ID SENT ebs_ajmer_0002 అజ్మీర్ ebs_ajmer_0004 ట్యాగ్లైన్ అజ్మీర్-ఎ-షరీఫ్ ఆవాసం ebs_ajmer_0006 ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనువైన సమయం-అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ebs_ajmer_0008 ఉద్ధరణ - ఆధ్యాత్మికత ఇంకా పూర్వ సంస్కృతిలో తడిసిముద్దైన రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరం, ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశం. ebs_ajmer_0012 అనా సాగర్ సరస్సు యొక్క విస్తృత ప్రదేశాన్ని ఉపేక్షించినట్లుగా ఉండే, ఒడుదొడుకుగానున్న ఆరావళి పర్వతాలతో చుట్టుముట్టి ఉన్న రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరం, విభిన్న మతాలు మరియు సంస్కృతుల సమ్మేళనం. ebs_ajmer_0013 ఇది యాత్రీకులకు ప్రసిద్ధ ప్రదేశం, భారతదేశంలో ప్రధాన సూఫీ శాఖ అయిన చిష్తి వ్యవస్థ స్థాపకుడైన ఖ్వాజా ముయిన్ ఉద్-దిన్ చిష్తి యొక్క దర్గా (ఒక సమాధిపై నిర్మించిన ప్రార్థనా స్థలం), ఇదే అజ్మీర్-ఎ-షరీఫ్ యొక్క ఆవాసంగా పేరుగాంచింది. ebs_ajmer_0014 దర్గా ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తుండగా, రంజాన్ పండుగ అలాగే ఫకీరు వర్ధంతి సందర్భంగా, నివాళులర్పించడానికి జనం పెద్ద సంఖ్యలో విచ్చేసినప్పుడు ఇది దేదీప్యమానంగా కనిపిస్తుంది. ebs_ajmer_0016 నగరాన్ని స్థాపించిన చౌహాన్ రాజుల ఒకప్పటి రాజసింహాసనమైన, అజ్మీర్-గొప్ప కోటలు, పురాతన దేవాలయాలు ఇంకా దాని కళాకృతులలో చూడగలిగే ఒక శక్తివంతమైన చరిత్రతో చిత్రవిచిత్రముగా ఉంటుంది. ebs_ajmer_0017 ఒక ప్రధాన హిందూ పుణ్యక్షేత్రంగా పరిగణించబడే పుష్కర్ పట్టణానికి ఈ నగరం ప్రవేశ ద్వారం కూడా. ebs_ajmer_0018 నిర్మలమైన పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించి, ఇసుక దిబ్బలు, సరస్సులు, కొండలు మరియు అడవుల నాటకీయ ప్రకృతి దృశ్యంతో, పుష్కర్ అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో నిర్వహించిన ప్రసిద్ధ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది, ఇది 2,00,000 కన్నా ఎక్కువ ఫుట్‌ఫాల్స్‌ను ఆకర్షిస్తుంది. ebs_ajmer_0020 రాజా అజయ్‌పాల్ చౌహాన్ స్థాపించినప్పటి నుండి, పృథ్వీరాజ్ చౌహాన్ 12 వ శతాబ్దంలో ఘోర్ ముహమ్మద్ చేత చంపబడటం వరకు అజ్మీర్ గొప్ప అల్లిన చరిత్రను కలిగి ఉంది. ebs_ajmer_0021 తరువాత దీనిని 1532 లో మార్వాడ్ రాజవంశం స్వాధీనం చేసుకుంది, తరువాత 1559 లో అక్బర్ ఆధ్వర్యంలో మొఘల్ రాజవంశం పాలన జరిగింది. ebs_ajmer_0022 అక్బర్ చక్రవర్తి అజ్మీర్‌కు పూర్తి స్థాయి రాజ్యం యొక్క హోదాను కల్పించాడు. ebs_ajmer_0023 1770 లో మరాఠాలకు లొంగిపోయేంత వరకు మొఘలులు అజ్మీర్‌ పై తమ పరిపాలనను కొనసాగించారు. ebs_ajmer_0024 చివరికి, 1818 లో అజ్మీర్‌ను మరాఠాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారు. ebs_ajmer_0026 ఆకర్షణలు: ebs_ajmer_0028 అజ్మీర్-ఎ-షరీఫ్ (ఆధ్యాత్మికం) ebs_ajmer_0030 సందడిగా ఉన్న వీధి మధ్య నెలకొని ఉన్న, అజ్మీర్-ఎ-షరీఫ్ దేశంలో అత్యంత పవిత్రమైన