ID SENT ebs_alwar_0002 అల్వార్ ebs_alwar_0004 ట్యాగ్‌లైన్: రాజస్థాన్ యొక్క వారసత్వం ebs_alwar_0006 సందర్శించడానికి అనుకూలమైన సమయం: అక్టోబర్ నుండి మార్చి వరకు ebs_alwar_0008 ఉద్ధరణ: చారిత్రాత్మక నగరం అయిన అల్వార్ ఉత్సాహవంతమైన రాజస్థాన్‌ రాష్ట్రానికి ముఖద్వారం, ఈ నగరం గొప్ప వారసత్వం యొక్క అవశేషాలను కలిగి ఉంది. ebs_alwar_0012 అల్వార్‌ను సందర్శిస్తున్నప్పుడు మనం గతంలోకి వెళ్తునట్లు అనిపిస్తుంది. ebs_alwar_0013 ఆరావళీ పర్వత శ్రేణులలో ఒదిగి ఉన్న ఒకప్పటి రాజులకు వేటాడే స్థలాలు అయిన ఈ నగరం, కోట మరియు రాజభవనాలు నుండి వన్యప్రాణుల అభయారణ్యం వరకు, ఇది రాజస్థాన్‌లో అన్నిటి కంటే పురాతన మరియు ధనిక రాజ్యాలలో ఒకటిగా ఉన్నప్పటి నుండి అనేక చారిత్రక రత్నాలను కలిగి ఉంది . ebs_alwar_0015 ఒక గొప్ప స్మారకానికి ఏమీ తీసిపోని విధంగా కనిపించే బృహత్తరమైన బాలా ఖిలా, నగరం యొక్క కేంద్రభాగంగా ఉంది. ebs_alwar_0016 ఆరు అద్భుతమైన ద్వారాలు మరియు అందమైన వాస్తుకళతో ఉన్న ఈ కోట, నగరంలోని విస్తృత దృశ్యాలను చూడటానికి మంచి అనువైన ప్రదేశం. ebs_alwar_0017 ఒకప్పటి మహారాజు వేటభూమిగా ఉన్న సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడి మరో ఆకర్షణ. ebs_alwar_0018 పులులు, దుప్పి, మనుబోతు, సాంబార్ జింక మొదలైన జంతువులతో నిండిన ఈ అభయారణ్యం ఖజురాహో లాంటి శిల్పాలను కలిగి ఉన్న పురాతన కోటలు మరియు దేవాలయాల శిథిలాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ebs_alwar_0020 మహాభారత మహాకావ్యంలో అల్వార్ గురించిన ప్రస్తావన ఉంది, ఇందులో పాండవ సోదరులు తమ ప్రవాసంలో కొంత భాగాన్ని ఇక్కడ గడిపారని అని నమ్ముతారు. ebs_alwar_0021 క్రీస్తుపూర్వం 1500 లో విరాట్‌నగరంలోని మత్స్య భూభాగాల్లో అల్వార్ ఒక భాగంగా ఏర్పడిందని చెబుతారు. ebs_alwar_0022 అంతేకాకుండా, మొఘలుల కాలంలో ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే ఇది పొరుగు రాజ్యాలపై దాడులు చేయడానికి ఒక స్థావరంగా ఉపయోగపడింది. ebs_alwar_0023 తరువాత దీనిని భరత్‌పూర్ యొక్క జాట్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. ebs_alwar_0024 ఏదేమైనా, మాచ్చేరికి చెందిన ప్రతాప్ సింగ్ దీనిని 1775 లో జాట్‌ పాలకుల నుండి స్వాధీనం చేసుకుని ప్రత్యేక రాష్ట్రంగా స్థాపించాడు. ebs_alwar_0028 బాలా ఖిలా (వారసత్వ సంపద) ebs_alwar_0030 ఆరావళి పర్వత శ్రేణులలో ఒదుగుకొని ఉన్న, బ్రహ్మాండమైన బాలా ఖిలా కోట ఒక గొప్ప స్మారకానికి ఏమీ తీసిపోదు. ebs_alwar_0031 15వ శతాబ్దంలో మేవాత్ రాజపుత్ పాలకుడు అయిన హాసన్ ఖాన్ మేవాతి ద్వారా