ID SENT ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0001 10. అంతరిక్ష యానము ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0003 - అంతరిక్ష యానము ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0005 - కృత్రిమ ఉపగ్రహాల వర్గీకరణ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0007 - ఉపగ్రహ నౌకలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0009 - కృత్రిమ ఉపగ్రహాలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0011 - కృత్రిమ ఉపగ్రహాల భ్రమణ కక్ష్యలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0013 - భూమి నుంచి దూరంగా వెళ్ళిన అంతరిక్ష యానము ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0017 1. అంతరిక్షం మరియు ఆకాశం, వీటిలో ఎట్టి భేదం ఉంది? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0019 2. సౌర కుటుంబంలోని వివిధ ఘటకాలు ఏవి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0021 3. ఉపగ్రహాలు అనగానేమి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0023 4. భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలున్నాయి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0025 తెలియని విషయాల పట్ల మానవుడు ఎల్లప్పుడు ఆకర్షితుడగు చూ వస్తున్నాడు. వాటిని గురించి తెలుసుకొని తన జ్ఞాన క్షేత్రాన్ని విస్తరించ కొనుటకు అతడు నిరంతరం ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0026 అప్పటి నుంచి అంతరిక్షం మరియు అందులో మిణుమిణుకు మనే అసంఖ్యాకమైన తారల గురించి కూడా అతనికి ప్రాచీనకాలం నుంచి కుతూహలం పెరుగుతూ వచ్చింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0027 అంతరిక్షంలో ఎగరాలని అతడు ఎల్లప్పుడు కలలు కూడా కనుచూ వచ్చాడు. దాని గురించి నిరంతం ప్రయత్నశీలుడై ఉంటున్నాడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0029 అంతరిక్ష యానం (Space missions) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0031 సాంకేతికజ్ఞానంలో ముఖ్యంగా అంతరిక్ష సాంకేతిక జ్ఞానంలో జరిగిన ప్రగతి మూలంగా ఇరవయ్యవ శతాబ్దం ఉత్తరార్థంలో అంతరిక్ష నౌకలు నిర్మింపబడినవి తద్వారా అంతరిక్ష యాత్ర చేయడం సాధ్యపడింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0032 అప్పటి నుంచి వేల సంఖ్యలో కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ప్రత్యేక కక్ష్యలలో అంతరిక్షంలో ప్రవేశపెట్టబడినవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0033 అంతేగాకుండా సౌరకుటుంబంలోని వివిధ ఘటకాలను దగ్గరి నుంచి అభ్యసించుటకు కొన్ని ప్రత్యేక యంత్రాలను సౌర కుంటుంబం లో వివిధ భాగాల వైపు పంపి అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలు జరుపబడినవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0034 వాటిని గురించి మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0036 అంతరిక్ష కార్యకలాపాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0037 కృత్రిమ ఉపగ్రహాలు భూ కక్ష్యలో ప్రవేశపెట్టి వివిధ రకాల పరిశోధనలు చేయటం, అలాగే ఉపగ్రహాలను మన జీవన ఉపయోగ పనులకు ఉపయోగించుట అనునవి మొదటి రకం కార్యకలాపాల ఉద్దేశం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0038 సౌర కుటుంబంలోని మరియు దానికి ఆవలి లో గల వివిధ ఘటకాల వైపు అంతరిక్ష నౌకలను పంపి ఆ ఘటకాలను సమీపం నుంచి పరిశీలించుట, తెలుసుకొనుట మొదలగునవి రెండవ రకం కార్యకలాపాల ఉద్దేశం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0042 రష్యాకు చెందిన యురి గాగారిన్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి మానవుడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0043 అతడు 1961 సంవత్సరంలో భూమి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0044 మొట్టమొదట (1969) అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రునిపై అడుగుపెట్టాడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0045 భారతదేశానికి చెందిన రాకేశ్ శర్మ 1984వ సంవత్సరంలో రష్యా అంతరిక్ష నౌకలో భూమి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0046 సునీతా విలియమ్స్ మరియు కల్పనా చావ్లా కూడా అమెరికాలోని 'నాసా' (National Aeronautics and Space Administration) అనే సంస్థ యొక్క అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ప్రయాణించారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0050 కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ఏయే రకములైన దుర్బిణి లు భూమి చుట్టూ తిరుగుట కొరకు ఉంటాయి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0051 వాటిని అంతరిక్షంలో ఉంచవలసిన అవసరం ఏమిటి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0053 చెప్పుకోండి చూద్దాం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0055 మీ మొబైల్ (చరవాణి) సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0056 మొబైల్ టవర్ లోకి అది ఎక్కడి నుంచి వస్తుంది? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0057 టెలివిజన్ కార్యక్రమాలు మీ టెలివిజన్ లోకి ఎలా వస్తాయి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0058 మీరు వార్తా పత్రికలలో మనదేశంలోని ఋతుపవన మేఘాల స్థితిని చూపే చిత్రాలను చూసే ఉంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0059 అవి ఎలా లభిస్తాయి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0061 page-135 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0063 అంతరిక్షయానం అవసరం మరియు ప్రాముఖ్యత ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0065 అంతరిక్షయానం ద్వారా ప్రవేశపెట్టబడిన కృత్రిమ ఉపగ్రహాల వల్ల నేడు ప్రపంచం ఒక 'విశ్వగ్రామం'గా మారినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0066 నేడు అరక్షణంలో ప్రపంచంలోని ఏదైన ప్రదేశంలో ఉన్న వ్యక్తితో మాట్లాడవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0067 ఇంట్లోనే కూర్చుండి ప్రపంచంలో జరిగే సంఘటనల సమాచారాన్ని పొందవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0068 అంతర్జాలం (Internet) యొక్క ప్రాముఖ్యతను మీరందరు తెలుసుకొని ఉన్నారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0069 దాని ద్వారా ఎటువంటి సమాచారమైన అరక్షణంలో లభిస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0070 సంభవించే ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా పూర్వ సూచనలు (హెచ్చరికలు) పొంది అప్రమత్తంగా ఉండుటకు సాధ్యపడుచున్నది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0072 యుద్ధంలో శత్రు సైన్యాల స్థితి గురించి అదేవిధంగా 10.1 కృత్రిమ ఉపగ్రహం ద్వారా సందేశం ప్రసారం భూగర్భంలో ఖనిజ పదార్థాల నిలువలు/నిక్షేపాలు ఎక్కడున్నవి కూడా మనం తెలుసుకొనవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0073 అంతరిక్షయానం ద్వారా ఇలా లెక్కలేనన్ని లాభాలున్నాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0074 నేటి ప్రపంచంలో అంతరిక్ష సాంకేతిక జ్ఞానం లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెందజాలదు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0076 కృత్రిమ ఉపగ్రహం (Artificial satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0078 సహజ ఉపగ్రహం అనగా భూమియొక్క లేదా ఏదేని గ్రహం యొక్క నియమిత కక్ష్యలో పరిభ్రమించు ఖగోళ వస్తువు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0079 చంద్రుడు భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0080 సౌరకుటుంబంలోని ఇతర కొన్ని గ్రహాలకు ఒకటి కంటే అధికంగా సహజ ఉపగ్రహాలున్నాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0081 సహజ ఉపగ్రహాల మాదిరి ఒక మానవ నిర్మిత యంత్రం భూమి లేదా ఏదేని ఒక గ్రహం యొక్క నియమిత కక్ష్యలో పరిభ్రమిస్తుంది దానిని కృత్రిమ ఉపగ్రహం అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0082 (పటం 10.1) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0084 రష్యాదేశం 1957వ సంవత్సరంలో 'స్ఫుటనిక్' (పటం 10.2 చూడండి) అనే కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0085 నేడు అలాంటివి వేల ఉపగ్రహాలు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0086 ఈ ఉపగ్రహాలు సౌరశక్తిని ఉపయోగించుకొంటాయి కాబట్టి వాటికి రెండు వైపుల రెక్కల వంటి 'సౌరప్యానెల్'లు అమర్చబడి ఉంటాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0087 భూమి నుంచి వచ్చే సందేశం గ్రహించుటకు మరియు భూమి వైపు సందేశాన్ని పంపించుటకు పరికరాలు అమర్చబడి ఉంటాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0088 ప్రతి ఉపగ్రహంలో దాని పనిని బట్టి కావలసిన ఇతర పరికరాలు కూడా ఉంటాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0089 ఇలా ఒక ఉపగ్రహం పటం 10.1లో చూపబడినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0090 భూమి నుంచి ఉపగ్రహం వైపు వెళ్ళే మరియు ఉపగ్రహం నుంచి భూమిపై గల మొబైల్, మొబైల్ టవర్, మొదలగు వాటి వైపు వచ్చే సందేశం చూపబడినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0091 వివిధ రకాల పనులు చేయుటకు ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపుతారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0092 వాటి పనులను బట్టి అవి క్రింది విధంగా వర్గీకరించబడతాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0094 సాంకేతిక సమాచార ప్రసారంతో జోడింపు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0096 భారతదేశం అంతరిక్ష పరిశోధన రంగంలోని కృషిని తెలిపే ప్రతిపాదన కంప్యూటర్ లో తయారు చేసి తరగతిలో ప్రదర్శించండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0098 INSAT: Indian National Satellite ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0100 GSAT: Geosynchronous Satellite ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0102 IRS : Indian Remote Sensing Satellite ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0104 GSLV: Geosynchronous Satellite Launch Vehicle ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0106 IRNSS: Indian Regional Navigation Satellite System‍ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0108 PSLV: Polar Satellite Launch Vehicle ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0114 page-136 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0116 ఉపగ్రహ రకం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0118 వాతావరణ ఉపగ్రహం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0120 (Weather Satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0122 సమాచార ఉపగ్రహం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0124 (Communication Satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0126 ధ్వని-చిత్ర ఉపగ్రహ నౌక ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0128 (Broadcast Satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0130 దిశా దర్శక ఉపగ్రహం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0132 (Navigational Satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0134 సైనిక ఉపగ్రహం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0136 (Military Satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0138 భూ పరిశీలన ఉపగ్రహం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0140 (Earth Observation Satellite) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0142 భారతదేశ ఉపగ్రహాల పేర్లు మరియు అంతరిక్ష నౌకల పేర్లు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0144 INSAT మరియు GSAT ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0146 అంతరిక్షనౌక : GSLV ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0156 IRNSS ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0158 అంతరిక్షనౌక : PSLV ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0160 IRS ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0164 ఉపగ్రహం యొక్క పని ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0166 వాతావరణాన్ని గూర్చి అభ్యసించుట మరియు వాతావరణాన్ని అంచనా వేసి తెలుపుట. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0168 ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో ప్రత్యేక తరంగాల ద్వారా సంబంధం నెలకొల్పుట. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0170 టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేయుట. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0172 భూమిపై గల ఏదేని ప్రదేశపు భౌగోళిక స్థానం అనగా ఆ స్థానం యొక్క అత్యంత ఖచ్చితమైన అక్షాంశాలు (Latitude) మరియు రేఖాంశాలు (Longitude) నిశ్చయించుట. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0174 సంరక్షణ దృష్టికోణంతో భూ ప్రదేశంలోని సమాచారాన్ని సేకరించుట. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0176 భూ ఉపరితలంపై గల అడవులు, ఎడారులు, సముద్రాలు, ధృవ ప్రదేశాలలోని మంచు మొదలగు వాటి గురించి అధ్యయనం, అలాగే సహజ వనరుల పరిశోధన మరియు నిర్వహణ. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0178 వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం, మొదలగు ప్రకృతి వైపరీత్యాలను పరిశీలించుట మరియు మార్గదర్శనం చేయుట. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0180 అంతర్జాలం నా నేస్తం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0182 వీడియో చూడండి మరియు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0184 1. https://youtu.be/cuqYLHaLB5M ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0186 ఇతరులకు పంపండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0188 2. https://youtu.be/y37iHU0jK4s ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0190 కృత్రిమ ఉపగ్రహాల యొక్క భ్రమణ కక్ష్యలు (Orbits of Artificial Satellites) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0192 ఉపగ్రహాలన్నీ ఒకే మాదిరి కక్ష్యలలో భూమిచుట్టూ పరిభ్రమణం చేయుటలేదు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0193 కృత్రిమ ఉపగ్రహం యొక్క భ్రమణ కక్ష్య భూ ఉపరితలానికి ఎంత ఎత్తులో ఉండాలి, భ్రమణ కక్ష్య వృత్తాకారంలో ఉండాలా లేక దీర్ఘవృత్తాకారంలో ఉండాలా, భూమధ్యరేఖకు సమాంతరంగా ఉండాలా లేక భూమధ్యరేఖతో కోణం ఏర్పడే విధంగా ఉండాలా, మొదలగు విషయాలన్నిటిని ఉపగ్రహం యొక్క పనిని బట్టి నిశ్చయిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0195 భూ ఉపరితలం నుండి ప్రత్యేకమైన ఎత్తులో తిరుగుతూ ఉండుటకు ఉపగ్రహాన్ని ఉపగ్రహ ప్రక్షేపకం ద్వారా ఆ ఎత్తువరకు తీసుకుపోబడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0196 ఆ తర్వాత ఆ ఉపగ్రహాన్ని నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టుటకు కక్ష్య యొక్క ఉపగ్రహ స్పర్శరేఖ దిశలో విశిష్టమైన వేగాన్ని (vc) అందిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0197 ఈ వేగం పొందగానే ఉపగ్రహం భూమిచుట్టూ పరిభ్రమించడం ప్రారంభిస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0198 ఈ వేగం యొక్క సూత్రాన్ని క్రింది విధంగా తయారు చేయవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0200 ఒకవేళ m ద్రవ్యరాశి గల ఉపగ్రహం భూకేంద్రం నుంచి ఎత్తులో మరియు ఉపరితలం నుంచి శ్రీ ఎత్తులో V వడితో పరిభ్రమణం భూమి చేయుచున్నట్లయితే దానిపై పనిచేయు అభికేంద్ర బలం mvc^2_c ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0202 10.3 కృత్రిమ ఉపగ్రహం యొక్క భ్రమణ కక్ష్య ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0204 page-137 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0206 ఈ అభికేంద్ర బలాన్ని భూమి గురుత్వం ఇస్తుంది కనుక, అభికేంద్ర బలం = భూమి మరియు ఉపగ్రహంలోని గురుత్వ బలం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0208 G = గురుత్వ స్థిరాంకం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0210 M = భూమి ద్రవ్యరాశి ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0212 R = భూమి వ్యాసార్థం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0214 h = భూ ఉపరితలం నుంచి ఉపగ్రహం ఎత్తు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0216 R+ h = ఉపగ్రహం భ్రమణ కక్ష్య యొక్క వ్యాసార్థం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0218 ప్రత్యేక వేగం (V.) అనేది ఉపగ్రహం యొక్క ద్రవ్యరాశి పై ఆధారపడి ఉంటుందని పై సూత్రాన్ని బట్టి తెలియుచున్నది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0219 ఉపగ్రహ కక్ష్య ఎత్తు భూ ఉపరితలం నుంచి పెరుగుతూ పోవు కొలది ఆ ఉపగ్రహ స్పర్వ రేఖలో గల వేగం తగ్గుతూ పోతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0220 భూ ఉపరితలం నుంచి కృత్రిమ ఉపగ్రహం యొక్క భ్రమణ కక్ష్య ఎత్తు ఎంత ఉందో, దానిని బట్టి సర్వసాధారణంగా కక్ష్యలు వర్గీకరించబడుతాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0222 ఎత్తైన భూ కక్ష్యలు (High Earth Orbits) : (భూ ఉపరితలం నుంచి ఎత్తు > 35780 km) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0224 ఏ ఉపగ్రహ భ్రమణ కక్ష్యలు భూ ఉపరితలం నుంచి 35780 కి.మీ. లేదా అధికంగా ఉంటాయో ఆ కక్ష్యలను ఎత్తైన భూ కక్ష్యలు అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0225 అనగా భూ ఉపరితలం నుంచి 35780 కి.