ID SENT ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0001 Link-1 ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0003 వ్యవసాయ రంగంలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి చవకైన మరియు సౌర శక్తితో పనిచేసే బ్యాటరీ ఆధారిత స్ప్రేయర్ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0005 నీరు ఒక అమూల్యమైన వనరు. నీటి కొరత మొత్తం దేశాన్నే కుదిపేస్తోంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0006 సాగునీటిలో దాదాపు 70% నీటిని వినియోగించుకునే వ్యవసాయ రంగం, ఈ సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అన్నింటికంటే బలహీనమైన రంగంగా మారింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0007 ఈ సమస్యను పరిష్కరించడానికి దాదాపు ప్రతి భూభాగంలో సౌర పంపులను వాడకంలోకి తీసుకురావటం పై చర్చ జరిగింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0009 నీటి వినియోగాన్ని తగ్గించటం ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0011 శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సియస్ ఐఆర్- సిఎమ్ ఇఆర్ ఐ) లు సౌర పంపులే కాకుండ, సేద్యం కోసం అవసరమయ్యే నీటి వాడకాన్ని తగ్గించే విధానాలపై కృషి చేస్తున్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0012 ముందుగా, డ్రిప్ సేద్య పద్ధతిని పరిగణించారు. కాని సన్నకారు రైతుల మొదలుకుని, భారతీయ వ్యవసాయ భూభాగంలో ప్రధాన వాటా ఉన్న ఉపాంత రైతుల దాకా, అది చవక కాదని గ్రహించారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0013 ఈ రైతులు కొన్ని వేల రూపాయల ఖరీదైన చేతితో నడిపే పిచికారీ యంత్రాలను (మాన్యువల్ స్ప్రేయర్స్) ఉపయోగిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0015 పిచికారీ యంత్రము-ప్రస్తుత స్థితి ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0017 అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పంట యొక్క ఉత్పాదకతను పెంచడంలో పురుగుమందులు భారీ పాత్రను పోషిస్తాయి. కాని తగిన యంత్రాలు లేకపోవడం వల్ల పురుగుమందుల పిచికారీ పెద్ద మొత్తంలో వృధా అవుతుంది మరియు నేల, నీరు, గాలి కలుషితమయిపోతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0018 పురుగుమందుల యొక్క ఇటువంటి హానికరమైన ప్రభావాల కారణంగా, వాటి వాడకాన్ని తగ్గించడానికి మరియు వాటిని మరింత సమర్థవంతంగా పిచికారీ చేయడం పై ఒత్తిడి పెరుగుతోంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0019 సమర్థవంతంగా పిచికారీ చేసే పరికరాల తయారీకి ఉపరితల వ్యాప్తి, మెత్తదనం / పెళుసుదనం, బరువు, గాలి ప్రవాహం, డైనమిక్ ప్రెజర్, కణ ఆకారం మొదలైనవాటిని శాస్త్ర పరంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0021 బ్యాటరీతో పనిచేసే పిచికారీ వ్యవస్థ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0023 CSIR-CMERI బ్యాటరీలతో నడిచే రెండు రకాల పిచికారీ విధానాలను అభివృద్ధి చేసింది. ఒకటి "ఉపాంత రైతుల" కోసం, మరొకటి "సన్నకారు రైతుల" కోసం . ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0024 5 లీటర్ల సామర్థ్యం కలిగిన బ్యాక్ ప్యాక్ స్ప్రేయర్ (వీపుకు తగిలించుకుని లేదా కట్టుకుని పిచికారీ చేసే యంత్రం) ‌ను "ఉపాంత రైతులు" కోసం రూపొందించగా, 10 లీటర్ల సామర్థ్యం కలిగిన కాంపాక్ట్ ట్రాలీ స్ప్రేయర్‌ను "సన్నకారు రైతుల" కోసం రూపొందించారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0025 పంటల రకరకాల నీటి అవసరాలు, లక్ష్యంగా పెట్టుకున్న /ప్రత్యేక భూముల సాగు, తెగుళ్ళను నియంత్రించడానికి పురుగుమందు / శిలీంద్ర సంహారిణి ఎప్పుడూ సరిగా ఉపయోగపడేలా, ఆకుల ఉపరితలంపై నీటి ఆధారిత సూక్ష్మ కరుకుదనాన్ని సృష్టించడానికి, చిన్న ప్రాంతాల పరిధిలో నేలలోని తేమ స్థాయిని నిలవ ఉంచడం మరియు కలుపు నియంత్రణ చేయటం కోసం ఈ పిచికారీ పరికరాలు రెండు వేర్వేరు ట్యాంకులను, ప్రవాహ నియంత్రణ మరియు పీడన నియంత్రణలను కలిగి ఉంటాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0026 ఈ వ్యవస్థ సౌర-శక్తి ఆధారిత బ్యాటరీలపై పనిచేస్తుంది. ఇలా దేశంలోని విద్యుచ్ఛక్తికి నోచుకోని పంటపొలాలో దీని వాడకాన్ని సమర్థవంతం చేస్తుంది. ఇలా విలువైన అస్థిర శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0027 ఈ పిచికారీ యంత్రాలు (స్ప్రేయర్లు) అభివృద్ధి చెేయడానికి సులభమైనవి మరియు నేర్చుకోవడం, వాడటం కూడా తేలిక. కాబట్టి ఇవి భారతీయ రైతులు ఎదుర్కోబోతున్న నీటి సంక్షోభాన్ని తొలగించడంలో సహాయకారిగా నిరూపింపబడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0029 పనిచేసేవిధానం ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0031 పిచికారీ యంత్రాల(స్ప్రేయర్స్) యొక్క ప్రవాహ నియంత్రణ సౌకర్యం నీరు / పురుగుమందుల వివిధ ప్రవాహ దశలను పొందడానికి సహాయపడుతుంది. దీనితో భూమిలోని పెళుసుదనాన్ని మరియు కదలికలతో పాటు అనువర్తనాల తీవ్రత కూడా పెరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0032 పిచికారీ యంత్రాల (స్ప్రేయర్) యొక్క డ్యుయల్-ఛాంబర్ (రెండు-దశల) డిజైన్, వనరును మరింత క్రియాత్మకంగా చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే, ఇది, ఒక నిర్దిష్ట సమయంలో రెండు రకాల ద్రవ పదార్థాలను తీసుకువెళ్ళడానికి వ్యవస్థను అనుమతిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0033 CSIR-CMERI లో నిర్వహించిన ప్రయోగాల ప్రకారం, ఈ సంస్థలు అభివృద్ధి చేసిన స్ప్రేయర్‌ను ఉపయోగించినప్పుడు, 75% నీరు మరియు 25% సమయం ఆదా అవుతుందని శ్రామిక రైతులు తెలియజేశారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0034 ఈ డిజైన్, స్ప్రే-ఆధారిత వ్యవసాయ అనువర్తనాల సమయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఎందుకంటే రైతులు ఇంకొక పదార్థాన్ని ఉపయోగించే ముందు వేరే ఏ పాత్రలోని పదార్థాలను పూర్తిగా ఖాళీ చేయకూడదు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0036 ప్రభావవంతమైన సామాజిక-ఆర్థిక పరిష్కారాలు ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0038 CSIR-CMERI సంస్థల దర్శకులు ప్రొఫెసర్ (డా.) హరీష్ హిరానీ విపులంగా ఇలా వివరించారు. వివిధ రకాల ఈ పద్ధతులు "వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురాగలవు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0039 ఈ విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం బీడుపడిన మరియు పాక్షిక బీడు భూముల్లో కూడా వ్యవసాయనికి బాటలను వేయడంలో సహాయపడుతుంది, ఎందుకంటే రైతు సమాజానికి నీటి కొరత గురించి భయం ఉండదు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0040 CSIR-CMERI చే అభివృద్ధి చేయబడిన స్ప్రేయర్ ఉపాంత మరియు సన్నకారు రైతుల పెట్టుబడికి తగ్గ లాభదాయక సామాజిక-ఆర్థిక