది. 38. కాబట్టి సమూహ సభ్యులకు ఉండే లక్ష్యాన్ని సాధించడానికి వారికి సమీకృత జవాబుదారితనం ఉండాలి. 39. మీ సంస్థలో సాంస్కృతిక ఉత్సవం ఉంది. అందులో చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా ! ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి, చేపట్టి, నడిపించి, విజయవంతం చేసే వ్యక్తి మీకు కావాలి. 40. ఈ విధంగా జవాబుదారితనం ఉంటే దాన్నే జట్టు స్ఫూర్తి అంటారు. 41. కాబట్టి జట్టు యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే అందరికోసం ఒకరు, ఒకరి కోసం అందరూ. 42. ఒక సమూహంగా మీరు ఐక్యత ద్వారా విజయం సాధిస్తారు. 43. ఒక సమూహంలో చాలా జట్లు ఉంటే, వారందరికీ ఒకే లక్ష్యం, అంటే పని చక్కగా పూర్తిచేయాలి, అని ఉన్నప్పటికీ, అనేక జట్లుండటం వలన సమూహం విభజించ బడుతుంది. అన్ని జట్లకి నిర్ధిష్ట లక్ష్యం ఉంటుంది. 44. సంగీత కార్యక్రమాల్ని ఏర్పాటు చేసే జట్టు సభ్యులు కేవలం సంగీతం పైనే ఏకాగ్రత చూపుతారు. 45. అలాగే ఉపన్యాసాలు ఏర్పాటుచేసే పని ఉన్నవారు వ్యక్తులను కలుసుకొని, ఈ కార్యక్రమం ఎలా జరపాలో ఆలోచిస్తుంటారు. కాబట్టి మనం సమూహాలు, జట్ల మధ్య తేడాల్ని తెలుసుకోవాలి. 46. సమూహాల ముఖ్య లక్షణాలు ఏంటి? జట్టు యొక్క  ముఖ్య లక్షణాలు ఏంటి? 47. రెండింటికీ ఒక సామాన్య లక్ష్యం ఉంటుంది. 48. అంటే ఈవెంట్ను సఫలం చేయాలి. 49. అలా సఫలత సాధించాలంటే అన్ని జట్లు కలసి పనిచేయాలి. సహకారం అందించుకోవాలి. అప్పుడే పని సజావుగా సాగుతుంది. 50. సహకారం అంటే ఒకరికి ఒకరు సహాయం చేయటమే కాక ఎవరు ఏ పని సరిగ్గా చేయగలరో గుర్తించాలి. సభ్యుల నైపుణ్యాలేమిటో తెలుసుకోవాలి. 51. సభ్యులు. 52. ప్రతి జట్టుకి ఒక నాయకుడు ఉంటాడు. 53. నాయకత్వం గురించి వచ్చే ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. 54. ఎవరు నాయకుడు కాగలడు? నాయకుడు, నాయకత్వ లక్షణాలు, గుణాల గురించి వచ్చే ఉపన్యాసంలో చర్చిద్దాం. ఒక జట్టులో లక్ష్యం గురించి తెలిసి ఉన్నా కూడా ఒకోసారి గందరగోళం ఏర్పడుతుంది. 55. కొన్ని సందర్భాలు సవాళ్ళు ఎలా ఎదుర్కోవాలో తెలియక మనకి ఒక ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. 56. ఆ ప్రతిష్ఠంభన తొలగించడానికి, దారి చూపడానికి ఒక వ్యక్తి అవసరం. 57. కనుక మీరు ఒక కామన్ నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. 58. పనులు సరిగ్గా జరిగినా, తప్పుగా జరిగినా అది సమూహ సమీకృత బాధ్యత. 59. ఏ పని సాధించాలన్న అది సమూహ జవాబుదారీతనo కలిగి ఉండాలి. 60. మీరు ఒక జట్టు సభ్యడిగా జట్టు లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి. 61. వ్యక్తిగత లక్ష్యాలు పక్కన పెట్టాలి. 62. మీరు వినే ఈ ఉపన్యాసం ఒక వ్యక్తి కృషి కాదు. 