ID SENT ebs_alappuzha_0002 గమ్యం పేరు ebs_alappuzha_0004 అలప్పుజ్హ ebs_alappuzha_0008 వెనిస్ ఆఫ్ ది ఈస్ట్(తూర్పు వెనిస్) ebs_alappuzha_0016 ఇదివరకు అలెప్పీ అని పిలువబడే ప్రశాంత వాతావరణంగల ఈ అలప్పుజ్హ దాని మనోహరమైన బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్ రైడ్‌లు మరియు ఆకుపచ్చని అంచులుగల అందాలకు ప్రసిద్ధి చెందింది. ebs_alappuzha_0020 'కేరళ యొక్క బ్యాక్ వాటర్స్ నడిబొడ్డున ఉన్న అలప్పుజ్హ తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు మరియు వెయ్యికి పైగా హౌస్ బోట్‌లతో నిండి ఉంది.' ebs_alappuzha_0021 అద్భుతమైన బీచ్‌లు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, ఉత్సాహభరితమైన బోట్ రేసులు మరియు రుచికరమైన సముద్ర ఆహారానికి పేరుగాంచిన ఈ ఆకుపచ్చని అందమైన చిన్నపాటి ఉష్ణమండలీయ స్వర్గం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ebs_alappuzha_0022 ఈ ఆకర్షణలకు తోడు, నగరం అంతటా ఆయుర్వేద స్పాలు మరియు ఆరోగ్య కేంద్రాలు విస్తరించి ఉన్నాయి, ఇవి అలసిపోయిన శరీరాలు మరియు మనస్సులను తేలికపరచుకోవాలని కోరుకునే వారిని ఆకర్షిస్తాయి. ebs_alappuzha_0024 "బ్రిటీష్ ఇండియాకి మునుపటి వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్, అప్పట్లో అలెప్పీగా పిలువబడే అలప్పుజ్హ యొక్క అందాలకు ఎంతో పరవశమయ్యారు అంటే ఆయన," " ఇక్కడ, ప్రకృతి తన అత్యంత సంపన్నమైన సంపదను భూమి మీద వెచ్చించింది. ebs_alappuzha_0025 అలెప్పి, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్(తూర్పు వెనిస్). అని అన్నారు.” ఆ విధంగా ఈ నగరం ఆ పేరును సంపాదించింది, దాని జలమార్గాల విశాల సమాహారాన్ని సూచిస్తూ. ebs_alappuzha_0026 'సాధారణ దోనె లేదా ఆడంబరమైన హౌస్‌బోట్‌లలో బ్యాక్ వాటర్ గుండా ప్రయాణం చేయడం అనేది అలప్పుజ్హలోని అతి ముఖ్యమైన ఆకర్షణ.' ebs_alappuzha_0027 ఇరు వైపుల ఉన్న ముదురు ఆకుపచ్చని వరి పొలాలు, చిన్న పడవలు మరియు విలక్షణమైన గ్రామాలు, ఈ పడవ ప్రయాణాలు తప్పక ప్రయత్నించాలి. ebs_alappuzha_0031 కుమారకోం పక్షుల అభయారణ్యం ప్రకృతి మరియు వన్యప్రాణులు ebs_alappuzha_0033 14 హెక్టార్లలో విస్తరించి ఉన్న కుమారకోం పక్షుల అభయారణ్యం కొట్టాయంలోని వెంబనాడ్ సరస్సు ఒడ్డున ఉంది. ebs_alappuzha_0034 సైబీరియా మరియు హిమాలయాల నుండి వలస పక్షులు ఇక్కడకు అధిక సంఖ్యలో వస్తున్నందున ఇది పక్షివీక్షకులకు ప్రసిద్ధ గమ్యం. ebs_alappuzha_0035 ఈ అభయారణ్యాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్ మరియు ఆగస్టు మధ్య ఉంటుంది, ఎందుకంటే ఇది వైట్ ఇబిస్(శ్వేత కంకణం), హెరాన్‌లు(నారయణ పక్షులు), ఎగ్రెట్‌లు(తెల్ల కొంగలు), లిటిల్ కార్మోరెంట్‌లు(చిన్న చెరువుకాకి), ఇండియన్ డార్టర్‌లు మరియు కింగ్ ఫిషర్‌లు వంటి చిత్తడి నేలల్లో పెరిగే పక్షులు పిల్లలు పెట్టే కాలం. ebs_alappuzha_0036 వుడ్ బీట్ల్స్, భరతపక్షులు, దాసరిపిట్టలు, రామచిలుకలు, అడవిబాతులు, సైబీరియన్ కొంగలు, గుడ్లగూబలు, నీటి బాతులు మరియు జలపక్షులు వంటి కొన్ని తప్పక చూడాల్సిన పక్షులకు సంబంధించిన జాతులు కూడా ఉన్నాయి. ebs_alappuzha_0038 ఈ అభయారణ్యాన్ని సందర్శించడానికి ఒక ఆసక్తికరమైన మార్గం ఉంది, అదే పడవ విహారం, ఇది జలాశయం చుట్టూ గుంపులుగా వాలిన పక్షులను దగ్గరగా చూపిస్తుంది. ebs_alappuzha_0039 మరింత విస్తారమైన అనుభవం కోసం, పర్యాటకులు కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెటిడిసి) యొక్క బ్యాక్ వాటర్ రిసార్ట్ వద్ద స్తంభాలపై నిర్మించిన స్వతంత్ర కుటీరాలలో ఉండవచ్చు. ebs_alappuzha_0041 పర్యాటకులు కేరళలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటైన వెంబనాడ్ సరస్సుకి కూడా వెళ్ళవచ్చు. ebs_alappuzha_0042 పిక్నిక్, బోటింగ్, చేపలు పట్టడం మరియు ఆసక్తికర స్థలాల సందర్శన కోసం కుటుంబంతో కలసి వెళ్ళదగిన ప్రశాంత ప్రదేశం, ఇది పక్షుల అభయారణ్యానికి మీ సందర్శనకు ఒక ఉత్తమమైన ముగింపుని ఇస్తుంది. ebs_alappuzha_0044 హౌస్‌బోట్ ప్రయాణం (చేయవలసిన పనులు) ebs_alappuzha_0046 అరేబియా సముద్రానికి సమాంతరంగా ప్రవహిస్తున్న కేరళ బ్యాక్ వాటర్స్, భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ebs_alappuzha_0047 అలెప్పీ, లేదా అలప్పుజ్హ, ప్రత్యేకంగా తమ హౌస్ బోట్ ప్రయాణాలకు ప్రాచుర్యం పొందింది. ebs_alappuzha_0048 కేరళలో ప్రశాంతమైన బ్యాక్ వాటర్ ప్రయాణాలు ఒక ప్రత్యేకమైన అనుభవం, అది చిన్న దోనెలే లేదా పడవలలో తక్కువ దూరంగలవే కావచ్చు, ఇవి ఇరుకైన కాలువల గుండా మెలికలు తిరుగుతూ ప్రయాణిస్తాయి, లేదా విలాసవంతమైన హౌస్‌బోట్‌లలో ఎక్కువసేపు ఉండవచ్చు, నిర్మలమైన గ్రామీణ ప్రాంతాలు మెల్లగా మీ వెంట నడుస్తుండగా, ఇవి తాటి మరియు కొబ్బరి చెట్ల అంచుతో కూడిన పచ్చని జలాల వెంట మిమ్మల్ని తేలియాడిస్తూ ఉంటాయి. ebs_alappuzha_0050 ఇక్కడ ప్రయాణించే హౌస్‌బోట్‌లు, సమీప పట్టణాలకు బియ్యం మరియు సుగంధ ద్రవ్యాలను రవాణా చేయడానికి ఉపయోగించబడే పరివర్తించిన కెట్టువల్లాలు లేదా సాంప్రదాయ వాణిజ్యం కోసం ఉపయోగించబడే పెద్ద నౌకలే. ebs_alappuzha_0051 రోడు రవాణాకు ప్రాముఖ్యత లభించడంతో, నీటిపై నడిచే ఈ అందమైన నీటియేనుగులు కనుమరుగయ్యాయి, అది కూడా కేవలం పర్యాటకులకు ఆధునిక జీవితంలోని అన్ని విలాసాలను అందించే తేలియాడే హోటళ్ళుగా తిరిగి ఉద్భవించడానికి మాత్రమే. ebs_alappuzha_0052 జలమార్గాల చుట్టూ ఉన్న దృశ్య సౌందర్యం