పరిష్కారాన్ని అందిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0041 సరసమైన ధరలను నిర్ణయించే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత పరచటం ద్వారా కుటీర మరియు సూక్ష్మ పరిశ్రమలకు అవకాశం లభిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0042 " ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0044 CSIR-CMERI సంస్థలు ఇప్పటికే 1 కిలోవాట్- సామర్థ్యం (kwp), 3 కిలోవాట్- సామర్థ్యం (kwp), 5 కిలోవాట్- సామర్థ్యం (kwp), 6 కిలోవాట్- సామర్థ్యం (kwp), 7.5 కిలోవాట్- సామర్థ్యం (kwp) మరియు 11.5 కిలోవాట్- సామర్థ్యం (kwp) కల ఒక సౌర వృక్షాన్ని అభివృద్ధి చేసింది, (ఇది ఇప్పటివరకు ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సౌర వృక్షం). ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0046 లింక్ -2 ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0048 వ్యవసాయంలో నానోటెక్నాలజీ యొక్క వినూత్న ప్రయోగాలు ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0050 ప్రస్తుత సమయంలో, తమ సూక్ష్మ ఆకారం మరియు అద్వితీయమైన భౌతిక-రసాయనిక ప్రత్యేకతల కారణంగా వివిధ రంగాలలో నానోమెటీరియల్స్ యొక్క వాడకం పెరిగింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0051 వ్యవసాయానికి సంబంధించిన ప్రతికూల సమస్యలను తగ్గించడంతో పాటుగా, పర్యావరణ, మానవ ఆరోగ్య, ఆహార భద్రత మరియు వ్యవసాయ ఉత్పాదకతలో మార్పులు తీసుకువచ్చే అపారమైన సామర్థ్యం నానోటెక్నాలజీ లో ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0052 వ్యవసాయ ఉత్పత్తులు మానవ జీవితంలోని అధికశాతం అంశాలను ప్రభావితం చేస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0053 ఇంధనం, వస్త్రాలు, ఫర్నిచర్, ఆహారం మరియు పశుగ్రాసం వంటి రోజువారీ జీవితంలో ఉపయోగకరమైన వస్తువులెన్నో వీటిలో ఉన్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0054 వ్యవసాయం తో భావి ప్రపంచ అవసరాలను తీర్చడానికి సాంకేతిక పురోగతి అవసరం. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0055 వ్యవసాయ రంగంలో నానోటెక్నాలజీ యొక్క వివిధ అనువర్తనాలు మరియు సంశయాలను ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడ్డాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0057 నేల యొక్క నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచడం కోసం, హైడ్రోజన్, నానోక్లే మరియు నానోజియోలైట్లను పరిశోధకులు విజయవంతంగా పరీక్షించారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0058 అందువల్ల, పంట పరిపక్వత సమయంలో నీరు కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంది మరియు చాలా కాలం పాటు అవసరానికి అనుగుణంగా కూడా లభిస్తుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0059 విభజించబడిన/పంచబడిన ప్రాంతాలలో పునః పంపిణీకి ఈ రకమైన వ్యవస్థ యొక్క వాడకం అనుకూలంగా ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0060 పర్యావరణాన్ని కలుషితం చేసే హానికరమైన పదార్థాలను పీల్చుకోవటానికి, కార్బన్ నానోట్యూబ్, కార్బన్ లేని నానో పదార్థాలు మరియు మెటల్ ఆక్సైడ్లు కూడా ఉపయోగించబడ్డాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0062 నానోమెటీరియల్స్ ద్వారా మొక్కల ప్రభావాత్మక పెరుగుదల ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0064 