సూఫీ పావనస్థలాలో ఒకటి. ebs_ajmer_0031 ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీకి నివాళులర్పించడానికి, దర్గా షరీఫ్ లేదా అజ్మీర్-ఎ-షరీఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆహ్వానిస్తుంది. ebs_ajmer_0032 అతను అతని లౌకిక భావజాలాలకు, శాంతికి సంబంధించిన గొప్ప బోధనలకు ప్రసిద్ధి చెందాడు. ebs_ajmer_0033 దర్గా వెలుపల ఉన్న వీథి - ఖ్వాజాకు సమర్పించే పరిమళ ద్రవ్యాలు, మిఠాయిలు, పువ్వులు ఇంకా 'చాదార్లు' లేదా వస్త్రం వంటి వస్తువుల విస్తృత శ్రేణి విక్రయించే దుకాణాలు బారులు తీరి ఉంటాయి. ebs_ajmer_0034 దర్గాలోకి ప్రవేశించినప్పుడు - అద్భుతమైన చెక్కడాలుగల వెండితో చేసిన భారీ తలుపుల గుండా వెళ్లాలసి ఉంటుంది. ebs_ajmer_0035 వాళ్ళు పాలరాయితో చెక్కిన మొయినుద్దీన్ చిష్తి సమాధికి నిలయమైన ఆవరణంలోకి ప్రవేశిస్తారు. ebs_ajmer_0036 దర్గా పై భాగంలో బంగారుపూత, ఇంకా వెండితో చేసిన ఒక పిట్టగోడ, ఒక పాలరాతి అడ్డగోడ ద్వారా చాటుచేసి ఉన్నాయి. ebs_ajmer_0037 సాయంత్ర సమయ మతాచారాలలో మెహ్ఫిల్ ఎ-సమా ఉంటుంది, ఇది సందర్శకులకు ఒక సమ్మోహపరిచే అనుభూతిని కలుగజేస్తుంది. ebs_ajmer_0038 మీరు దర్గా ప్రాంగణం నుండి బయలుదేరేటప్పుడు 'బడీ దేగ్' అను భారీ వంట పాత్రను చూడడం మరవకండి. ebs_ajmer_0039 పాత్రలో డబ్బు విసిరితే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ebs_ajmer_0041 అనా సాగర్ సరస్సు (ప్రకృతి) ebs_ajmer_0043 ఆసియాలోని మానవుడు సృష్టించిన అతిపురాతన సరస్సులలో ఒకటైన, అనా సాగర్ సరస్సు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ebs_ajmer_0044 అనా సాగర్ సందర్శంచినప్పుడు పర్యాటకులు నౌకా విహారం, ఒంటె సవారీ వంటి వివిధ వినోద కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ebs_ajmer_0045 సైబీరియా ఇంకా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే పెలికన్లు(గూడకొంగలు), కూట్స్(బోడికోళ్ళు), బాతులు వంటి వలస పక్షులకు నిలయంగా మారే సరస్సును సందర్శించడానికి అనువైన సమయం శీతాకాలం. ebs_ajmer_0046 పర్యాటకులు దౌలత్ బాగ్ ను కూడా సందర్శించవచ్చు, ఇది 1637 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన 'బారాదరీ' అనబడే ఆకర్షణీయమైన పాలరాయి మంటపాలకు ప్రసిద్ధి చెందింది. ebs_ajmer_0047 సమీపంలో, అనసగర్ చౌపాటీ ఉంది, ఇది సరస్సు పరిధిలో ఏర్పాటు చేసిన సందడిగా ఉండే వీధి ఆహారపు బజారు. ebs_ajmer_0048 సూర్యాస్తమయం యొక్క అద్భుతమైన దృశ్యాలను అందించే ఈ సరస్సును, సాయంత్రం సమయాలలో స్థానికులు ఇంకా పర్యాటకులు పేద్ద సంఖ్యలో సందర్శిస్తూంటారు. ebs_ajmer_0049 ఈ సరస్సును, క్రీ.శ. 1135 నుండి క్రీ.