ID SENT ebs_amravati_0002 గమ్యం పేరు ebs_amravati_0004 అమరావతి ebs_amravati_0008 ప్రాచీన బౌద్ధ కేంద్రం ebs_amravati_0010 సందర్శించడానికి అనుకూలమైన సమయం ebs_amravati_0012 నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ebs_amravati_0016 కృష్ణా నది తీరాన నెలకొని ఉన్న ప్రాచీన నగరం అయిన అమరావతి, బౌద్ధ సంస్కృతితో నిండి ఉంది. ebs_amravati_0019 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నది తీరాన ఉన్న ఈ అసాధరణ అమరావతి నగరం, సమృద్ధ బౌద్ధ సంస్కృతిలో పాతుకుపోయింది. ebs_amravati_0020 ప్రాచీన బౌద్ధు విడిదిలో వివిధ అవశేషాలతో నిండి ఉన్న అమరావతి, బౌద్ధమతాన్ని అనుసరించే వారికి అలాగే చరిత్ర ప్రేమికులకు ఒక అభయస్థానం వంటిది. ebs_amravati_0021 విజయవాడ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం, చింతపల్లి అనే ఒక ప్రాచీన బౌద్ధుల విడిది. ebs_amravati_0022 మౌర్య చక్రవర్తి అయిన అశోకుని పాలనలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో నిర్మించిన ఇక్కడి స్తూపం, కనిపిస్తున్నట్లుగానే సాంచి వద్ద ఉన్న స్తూపం కంటే పెద్దది ఇక ఇది నలుదిక్కులా ఒకొక్క ముఖద్వారాన్ని కలిగి ఉంది. ebs_amravati_0023 ముఖద్వారాలలో ఒకటి పునర్నిర్మించబడింది దానిని మనం చూడవచ్చు, అయితే ఇతర నిర్మాణాలు ఇప్పుడు లేవు. ebs_amravati_0025 బుద్ధ భగవానుని జీవనగాథలు ఈ ముఖద్వారం మీద చెక్కబడ్డాయి. ebs_amravati_0027 500 సంవత్సరాల నాటి పురాతన ప్రక్రియను ఉపయోగించి తయారు చేసే ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలకు కేంద్రంగా ఉన్న కొండపల్లి బొమ్మల గ్రామాన్ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు, ఈ బొమ్మలు వాటి కాంతివంతమైన రంగులు మరియు విలక్షణమైన రూపాలకు ప్రసిద్ది చెందాయి. ebs_amravati_0031 ఉండవల్లి గుహలు (ఆధ్యాత్మికం) ebs_amravati_0032 'క్రీ.పూ 7 వ శతాబ్దినికి చెందిన ఉండవల్లి గుహలు, ఈ గుహలు ఒకే ఇసుకరాయితో చెక్కబడినవి, ఈ గుహలు భారతదేశ చెక్కినశిలా నిర్మాణశాస్త్ర సంబంధి సంస్కృతికి ఒక ప్రధాన నిదర్శనం.' ebs_amravati_0033 గుహల యొక్క ఆకర్శించే ఆకృతి రచన ప్రాచీన విశ్వకర్మ వాస్తుశిల్పులు మరియు ఆలయ నిర్మాతల అధునాతన నిర్మాణ నైపుణ్యాల గురించి కథలుకథలుగా చెబుతుంది. ebs_amravati_0034 ఈ గుహలు, క్రీ.శ. 420 మరియు క్రీ.శ. 620 మధ్య భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను పాలించిన ప్రబలులైన విష్ణుకుండిన రాజవంశానికి చెందినవిగా చెప్పబడుతున్నాయి. ebs_amravati_0035 ఈ గుహలు గుప్తులు నిర్మాణశైలికి కూడా చక్కటి నమూనానే, అలాగే రెండవ అంతస్తులో వివరణాత్మక ఆకృతి రచన చాళుక్యుల నిర్మాణశైలిని ప్రతిబింబిస్తుంది. ebs_amravati_0036 ఈ అతిపెద్ద గుహలో నాలుగు అంతస్తులు ఉన్నాయి, అలాగే విశ్రాంతి తీసుకునే భంగిమలో ఉన్న మహావిష్ణువు యొక్క భారీ విగ్రహానికి ఇది నిలయం. ebs_amravati_0037 ఈ శిల్పం, ఒక గ్రానైట్ రాతిబండ నుండి చెక్కబడిందని చెబుతారు. ebs_amravati_0038 గుహల యొక్క మొదటి అంతస్తులో జైన తీర్థంకరుల (సాధువుల) శిల్పాలు ఉండడం, ఈ గుహలు ఒకప్పుడు జైన సన్యాసులకు నివాసం అని సూచిస్తున్నాయి. ebs_amravati_0039 మొదటి