63. నేను ఉపన్యాసం ఇస్తున్నా, నా వెనుక అనేక మంది వ్యక్తుల సహకారం ఉంది. 64. అంతే కాకుండా మొత్తం వ్యవహారంలో, ప్రక్రియలో అనేక జట్లు ఉంటాయి. 65. ఒక జట్టు రికార్డింగ్ చేస్తే, ఒకరు ఎడిటింగ్, ఒకరు ఫైనల్ టచ్, ఒక జట్టు చివరగా తమ ఆమోదాన్ని తెలుపుతాయి. 66. ఇంకొక జట్టు ఉపన్యాసాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. 67. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఏ ఈవెంట్ అయినా విజయవంతం అవడానికి సమీకృత కృషి, సహకారo జట్టులో ఉండాలని అర్థం చేసుకోవాలి. 68. ఒక సమూహంగా, జట్టుగా మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. 69. దీనినే సమూహ కమ్యూనికేషన్ అంటారు. దీనిలో ఉండే పనులేంటి ? ఒకోసారి కొన్ని సమస్యలకి పరిష్కారం కనుగొనడం. అయితే ఆ పరిష్కారం సాధ్యమైనది, ప్రభావమంతమైనదని ఎలా తెలుసుకోగలరు. 70. మీరు ఒక్కరే సమస్యను పరిష్కరించడం గురించి ఆలోచిస్తే అది కష్టంగా ఉండవచ్చు. 71. కాని మీ జట్టులో ఉండే అనేక మంది సభ్యులు శక్తి, తెలివితేటలు, తేజస్సు, పద్దతులు మరియు మార్గాలను కలిగి ఉంటారు. 72. వారందరికీ విభిన్న ఆలోచనలు ఉంటాయి. 73. ఒక సమస్యని పరిష్కారం చేయాలంటే జట్టు సభ్యులంతా ముందుకు వస్తారు. కాబట్టి సమూహ కార్యాల్లో ముఖ్యమైనది సమస్యా పరిష్కారం. 74. రెండవది ఒక అవకాశాన్ని వెతుక్కోవడం. 75. ఒక సంస్థ ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశ పెట్టడం లేదా కొనడం, ఒక కొత్త ప్రణాళిక గురించి ప్రకటించడం కోసం ఒక జట్టు అవసరం. ఆ జట్టు ఆ వ్యవహారం యొక్క ఫలితాలు ఏమిటి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏదైనా పొరపాటు జరిగితే ఏం చేయాలి ? ఇవన్నీ కనిపెడతాయి. 76. కాబట్టి అవకాశాన్ని వెతుక్కోవాలి. 77. మనం పూర్వ ఉపన్యాసంలో నివేదిక రచన గురించి చర్చించాం. 78. ఆ నివేదిక మొత్తం ఒకే వ్యక్తి వ్రాసారని మనం అనుకోవచ్చు. 79. ఒకే వ్యక్తి వ్రాస్తే చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి సమస్య పరిష్కారం ఆలస్యం అవుతుంది. 80. జట్టుకి ఉన్న బాధ్యతల్లో ఒకటి నివేదికలు వ్రాయటం, 81. ఒక మానేజర్ గా, CEO గా, లేదా ఇన్ చార్జ్ గా మీరు మౌఖిక ప్రజంటేషన్స్ ఇస్తూ ఉంటారు. 82. అయితే అన్ని వివరాలు, డేటా సేకరించి అన్ని ఈవెంట్స్ గురించి చెప్పటానికి ఒక జట్టు అవసరం. 83. కొన్ని సార్లు మీరు సమూహ ప్రజంటేషన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 84. సమూహ ప్రజంటేషన్లు ఇచ్చేటప్పుడు ఎవరికి ఏ విషయంలో నైపుణ్యత ఉందో తెలుసుకోవాలి. 85. ఎవరు ఏ భాగానికి సంబంధించిన ప్రజంటేషన్ ఇస్తారో వారు ఆ భాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. 