మీ. ఎత్తులో గల ఉపగ్రహం భూమిచుట్టూ ప్రదక్షిణ పూర్తి చేయుటకు దాదాపు 24 గంటలు పడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0226 భూమి కూడా తనచుట్టూ తాను ఒక చుట్టు పూర్తి చేసుకోవడానికి 24 గంటలు పడుతుందని మనకు తెలుసు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0227 ఈ ఉపగ్రహం యొక్క కక్ష్య ఒకవేళ భూమధ్యరేఖకు సమాంతరంగా ఉంటే, భూమికి తనచుట్టు భ్రమణం చేయుటకు పట్టు కాలవ్యవధి మరియు ఉపగ్రహం భూమిచుట్టూ పరిభ్రమణం చేయుటకు పట్టు కాలవ్యవధి ఒకటే కాబట్టి భూమి సాపేక్షత వల్ల ఉపగ్రహం అంతరిక్షంలో స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0228 ఏకరీతి చలనంలో సమాంతరంగా నడుస్తున్న వాహనంలోని ప్రయాణికులకు ప్రక్క వాహనం స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఇచట జరుగుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0229 కావున ఇలాంటి ఉపగ్రహాన్ని భూస్థిర ఉపగ్రహం (Geosynchronous Satellite) అని అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0230 ఇలాంటి ఉపగ్రహం భూమి స్థిరంగా ఉండుటవలన భూమి యొక్క ఒకే భాగాన్ని మాత్రమే ఎల్లప్పుడు పరిశీలించ కల్గుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0231 కావున వాతావరణ శాస్త్రం, దూరవాణి, టెలివిజన్, ఆకాశవాణి మొదలగు సందేశ ప్రసారాలలో ఇది ఉపయోగపడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0233 మధ్యమ భూ కక్ష్యలు (Medium Earth Orbits) : (భూ ఉపరితలం 2000 km నుంచి 35780 km) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0235 ఏ ఉపగ్రహ భ్రమణ కక్ష్యలు భూ ఉపరితలానికి 2000 కి.మీ. నుంచి 35780 కి.మీ.లకు మధ్యన ఉంటాయో అలాంటి కక్ష్యలను మధ్యమ భూ కక్ష్యలు అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0236 భూస్థిర ఉపగ్రహం భూమధ్యరేఖకు సరిగా పైన పరిభ్రమిస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0237 దానివల్ల ఉత్తర లేక దక్షిణ ధృవ ప్రదేశాలను అధ్యయనం చేయుటకు అది ఎక్కువగా ఉపయోగపడదు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0238 మరి అయితే అందుకోసం ధృవ ప్రదేశాలపై నుంచి వెళ్ళే దీర్ఘవృత్తాకార మధ్యమ భూకక్ష్యలను ఉపయోగిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0239 ఈ కక్ష్యలను 'ధృవీయ కక్ష్య'లు అని అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0240 ఈ కక్ష్యలలో ఉపగ్రహం దాదాపు 2 నుంచి 24 గంటలలో ఒక ప్రదక్షిణ పూర్తి చేయును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0242 కొన్ని ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి దాదాపు 20,200 కి.మీ. ఎత్తులో వృత్తాకార కక్ష్య గుండా భ్రమణ చేస్తుంటాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0243 దిశా దర్శక ఉపగ్రహం ఈ కక్ష్యలో భ్రమణం చేస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0245 నిమ్న భూకక్ష్యలు (Low Earth Orbits) : (భూ ఉపరితలానికి 180 km నుంచి 2000 km) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0247 ఏ ఉపగ్రహ భ్రమణ కక్ష్యలు భూ ఉపరితలానికి 180 కి.మీ. నుంచి 2000 కి.మీ. ఎత్తులో ఉంటాయో అలాంటి కక్ష్యలను నిమ్న భూకక్ష్యలు అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0248 శాస్త్రీయ ప్రయోగాలకు లేదా వాతావరణ అధ్యయనానికి ఉపయోగించబడే ఉపగ్రహాలు నిమ్న భూకక్ష్యలలో భ్రమణం చేస్తాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0249 వాటి కక్ష్యల ఎత్తులను బట్టి దాదాపు 90 నిమిషాలలో వాటి ఒక పరిభ్రమణం పూర్తవుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0250 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) హబల్ దుర్బిణి కూడా ఇదే రకమైన కక్ష్యలలో పరిభ్రమణం చేస్తాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0252 పటం 10.4 లో ఉపగ్రహాల వివిధ కక్ష్యలు చూపబడినవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0254 page-138 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0258 పుణెలో COEP (కాలేజ్ ఆఫ్ ఇంజినియరింగ్, పుణె) సంస్థలోని విద్యార్థులు ఒక చిన్న ఉపగ్రహాన్ని తయారుచేసి ఇస్రో ద్వారా దానిని 2016 సంవత్సరంలో అంతరిక్షంలోకి (రోదసి) ప్రవేశపెట్టారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0259 ఈ ఉపగ్రహం పేరు 'స్వయం'. దీని బరువు సుమారు 1 కేజి ఉంటుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0260 అది భూమికి 515 కి.మీ ఎత్తులో మధ్యమ భూ కక్ష్య పరిభ్రమణం చేయుచున్నది. అది భూమిపై గల ఒక స్థానం ఎత్తైన భూ కక్ష్య నుంచి వేరొక స్థానం వరకు ఒక ప్రత్యేక పద్ధతిలో సందేశాన్ని పంపుటలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0262 10.4 ఉపగ్రహాల వివిధ కక్ష్యలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0264 సాధించబడిన ఉదాహరణలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0266 1. ఉపగ్రహ కక్ష్య భూ ఉపరితలం నుంచి సరిగ్గా 35780 కి.మీ. ఎత్తులో ఉన్నదని అనుకున్నట్లయితే ఆ ఉపగ్రహం యొక్క స్పర్శరేఖ లో గల వేగాన్ని కనుగొనండి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0268 ఉదాహరణ 2 : పై ఉదాహరణలోని ఉపగ్రహానికి భూమి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయుటకు ఎంత కాలం పట్టును? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0270 page-139 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0272 ఉపగ్రహ నౌకలు (Satellite Launch Vehicles) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0274 ఉపగ్రహాన్ని దాని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టుటకు ఉపగ్రహ నౌకలను (Satellite Launch Vehicles) ఉపయోగిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0275 న్యూటన్ మూడవ గమన నియమంపై ఉపగ్రహ నౌక యొక్క పని ఆధారపడి ఉంటుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0276 నౌకలలో ప్రత్యేకమైన ఇంధనాన్ని వాడతారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0277 ఈ ఇంధన వాయువు వేడిగా ఉండుట వలన వ్యాకోచిస్తుంది. అది నౌక యొక్క వెనుకభాగం నుంచి అత్యంత వేగంతో బయటపడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0278 దానికి ప్రతిచర్యగా నౌకపై ఒక 'అభిబలం' (Thrust) పనిచేస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0279 నౌకపై అభిబలం ప్రయోగించబడుట చేత నౌక అంతరిక్షంలోకి ఎగురుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0281 ఉపగ్రహం ఎంత బరువు గలది దానిని ఎంత ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్ట వలెనను విషయాలపై నౌక యొక్క ప్రణాళికను నిర్ణయిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0282 నౌకకు కావలసిన ఇంధనాన్ని కూడా నిర్ణయిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0283 మొత్తం మీద నౌకలో ఇంధనం ఎక్కువ బరువు కల్గి ఉంటుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0284 అందువలన నౌక ఎగురునపుడు దానితోబాటు అత్యంత బరువుగల ఇంధనాన్ని కూడా తీసుకుపోవలసి ఉంటుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0285 కావున దీనికొరకు అంచెల వారిగా తయారుచేసిన నౌకను వాడతారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0286 ఈ ఉపాయం వల్ల నౌక ఎగిరిన తర్వాత అంచెల వారిగా దాని బరువును కూడా తగ్గించవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0287 ఉదాహరణకు, ఒక నౌక రెండు అంచెలు కలదని అనుకోండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0289 నౌక ఎగరడానికి మొదటి అంచెలో ఇంధనం మరియు ఇంజన్ వాడబడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0290 అప్పుడు అవి నౌకకి నిర్ణీత వేగం మరియు ఎత్తును ఇస్తుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0291 ఈ మొదటి ఉపగ్రహం పెట్టే స్థలం అంచెలో ఇంధనం అయిపోగానే ఖాళీ అయిన ఇంధన ట్యాంకు మరియు ఇంజన్ నౌక నుంచి విడిపోయి క్రింది సముద్రంలో లేక నిర్జీవ ప్రదేశంలో పడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0292 మొదటి అంచెలోని ఇంధనం అయిపోగానే రెండో అంచెలో ఇంధనం ప్రజ్వలింపబడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0293 కాని ఇప్పుడు నౌకలో కేవలం రెండే అంచెలో మిగిలి ఉండుట వలన దాని బరువు చాలా తగ్గి అది అధిక వేగంతో ప్రమాణం చేయగల్గుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0294 చాలమటుకు నౌకలు అన్ని రెండు లేదా అధిక అంచెలలో తయారు చేయబడుతాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0295 ఉదాహరణకు పటం 10.5 'అ' లో భారతదేశపు ఇస్రో (ISRO) సంస్థ తయారుచేసిన ఒక నౌక యొక్క చిత్రం పనిచేయు మూడోదశ (PSLV) ఇవ్వబడినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0297 ఉపగ్రహ నౌక చాల ఖర్చుతో కూడుకున్నది. ఎందుకనగా అది ఒకేసారి ఉపయోగపడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0298 అందువలన అమెరికాదేశం Space Shuttle ను తయారు చేసింది (పటం 10.5 ఆ). అందులో కేవలం ఇంధన ట్యాంకు మాత్రమే వ్యర్థమవుతుంది. మిగిలిన భాగాలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0299 ఈ భాగాలు మళ్ళీ ఉపయోగపడతాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0301 page-140 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0303 ఇది ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0305 దీపావళి పండుగనాడు కాల్చి ఎగరవేసే 'రాకెట్' ఒక రకమైన నౌక యే ఈ రాకెట్ లోని ఇంధనం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0306 దానికి జోడించబడిన వత్తి సహాయంతో మండించగానే ఈ రాకెట్ నౌక పైకి ఎగురుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0307 ఒక బుడగను ఊది విడిచిపెడితే అందులోని గాలి వేగంగా బయటపడుతుంది. బుడగ వ్యతిరేక దిశలో నెట్టబడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0308 ఈ చర్య కూడా న్యూటన్ గమన నియమంపై ఆధారపడి ఉంటుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0310 భూమికి దూరంగా వెళ్ళిన అంతరిక్ష యానములు (Space missions away from earth) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0312 చాలా మటుకు కృత్రిమ ఉపగ్రహాలను మన జీవనాన్ని అధికంగా సమృద్ధిగావించుటకు ఉపయోగిస్తారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0313 కాని మనం గత తరగతిలో కృత్రిమ ఉపగ్రహం పై అమర్చిన దుర్బిణి ద్వారా విశ్వంలోని వివిధ ఘటకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా పొందవచ్చునో తెలుసుకొన్నాం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0314 అదే విధంగా విశ్వానికి సంబంధించిన జ్ఞానం మనం పెంపొందించుకొనుటకు కొన్ని అంతరిక్ష యానాలు నిర్వహించబడుతుంటాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0315 ఇందులో సౌరకుటుంబంలోని ఇతర ఘటకాలను సమీపం నుంచి పరిశీలించుటకు అంతరిక్షనౌకను ఉపయోగిస్తారు. ఇలాంటి కార్యాల ద్వారా నూతన సమాచారం పొంది సౌరకుటుంబం ఉత్పత్తిని మరియు పరిణామక్రమాన్ని తెలుసుకొనుటలో అభివృద్ధి చెందాము. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0317 ఇలాంటి ప్రయోగాలకు అంతరిక్ష నౌక భూమి గురుత్వాకర్షణ బలం నుంచి పలాయనమై రోదసిలో ప్రయాణం చేయగలగాలి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0318 మనం గురుత్వాకర్షణ అనే పాఠంలో ఇలా జరుగుటకు వస్తువు యొక్క తొలి అనగా భూ ఉపరితలం పై వేగం భూ పలాయన వేగాని కంటే (Escape Velocity, v,) అధికంగా ఉండుట తప్పనిసరి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0319 ఏదైన గ్రహంపై గల పలాయన వేగాన్ని క్రింది సూత్రంతో కనుగొనవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0321 అనగా భూమి గురుత్వాకర్షణ బలం నుంచి పలాయనం చేసి ఒక నౌక అంతరిక్షంలో ప్రయాణం జేయుటకు ఆ నౌక చలనం కనిష్ఠంగా 11.2 కి.మీ./సెకనులు ఉండుట తప్పనిసరి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0325 సౌరకుటుంబంలో మనకు అత్యంత సమీపంలో నున్న ఘటకం చంద్రుడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0326 చంద్రుని నుంచి మన వరకు కాంతి చేరుటకు 1 సెకను కాలం పడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0327 అనగా కాంతి వేగంతో ప్రయాణిస్తే మనం ఒక సెకనులో చంద్రునిపైకి చేరుకోగలం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0328 కాని, మన అంతరిక్ష నౌక వేగం కాంతివేగంతో పోల్చితే తక్కువ ఉండుట వలన చంద్రునిపై చేరుటకు అధిక కాలం పట్టుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0329 ఒక అంతరిక్ష నౌకను చంద్రుని వరకు చేరుటకు తక్కువలో తక్కువ 8 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0333 చంద్రయాన కార్యక్రమం (Moon missions) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0335 చంద్రుడు మనకు అతిదగ్గరి ఖగోళ వస్తువు వలన సౌరకుటుంబంలోని ఘటకాల వైపు పంపబడిన యానాలలో చంద్రయానమే మొట్టమొదటి అంతరిక్షయానము. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0336 ఇలాంటి యానాలు నేటివరకు సోవియెట్ యూనియన్, అమెరికా, యూరప్ దేశం, చైనా, జపాన్ మరియు భారతదేశం ద్వారా నిర్వహించబడినవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0337 సోవియట్ యూనియన్ పంపిన 'లునా' మాలికలోని అంతరిక్షనౌక చంద్రుని వద్దకు చేరింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0338 1959లో ప్రవేశపెట్టిన 'లునా 2' అనేదే మొదటి అంతరిక్ష నౌక. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0339 అప్పటి నుంచి 1976 వరకు వారు పంపిన 15 నౌకలు చంద్రుని రసాయనిక విశ్లేషణ చేసినవి దాని గురుత్వం, సాంద్రత, మరియు చంద్రుని నుంచి వెలువడిన వికిరణాలను కొలిచాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0340 చివరి 4 నౌకలు చంద్రునిపై దిగి అచటి శిలల నమూనాలను భూమిపై గల ప్రయోగశాలలో అధ్యయనం చేయుటకు తెచ్చాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0341 ఈ యానములు మానవ రహితమైనవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0343 అమెరికా కూడా 1962 నుంచి 1972 లో చంద్రయాన కార్యక్రమం నిర్వహించింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0344 వారి ప్రత్యేకతలు ఏమనగా, వారి కొన్ని నౌకల ద్వారా మానవులు కూడా చంద్రునిపై దిగారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0345 జులై 1969 లో నీల్ ఆర్మ స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రునిపై కాలిడిన మొట్టమొదటి మానవునిగా నిలిచాడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0346 2008 లో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చంద్రయాన్- 1 ని విజయవంతంగా ప్రయోగించింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0347 సంవత్సరమంత ఆ నౌక భూమి పైకి సమాచారాన్ని పంపింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0348 చంద్రునిపై నీటి అస్తిత్వాన్ని కని పెట్టుటలో ఈ కార్యక్రమం ద్వారా చేసిన అతి ముఖ్యమైన పరిశోధన. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0349 భారతదేశం దీనిని కని పెట్టుటలో మొదటి దేశంగా నిలిచింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0351 అంగారక యాన కార్యక్రమం (Mars missions) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0353 చంద్రుని తర్వాత దగ్గరగా నున్న రెండో ఖగోళ వస్తువు అంగారకుడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0354 అంగారకునిపైకి కూడా అనేక దేశాలు నౌకలను పంపాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0355 కాని ఈ పని కష్టంగా ఉండుటవలన అందులో దాదాపు సగం ప్రయాణాలు విజయవంతం కాలేదు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0356 కాని మనం గర్వించదగిన విధంగా ఇస్రో పాటుపడింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0357 అతి తక్కువ ఖర్చుతో ఇస్రో నవంబర్ 2013 లో ప్రయోగించిన అంగారక యానం సెప్టెంబర్ 2014 లో అంగారకుని కక్ష్యలో ప్రవేశించింది. అది అంగారకుని ఉపరితల భాగానికి మరియు వాయు మండలానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0359 రాకేశ్ శర్మ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0361 అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయుడు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0362 భారత్ రష్యా సంయుక్తంగా అంతరిక్ష యానంలో భాగంగా ఇద్దరు రష్యన్ అంతరిక్ష పరిశోధకులతో కూడి అంతరిక్షంలోకి ఎగిరాడు. 8 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0364 కల్పనా చావ్లా ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0366 పంజాబుకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ పూర్తి ఈమె 1988 లో కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0367 పరిశోధన కార్యాలయంలో ఆమె 336 గంటలు అంతరిక్షంలో ఉన్నారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0368 1 ఫిబ్రవరి 2003 లో అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తుండగా కొలంబియా అంతరిక్షనౌక పేలిపోవడం వల్ల మరణించారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0370 సునితా విలియమ్స్ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0372 2006 లో డిస్కవరీ నుంచి మొదటగా అంతరిక్షంలోని International space stationకు ప్రయాణించారు. అచట 29 గంటల పాటు షటిల్ బయట పనిచేశారు. ఆమె 192 రోజులు అంతరిక్షంలో ఉండుటకు సాహసించింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0374 ఇతర గ్రహాల యాత్రలు : ఇతర గ్రహాలను అధ్యయనం చేయుటకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించబడినవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0375 ఇందులో భాగంగా కొన్ని అంతరిక్ష నౌకలు గ్రహాలను ప్రదక్షిణ చేశాయి. మరికొన్ని నౌకలు గ్రహాలపై దిగాయి. ఇంకొన్ని నౌకలు గ్రహాలను సమీపం నుంచి పరిశీలించి ముందుకెళ్ళాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0376 ఇంతేగాకుండా లఘు గ్రహాలు మరియు ధూమకేతు (తోకచుక్కలు)వులను అధ్యయనం చేయుటకు అంతరిక్షనౌకలు పంపబడినవి. లఘు గ్రహాల పై గల ధూళికణాలు, శిలలు మొదలగు వాటిని భూమిపైకి తీసుకురాగలిగాము. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0377 ఈ కార్యక్రమాలు అన్నింటి ద్వారా మనకు విలువైన సమాచారం లభిస్తుంది. సౌరకుటుంబం యొక్క ఏర్పాటు మరియు పరిణామ క్రమానికి సంబంధించిన భావనలు అధికంగా స్పష్టమగుచున్నవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0379 page-142 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0381 భారతదేశం మరియు అంతరిక్ష సాంకేతికశాస్త్రం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0383 భారతదేశం కూడా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన జ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో గర్వించదగిన అభివృద్ధిని సాధించింది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0384 ప్రయోగించుటకు విభిన్న రకాల నౌకలను తయారుచేయబడినవి. అందులో 2500 k.g. బరువు వరకు గల ఉపగ్రహం అన్ని రకాల కక్ష్యలలో ప్రవేశించ కల్గుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0385 ఇందులో PSLV మరియు GSLV ముఖ్యమైనవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0386 భారతదేశం అంతరిక్షశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రంలో సాధించిన అభివృద్ధి జాతీయ మరియు సామాజిక అభివృద్ధిలో గొప్ప తోడ్పాటు గలదు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0387 దూర ప్రసారం (Telecommunication) దూరదర్శిని ప్రసారం (Television broadcasting) మరియు వాతావరణ శాస్త్ర సేవలు (Meterological services) మొదలగు వాటికి INSAT మరియు GSAT ఉపగ్రహ మాలికలు పనిచేస్తున్నాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0388 వీటివలననే దేశమంతటా దూరదర్శిని, దూర ధ్వని మరియు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0389 ఇదే మాలికల లోని EDUSAT అనే ఉపగ్రహం కేవలం విద్యారంగానికి మాత్రమే ఉపయోగించుటకు అందుబాటులో ఉన్నది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0390 దేశంలోని సహజ వనరుల నియంత్రణ మరియు నిర్వహణ (Monitoring and management of natural resources) అలాగే విపత్తుల నిర్వహణ (Disaster management)కు IRS ఉపగ్రహ మాలిక పనిచేయుచున్నది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0391 భూమిపై గల ఏదేని ప్రదేశపు భౌగోళిక స్థానం అనగా ఆ స్థానం యొక్క అత్యంత నిక్కచ్ఛితమైన అక్షాంశాలు (Latitude) మరియు రేఖాంశాలు (Longitude) నిర్ణయించుటకు IRNSS అనే ఉపగ్రహ మాలిక ప్రవేశపెట్టబడినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0393 సమాచారం కల్గి ఉండండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0395 రాకెట్ ప్రయోగ కేంద్రాలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0397 1. తూర్పు, తిరువనంతపురం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0399 2. శ్రీహరికోట ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0401 3. చాందీపూర్ (ఒడిషా) ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0403 అంతరిక్ష పరిశోధన సంస్థలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0405 1. విక్రం సారాభాయి అంతరిక్ష పరిశోధన కేంద్రం, తిరువనంతపురం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0407 2. సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం, శ్రీహరికోట ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0409 3. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0411 శాస్త్రజ్ఞుని పరిచయం ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0413 విక్రం సారాభాయి భారతీయ అంతరిక్షయాన పితామహుడని అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0414 అతని ప్రయత్నం ద్వారా ఫిజికల్ రీసర్చ్ ల్యాబొరేటరీ (PRL) స్థాపించబడినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0415 1962వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అతని అధ్యక్షతన 'భారతదేశ అంతరిక్ష పరిశోధన సమితి స్థాపన’ చేసి 1963వ సంవత్సరంలో దేశంలోని మొదటి ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని థుంబా వద్ద స్థాపించారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0416 అతని ప్రయత్నం వలననే భారత దేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడినది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0417 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) స్థాపనలో అతని ప్రధాన కృషి కలదు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0419 అంతరిక్షంలోని వ్యర్థాలు మరియు దాని నిర్వహణ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0421 కృత్రిమ ఉపగ్రహాలతో పాటు ఇతర మానవ నిర్మిత వస్తువులు కూడా భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0422 అందులో ఇపుడు పనికిరాని ఉపగ్రహాలు ప్రయోగ సమయంలో విడిపోయిన నౌకల భాగాలు మరియు ఏదేని ఉపగ్రహం వేరొక ఉపగ్రహంతో లేదా అంతరిక్షంలోని ఇతర వస్తువులతో ఢీ కొట్టడం వలన ఏర్పడే ముక్కలు మొదలగు వస్తువులన్నీ ఇందులో ఉంటాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0423 2016 లో ఒక అంచనా ప్రకారం ఇలా నిరుపయోగమైన వస్తువులు 1 సెం.