కార్బన్ నానోట్యూబ్ మరియు Mo, SiO2, ZnO మరియు Tio2 యొక్క నానోకణాలు ఉపయోగించిన తరువాత మొక్కల యొక్క పెరుగుదల అంచనా వేయబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0065 ఈ పద్ధతి ద్వారా మొక్కలకు పుష్కలంగా పోషక విలువలు లభిస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0066 నానో మెటీరియల్స్ యొక్క అసలైన ప్రభావం ఆయా జాతి మొక్కలకు ఉండే సున్నితత్వమే కాకుండా, కూర్పు, పరిమాణం, ఉపరితలం, భౌతిక మరియు రసాయన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0068 భారతీయ వ్యవసాయ పరిశోధనా పరిషత్ ‌లో నానోటెక్నాలజీ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0070 వ్యవసాయ సంబంధిత రంగాలలో నానోటెక్నాలజీ యొక్క ప్రయోగాలపై సంస్థ యొక్క శాస్త్రవేత్తలు గుర్తించదగిన పద్ధతులను అభివృద్ధి చేశారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0072 నానోసెల్లూలోస్ పైలట్ ప్లాంట్ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0074 భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారంలో ఈ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి, తన వాటాదారులకు మరియు కొత్త వ్యస్థాపకులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి మరియు మన దేశంలో ఈ రకంగా మొదటిదైన నానోసెల్లూలోజ్ పైలట్ ప్లాంట్‌ను ముంబయు ప్రధాన కార్యాలయంలో స్థాపించింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0075 ఈ పైలట్ ప్లాంట్లో పత్తి లింటర్స్, పత్తి యొక్క వ్యర్థాల నుంచి మరియు పత్తి నుంచి, ప్రతి 8 గంటలకు 10 కి.గ్రా చొప్పున, నానోక్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎన్‌సిసి) ను ద్రవ రూపంలో మరియు నానోఫైబ్రిలేటెడ్ సెల్యులోజ్ (ఎన్ఎఫ్‌సి) ను పొడి రూపంలోను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0076 నానోసెల్లూలోజ్‌ కలిగిన వివిధ అనువర్తనాల యొక్క సమర్థవంతమైన పద్ధతులను అభివృద్ధి చేయడానికి మరియు కస్టమైజ్డ్ ఉత్పత్తుల యొక్క టెస్ట్ ట్రయల్ చేయటానికి నానోసెల్లూలోస్ పైలట్ ప్లాంట్‌ యొక్క సౌకర్యాన్ని సంస్థ యొక్క వాటాదారులకు కల్పిస్తారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0078 నానోపార్టికల్స్ కలిగిన పత్తితో చేసిన వస్త్రం ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0080 ఈ పైలట్ ప్లాంట్ సదుపాయం నానో జింక్ ఆక్సైడ్ వంటి ఇతర నానో మెటీరియల్స్ ను తయారు చేయడానికి కూడా వాడకంలోకి తీసుకురాబడుతోంది. వీటి వాడకంతో ఆసుపత్రిలో చేరిన రోగులకు రోగసంక్రమణను నివారించడానికి శుద్ధి చేసిన అధునాతనమైన రోగనిరోధక నూలు దుప్పట్లను విజయవంతంగా వాడకంలోకి తీసుకు రాబడుతున్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0082 హై-ఎండ్ పేపర్ కోటింగ్ తో క్రాఫ్ట్ పేపర్ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0084 నానోసెల్లూలోజ్ ను ఉపయోగించి స్వచ్ఛమైన గుజ్జు కనీస ఖర్చుతో తయారుచేయబడింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0085 ఒకదానితో ఇంకొకటి జోడించేదిగా లేదా ఎడిటివ్ లాగా పునఃచక్రిత క్రాఫ్ట్ పేపర్‌లో వేయడం వల్ల కాగితపు దృఢత్వం మెరుగు పడటం గమనించారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0087 నానోసెల్లూలోస్ కలిగిన గ్రీన్ కంపోజిట్ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0089 ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో నానోసెల్లూలోజ్‌తో చేయబడిన నానోకంపొజిట్ ఫిల్మ్ వలన అతి త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల షెల్ఫ్ లైఫ్ లో మార్పు వచ్చింది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0091 నానో ఎరువులు ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0093 మెరుగైన నేల అభివృద్ధి కోసం, నైట్రోజన్ ఎరువుల వల్ల కలిగే నష్టాన్ని, మొక్కలలో అమ్మోనియా విష ప్రభావాన్ని తగ్గించడానికి, వ్యవసాయ దిగుబడిని పెంచడానికి ఎరువులను ప్రభావవంతంగా మరియు కొద్ది కొద్దిగా ప్రవహింప చేయడానికి, నానోసెల్యులోజ్ పదార్థం యొక్క ఉపయోగం ఉపయోగకరంగా ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0094 దీనివల్ల ఎరువుల వినియోగం తగ్గుతుంది మరియు పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0096 ఇటువంటి విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానాలే కాకుండ, నానోటెక్నాలజీ రంగంలో పరిశోధనకు సంబంధించిన అన్ని అత్యాధునిక పరికరాలు మరియు సౌకర్యాలు సంస్థలో ఉన్నాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0097 ఈ విషయంలో ఎప్పటికప్పుడు వివిధ శిక్షణా కార్యక్రమాలు సంస్థ ద్వారా నిర్వహించబడుతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0098 వ్యవస్థాపకులు/ పరిశోధకుల సంస్థ మరియు సిర్కోట్ ద్వారా అభివృద్ధి చేసిన నానోసెల్యులోస్ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంతో, పత్తి లింటర్లు మరియు ఇతర సెల్యులోజ్ వ్యవసాయ వ్యర్థాలకు విలువ పెరగడమే కాకుండ, సాంకేతిక లైసెన్సింగ్ కోసం శోధకులు, ఉత్సాహవంతులు మరియు పారిశ్రామికవేత్తలు కూడా స్టార్టప్ లో భాగంగా భారత ప్రభుత్వం యొక్క ఈ సంస్థలో చేరుతున్నారు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0100 భవిష్యత్ అవగాహనలు ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0102 వ్యవసాయం ప్రపంచంలో నానోటెక్నాలజీ యొక్క సంభావ్య అనువర్తనాలను గుర్తించడంలో చాలా పురోగతే ఉన్నప్పటికీ, వ్యవసాయ రంగంలో గణనీయమైన పాత్రను పోషించే ముందు, సమీప భవిష్యత్తులో అనేక ఇతర సమస్యలను పరిష్కరించుకోవలసి ఉంది. అవి క్రింద ఇవ్వబడ్డాయి: ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0104 నానోసిస్టమ్స్ యొక్క ప్రభావాలను ఇప్పటికే ఉన్న వాణిజ్య ఉత్పత్తుల ప్రభావాలతో పోల్చడం ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0106 నానో మెటీరియల్స్, నానోపెస్టిసైడ్స్, నానో ఫర్టిలైజర్స్, సంబంధిత నష్టం, జీవిత చక్ర అంచనా మరియు పద్ధతులతో పాటు ఇతర మొక్కలు, నేలలు మరియు తేనెటీగలు వంటి లక్ష్యం కాని జీవులపై ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడం. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0108 నానో మెటీరియల్స్ మరియు నానోకణాలను ఉపయోగించి తయారు చేయబడిన ఆహార యొక్క ప్రక్రియలో నియమించబడిన కార్మికులు మరియు వినియోగదారుల భద్రతను జోడించడం కూడా అవసరం. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0110 పెరుగుతున్న ప్రపంచ జనాభా మరియు నీటి, గాలిలోని మార్పుల వల్ల తలెత్తే సవాళ్ల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ రంగంలో నానో మెటీరియల్స్ యొక్క సుస్థిరత విషయంలో పరిష్కారాన్ని వెదుకుకోవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0111 వాస్తవానికి నానోస్కేల్ కెరీర్‌ల వాడకం ద్వారా ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పెంచవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0112 దీనివల్ల తక్కువ వినియోగంతోనే మంచి ఉత్పాదకతను సులభంగా పొందవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0113 నానోటెక్నాలజీ ద్వారా ఏ ప్రక్రియలోనైనా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మరియు ఉప-ఉత్పత్తులు తక్కువగా ఉంటాయి. దీనితో పాటుగా వ్యర్థాల పునర్వినియోగంలో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయ పడుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0114 శక్తి మరియు వనరుల సమర్థ నిర్వహణతో పాటు ప్రిసిజన్ (ఖచ్చితమైన) వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించడంలో నానోసెన్సర్స్ పద్ధతి ఉపయోగకరంగా ఉంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0115 పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై నానోటెక్నాలజీ యొక్క ప్రభావాలను ఖచ్చితంగా అంచనా వేయడానికి నమ్మకమైన పద్ధతులను అభివృద్ధి చేయడం అవసరం. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0116 దీంతో వివిధ మాట్రిసులలో వాడబడే నానోమెటీరియల్స్ యొక్క లక్షణాలను మరియు పరిమాణాలను అంచనా వేయడం కుదురుతుంది. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0118 నానోసెన్సర్స్ వ్యవస్థ ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0120 ఖచ్చితమైన నియంత్రణతో మొక్కల యొక్క సమయోచిత అవసరాలను తీర్చటంలో నానోసెన్సర్లు రైతులకు సహాయపడతాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0121 ఇలా, పంటల పర్యవేక్షణ, నేలలోని పోషకాలు మరియు పురుగుమందుల యొక్క ఖచ్చితమైన విశ్లేషణ లేదా స్మార్ట్ వ్యవసాయం కోసం నీటి వినియోగ సామర్థ్య నియంత్రణ చేసేందుకు సంబంధించిన పరిశోధనలు చేయటానికి ప్రయత్నాలు చేయడం తప్పనిసరి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0122 నానోసెన్సర్ల ద్వారా నేల యొక్క అనేక పారామితులు; పిహెచ్ విలువలు, పోషకాలు, పంట మరియు మట్టిలో వ్యర్థ పురుగుమందుల పరిమాణం, తేమ, వ్యాధికారకాల ముందస్తు అంచనా, నత్రజనిని అప్ టేక్ చేసుకోవడం (పీల్చుకోగలగడం) మొదలైనవి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0123 సాంప్రదాయిక సెన్సార్ వ్యవస్థతో పోలిస్తే నానోసెన్సర్ వ్యవస్థ అధిక సున్నితత్వం మరియు ప్రత్యేకతను కనబరుస్తాయి. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0124 దీని ద్వారా, మట్టిలో నిలిచి ఉండే భూగర్భ జల ఒత్తిడిని అంచనా వేసి, నీటి యొక్క అసలైన వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0125 ఇంకా, దీనిని తమంత తాముగా పనిచేసే నీటి నియంత్రణ యంత్రాలతో కూడా కలపవచ్చు. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0126 ముఖ్యంగా సాగు నీరు కావలసినంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లో, సాగునీటి వ్యవస్థ యొక్క ఆటోమేషన్, స్మార్ట్ వ్యవసాయం యొక్క ఒక ప్రధాన మరియు ముఖ్య అవసరం. ebs_Unnat-Kirshi-Taknik-Link1-2-translation-hin2tel_0128 మూలం: వ్యవసాయ పత్రిక, ఐసిఎఆర్, మనోజ్ కుమార్ మహావర్, సైంటిస్ట్, ఎ.కె. భారిమల్లా- సీనియర్ శాస్త్రవేత్త, పి.జి. పాటిల్-దర్శకులు మరియు ప్రాచి మాట్రో- గ్రంధాలయ అధ్యక్షులు, ఐసిఎఆర్- సెంట్రల్ కాటన్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ముంబై (మహారాష్ట్ర).