86. కాబట్టి జట్టు సభ్యులు నివేదికలు వ్రాయటమే కాకుండా ప్రజంటేషన్ కూడా ఇవ్వాలి. 87. మీకు తెలిసే ఉంటుంది. చాలా సంస్థలలో ఇంక్యుబేషన్ సెంటర్లు ఉంటాయి. 88. ఆ సెంటర్ వారు ఒంటరిగానే పనిచేస్తారా ? అక్కడ కూడా జట్లుంటాయి. కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, ప్రతిపాదించడం వంటి పనులలో జట్టు సభ్యులంతా బిజీగా ఉంటారు. ఒకరితో ఒకరు సంప్రదిస్తూ సహకరిస్తారు. 89. చివరగా మనం ఉత్పత్తిని చూసినప్పుడు, దాని వెనుక కృషిని చూడలేం. కాబట్టి మనం సమూహ కృషి గురించి తెలుసుకోవాలి. 90. ఈ రోజులలో మీరు ఒక్కరే ఒంటరిగా శ్రమించి భూమి, ఆకాశాలను కదిలించేస్తామనుకుంటే అసాధ్యం. మిత్రులారా, మీరు ఒక సమూహం లేదా జట్టును నమ్మాలి. 91. సమూహాల్లో అనేక రకాలుంటాయి. అనేక సంస్థలలో అధికారిక సమూహాలుంటాయి. 92. మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే, చాలా సమూహాలు ఉన్నాయి మరియు చాలా యూనిట్లు కూడా ఉన్నాయి. 93. ఈ అధికారిక విభజన వలన సమూహాలు విజయవంతంగా ఒక ఈవెంట్ ని నిర్వహించగలవా? కొన్నిసార్లు అనధికారిక సమూహాలు చక్కగా పనిచేస్తాయి. 94. అయితే అధికారికంగా సమూహాల్ని విభజించగా అందులో సభ్యులు అనధికారికంగా ఒకరితో ఒకరు సహకరిస్తేనే పని జరుగుతుంది. 95. ఫార్మాలిటీ పేరిట,ఒక సమూహాన్ని విభజిస్తాము, కాని ఎక్కువ మంది సభ్యులు ఒకరితో ఒకరు అనధికారికంగా అది పని చేస్తుందని చెప్పడం చాలా సందేహాస్పదంగా ఉందని మీకు తెలుసు. 96. ఇప్పుడు కేవలం అధికారిక, అనధికారిక సమూహాలే కాకుండా వర్చువల్ సమూహాలు కూడా ఉన్నాయి. అంటే ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాంకేతిక పరికరాల ద్వారా ఏర్పడినవి. 97. మీరు ఈ సమూహాల్లో సభ్యులై ఉంటే సమాచారం పంచుకోవచ్చు, కమ్యూనికేట్ చేయవచ్చు. ప్రపంచం చిన్నదిగా, నిజమైన జీవన ప్రమాణంగా, సాదృశంగా ఉంటుంది. 98. ఏ సమూహానికైనా సమస్యా పరిష్కారం అనే బాధ్యత ఉంటుంది. 99. సమూహ సభ్యులందరికి ఒకే రకమైన సమర్థత, నైపుణ్యత ఉండదు. ఒకోసారి కొందరు తమ పరిధిని మించి ముందుకు వెళ్ళి ఇతరులతో సహకరించి, సమూహ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడతారు. 100. ఈ సమూహ సభ్యులందరినీ కలసి కట్టుగా ఉండేలా చేసి అనేక విధాలుగా మేలు చేస్తుంది. 101. అనేక వ్యక్తులు సమూహాల యొక్క ప్రయోజనాల గురించి ప్రశ్నలు వేస్తుంటారు. 102. సమూహాల వల్ల లాభనష్టాలేంటి? ఒక సమూహంలో పని చేసేటపుడు అందరి వద్దా కావల్సిన సమాచారం ఉండదు. అందరికీ తగినంత శక్తి, చిట్కాలు తెలిసి ఉండవు. 103. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చదవడానికి అందరికీ సమయం ఉండదు. ఒక ఉత్పత్తికి సంబంధించిన రచన, లేదా ప్రక్రియల గురించి మొత్తం తెలుసుకోలేరు. 