అంతస్తులోని గోడలపై పౌరాణిక కథల దృశ్యాలను వర్ణించే అద్భుతమైన కుడ్యచిత్రాలు ఉన్నాయి. ebs_amravati_0040 మూడవ అంతస్తులోని ముందు భాగంలో సింహాలు, ఏనుగుల చిత్రణలతో పాటు అనేక శిల్పాలు ఉన్నాయి. ebs_amravati_0042 సమీపంలో బ్రహ్మ, విష్ణువు మరియు శివునికి అంకితం చేయబడిన మరో అద్వితీయమైన గుహ ఉంది. ebs_amravati_0044 'ఉండవల్లి గుహల నిర్మాణశైలి మరియు పచ్చని పరిసరాలు భువనేశ్వర్‌లోని ఉదయగిరి గుహలను తలపిస్తాయి.' ebs_amravati_0046 చందవరం బౌద్ధ క్షేత్రం (ఆధ్యాత్మికం) ebs_amravati_0047 క్రీ.పూ. 2వ శతాబ్దం మరియు క్రీ.శ. 2వ శతాబ్దం మధ్య నిర్మించబడిన చందవరం బౌద్ధ క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి క్షేత్రాలలో ఇదే మొదటిది. ebs_amravati_0048 చరిత్ర మరియు పురావస్తు ప్రేమికులకు ఒక మనోహరమైన ప్రదేశం, ఇది సింగరాయకొండ అనే ఒక కొండపైన ఉంది. ebs_amravati_0049 ఇది తక్షశిలలోని ప్రసిద్ధ ధర్మరాజిక స్తూపంతో దగ్గరి పోలికలు ఉన్న చందవరం స్తూపాన్ని కలిగి ఉంది. ebs_amravati_0050 రెండు అంతస్థుల గల ఈ స్తూపాన్ని మహా స్తూపం అని కూడా పిలుస్తారు, ఇది బౌద్ధధర్మం యొక్క హీనయాన శాఖలో భాగంగా నిర్మించిన స్తూప లక్షణాలను ప్రదర్శిస్తుంది. ebs_amravati_0051 పురావస్తు ప్రదేశంలో 15 సాధారణ పరిమాణంగల స్తూపాలు మరియు 100 చిన్న స్తూపాలతో పాటు మహాచైత్య, శిలామండపం, విహారాలు మరియు శాసనాలు, ఆకృతులతో అలంకరించబడిన రెండు డజన్లకు పైగా బౌద్ధ పలకలు ఉన్నాయి. ebs_amravati_0053 గుండ్లకమ్మ నదీతీరాన ఉన్న చందవరం, ప్రకాశం జిల్లాలో ఉంది, అమరావతి నుండి ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. ebs_amravati_0055 కొండపల్లి కోట (వారసత్వ సంపద) ebs_amravati_0056 కొండపల్లి గ్రామం నడిబొడ్డున ఉన్న, కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ గొప్ప కొండపల్లి కోట తప్పక చూడవలసిన ప్రదేశం. ebs_amravati_0057 పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించబడిన బృహత్ పరిమాణంగల కోట ప్రహరీలు, కొండపల్లి గ్రామంలోకి ప్రవేశించగానే చాలా దూరం నుండి కనిపిస్తాయి. ebs_amravati_0058 దర్గా దర్వాజా అని పిలువబడే ప్రవేశ ద్వారం ఈ కోట యొక్క అత్యంత అద్భుత ప్రత్యేకతలలో ఒకటి. ebs_amravati_0059 ఇది ఒక గ్రానైట్ గండశిల నుండి చెక్కించబడింది. ebs_amravati_0060 ఈ కోట యొక్క ఇతర ముఖ్యమైన ప్రత్యేకతలలో గోల్కొండ దర్వాజా, గరీబ్ సాహిబ్ దర్గా మరియు తానీషా మహల్ లు ఉన్నాయి. ebs_amravati_0061 దక్షిణ భారతదేశానికి చెందిన యోధ రాజులైన ముసునూరి నాయకుల ద్వారా నిర్మించబడిన సమయం నుండి చూసినట్లైతే ఈ కోట 14 వ శతాబ్దం నాటిది అని అనవచ్చు. ebs_amravati_0063 ఈ కోటను కొండపల్లి కోట లేదా కొండపల్లి ఖిలా అని కూడా పిలుస్తారు. ebs_amravati_0065 కొండపల్లి బొమ్మల గ్రామం (కళ మరియు సంస్కృతి) ebs_amravati_0066 అమరావతికి చెందిన ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలు కొండపల్లి గ్రామానికి చెందిన నిపుణ కళాకారులుచే రూపొందించబడ్తాయి. ebs_amravati_0067 బొమ్మలు వాటి కాంతివంతమైన రంగులు మరియు విలక్షణ రూపాలకు ప్రసిద్ది చెందినవి, వీటిని 500 సంవత్సరాల పురాతన ప్రక్రియను ఉపయోగించి