శ. 1150 సంవత్సరాల మధ్యలో, పృథ్వీరాజ్ చౌహాన్ కి తాత గారైన అనాజీ చౌహాన్ నిర్మించారు. ebs_ajmer_0051 అఢాయీ-దిన్-కా-ఝోంప్డా (ఆధ్యాత్మికం) ebs_ajmer_0053 నగర శివార్లలో నెలకొని ఉన్న, అఢాయీ-దిన్-కా-ఝోంప్డా ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, వాస్తుకళపరంగా ఇది ఇండో-ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది. ebs_ajmer_0054 ఇది, అదే పేరుతో పిలువబడే మసీదు శిథిలాలు. ebs_ajmer_0055 'అఢాయి' అనే పదానికి హిందీలో 'రెండున్నర' అని అర్ధం, ఈ మసీదును రెండున్నర రోజుల్లో నిర్మించారు అని చెబుతూ ఉంటారు. ebs_ajmer_0056 హెరాత్‌కు చెందిన అబూబకర్ రూపొందించిన ఈ 'అఢాయీ-దిన్-కా-ఝోంప్డా' లో 100 కి పైగా స్తంభాలపై నిలబడి ఉన్న 10 గుమ్మటాలు ఉన్నాయి. ebs_ajmer_0057 ప్రధాన చావడి గోడలలో సూర్యరశ్మి పడేటట్లు చిన్న గవాక్షాలు చెక్కబడ్డాయి. ebs_ajmer_0058 మసీదు లోపలి భాగంలో ఒక ప్రధాన చావడి ఉంది, అందులో అద్భుత కళాత్మకతతో చెక్కిన అనేక స్తంభాలు ఉన్నాయి. ebs_ajmer_0059 దర్గా షరీఫ్ వద్ద మీరు ప్రార్థనలు చేసిన తరువాత, మీరు అక్కడి నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న 'అఢాయీ-దిన్-కా-ఝోంప్డా' ను సందర్శించవచ్చు. ebs_ajmer_0061 కిషన్‌ గఢ్(వారసత్వం) ebs_ajmer_0063 కోలాహలముగా ఉండే పాలరాళ్ల బజారు ఉండడం వలన, 'మార్బుల్ సిటీ ఆఫ్ ఇండియా' గా ప్రసిద్ధి చెందిన, కిషన్‌ గఢ్ అజ్మీర్ శివార్లలో ఉంది. ebs_ajmer_0064 బహుశా ప్రపంచంలోనే ఏకైక ఆలయం అయిన 'తొమ్మిది గ్రహాల ఆలయం', ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ebs_ajmer_0065 ఇక్కడ ఉన్నప్పుడు, పర్యాటకులు ప్రసిద్ధ కిషన్‌గఢ్ శైలి సూక్ష్మ చిత్రాలను కొనుగోలు చేయవచ్చు, ఆకుపచ్చ రంగును ఎక్కువగా ​​ఉపయోగించడం ఇంకా ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ ఈ చిత్రాలలో కనిపించే విశేషతలు. ebs_ajmer_0066 మీరు మిరపపండ్ల బజారును కూడా సందర్శించవచ్చు. ebs_ajmer_0067 నగరంలోని ఇతర పర్యాటక ఆకర్షణలలో గుందోలావ్ సరస్సు, కిషన్‌గఢ్ మహారాజుల విలాస ఉద్యానం అయిన ఫూల్ మహల్ ప్యాలెస్, భారతదేశాన్ని పాకిస్తాన్‌తో కలిపే రహదారిపై ఉన్న కిషన్‌గఢ్ కోట ఇంకా రాజస్థానీ తరహా నిర్మాణానికి చక్కటి ఉదాహరణ అయిన రూపన్గఢ్ కోటలు ఉన్నాయి. ebs_ajmer_0068 జూలై, ఆగస్టు నెలలలో జరిగే గంగౌర్ ఉత్సవ సమయం, నగరాన్ని సందర్శించడానికి అనువైన సమయం. ebs_ajmer_0070 తోడ్ గఢ్ (ప్రకృతి, వన్యప్రాణులు) ebs_ajmer_0072 సముద్ర మట్టానికి 3,281 అడుగుల ఎత్తులో ఉన్న ఆరావళి యొక్క నిర్మలమైన పరిసరాలలో, 'తోడ్ గఢ్' అనే అందమైన గ్రామం ఉంది. ebs_ajmer_0073 ఇది వలసరాజ్యాల భవనాలు, వంకరటింకర రోడ్డులు, సహజమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది, ఇది చరిత్ర అలాగే ప్రకృతి ప్రేమికులకు సరైన ప్రదేశం. ebs_ajmer_0074 రాజస్థాన్ లోని అత్యుత్తమ పర్యావరణ-పర్యాటక ప్రదేశాలలో ఒకటైన, తోడ్ గఢ్-రావోలీ వన్యప్రాణుల అభయారణ్యం, చిరుత, స్లాథ్ బేర్, భారతీయ జింక, నీల్ గాయ్, భారతీయ తోడేలు మొదలైన వాటితో పాటు అనేక రకాల పక్షులను సంరక్షిస్తుంది. ebs_ajmer_0075 అభయారణ్యం మధ్యన ఉన్న దూధేశ్వర్ ఆలయం ఇక్కడి మరో ఆకర్షణ. ebs_ajmer_0076 దీనికి పరమశివుడి పేరు పెట్టబడింది, ఇది శాశ్వత నీటి వనరుకు నిలయం కూడా. ebs_ajmer_0077 ఇది మర్రి చెట్లు, చింతచెట్లతో చుట్టుముట్టి ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశం. ebs_ajmer_0078 'తోడ్ గఢ్' ని సందర్శించినప్పుడు 'భీల్‌బెరి' జలపాతాన్ని చూడడం మరవకూడదు, బహుశా ఇది రాజస్థాన్‌లో ఎత్తైన జలపాతం కావచ్చు. ebs_ajmer_0079 పర్యావరణ పర్యాటక ప్రదేశాలతో పాటు, ప్రజ్ఞా శిఖర్, అలాగే విక్టోరియన్ యుగం నాటి చర్చి, పాఠశాల వంటి కొన్ని గమనార్హ ప్రదేశాలకు ఇది నిలయం. ebs_ajmer_0081 పుష్కర్ (ఆధ్యాత్మికం) ebs_ajmer_0083 నిర్మలమైన పుష్కర్ సరస్సు, చుట్టూ విస్తరించి ఉన్న అసాధారణమైన పుష్కర్ పట్టణం ఇసుక దిబ్బలు, సరస్సులు, కొండలు మరియు అడవుల నాటకీయ ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంది. ebs_ajmer_0084 ఆధ్యాత్మికతలో మునిగి ఉన్న పుష్కర్, శబ్దతః అనువదించి చెప్పాలంటే తామర పువ్వు అనీ, ఇది బ్రహ్మ దేవుని ఆసనమనీ నమ్ముతారు. ebs_ajmer_0085 ఈ విధంగా, బ్రహ్మదేవుని ఆలయంగల అరుదైన ప్రదేశాలలో పుష్కర్ ఒకటి. ebs_ajmer_0086 క్రీ.శ. 14 వ శతాబ్దంలో నిర్మించిన ఎరపు శిఖరంగల నిర్మాణం, ఇది దూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ebs_ajmer_0087 పురాణగాథల ప్రకారం, బ్రహ్మ దేవుడు ఒక కమలాన్ని నేలమీద పడేశాడు, ఇది ఒక సరస్సు యొక్క తక్షణ సృష్టికి దారితీసింది, తరువాత అతను ఆ సరస్సుకు ఆ పువ్వు పేరే పెట్టాడు. ebs_ajmer_0089 పుష్కర్ యొక్క ఆత్మ దాని వీధుల్లో కనిపిస్తుంది, ఇక చిక్కుగా ఉన్న దారులు, సందులు, బజార్లు ఇంకా ఘాట్ల ద్వారా నగరాన్ని ఆనందించవచ్చు. ebs_ajmer_0090 పశువులు, గుర్రాలు, ఒంటెల ఉత్సవం ప్రత్యేకత అయిన పుష్కర్ ఫెయిర్ (పుష్కర్ సంత) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ebs_ajmer_0091 ఇది అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో ఒక ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవం. ebs_ajmer_0092 ఈ సంత యొక్క ఉత్సాహపూరిత వాతావరణం, ప్రతి సంవత్సరం దాదాపు 2,00,000 మందిని ఆకర్షిస్తుంది, ఇందులో విక్రేతలు, అలాగే గుర్రాలు, ఒంటెలు, గేదెల కొనుగోలుదారులు, అమ్మకందారులు ఉంటారు. ebs_ajmer_0093 చేనేత వస్త్రాలు, ఫలహారాలు, మిఠాయిలు, ఐస్ క్రష్(చితుకగొట్టిన ఐసు), గాజులు, ఒంటె జీనులు వంటి వివిధ దుకాణాలు సందర్శకులను ఆకర్షించడానికి ఏర్పాటు చేయబడ్తాయి. ebs_ajmer_0095 మేడ్తా నగరం (పూర్వ సంస్కృతి, ఆధ్యాత్మికం) ebs_ajmer_0097 అజ్మీర్ నుండి ఒక్క రోజులో వెళ్ళి తిరిగి వచ్చే ప్రదేశాలలో ఆధ్యాత్మిక నగరమైన మేడ్తా నగరం ఒక గొప్ప ప్రదేశం అని చెప్పవచ్చు. ebs_ajmer_0098 ఒకప్పుడు మేడ్తియా రాథోడ్ రాజ్‌పుత్ ల పాలనలో ఒక ముఖ్యమైన రాజ్యంగా విరసిల్లిన, ఈ నగరం కవయిత్రి ఇంకా కృష్ణుడి భక్తురాలు అయిన మీరాబాయి జన్మస్థలం. ebs_ajmer_0099 భక్తిలో మునిగిపోయిన రాణి యొక్క కథలతో మారుమ్రోగే 500 సంవత్సరాల పురాతన శిథిలాలైన, మీరా బాయి యొక్క జన్మస్థలమైన ఈ స్థలాన్ని సందర్శించండి. ebs_ajmer_0100 పర్యాటకులు నగర కేంద్రాన్ని సందర్శించి మీరా బాయి ఆలయాన్ని చూడవచ్చు, దీనినే 'చార్భుజా' ఆలయం అని కూడా