104. ఒక సమూహంలో అందరి వద్ద సమాచారం ఉంటుంది. 105. ఒక వ్యక్తి వద్ద ఉన్న ఆలోచన ముందుకు తీసుకు వెళ్లటానికి ఇంకో వ్యక్తి తోడ్పాటు అవసరం. 106. మీరొక సమస్యకి పరిష్కారం వెతుకుతున్నారు. 107. అదే సమూహంలో అయితే సభ్యులందరూ తమ వైఖరి, దృష్టికోణం బట్టి ఆలోచించి సమస్య గురించి తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. 108. ఆ అభిప్రాయాలు విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. 109. ఒకసారి సమూహ సభ్యులలో కొంతమందికి ఇదే విధమైన ఉత్పత్తి గురించి అనుభవం ఉంటే అది లాభకారి అవుతుంది. 110. సమూహ సభ్యులనుండి విభిన్న అభిప్రాయాలు ఆలోచనలు సేకరించి వాటిని సమస్యా పరిష్కారం కోసం ఉపయోగించవచ్చు. 111. కనుక అభిప్రాయాలు, వైవిధ్యంగా ఉంటాయి. 112. అయితే జట్టు సఫలత అందరి స్వీకృతి పైనే ఆధారపడి ఉంటుంది. 113. ఒక విషయాన్ని ప్రతిపాదించినపుడు మీరు ఆమోదించక పోయినా ఇతర సభ్యులు కూడా ఉంటారు. 114. మరియు వారు దానిని వేర్వేరు దృష్టికోణాల నుండి తులనాత్మకంగా చూసి ఆ సందర్బం యొక్క లోతుపాతులు విశ్లేషించి ఆమోదముద్ర వేస్తే అందరి ఒప్పందం తీసుకోవాలి. 115. సమూహాల వల్ల వచ్చే లాభం, అవి మెరుగ్గా పనిచేస్తాయి. 116. మనం ఒక పని ఒకే సమయంలో చేయగలం. 117. కాని మనం సమూహంలో ఉంటే ఆ ఒక్క పనిని విజయవంతంగా ముగించటానికి అనేక మంది సభ్యులుంటారు. 118. వారందరూ తమ నైపుణ్యము, అంగీకారాన్ని బట్టి పని చేయటానికి ఒప్పుకుంటారు. 119. అందువల్ల సమూహం పనితీరు ఎల్లప్పుడూ మంచిది. 120. మీరు ఒక సమూహంలో సభ్యులై ఉంటే మీకు ఒక సన్నిహిత భావన కలుగుతుంది. మీరు ఒక సంస్ధ, సమాజం, లేదా అసోసియేషన్ కు చెందిన వారమని గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే మనుషులకు ఒక చెందామనే భావన అవసరం. 121. మీరు ఒక సమూహంలో సభ్యులైతే చాలా మందిని కలుసుకోగలుగుతారు. మీ జ్ఞానం వృద్ది పొందుతుంది. అంతేకాకుండా మీరు కేవలం విని అర్ధం చేసుకోలేక పోయిన విషయాలను సమూహ కమ్యూనికేషన్ వలన చక్కగా అర్ధం చేసుకోవచ్చు. 122. అయితే గుర్తుంచుకోండి, ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడే నష్టం కూడా ఉంటుంది. 123. ఒక లాభం ఒక నష్టం ఉంటాయి. 124. ప్రతి నాణేనికి రెండు పక్కలుంటాయి. 125. సమూహల వల్ల చాలా లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు లేకపోలేదు. 126. నష్టాలు చాలా ఉంటాయి. 127. ప్రతి సమూహంలోనూ మొండి ఆలోచనలు కలిగిన వ్యక్తులుంటారు. వారికి ఒక ప్రత్యేక వైఖరి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సభ్యుల మధ్య ఈ ఘర్షణ ఉంటుందో దాని వలన ఇతరులకి సమయం వృధా అవుతుంది. 128. కొన్నిసార్లు ఈ ప్ర్రక్రియ నిష్ఫలితంగా, నిరాశాజనకంగా మారుతుంది. 