మంత్రముగ్దులను చేస్తుండగా, ఈ విశాలమైన మరియు చక్కగా అలంకరించబడిన హౌస్‌బోట్‌లు అనుభవం యొక్క మనోజ్ఞతను పెంచుతాయి. ebs_alappuzha_0054 సాంప్రదాయకంగా, ఒక కెట్టువల్లం సుమారుగా 60 అడుగుల పొడవు మరియు దూలం వద్ద 15 అడుగుల వెడల్పు ఉంటుంది. ebs_alappuzha_0055 కొన్ని కొత్త హౌస్‌బోట్‌ల పొడవు 80 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది ebs_alappuzha_0056 పనసపండు చెట్టు కలప, తాటి చెట్టు కలప, కొబ్బరి నార, వెదురు కర్రలు, తాళ్ళు, తడకలు మొదలైన స్థానికంగా లభించే సహజ పదార్థాల నుండి నిర్మించిన ఈ పడవలు సుఖప్రద ప్రయాణాన్ని అందజేస్తాయి. ebs_alappuzha_0057 వీటిని కొబ్బరి నారతో చెక్క బల్లలను కట్టి (మేకులతో కాకుండా) నిర్మిస్తారు. ebs_alappuzha_0058 జీడిపప్పు పెంకుల నుండి సేకరించిన లక్కను బల్లలకు పూస్తారు. ebs_alappuzha_0059 పైకప్పు నిర్మాణానికి వెదురు కర్రలు మరియు తాటి ఆకులను ఉపయోగిస్తారు. ebs_alappuzha_0060 ఈ పడవల్లో కొన్నింటికి విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ప్యానెల్లు కూడా ఉన్నాయి. ebs_alappuzha_0061 జాగ్రత్తగా ఉంచుకుంటే, ఈ పడవలు దశాబ్దాల పాటు ఉండవచ్చు. ebs_alappuzha_0062 కేరళలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి అయిన వేంబనాడ్ సరస్సులో మరియు ఆ చుట్టుపక్కల ఉండే కాలువలలో అలప్పుజ్హ పడవ ప్రయాణాలు కొనసాగుతాయి. ebs_alappuzha_0063 మడ అడవులు మరియు కొబ్బరి చెట్లతో చుట్టుముట్టబడిన ఈ సరస్సులో అద్దం లాంటి తేజస్సు ఉంది, ఇక దాని ఉపరితలంపైన ప్రయాణించడం సంతృప్తి మరియు శాంతిని చేకూరుస్తుంది. ebs_alappuzha_0064 ఈ ప్రయాణాలు చిన్న కుగ్రామాలు మరియు మడుగు ద్వీపాల మీదుగా తీసుకెళ్తూ పర్యాటకులను ఈ ప్రాంతం యొక్క లోపలి భాగాలను అన్వేషించేలా చేస్తుంది. ebs_alappuzha_0065 సాంప్రదాయ వంటకాల రుచి చూడండి, ఆయుర్వేద మర్దనాలను ఆస్వాదించండి అలాగే కేరళ యొక్క స్ఫూర్తి మీలో ఒక కొత్త శక్తిని నింపనివ్వండి. ebs_alappuzha_0067 కృష్ణపురం ప్యాలెస్ పూర్వ సంస్కృతి ebs_alappuzha_0069 ఒక చిన్న కొండపై ఉన్న కృష్ణపురం ప్యాలెస్ చుట్టూ చెరువులు, పచ్చిక బయళ్ళు మరియు ఫౌంటైన్లు ఉన్నాయి. ebs_alappuzha_0070 ఇంటి మూలకప్పు, పైకప్పు కిటికీలు మరియు ఇరుకైన వరండాలతో ఈ భవనం యొక్క నిర్మాణ శైలి కేరళ శైలిలో నిర్మించబడింది, ఇది దాని వైభవాన్ని ప్రస్ఫుటము చేస్తుంది. ebs_alappuzha_0071 ఈ సముదాయంలో వివిధ రకాల వృక్షజాతులకు నిలయమైన చక్కటి ప్రకృతి దృశ్యంగల ఉద్యానవనం, కొత్తగా నిర్మించిన బుద్ధ మండపం మరియు ఇటీవల తిరిగి పొందిన బుద్ధభగవానుడి విగ్రహం కూడా ఉన్నాయి. ebs_alappuzha_0072 ఈ ప్యాలెస్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రక్షించబడుతున్న