అంటారు. ebs_ajmer_0101 ఆ ఆలయ లోపలి భాగం ఆకట్టుకునేదిగా ఉంటుంది, దీని గోడలు, ఇంకా నేలలు, అద్దాలూ రత్నాలతో అలంకరించిన వేలాది టైల్స్ తో అలంకరించబడి ఉంటాయి. ebs_ajmer_0102 గోడలపై విస్తృతమైన చిత్రాలు వేర్వేరు హిందూ దేవతలను వర్ణిస్తాయి. ebs_ajmer_0103 మీరా బాయి స్మారకం లేదా మీరా బాయి మెమోరియల్, మరో పర్యాటక ప్రదేశం, ఇది, ఎరుపు ఇసుకరాయిని ఉపయోగించి విలక్షణమైన రాజ్ పుత్ నిర్మాణంలో నిర్మించిన పెద్ద గేటు. ebs_ajmer_0104 స్మారక చిహ్నం దగ్గర ఒక చిన్న మ్యూజియం ఉంది, ఇది మీరా బాయి జీవితం గురించి అంతర్దృష్టిని అందజేస్తుంది. ebs_ajmer_0105 మొఘల్ వాస్తుశిల్పం యొక్క చక్కటి నమూనా అయిన ఔరంగజేబ్ మసీదు నగరంలో తప్పక చూడవలసిన మరో ప్రదేశం. ebs_ajmer_0106 పుష్కర్‌ నుండి 61 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడ్తా, పుష్కర్ కు వెళ్ళినప్పుడు చూడవలసిన ఒక ప్రసిద్ధ విహారయాత్ర. ebs_ajmer_0108 కవ్వాలి అజ్మీర్ యొక్క జానపద సంగీతం (కళలు, చేతిపనులు) ebs_ajmer_0110 తోలు పని (కళలు, చేతిపనులు) ebs_ajmer_0112 బ్యావర్ (వారసత్వ సంపద) ebs_ajmer_0118 మధురమైన కవ్వాలి వినండి లేదా అజ్మీర్ యొక్క కళాత్మక సంస్కృతిలో మునిగిపోడానికి తోలుతో చేసిన చక్కటి వస్తువుల కోసం షాపింగ్ చేయండి. ebs_ajmer_0120 కవ్వాలి-అజ్మీర్ యొక్క జానపద సంగీతం ebs_ajmer_0122 అజ్మీర్ యొక్క కవ్వాలీలు, కవ్వాల్లు(కవ్వాలీ పాడేవారు) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, ప్రసిద్ధి చెందారు. ebs_ajmer_0123 ప్రసిద్ధ సూఫీ ఇస్లామిక్ భక్తి గీతాల గేయ రూపం అయిన, కవ్వాలీ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది అలాగే నగర తన్మయత్వాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ebs_ajmer_0124 'కవ్వాలి' అనే పదం అరబిక్ పదం 'కవోల్' నుండి నిష్పాదించబడింది, దీని అర్థం ఆలోచనల శుద్ధీకరణకు సహాయపడే మతపరమైన అంశాలపై ఆధారపడిన సిద్ధాంతం. ebs_ajmer_0126 ఇది 13 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రాచుర్యం పొందింది, అప్పటి నుండి అనంతరపు ప్రసిద్ధ కవ్వాలులు అజ్మీర్‌లో నివసిస్తున్నారు. ebs_ajmer_0127 అజ్మీర్ షరీఫ్ దర్గా చావడి లోపల భక్తి గీతాలు ఆలపించే గాయకులు (కవ్వాల్స్) ద్వారా అల్లా‌ను ప్రశంసిస్తూ కవ్వాలీలను పాడుతారు, దీనినే 'మహ్ఫిల్-ఎ-సమా' అని అంటారు. ebs_ajmer_0128 సాధారణంగా, కవ్వాలి ప్రదర్శనలు ప్రతిరోజూ రాత్రి 7 నుండి 11 గంటల వరకు జరుగుతాయి, ఇవి అద్భుత అనుభూతిని కలిగిస్తాయి. పర్యాటకులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల గాయకులు కలిసి తమ కవ్వాలీల ద్వారా అల్లాను స్తుతిస్తూ పాడడాన్ని చూడవచ్చు. ebs_ajmer_0129 ప్రతి సంవత్సరం దర్గాలో సూఫీ ఫకీరు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి మరణం జ్ఞాపకార్థం జరిగే వార్షిక 'ఉర్స్' ఉత్సవం, అజ్మీర్ యొక్క కవ్వాలిని ఆనందించడానికి ఉత్తమ సమయం. ebs_ajmer_0130 ఈ సమయంలోనే దర్గా భవన సముదాయం లోపల అనేక కవ్వాలి కార్యక్రమాలు జరుగుతాయి, ఇక