129. కొంతమంది కొన్ని అపోహలు కలిగి ఉండి బాధపడుతుంటారు. వారికి అన్ని విషయాలు తెలుసు అనే తప్పుడు ఆలోచనలో ఉండి ఇతరులకు ఏమీ తెలియదనుకుంటారు. 130. ఇలాంటి సందర్భంలో ఒకరు ఇంకొకరి అభిప్రాయాలను ఆమోదిస్తే కాని ఒప్పందం కుదరదు. 131. ఒక్కోసారి మనం గమనిస్తే ప్రతీ సమూహంలో ఇంకా చిన్న చిన్న బృందాలుంటాయి. 132. కొంతమంది ఇతరులను ప్రభావితం చేసి, అనుచరులను తయారుచేసుకొని వేరే సమూహంగా ఏర్పడుతారు. అప్పుడు వ్యక్తుల స్వంత అభిప్రాయాలకు విలువ ఉండదు. 133. కొంతమంది వ్యక్తుల అభిప్రాయాల్లో మంచి మెరుపు లేదా తెలివి ఉన్నప్పటికీ, విషయం చాలా ఉన్నా ఇతరుల ఒత్తిడి వలన వాటిని నిర్లక్ష్యం చేస్తారు. 134. కాబట్టి వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు వదిలివేయబడతాయి. 135. ఒకోసారి సమూహంలో సభ్యుల సమిష్టి ఆలోచన  ద్వారా ఒక నిర్ణయానికి వచ్చినా అది అమలుకాదు. ఎందుకంటే సమస్య ఎక్కువ సభ్యులుండటమే. 136. కాబట్టి, సమూహం భావిస్తే లేదా సమూహ సభ్యులకు ఒక రకమైన అంగీకారం లభిస్తే, కొన్ని సమయాల్లో మనం కూడా తక్కువ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకోసారి ఆ నిర్ణయం చాలా లోకువగా ఉండవచ్చు. 137. సమూహంలో సభ్యలందరూ ఒక తప్పుడు నిర్ణయాన్ని సమర్ధించి, ఒకే వ్యక్తి సరియైన నిర్ణయం చెప్పినా, సమూహ నిర్ణయమే గెలుస్తుంది. అది తప్పైనా సరే. సరియైనదైనా కూడా వ్యక్తి నిర్ణయం ఓడిపోతుంది. 138. అలాగే కొంతమంది సమూహ సభ్యులకు ఒక రహస్య అజెండా దాగి ఉంటుంది. 139. ఎవరైనా చాలా నమ్మకం, నిజాయితీ మరియు సమగ్రతతో పనిచేస్తే బాగుంటుంది. కాని కొంతమంది సభ్యుల రహస్య ఎజెండా సమూహ ప్రతిచర్య పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. 140. సమూహ సభ్యులంతా విభిన్న నేపధ్యాలు, సంస్కృతులు, రుచులు కలిగి వైవిధ్యంగా ఉంటారు. కాబట్టి సహకరించడం కష్టమే. 141. మరియు ఇక్కడ ఒక మెస్సీయ పాత్ర వస్తుంది, అందరినీ సమర్ధించుకొని, సరియైన దారిలో ముందుకు నడపగల వ్యక్తి అవసరం ఉంది. 142. అలాంటి వ్యక్తి ఉంటే మనం ఈ సందర్భాన్ని దాటుకొని విభిన్న వ్యక్తులను ఒకే తాటిపై నడిపించ వచ్చును. 143. సమూహం అనేక వ్యక్తుల సమాహారం, సమీకృత లక్ష్యంతో పనిచేసే విభిన్న వ్యక్తుల కూడిక. 144. సమూహం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 145. కాబట్టి, సమూహానికి నిజంగా ఏమి సహాయపడుతుంది, సమూహం యొక్క డైనమిక్స్ ఖచ్చితంగా ఏమిటి, అనుసరించాల్సిన డైనమిక్స్ ఏమిటి. 146. ఈ డైనమిక్స్ ఒక వ్యక్తి మాత్రమే అనుసరించదగినది కాదు. అందరూ నిర్ణయించుకోవాలి. సహకారం అనేది ముఖ్యం. 147. అందరూ సహకరిస్తేనే సమాధానం దొరుకుతుంది. అప్పుడే మనకున్న పెద్ద అవరోధాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. 