తయారు చేస్తారు. ebs_amravati_0068 ఈ బొమ్మలను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి, పర్యాటకులు వరుసగట్టిన రంగురంగుల చెక్క బొమ్మలను విక్రయించే దుకాణాలు గల కొండపల్లి గ్రామాన్ని సందర్శించవచ్చు. ebs_amravati_0069 ప్రసిద్ధి చెందిన తంజావూరు నృత్య బొమ్మలకు కూడా ఈ గ్రామం ఖ్యాతిని పొందింది, వాటిని ఇప్పుడు ఇక్కడ తయారుచేస్తున్నారు. ebs_amravati_0070 మీరు గ్రామం యొక్క ప్రధాన వీధి గుండా వెళుతున్నప్పుడు, గ్రామస్థుల తమ ఇళ్లలో నిర్వహిస్తున్న చిన్న చిన్న కర్మాగారాల నుండి వచ్చే అణిచిన గుద్దుడుల శబ్దాలను మీరు వినవచ్చు. ebs_amravati_0071 గ్రామంలోని అన్ని కుటుంబాల నుండి సుమారు 200 మంది ఈ సాంప్రదాయ కళను సజీవంగా ఉంచే పనిలో నిమగ్నమై ఉన్నారు. ebs_amravati_0072 పూర్వం సంక్రాంతి మరియు నవరాత్రి పండుగలకి కొండపల్లి బొమ్మలు ప్రత్యేక భాగంగా ఉండేవి. ebs_amravati_0074 ఈ అద్భుతమైన గ్రామాన్ని సందర్శించడం ద్వారా పర్యాటకులకు, ఎంతో ఆతిథ్యాన్ని చూపే కళాకారుల కుటుంబాలతో సంభాషించి ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలకు మరింత చేరువ అయ్యే అవకాశం లభిస్తుంది. ebs_amravati_0076 ఘంటసాల (వారసత్వ సంపద, ఆధ్యాత్మికం) ebs_amravati_0077 ప్రాచీన కాలంలో కటకశిలాగా పిలువబడే ఘంటసాల ఒకప్పుడు ప్రఖ్యాత బౌద్ధ కేంద్రంగా ఉండేది. ebs_amravati_0078 చరిత్రలో పాతుకుపోయి, దాని గొప్ప వారసత్వ సంపదకు గాను, ఇది చరిత్ర-ప్రేమికులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలను ఇక్కడికి ఆహ్వానిస్తుంది. ebs_amravati_0079 1919-20 లో వెలికితీసిన బౌద్ధ స్తూపం మరియు ఇతర బౌద్ధ శిల్పాలు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆకర్షణలలో ఉన్నవి. ebs_amravati_0080 ఇక్కడ తవ్వకాల్లో లభించిన ప్రసిద్ధ స్తూపమైన మహా చైత్య, శాతవాహన కాలానికి చెందిన బౌద్ధధర్మం యొక్క స్తూపాలతో పోలి ఉంది. ebs_amravati_0081 స్తూపం యొక్క గోపురం ఒకప్పుడు బుద్ధ భగవానుని సూచించే 47 పలకలను కలిగి ఉండేదని చెబుతారు. ebs_amravati_0082 నగరంలోని మ్యూజియం, బౌద్ధ అవశేషాలతో పాటు రోమన్ మరియు శాతవాహనుల బంగారు నాణాల ఒక విస్తృత సేకరణ కలిగి ఉంది. ebs_amravati_0083 జలధీశ్వరస్వామి ఆలయం కూడా ఘంటసాలలో ఒక ప్రధాన ఆకర్షణ, ఇది శివుడు మరియు పార్వతి దేవి విగ్రహాలకు నిలయం. ebs_amravati_0084 చిన్న కాశీగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయం వివిధ దేవతలచే నిర్మించబడిందని నమ్ముతారు. ebs_amravati_0085 ఈ ఆలయంలో సదాచారి అయిన ఆది శంకరాచార్యులు తన మొట్టమొదటి మతపర కర్మను ఆచరించారని కూడా అంటారు. ebs_amravati_0087 ఘంటసాల అమరావతి నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది ఒక రోజు యాత్రకు గొప్ప ప్రదేశం. ebs_amravati_0089 మంగళగిరి (వారసత్వ సంపద, ఆధ్యాత్మికం) ebs_amravati_0090 ఈ పురాతన నగరం శ్రీ పానకాల లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది, ఈ ఆలయం నరసింహ స్వామి (సగం మనిషి-సగం సింహం రూపంలో ఉన్న) భగవానుడికి అంకితం చేయబడింది. ebs_amravati_0091 కొండ పైన నెలకొని ఉన్న ఈ ఆలయం దేశంలోని ఎనిమిది ముఖ్య పవిత్ర మహాక్షేత్రాలలో (పవిత్ర