ఆ కార్యక్రమాలకు హాజరుకావడం నిజంగా ఒక దైవిక అనుభూతి. ebs_ajmer_0132 తోలు పని ebs_ajmer_0134 అజ్మీర్ నగరం దాని తోలు పనికి ప్రసిద్ధి చెందింది, దీనిని సాంప్రదాయ అలాగే ఆధునిక పద్ధతులను ఉపయోగించి స్థానిక చేతివృత్తులవారు అనుసరిస్తున్నారు. ebs_ajmer_0135 తోలుతో చేసిన వస్తువుల తయారీకి జవాజా, హర్మాడా అను గ్రామాలు ప్రధాన కేంద్రాలు. ebs_ajmer_0136 హర్మాడ యొక్క చేతివృత్తులవారు తోలు కుర్చీలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, అలాగే బూటేదారు పని(కసీదా) చేసిన జూతీలను(చెప్పులు) తయారు చేయడంలో నిపుణులు. ebs_ajmer_0137 తిలోనియా గ్రామంలో తోలుతో తయారు చేసిన గ్రాఫిక్ ఎంబ్రాయిడరీలతో ఉండే డిజైనర్ హ్యాండ్‌ బ్యాగులు, పర్సులు, బెల్టులు, టోపీలు, బల్లలు ఇంకా మడత కుర్చీలు కూడా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ebs_ajmer_0138 పర్యాటకులు ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా కనిపించే మోజ్రీలు లేదా జూతీలను కొనుక్కోవచ్చు. ebs_ajmer_0139 వాటిని తయారు చేయడానికి, తోలుపై ఎంబ్రాయిడరీ చేస్తారు, రంధ్రాలు చేస్తారు, రాళ్ళు పొదుగుతారు ఇంకా అనేక ఆకట్టుకునే ఆకృతులు, నమూనాలలో కుడ్తారు. ebs_ajmer_0140 రాజస్థాన్ జానపద సంగీతకారులు ఉపయోగించే ఢోల్, తబలా (ఆఘాతం వల్ల వాయించే వాయిద్యాలు) వంటి సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి కూడా తోలును ఉపయోగిస్తారు. ebs_ajmer_0142 సూక్ష్మ చిత్రాలు ebs_ajmer_0144 అజ్మీర్‌లో రాజస్థాన్ యొక్క అందమైన సూక్ష్మ చిత్రాలు తప్పక కొనాల్సిన వస్తువులు. ebs_ajmer_0145 వారి పురాణగాథలు, చారిత్రక కాలాల వర్ణన అలాగే చక్కటి బ్రష్ స్ట్రోక్‌లు వాటికి చాలా ప్రాచుర్యం తెచ్చిపెట్టాయి. ebs_ajmer_0146 నేపథ్యంలో కదిలే మేఘాలతో పెద్ద, మెలికలు తిరిగిన కళ్ళు వంటి ముఖ లక్షణాలను కొట్టొచ్చిన్నట్లుగా ఈ చిత్రాలు చూపిస్తాయి. ebs_ajmer_0147 18 వ శతాబ్దానికి చెందిన భారతీయ చిత్రలేఖన శైలిలో ఉండే కిషన్గఢ్ చిత్రకళ అజ్మీర్‌ అంతటా ప్రసిద్ధి చెందింది. ebs_ajmer_0148 కిషన్గఢ్ చిత్రాలలో పాత్రలు ఎక్కువగా పెద్ద విస్తృత ప్రకృతి దృశ్యాలలో పనిచేస్తున్నట్లుగా చూపించబడ్తాయి. ebs_ajmer_0152 చేయవలసిన పనులు ebs_ajmer_0154 ఫాయ్ సాగర్ సరస్సు వద్ద నీటిలో మునిగిపోతున్న సూర్యుని కక్ష్యను చూడండి లేదా ఖర్వా యొక్క చారిత్రక వారసత్వాన్ని అన్వేషించండి, అజ్మీర్‌లో చేయవలసినది చాలా ఉంది. ebs_ajmer_0156 ఫాయ్ సాగర్ ebs_ajmer_0158 సుందరమైన ఆరావళి కొండల మధ్య ఏర్పాటు చేసిన ఫాయ్ సాగర్ ఒక కృత్రిమ సరస్సు, ఇది అందమైన పరిసరాలను కలిగి ఉంది. ebs_ajmer_0159 అధివాస్తవిక సూర్యాస్తమయాలను చూసేందుకు అజ్మీర్‌లోని ఉత్తమ ప్రదేశాలలో ఈ సరస్సు ఒకటి. ebs_ajmer_0161 మాంగ్లియావాస్ ebs_ajmer_0163 నగరం శివార్లలో ఉన్న మాంగ్లియావాస్ 'కల్ప్ వృక్ష్' అని పిలువబడే అరుదైన జాతులకు చెందిన 800 సంవత్సరాల పురాతనమైన రెండు చెట్లకు ప్రసిద్ది చెందింది. ebs_ajmer_0164 ఈ ప్రదేశంలో ప్రార్థన చేసేవారి