148. కొన్నిసార్లు మార్గ నిరోధకాలున్నా, కమ్యూనికేషన్ ద్వారా మనం ఆ అవరోధాన్ని, అసమ్మతి, విభిన్న ఆలోచనల వలన వచ్చే ప్రతిబంధకాల్ని తొలగించవచ్చు. 149. తరువాత వచ్చేది విధేయత. నేనొక సమూహానికి విధేయునిగా ఉంటే ఈ వ్యవస్థ గురించి గర్వంగా చెప్పుకుంటాను. 150. నాకు అలాంటి అంకితభావం ఉంటే సమూహంతో విధేయత ఉంటే గొప్పగా చెపుతాను. 151. ఇలాంటి సమూహ విధేయతని ఎప్పుడూ కలిగి ఉండటానికి నేను చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి రావచ్చు. సమూహ సంక్షేమం కోసం ఈ విధేయత ఉపయోగపడి, ముందుకు తీసుకెళ్తుందంటే ఒక సభ్యునిగా తప్పక పాటిస్తాను. 152. డైనమిక్స్ లో విధేయత ముఖ్యమైనది. 153. ఒక పాత సామెత ప్రకారం ఎన్ని గిన్నెలు ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ చప్పుడు ఉంటుంది. 154. తరువాతి అంశం సమన్వయత. అలాగే ఒక సమూహంలో ఎక్కువ మంది సభ్యులుంటే ఎక్కువ భేదాభిప్రాయాలుంటాయి. అయితే అందరూ సమన్వయంగా ఉండాలంటే, ఆ సహకార వైఖరివల్లనే దాన్ని ఏర్పరచగలం, సాధించగలం. 155. మన లక్ష్యంపై నిబద్ధత ఉంటే తప్పక సాధ్యమౌతుంది. మనం నిబద్ధత, విధేయత మరియు సమన్వయం యొక్క అవసరాన్ని తెలుసుకుంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని విడదీయలేదు. ఎవరూ నిర్ణయాలు తీసుకోకుండా ఏకగ్రీవ ఒప్పందానికి రాకుండా ఆపలేరు. 156. ఒక సమూహాన్ని ఏర్పరిచే ప్రక్రియలో అనేక ధశలుంటాయి.  ఇలా సమూహాల ఏర్పాటు చాలా ముఖ్యమైనది. 157. ఒక సంస్థలో లేదా సమూహంలో మీరొక కొత్త సభ్యునిగా చేరినప్పుడు మీకు భయం వేస్తుంది. 158. కాని కొంత సమయం తరువాత ఒక పనికోసం మీరొక జట్టుతో జోడించబడతారు. 159. ఒక సమూహం ఏర్పాటులో అనేక దశలుంటాయి. 160. సమూహం నిర్మాణ దశలు ఏమిటి ? ఒక వ్యక్తిగా మీరు సమూహంలో చేరినప్పుడు మీకు ఎవరూ పరిచయం ఉండరు. ఈ మొదటి దశను మనం ఏర్పాటు దశ అనవచ్చు. ఇక్కడ నాలుగు దశలుంటాయి. అవి నిర్మాణం, తుఫాను, ఆదర్శం , పనితీరు మరియు వాదన. 161. మొదటిదశ ఏర్పాటుదశ. 162. ఈ దశలో మీరు కొత్త సభ్యులుగా ఇతరులకి పరిచయం చేయబడాలి. 163. సమయం గడిచేకొద్దీ మీరు ఇతరులతో స్నేహం పెంచుకొని వారిని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. 164. అందువల్ల, మొదటి దశ ఏర్పడటం --- ఏర్పడే కాలం, ఏర్పడే కాలం. 165. మొదటి దశైన ఏర్పాటు దశలో కొత్త సభ్యులందరూ ఇతరుల గురించి తెలుకోడానికి ప్రయత్నం చేస్తారు. 166. అందువల్ల వారి ఒక రకమైన సఖ్యత  పెంచుకోవడానికి చూస్తారు. అయితే సఖ్యత పెంపొందించడానికి సమయం పడుతుంది. 167. రెండవ దశ తుఫాను. 168. మొదటి దశలో పరిచయాలు పంచుకున్న తరువాత ఒకరి నొకరు తెలుసుకున్నాక రెండవ దశలో ప్రతిచర్య ఉంటుంది. 