నగరానికి సంరక్షణగా నిర్మించబడిన ఈ కోట 300 మీటర్ల ఎత్తులో ఉంది. కోట కట్టడం ద్వారా ఈ నిర్మాణాన్ని బలపరచబడింది మరియు ఇది సున్నితమైన జాలీ పని చేసిన బాల్కనీలు మరియు పాలరాతి స్తంభాలు కలిగి ఉంది. ebs_alwar_0032 కోట యొక్క పరిమాణాన్ని దాని ఆరు విశాల ద్వారాల ద్వారా ఊహించవచ్చు: అవే పోల్, సూరజ్ పోల్, లక్ష్మణ్ పోల్, చాంద్ పోల్, కృషన్ పోల్ మరియు అంధేరి ద్వారం. ebs_alwar_0033 ఈ రోజు, పర్యాటకులు కోటను పై వరకు ఎక్కుతారు, అక్కడ నుండి వారు అల్వార్ నగరం యొక్క విస్తృత దృశ్యాలను చూడవచ్చు. ebs_alwar_0035 బాలా ఖిలా లేదా యంగ్ ఫోర్ట్, ఒక అగ్రరాజ్యంగా విరాజిల్లుతున్న సమయంలో, ఒక అధికార కేంద్రంగా ఉండేది మరియు ఈ ప్రాంతం, యాదవులు, మరాఠాలు మరియు కచ్వాహా రాజపుత్రులు వంటి రాజవంశీకుల ద్వారా పరిపాలించబడింది. ebs_alwar_0036 వాస్తవానికి, 1775 లో కచ్వాహా పాలకులు కోటను స్వాధీనం చేసుకున్న తరువాత వాళ్లు అల్వార్ నగరానికి పునాదిని నిర్మించారు. ebs_alwar_0037 ఇది మొఘలుల ఉన్నతికి ముందు, రాష్ట్రంలో నిర్మించిన కొన్ని కోటల్లో ఒకటి, నిజంగానే ఇది ఒక నిధి. ebs_alwar_0038 మొఘల్ చక్రవర్తులు అయిన బాబర్, అక్బర్ కూడా ఇక్కడ నివసించారని చెబుతారు. ebs_alwar_0040 ప్రస్తుతం, ఈ కోటలో రేడియో ట్రాన్స్మిటర్ స్టేషన్ ఉంది అలాగే సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్ వద్ద పోలీసు సూపరింటెండెంట్ అనుమతితోనే కోటలోని కొన్ని ప్రదేశాలను సందర్శించవచ్చు. ebs_alwar_0042 సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం (ప్రకృతి మరియు వన్యప్రాణులు) ebs_alwar_0044 ఒకప్పటి అల్వార్ మహారాజు యొక్క వేటభూమి అయిన సరిస్కా లోయ వివిధ రకాల వృక్షజంతుజాలాలకు నిలయం. ebs_alwar_0045 ఈ ఉద్యానవనంలో పులులు, మనుబోతు, సాంబార్ జింక, దుప్పి మొదలైన జంతువులు ఉన్నాయి. ebs_alwar_0046 సాయంత్రం సమయాలలో ఇండియన్ పార్క్యుపైన్, చారల సివంగి, చిరుతపులులను చూడవచ్చు. ebs_alwar_0047 భారతీయ నెమళ్ళు, నల్లపాముల గద్ద(క్రెస్టడ్ సర్పెంట్ ఈగల్), స్యాండ్ గ్రౌస్, గోల్డెన్ బ్యాక్డ్ వుడ్ పెకర్లు, గ్రేట్ ఇండియన్ హార్న్డ్ ఔల్స్, ట్రీ పైస్, రాబందులు మరియు మరెన్నో రకాల పక్షులు పెద్ద సంఖ్యలో ఉండటం వలన ఈ ప్రదేశం పక్షి ప్రేమికులకు స్వర్గంలా ఉంటుంది. ebs_alwar_0049 ఈ అభయారణ్యం యొక్క భూ దృశ్యం చాలావరకు ఎండిన ఆకురాల్చే అడవులను కలిగి ఉంది, ఇవి ఈశాన్యంలోని నిర్మలమైన సిలిసేఢ్ సరస్సు చుట్టూ ఉన్నాయి. ebs_alwar_0050 ఈ అభయారణ్యం పురాతన దేవాలయాల శిథిలాల చుట్టూ విస్తరించి ఉంది, ఈ ఆలయాలలో ఎక్కువ భాగం 10 మరియు 11 వ శతాబ్దాలకు చెందినవి. ebs_alwar_0051 కంక్వాడీ కోట మరియు 10 వ శతాబ్దం నాటి నీలకంఠ దేవాలయాల శిథిలాలు ఇక్కడ ఉన్న కొన్ని ప్రధాన ఆకర్షణలు. ebs_alwar_0052 ఈ దేవాలయాలకు వెళ్లే మార్గం కఠినమైనది, కాని వాస్తుకళ మరియు ఖజురాహో లాంటి శిల్పాలు సందర్శకుడిని విస్మయానికి గురిచేస్తాయి. ebs_alwar_0053 ఈ ఆలయాలు అభయారణ్యం లోపల 30 కి.