దేవాలయాలు) ఒకటి, ఇక్కడకు అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ebs_amravati_0092 ప్రాచీనకథ ప్రకారం, దేవుని నోటిలో శంఖంతో పానకం (బెల్లం నీరు) పోసినప్పుడు, పానకాన్ని మింగుతున్న ధ్వని స్పష్టంగా వినబడింది, ఈ కథ - విగ్రహం పానకాన్ని తాగుతుంది అన్న నమ్మికకు దారి తీసింది. ebs_amravati_0093 విగ్రహంలో పానకం ఎంత పరిమాణంలో పోస్తున్నాం అన్న విషయంతో సంబంధం లేకుండా, అందులో సగం మాత్రమే స్వీకరించబడుతుంది మిగిలినది తిరిగి వస్తుంది. ebs_amravati_0094 ఆలయాన్ని సందర్శించే భక్తులు ఆ పానకాన్ని చిన్న సీసాలలో ప్రసాదంగా తమ ఇళ్లకు తీసుకువెళతారు. ebs_amravati_0096 ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో జరిగే వార్షిక ఉత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ. ebs_amravati_0098 కనకదుర్గ ఆలయం (ఆధ్యాత్మికం) ebs_amravati_0099 ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనక దుర్గ అమ్మవారి ఆలయం విజయవాడ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఒకటి, ఈ ఆలయం నగరం నడిబొడ్డున ఉంది. ebs_amravati_0100 ఈ ఆలయం అపారమైన పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది అలాగే ఈ ఆలయం యొక్క గొప్ప నిర్మాణశైలి, సుందరమైన దృశ్యాలు మరియు దైవికశక్తి భక్తులను ఆకర్షిస్తాయి. ebs_amravati_0101 మహాభారత మహాకావ్యంలోని అర్జునుడు మహాశివుని కోసం తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని పొందిన ప్రదేశం ఇదేనని పురాణ కథనం. ebs_amravati_0102 అర్జునుడు ఈ ఆలయాన్ని నిర్మించి దుర్గా అమ్మవారికి అంకితం చేశాడని నమ్ముతారు. ebs_amravati_0103 ఆలయం యొక్క అద్భుతమైన రంగురంగుల ముఖద్వారం వద్ద కాపలాకాస్తూ ఉండే రెండు పసుపు రంగు సింహాల విగ్రహాలు సందర్శకులకు స్వాగతంపలుకుతూ ఉంటాయి. ebs_amravati_0104 ప్రధాన మందిరం ఆలయ సముదాయం యొక్క ఏడవ అంతస్తులో ఉంది. ebs_amravati_0105 'మంత్రముగ్ధులని చేసే ఈ ఆలయం యొక్క నిర్మాణశైలి హంపిలోని విరుపాక్ష ఆలయాన్ని తలపిస్తుంది.' ebs_amravati_0106 ఇంద్రకీలాద్రి కొండ పైనుంచి మీరు విజయవాడ మరియు కృష్ణానది యొక్క సుందర దృశ్యాన్ని చూడవచ్చు. ebs_amravati_0108 ఈ ఆలయం దసరా పండుగను వేడుకగా జరుపుకునేందుకు ప్రసిద్ధి పొందింది, ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. ebs_amravati_0110 శ్రీశైలం (విహారయాత్ర) ebs_amravati_0111 పచ్చని పరిసరాల మధ్య నెలకొని ఉన్న ఈ చారిత్రక నగరం ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది, భారతదేశంలోని అన్ని మూలల నుండి యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. ebs_amravati_0112 శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు శక్తిపీఠం (సతీదేవి యొక్క ఛేదింపబడిన శరీర భాగాలు పడిపోయిన పుణ్యక్షేత్రం) గా కూడా దైవకృప కలిగి ఉంది, దీనివల్ల ఇది చాలా ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. ebs_amravati_0113 మల్లిఖార్జున స్వామి ఆలయం మరియు భ్రమరంబా దేవి ఆలయం ఈ క్షేత్రంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు, ఇక్కడకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ebs_amravati_0114 