169. ప్రతి వ్యక్తిలో కొన్ని నైపుణ్యతలు, లక్షణాలు ఉంటాయి. అనేక మంది సభ్యులు ప్రతిస్పందిస్తున్నప్పుడు ఒక తుఫాను లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ తమ తమ ఆలోచనలని ప్రస్తావిస్తారు. 170. అందరూ తమ ఆలోచనలే గొప్పవని అనుకుంటారు. కాబట్టి ఒక లాంటి సంక్లిష్టత ఉన్నా అది లాభకరమే.ఎందుకంటే అనేక కొత్త విషయాలు బయటికొస్తాయి.అందరూ ఇతరులతో ఘర్షణ పడినా కొత్త ఆలోచనలు ఉత్పన్న మౌతాయి. 171. తరువాత దశ ప్రామాణిక కాలం ఉంటుంది. 172. ఈ ప్రమాణ కాలంలో, ప్రజలు గ్రహిస్తారు. 173. ఇక్కడ సభ్యులు తుఫాను తరువాత వచ్చే ప్రశాంతతలాగా విషయాల్ని చక్కగా తెలుసుకుంటారు. 174. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని తమ ఆలోచనలతో మెత్తబరుచుకొని సమూహాల కోసం పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించి, ఇతరుల ఆలోచనలని స్వీకరించి, అభిప్రాయాల్ని గుర్తించి, ముఖ్య విషయాలను గ్రహించి, అనవసరమైన విషయాల్ని వదిలేస్తారు. ఇది ఒక ర్అకమైన వడపోత. 175. ఆ వడపోత తరువాత ఈ దశలో కొంత ప్రశాంతత సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. 176. ఈ సాధారణ పరిస్థితి సభ్యులను సన్నిహితంగా చేస్తుంది. వారు తమ లక్ష్యాలు, బిన్నాభిప్రాయాలను గుర్తించి పనిచేయటానికి ఉద్యుక్తులౌతారు. 177. వారు పని చేస్తారని నిర్ణయిస్తారు. 178. తరువాతి దశ పనిచేయడం, ఏర్పాటు దశలో పరిస్థితి ఊహించలేం. 179. అందరు సభ్యులతో ప్రతిచర్య తరువాత, వారి విలువ, ఆలోచనల గొప్పదనం గ్రహించి వాటిని సమాయత్తం చేసి చివరగా పని దశకు వస్తారు. 180. పని చేస్తున్నప్పుడు,. 181. ఈ దశలో మీరు పూర్తి శక్తి, ఉత్సాహం మరియు బలంతో పని చేయటానికి తయారుగా ఉంటారు. 182. చివరగా పని చేసేటప్పుడు చాలా విజయవంతంగా ఆ పని ముగిస్తారు. 183. ఆ విజయం ఈ దశలన్నీ దాటిన తరువాతే వస్తుంది. 184. ప్రఖ్యాత మనస్తత్వవేత్త బ్రూన్ టక్ మన సమూహ వృద్ధి దశలను గురించి చెప్పారు. చివరి దశ అయిన `వాయిదా ని ఆయనే కనిపెట్టారు. 185. ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పరిచి, వారు తమ పనిని సక్రమంగా ముగించిన తరువాత ఆ జట్టుని ఆపేయాలి. 186. అయితే కొన్ని సందర్భాలలో ఈ తొలగింపు వలన చాలా ఆందోళన కలుగుతుంది. అయితే సమూహ డైనమిక్స్ లో ఇది కష్టంగా ఉంటుంది. 187. అయితే వాయిదా దశలో తొలగింపబడిన జట్టు తరువాత మళ్లీ ఏదైనా అవసరం కలిగినప్పుడు కొత్త జట్టుని ఏర్పరుస్తారు. 188. సంస్థ కోసం, క్రొత్త బృందం తప్పనిసరిగా క్రొత్త సమూహాన్ని ఏర్పాటు చేయాలి. 189. ఇప్పుడు మనం సమూహ పాత్రల గురించి తెలుసుకోవాలి. 190. ఇక్కడ మూడు రకాల పాత్రలుంటాయి. 