మీ. దూరంలో ఉన్నాయి, ఇక్కడ నెమళ్ళు వంటి అందమైన పక్షులను చూడవచ్చు. ebs_alwar_0054 దేవాలయాల నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో జైన తీర్థంకరుడైన శాంతినాథ్ యొక్క ఏకశిలా రాతి విగ్రహం కూడా ఉంది. ebs_alwar_0055 సరిస్కా అభయారణ్యంలో మతసంబంధి ప్రాముఖ్యత ఉన్న మరో ఆసక్తికరమైన ప్రదేశం పాండుపోల్, ఈ ప్రదేశంలో భీముడు (పాండవులలో అత్యంత బలవంతుడు) హిడింబుడు అనే మహాకాయం గల రాక్షసుడిని ఓడించి అతని సోదరి అయిన హిడింబాను వివాహం చేసుకున్నట్లుగా విశ్వసిస్తారు. ebs_alwar_0056 పాండవులు ప్రవాసంలో ఉన్నప్పుడు భీముడు ఇక్కడ ఆశ్రయం పొందాడని కూడా నమ్ముతారు. ebs_alwar_0057 ఈ ప్రాంతంలో అనేక లంగూర్లు, నెమలి, స్పర్ ఫౌల్లను(చిమటకోడి) చూడవచ్చు. ebs_alwar_0059 1955 లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడిన సరిస్కా 1979 సంవత్సరంలో జాతీయ ఉద్యానవనం హోదాను పొందింది. ebs_alwar_0060 ఈ అభయారణ్యాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి జూన్ వరకు అనుకూలమైన సమయం. ebs_alwar_0062 హిల్ ఫోర్ట్ కేస్రోలి (వారసత్వ సంపద) ebs_alwar_0064 ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న ఈ 14వ శతాబ్దపు కోటను ఇప్పుడు ఒక హెరిటేజ్ హోటల్‌గా మార్చారు. ebs_alwar_0065 ఈ కోట పెద్ద రాతిపై ఉంది అలాగే అద్భుతమైన విన్యాసం మరియు ఆకృతి కలిగి ఉంది. ebs_alwar_0066 ధృడమైన గోడలతో ఆవరించబడి ఉన్న ఈ కోట చాలమట్టుకు గ్రానైట్‌తో నిర్మించబడింది, అలాగే దీనిని బలపరిచేందుకు అనేక స్తంభాలు ఉన్నాయి. ebs_alwar_0067 ఈ భవనంలోని ప్రతిదీ పెద్దది మరియు విశాలమైనది-హాళ్ళు, కిటికీలు, పైకప్పు మరియు వరండాలు. ebs_alwar_0068 ఇది 100 మందికి పైగా వసతిని కల్పిస్తుంది అలాగే ఇక్కడ నుండి నగరం యొక్క అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ebs_alwar_0069 దాని చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, ఈ కోటను భారత ప్రభుత్వం ఒక వారసత్వ సంపదగా ప్రకటించింది. ebs_alwar_0071 ఈ రోజు, ఇది ఒక విలాసవంతమైన హోటల్, సందర్శకులు ప్రకృతిని దగ్గరగా చూడడానికి అలాగే గతంలోని రాజవంశీకులు ఎలా జీవించేవారో ఆ అనుభూతిని పొందడానికి ఇక్కడకు రావచ్చు. ebs_alwar_0072 సమీపంలోని సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించడానికి ఒక గొప్ప ప్రదేశం. ebs_alwar_0074 ఈ కోటను యదువంశీయులు (శ్రీకృష్ణుని వంశస్థులు) నిర్మించినట్లు నమ్ముతారు. ebs_alwar_0075 1775లో రాజపుత్‌ల చేతుల్లోకి రాక ముందు ఈ కోటను మొదట మొఘలులు, ఆ తర్వాత జాట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ebs_alwar_0076 రణావత్ ఠాకూర్, భవానీ సింగ్(1882-1934) పాలనలో ఇది ప్రధాన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ebs_alwar_0078 బైరాత్ (వారసత్వ సంపద) ebs_alwar_0080 చారిత్రక ప్రదేశమైన బైరాత్, తవ్వకాలలో బయటపడిన ఒక వృత్తాకార బౌద్ధ ఆలయం, ఇది భారతదేశంలో ప్రాచీన కాలంలో ప్రసిద్ధి చెందిన పూరతన దేవాలయాలలో ఒకటి, అశోకుని శాసనాలు మరియు ఒక మఠం యొక్క అవశేషాలకు ప్రసిద్ధి చెందింది. ebs_alwar_0081 మొఘల్లు, రాజ్‌పుత్ లు మరియు మౌర్యుల కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభించాయి. ebs_alwar_0082 ప్రాచీన కాలంలో, బైరాత్‌ను విరాట్‌నగర్ అని పిలిచేవారు, ఇది అప్పటి మత్స్యరాజు అయిన విరాట మహారాజు యొక్క రాజ్యానికి రాజధానిగా ఉండేది. ebs_alwar_0083 మహాభారతంలో, పాండవులు తమ ప్రవాస సమయంలో ఇక్కడ ఒక సంవత్సరం గడిపారని పురాణగాథలలో ఉంది. ebs_alwar_0084 చైనా యాత్రికుడు జువాన్‌జెంగ్, బౌద్ధ తీర్థయాత్రకు బైరాత్‌ను గొప్ప ప్రదేశంగా భావించాడు. ebs_alwar_0085 ఇతర తవ్వకాల్లో ఇది మౌర్యుల సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉందని అలాగే క్రీ.పూ 3 వ శతాబ్దం నుండి క్రీ.శ 1 వ శతాబ్దం వరకు బౌద్ధ కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది. ebs_alwar_0086 అశోకుని పాలనలో బుద్ధుని బోధనలను ప్రచారం చేసి బోధించడానికి చెక్కబడిన 84,000 శిలాశాసనాలు మరియు స్తంభ శాసనాలలోనివిగా విశ్వసించబడే రెండు శిలాశాసనాల ద్వారా ఇది నిరూపించబడింది. ఆ రెండు శిలాశాసనాలు ఇక్కడే లభించినవి. ebs_alwar_0087 ఈ నగరం మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది, ఆయన ఇక్కడ ఒక నాణాల కర్మాగారాన్ని నిర్మించారు. ebs_alwar_0089 ఎలా చేరుకోవాలి: ebs_alwar_0091 వాయుమార్గం: సమీప విమానాశ్రయాలు, సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లోని సంగనీర్ విమానాశ్రయం మరియు 163 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం. ebs_alwar_0093 రైలు మార్గం: రైల్వే వ్యవస్థ, ఢిల్లీ, జైపూర్ వంటి ముఖ్యమైన నగరాలను మరియు పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని అనేక ఇతర నగరాలను అనుసంధానిస్తుంది. ebs_alwar_0095