కోరికలను ఈ చెట్లు నెరవేరుస్తాయని అంటారు. ebs_ajmer_0165 ఈ అద్భుత ప్రభావాన్ని పొందడానికి, భక్తులు చెట్ల చుట్టూ ఒక దారాన్ని కడ్తారు. ebs_ajmer_0167 బ్యావర్ ebs_ajmer_0169 19 వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారి కల్నల్ చార్లెస్ జార్జ్ డిక్సన్ చేత సైనిక కంటోన్మెంట్‌గా స్థాపించబడిన గోడల నగరమైన బ్యావర్ వలసరాజ్యాల నైజములో తడిసిముద్దైపోయింది. ebs_ajmer_0170 నడవడం లేదా ఆటో రిక్షా అద్దెకు తీసుకోవడం ద్వారా బ్యావర్‌ను అన్వేషించడం ఉత్తమ మార్గం. ebs_ajmer_0171 నగరంలోని అన్ని సాంస్కృతిక, వినోద కార్యక్రమాల కేంద్రమైన పచ్చని సుభాష్ ఉద్యాన్ తో మీ యాత్రను ప్రారంభించండి. ebs_ajmer_0172 ఈ ఉద్యానవనంలో పిల్లల కోసం కొన్ని గొప్ప రైడ్ లు ఉన్నాయి, అలాగే ఇది ఒక అందమైన పిక్నిక్ ప్రదేశం కూడా. ebs_ajmer_0174 నగర గొప్ప వాస్తుకళ వారసత్వం యొక్క తక్షణదర్శనం కోసం, 'మహాదేవ్ జీ కీ ఛత్రీ' యొక్క మనోహరమైన గుమ్మటంగల మంటపం దిశగా వెళ్ళండి. ebs_ajmer_0175 సందడిగా ఉన్న అగ్రసేన్ మార్కెట్ సమీపంలో ఉన్న ఈ ఆలయం, బ్యావర్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఆలయం, ఇది పరమశివుడికి అంకితం చేయబడినది. ebs_ajmer_0176 పంచ్ బత్తీ పబ్లిక్ సర్కిల్ వద్ద ఆగి ఆనందించండి అలాగే స్థానిక సంస్కృతిని గ్రహించండి. ebs_ajmer_0177 సరసమైన ధరలకు లభించే రాజస్థానీ హస్తకళల ఒక మంచి ఎంపిక బ్యావర్ కలిగి ఉంది. ebs_ajmer_0178 నగరం యొక్క స్థానిక మార్కెట్లు, రాజస్థానీ తోలుబొమ్మలు, అలాగే ఇతర అలంకార వస్తువుల వంటి నిర్దిష్ట సమూహాలకి చెందిన రంగురంగుల హస్తకళలను విక్రయించే దుకాణాలతో, నిండి ఉన్నాయి. ebs_ajmer_0179 షాపురా మొహల్లాలోని షూల్‌బ్రెడ్ మెమోరియల్ సిఎన్‌ఐ చర్చి నగర వలసరాజ్యాల గతానికి సాక్ష్యంగా నిలుస్తుంది, ఇది బ్యావర్‌లో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ebs_ajmer_0180 చక్కెర, ఇంకా నువ్వులతో తయారు చేసిన గజక్ యొక్క ఒక రూపం లేదా పెళుసైన తీపి వంటకం అయిన బ్యావర్ యొక్క ప్రసిద్ధ తిల్ పట్టీని కొనేందుకు హల్వాయి గాలీని సందర్శించండి. ebs_ajmer_0181 బ్యావర్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం, వార్షిక తేజాజీ జాతర ఇంకా గైర్ ఉత్సవం జరిగే సమయం, అప్పుడు నగర సాంస్కృతిక సమృద్ధిని చూడవచ్చు. ebs_ajmer_0183 జూనియా ebs_ajmer_0185 నిర్మలమైన సరస్సు ఒడ్డున ఉన్న జూనియాకు చారిత్రాత్మక గతం ఉంది, అది రాజ్‌పుత్ సంస్కృతితో నిండి ఉన్నది. ebs_ajmer_0186 1,000 సంవత్సరాల పురాతన జూనియా కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ, ఇది ఒక గొప్ప, అద్భుతమైన నిర్మాణం. ebs_ajmer_0187 జూనియా, అజ్మీర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_ajmer_0189 ఖర్వా ebs_ajmer_0191 అజ్మీర్ శివార్లలో ఉన్న ఖర్వాలో అనేక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, ఇవి పర్యాటకులను వాటి వాస్తుకళ వైభవానికి గాను ఆహ్వానిస్తాయి. ebs_ajmer_0192 వీటిలో ప్రధానమైనది ఖర్వా కోట, ఇది రాజ్‌పుత్ వాస్తుకళకు ఉత్తమ ఉదాహరణలలో ఒకటి. ebs_ajmer_0193 ఆరావళి కొండలలో ఉన్న ఈ 500 సంవత్సరాల పురాతన కోటను ఖర్వా రాజ్య పాలకుడైన, మహారాజా రావు సగత్ సింగ్ ఖర్వా (1872-1939) నిర్మించారు. ebs_ajmer_0194 గొప్పగా అలంకరించబడిన గోడలు, చక్కటి కిటికీలు, విస్తారమైన ప్రాంగణాలు, ఇక అద్భుతమైన గ్యాలరీలను కలిగి ఉన్న, ఈ కోట సందర్శకులను దాని పూర్వ వైభవాన్ని అనుభవించడానికి ఆహ్వానిస్తుంది. ebs_ajmer_0195 అంతేకాక, నిశ్శబ్దంగా ఉండే, ప్రశాంతమైన సరస్సు ఒడ్డున ఉన్నందున దాని చుట్టుపక్కల అందం సందర్శనకు ప్రశాంతమైన శోభను జోడిస్తుంది. ebs_ajmer_0196 ఈ కోటను ఇప్పుడు రాజకుటుంబం ఒక హోమ్ స్టేగా(నివాసంగా) నడుపుతోంది. ebs_ajmer_0200 ఈ రుచికరమైన వంటకాలను ఆస్వాదించండి ebs_ajmer_0202 గుమగుమలాడే బిర్యానీ నుండి రుచికరమైన సోహన్ హల్వా వరకు, అజ్మీర్‌లో ఆహారం అద్భుతంగా, వైవిధ్యమైనదిగా ఉంటుంది. ebs_ajmer_0204 (ఆహారం, వంటకాలు) ebs_ajmer_0208 ఇది, అన్నంని పొరలుపొరలుగా పరచిన గుమగుమలాడే ఒక ప్రసిద్ధ రైస్ డిష్(అన్నంతో చేసిన వంటకం) అయిన, బిర్యానీని అజ్మీర్‌లో తప్పక రుచి చూడాల్సిందే. ebs_ajmer_0209 ఆరోగ్యవంతమైన పచ్చి మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేసిన రుచికరమైన చికెన్ దమ్ మరియు మటన్ దమ్ బిర్యానీలను వీధి దుకాణాలు అలాగే అజ్మీర్ యొక్క హై-ఎండ్ రెస్టారెంట్లు రెండింటిలోనూ తినవచ్చు. ebs_ajmer_0211 కఢీ కచోరి ebs_ajmer_0213 కఢీ కచోరి అనేది అజ్మీర్ యొక్క ఒక రుచికరమైన అలాగే ఆకలిని తీర్చే వీధి ఆహారం(స్ట్రీట్ ఫుడ్). ebs_ajmer_0214 ఇది రెండు ప్రసిద్ధ రాజస్థానీ వంటకాల సమ్మేళనం - అదే, కఢీ ఇంకా కచోరి, ఇది, ఉల్లిపాయ, కొత్తిమీర ఇంకా తీపి చట్నీల మిశ్రమంతో అలంకరించబడుతుంది. ebs_ajmer_0215 సాంప్రదాయకంగా ఇది ఒక అల్పాహార వంటకం, అయితే ఇది శీఘ్ర భోజన ఎంపికగా లేదా సాయంత్రం తినే చిరుతిండిగా కూడా ఇష్టపడ్తారు. ebs_ajmer_0217 సోహన్ హల్వా ebs_ajmer_0219 సోహన్ హల్వా అత్యంత ప్రాచుర్యం పొందిన, విస్తృతంగా ఇష్టపడే సాంప్రదాయ భారతీయ తీపి వంటకం. ebs_ajmer_0220 దీనిని మైదా, పాలు, డ్రై ఫ్రూట్ లతో తయారు చేస్తారు, ఇక ఇది తీపిని ఇష్టపడే వారందరికీ ఆనందం కలిగిస్తుంది. ebs_ajmer_0226 అజ్మీర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఢిల్లీ-జైపూర్-మార్వాడ్-అహ్మదాబాద్-ముంబై రైల్వే లైన్ లో ఉంది. ebs_ajmer_0227 ఈ స్టేషన్ ఢిల్లీ, ముంబై, జైపూర్, అలహాబాద్, లక్నో ఇంకా కోల్‌కతా వంటి ప్రధాన భారతీయ నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది. ebs_ajmer_0231 సమీప విమానాశ్రయం, అజ్మీర్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగనేర్ విమానాశ్రయం. ebs_ajmer_0232 ఇది అజ్మీర్‌ను ప్రధాన భారతీయ నగరాలతో బాగా అనుసంధానించింది. ebs_ajmer_0236 ఢిల్లీ, ముంబై మధ్య మిడ్ వే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే 8 లో ఉన్నందున అజ్మీర్ రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.