191. మొదటిది స్వీయ ఆధారిత పాత్ర, రెండవది నిర్వహణ పాత్ర, మూడవది పని ప్రోత్సాహక పాత్ర. 192. ఒక దశలో మనం కొంతమంది సభ్యులకు తమ స్వీయ లాభకర విషయాల గురించి ఆత్రుత ఉంటుందని గమనించాం. 193. వారు కేవలం తమ అభిప్రాయాలనే పరిగణించాలని కోరుకుంటారు. సమూహాన్నంతా తమ ఆధీనంలో ఉంచాలని చూస్తారు. 194. వారి అభిప్రాయాలు స్వీకరించబడకపోతే, ఆచరించబడకపోతే వారు సమూహం నుంచి విడిపోతారు. 195. ఇలాంటి వారు సమూహంలో కలువలేరు. 196. నిర్వహణ పాత్ర రెండవది. 197. ఇక్కడ సమూహ సభ్యులందరూ ఒక ఏకగ్రీవ తీర్మానానికి రావాలనే విషయాన్ని గుర్తించి, ఒక పొందిక లేదా సుహృద్భావం పెంపొందించు కోవాలి. 198. ఇతరులతో కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే ముఖ్యలక్ష్యం నిర్ణీత సమయంలో ఇచ్చిన పని పూర్తిచేయడం. 199. పని ప్రోత్సాహక పాత్ర మూడవది. 200. సమూహ సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరో ఒకరు పనిని ప్రారంభించాలి, చేపట్టాలి. 201. ఇంకెవరి వద్దనైనా అదనపు సమాచారం ఉంటే దాన్ని అందించవచ్చు. 202. అలాగే అవసరమైనప్పుడు ఇతరుల నుండి సమాచారం సేకరిస్తే సమూహం సహయోగం లభిస్తుంది. ముందుకెళ్ళే దారికి ప్రక్రియ మొదలౌతుంది. 203. మిత్రులారా ఒక సమూహంలో ఉన్నప్పుడు సంఘర్షణ లేకున్నా, ఏకగ్రీవ తీర్మానం కోసం, పని మెరుగ్గా చేయడానికి సంఘర్షణ వదిలివేయాలి. 204. ఒక సమూహంలో నాయకుడు ఉన్నా, నాయకుడు తయారైనా అతను సహకారం సహయోగం ఉండేలా చూసుకుంటాడు. 205. ఒకోసారి చాలా వివాదాలు, కొట్లాటలు, సంఘర్షణల మధ్య సమూహాన్ని కాపాడటానికి నాయకుడు తన స్థాయిని మించి కృషిచేసి అవాంతర సంఘటనలను ఆపగలడు. 206. ఇప్పుడు ప్రఖ్యాత మానేజ్ మెంట్ గురువు పీటర్ డ్రక్కర్ చెప్పిన పరిశీలనను తెలుసుకుందాం. ఒక పడవ మునిగిపోయేటప్పుడు,ఎవరూ సమావేశానికి పిలవరు. 207. క్యాప్టెన్ ఆర్డర్ ఇస్తాడు. లేదంటే అందరూ మునిగిపోతారు. 208. మనమంతా ఈ గ్లోబల్ ప్రపంచంలో మన పనులు నిర్ణీత సమయంలో ముగించాలంటే ఒక సమూహానికి చెంది ఉండాలి. 209. ఒక సమూహంలో సభ్యులుగా ఉన్నప్పుడు అక్కడి నైతిక విలువల్ని పాటించాలి. 210. ఒక వ్యక్తిగా మీ బాధ్యతలను గుర్తించి సమూహం ఒక పరిష్కారాన్ని పొంది సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి సహకరించాలి. 211. మీరు ఒక సంస్థలో ఉన్నప్పుడు సమూహంలో చేరటానికి ప్రయత్నించండి. ఎందుకంటే సమూహాల వలన ప్రతిష్టంబన ఏర్పడకూడదు. స్నేహపూరిత సమాధానం లభించాలి. 212. మీరు సమూహాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారనుకుంటాను. 213. తరువాతి ఉపన్యాసంలో నాయకుడు తన సమూహ లక్ష్యాలను ఎలా సాధించడానికి తోడ్పడుతాడో తెలుసుకుందాం. మరియు మెరుగైన పరిష్కారానికి రావడానికి దాని బాధ్యతను కూడా గ్రహించాలి. 214. ధన్యవాదాలు ! మంచి సమూహాన్ని తయారు చేయండి.