మీ. కంటే ఎక్కువ పొడవు గలవి దాదాపు 2 కోట్ల ముక్కలు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0424 వీటన్నింటిని అంతరిక్షంలోని వ్యర్థాలు అంటారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0426 ఈ వ్యర్థాలు కృత్రిమ ఉపగ్రహాలకు ముప్పుగా పరిణమించవచ్చు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0427 ఉపగ్రహాలను మరియు ఇతర అంతరిక్ష నౌకలను ఢీకొట్టి వాటికి హాని కలిగించ వచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0428 ఈ వ్యర్థాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నవి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0429 దీనివలన తొందరలోనే కొత్త అంతరిక్ష నౌకల ప్రయోగమునకు ఆటంకం ఏర్పడవచ్చును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0430 అందువలన ఈ చెత్తను నిర్వహణ చేయుట అత్యంతావశ్యకం. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0431 ఆ దృష్టితోనే కొన్ని పద్ధతుల గురించి అధ్యయనం మరియు కొన్ని ప్రయోగాలు కూడా చేయుట ప్రారంభించారు. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0432 ఈ సమస్యకు తొందరలోనే నివారణోపాయం దొరుకుతుంది. ఉపగ్రహాలకు మరియు అంతరిక్ష నౌకలకు భవిష్యత్తులో ముప్పు కలుగదు అనే ఆశ ఉంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0434 పుస్తకం నా నేస్తం : అధిక సమాచారం కొరకు గ్రంథాలయంలోని సందర్భ పుస్తకాలు చదవండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0436 1. అంతరిక్షం మరియు విజ్ఞానశాస్త్రం-డా. జయంత్ నార్లికర్ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0438 2. ఇస్రో కథ-డా. వసంత్ గోవారికర్ ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0440 page-143 ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0444 1. క్రింద ఇవ్వబడిన వాక్యాలలోని ఖాళీలను సరియైన పదాలతో పూరించి ఆ వాక్యాన్ని వివరించండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0446 అ. కృత్రిమ ఉపగ్రహం యొక్క భ్రమణ కక్ష్యను భూ ఉపరితలం నుంచి ఎత్తుకు పెంచినచో ఆ ఉపగ్రహం యొక్క స్పర్శ రేఖలోని చలనం ..... అవుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0448 ఆ. అంగారక యానం యొక్క తొలివేగం భూ .....కంటే అధికంగా ఉండుట తప్పనిసరి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0450 2. క్రింది వాక్యాలు సరియైనవో కాదో నిర్ణయించి వాటి స్పష్టీకరణలను రాయండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0452 అ. ఒక అంతరిక్షనౌక భూమి గురుత్వాకర్షణ బలప్రభావం నుంచి పలాయనం చేయవలసి వచ్చినపుడు దానివేగం పలాయన వేగాని కంటే తక్కువ ఉండాలి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0454 ఆ. చంద్రునిపై గల పలాయనవేగం భూమిపై గల పలాయన వేగాని కంటే తక్కువ ఉండును. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0456 ఇ. ఒక ప్రత్యేకమైన కక్ష్యలో పరిభ్రమణం చేయుటకు ఉపగ్రహానికి నిర్ణీత వేగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0458 ఈ. ఉపగ్రహం యొక్క ఎత్తును పెంచినచో దాని వేగం కూడా పెరుగుతుంది. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0460 3. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0462 అ. కృత్రిమ ఉపగ్రహం అనగానేమి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0463 ఉపగ్రహాల పని విధానమును అనుసరించి వాటిని ఎలా వర్గీకరిస్తారు? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0465 ఆ. ఉపగ్రహం యొక్క భ్రమణ కక్ష్య అనగానేమి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0466 కృత్రిమ ఉపగ్రహం యొక్క భ్రమణ కక్ష్యను దేని ఆధారంగా మరియు ఎలా వర్గీకరిస్తారు? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0468 ఇ. ధృవకు ప్రాంతాలను అధ్యయనం చేయుటకు భూస్థిర ఉపగ్రహం ఎందుకు ఉపయోగపడదు? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0470 ఈ. ఉపగ్రహ నౌక అనగానేమి? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0471 I.S.R.0 తయారుచేసిన ఒక ఉపగ్రహ నౌక యొక్క బాహ్య రూపురేఖను పటంతో స్పష్టం చేయండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0473 ఉ. ఉపగ్రహ ప్రయోగంలో ఒకటికంటే అధిక/అనేక దశలు గల నౌకను ఉపయోగించుట లాభదాయమెందుకు? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0475 4. క్రింది పట్టికను పూర్తి చేయండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0477 5. ఉదాహరణలు సాధించండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0479 అ. ఒక గ్రహం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే 8 రెట్లు అధికంగా మరియు దాని వ్యాసార్థం భూమి వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటే ఆ గ్రహానికి పలాయన వేగం ఎంత ఉండును? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0481 జవాబు : 22.4 km/s ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0483 ఆ. భూమి తనకున్న ద్రవ్యరాశి కంటే 4 రెట్ల ద్రవ్యరాశి ఉంటే గనుక 35780 కి.మీ. ఎత్తు కక్ష్యలో తిరిగే ఉపగ్రహానికి, భూమిచుట్టూ ఒక ప్రదక్షిణ చేయుటకు ఎంత సమయం పడుతుంది? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0485 జవాబు: 12 గంటలు ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0487 ఇ. భూమిచుట్టూ 7 సెకనులలో ఒక భ్రమణం చేయు ఉపగ్రహం యొక్క ఎత్తు h1. అయితే 2 \sqrt2 T సెకనులలో ఒక ప్రదక్షిణ చేయు భూస్థిర ఉపగ్రహం యొక్క ఎత్తు ఎంత ఉండును? ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0489 జవాబు : R+ 2h ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0493 1. సునీతా విలియమ్స్ యొక్క అంతరిక్షయాన సమాచారాన్ని సేకరించండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0495 2. మీరు సునీతా విలియమ్స్ తో ముఖాముఖి చేశారనుకోండి ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0496 వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు? ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లభిస్తాయో వాటి గురించి కూడా ఆలోచించండి. ebs_10th-aanrish-abhiyan-page-135-144-translation-hin2tel_0498 page-144