అక్క మహాదేవి గుహలు, కదళీ వనం గుహలు, శ్రీశైలం ఆనకట్ట మరియు శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యానికి కూడా శ్రీశైలం ప్రసిద్ది చెందింది. ebs_amravati_0115 అద్భుతమైన అక్క మహాదేవి గుహలను చేరుకోవడానికి కృష్ణ నదిపై పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది, అయితే కదళీ వనం గుహలను చేరుకోడానికి మాత్రం 12 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. ebs_amravati_0116 శ్రీశైలం ఆనకట్ట దాని ఆశ్చర్యజనక అందాలను చూడడానికి ప్రకృతి ప్రేమికులు సందర్శిస్తూ ఉంటారు. ebs_amravati_0117 రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలువబడే శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ లలో ఒకటి, ఇందులో కృష్ణ జింకలు, సాంబారు జింకలు, ప్యాంథర్లు, చుక్కల దుప్పిలు మరియు స్లాత్ బేర్ వంటి విస్తృత జాతుల జంతువులు ఉన్నాయి. ebs_amravati_0119 శ్రీశైలం, అమరావతి నుండి 228 కి.మీ. దూరంలో మరియు హైదరాబాద్ నుండి 217 కి.మీ. దూరంలో ఉంది. ebs_amravati_0121 నాగార్జునకొండ (విహారయాత్ర) ebs_amravati_0122 నాగార్జున అనబడే ప్రఖ్యాత బౌద్ధ భిక్షువు పేరుపై వెలసిన ఈ ప్రదేశం, బౌద్ధమతం యొక్క ప్రధాన విద్యా కేంద్రంగా ఉన్న పురాతన నగరాలలో ఒకటి. ebs_amravati_0123 చరిత్ర మరియు పురావస్తు శాస్త్రం పట్ల మక్కువ ఉన్నవారికి స్వర్గధామం అయిన నాగార్జునకొండ, క్రీ.పూ. 1 మరియు 2 వ శతాబ్దాలలో ఒక ముఖ్యమైన విడిదిగా ఉండేది. ebs_amravati_0124 రాతి యుగం నాటి పనిముట్ల అవశేషాలు, బౌద్ధ స్తూపాలు, ప్రాచీన మఠాలు, గుహలు మరియు ఎత్తైన జలపాతాలతో పాటు సమృద్ధ వృక్షజంతుజాలం గల ఈ ప్రదేశాన్ని అందరికీ ఒక అద్భుతమైన ప్రయాణ గమ్యస్థానంగా చేస్తాయి. ebs_amravati_0125 నాగార్జునకొండ మ్యూజియంకి వెళ్లి పురావస్తు ప్రదేశం యొక్క చరిత్రను లోతుగా పరిశోధించండి. ebs_amravati_0126 ఈ మ్యూజియంలో పురావస్తు తవ్వకాల్లో కనుగొనబడిన బౌద్ధ, పాతరాతియుగం మరియు కొత్తరాతియుగం యొక్క కళాఖండాలు మరియు శిథిలాలను ప్రదర్శిస్తుంది. ebs_amravati_0127 ప్రదర్శించబడిన కొన్ని రాతి-యుగం నాటి పనిముట్లు బుద్ధు భగవానుడు స్వయంగా సేకరించినట్లుగా చెబుతారు. ebs_amravati_0128 ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఉన్న ఎత్తిపోతల జలపాతాలను ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాలి. ebs_amravati_0130 అమరావతి నుండి మూడున్నర గంటల ప్రయాణం చేసి నాగార్జునకొండను సులభంగా చేరుకోవచ్చు. ebs_amravati_0136 సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ విమానాశ్రయం, సమీప విమానాశ్రయం, అలాగే ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. ebs_amravati_0139 ఈ నగరం హైదరాబాద్-గుంటూరు మరియు హైదరాబాద్-విజయవాడ రైలు మార్గాలలో ఉంది. ebs_amravati_0141 ఈ నగరానికి సమీప రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్, ఇది 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_amravati_0145 మోటర్ వాహనాలు నడిపేందుకు వీలైన మంచి రోడ్డు మార్గాలు, ఈ నగరాన్ని దేశం మరియు రాష్ట్రంలోని ఇతర పట్టణాలు మరియు నగరాలతో అనుసంధానిస్తాయి.