స్మారకం. ebs_alappuzha_0074 కేరళ రాష్ట్రంలో కనుగొన్న అతిపెద్ద ఏకాంశ కుడ్య చిత్రాలు గల ఈ ప్యాలెస్ ని ఇప్పుడు పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. ebs_alappuzha_0075 49 చదరపు మీటర్ల గజేంద్ర మోక్షం (పురాణగాథలోని ఒక దృశ్యం), ఇది అత్యంత విలువైన ప్రదర్శిత వస్తువు. ebs_alappuzha_0076 ప్రదర్శించిన ఇతర వస్తువులలో నాణేలు, శాసనాలు, రాతి నిర్మాణ అవశేషాలు, చెక్క కళాఖండాలు, రాతి మరియు ఇత్తడి శిల్పాలు మరియు చిత్రాలు ఉన్నాయి. ebs_alappuzha_0078 ఇది పూర్వపు కయాకుళం పాలకుల నివాసం, దీనిని ట్రావెన్కోర్ రాజు అనిజ్హమ్ తిరునాల్ మార్తాండ వర్మ (1729-1758) పాలనలో నిర్మించారు. ebs_alappuzha_0079 ఇది అలప్పుజ్హ నుండి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_alappuzha_0081 పతిరమన్నాల్ ప్రకృతి ebs_alappuzha_0083 అలప్పుజ్హ నుండి 13 కిలోమీటర్ల దూరంలో, రమణీయమైన మరియు చిన్న ద్వీపం అయిన పతిరమన్నాల్ కేరళలోని బ్యాక్ వాటర్ మీద తేలుతుంది. ebs_alappuzha_0084 ఇది అరుదైన వలస పక్షులను చూడటానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి, ఇది 50 అన్యదేశ జాతుల పక్షులు మరియు 91 రకాల స్థానిక పక్షులను కలిగి ఉంది. ebs_alappuzha_0085 సాధారణ అడవిబాతు, సూదితోక(పిన్‌టెయిల్) బాతులు, చెరువుకాకి, చింతొక(నైట్ హెరాన్), డార్టర్, భారతదేశపు నీరుకాకి, ఈలల బాతు, చిన్న చెరువుకాకి మరియు విస్కర్డ్ టర్న్ వంటి సాధారణ పక్షులను ఇక్కడ చూడవచ్చు. ebs_alappuzha_0086 ఈ ద్వీపం అనేక ఔషధ మొక్కలకు కూడా నిలయం. ebs_alappuzha_0088 అలప్పుజ్హ నుండి కొచ్చి వరకు విస్తరించి ఉన్న వెంబనాడ్ సరస్సు, మరియు కయంకుళం సరస్సుతో పతిరమన్నాల్ చుట్టుముట్టి ఉంది. ebs_alappuzha_0089 అందువలన, దీనిని పడవ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ebs_alappuzha_0090 అలప్పుజ్హ నుండి స్పీడ్‌బోట్ ద్వారా 30 నిమిషాల ప్రయాణం లేదా మోటారు బోటులో 1.5 గంటల ప్రయాణం చేసి ద్వీపానికి వెళ్ళవచ్చు. ebs_alappuzha_0091 అంతేకాకుండా, ఈ ద్వీపం హౌస్ బోట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోడానికి కూడా ఒక గొప్ప ప్రదేశం. ebs_alappuzha_0097 కొచ్చి సమీప విమానాశ్రయం, ఇది సుమారు 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_alappuzha_0101 అలప్పుజ్హ వద్ద ఉన్న రైలు మార్గం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. ebs_alappuzha_0105 ఈ నగరం మోటర్ వాహనాలు నడిపేందుకు వీలైన మంచి రోడ్లు మరియు జాతీయ రహదారులతో రాష్ట్రం మరియు భారతదేశంలోని ఇతర నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది.