ID SENT ebs_anantnag_0002 అనంతనాగ్ ebs_anantnag_0004 ట్యాగ్ లైన్: అమర్‌నాథ్ ఆలయ ప్రవేశ ద్వారం ebs_anantnag_0006 సందర్శించడానికి అనుకూలమైన సమయం: మే నుండి అక్టోబర్ వరకు ebs_anantnag_0010 'ఆ ప్రదేశం యొక్క అద్భుతమైన సౌందర్యం, ఇక్కడి అద్వితీయమైన దృశ్యాలు మరియు కాలినడక మార్గాలు మొదలైనవి, అనంతనాగ్‌ ప్రయాణికులను ఆనందపరుస్తాయి.' ebs_anantnag_0014 కాశ్మీర్ లోయలోని పచ్చని లిద్దర్ లోయకి ఏటవాలుగా ఉన్న అనంత్‌నాగ్, అసాధారణ సౌందర్యం కలిగిన భూమి. ebs_anantnag_0015 వేసవి సెలవు దినాలలో సేదతీరటానికి, ఈ ప్రదేశం పర్యాటకులను ఆహ్వానిస్తుంది, వారు సొగసైన ప్రవాహాలు మరియు ఎత్తైన పచ్చని పర్వతాలతో కూడిన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి వస్తారు. ebs_anantnag_0016 అనంతనాగ్ ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ యాత్రికులకు ఆతిథ్యమిస్తుంది, వారు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ అమర్‌నాథ్ గుహ ఆలయానికి ప్రయాసతో కూడిన మరియు భక్తి విశ్వాసంతో ప్రయాణం చేస్తారు. ebs_anantnag_0017 అనంతనాగ్ యొక్క చలనచిత్ర దృశ్య నేపథ్యం చాలా మంది సినీ నిర్మాతలను ఆకర్షించింది, వారు ముఖ్యంగా మార్తాండ్ సూర్య దేవాలయం శిధిలాల పట్ల ఆకర్షితులయ్యారు. ebs_anantnag_0018 లోయ యొక్క దక్షిణ అంచున ఉన్న అనంతనాగ్ జిల్లా రాష్ట్రంలోని పురాతన జిల్లాలలో ఒకటి. ebs_anantnag_0019 ఇది పహల్గామ్, కోకర్‌నాగ్, అచబల్, వేరినాగ్ మరియు డక్సుమ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలకు ప్రవేశ ద్వారం. ebs_anantnag_0020 సాంద్రాన్, బ్రెంగి, అరాపాత్ మరియు లిద్దర్‌ వంటి చిన్న నదులు ఈ ప్రాంతం నుండి ప్రవహించడం వలన ఈ ప్రదేశం యొక్క సహాజ సౌందర్య పెరుగుతుంది. ebs_anantnag_0024 అమర్‌నాథ్ గుహ (ఆధ్యాత్మికం) ebs_anantnag_0026 శివుడికి అంకితం చేసిన అమర్‌నాథ్ గుహను భగవంతుని నివాసం అని నమ్ముతున్నందున హిందువులు దీనిని పవిత్ర స్థలంగా భావిస్తారు. ebs_anantnag_0027 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలో వివిధ దేవతా ప్రతిమలను పోలి ఉండే నాలుగు లేదా ఐదు మంచు నిర్మాణాలు ఉన్నాయి. ebs_anantnag_0028 సాంప్రదాయం ప్రకారం, అతి పెద్దదైన అమర్‌నాథ్ లేదా శివ భగవానుడిని, ఆయనకు ఎడమ వైపున గణేశుడు, మరియు కుడి వైపున పార్వతి దేవిగా పూజిస్తారు. ebs_anantnag_0029 అమర్‌నాథ్ గుహ లోపల ఎడమ వైపున మరో చిన్న గుహ ఉంది, ఇక్కడ విభూతి లేదా పవిత్ర బూడిదను భక్తులకు పంపిణీ చేస్తారు. ebs_anantnag_0030 ఈ పవిత్ర మందిరాన్ని సందర్శించటానికి జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ebs_anantnag_0031 ఈ ప్రయాణం అమర్‌నాథ్ యాత్రగా ప్రసిద్ది చెందింది, ఈ యాత్ర చందన్‌వాడి నుండి ప్రారంభమై పిస్సూ, శేష్‌నాగ్ మరియు పంజ్‌తార్ని గుండా వెళుతూ అమర్‌నాథ్ గుహ వద్ద ముగుస్తుంది. ebs_anantnag_0033 పురాణాల ప్రకారం, శివుడు ప్రపంచ సృష్టి యొక్క రహస్యాన్ని మరియు అమరత్వాన్ని పార్వతి దేవికి వెల్లడించాలని అనుకున్నాడు దీని కోసం అతను ఈ గుహను ఎంచుకున్నాడు. ebs_anantnag_0034 'అతను తన ఆభరణాలన్నింటినీ తీసివేసి గుహలోకి ప్రవేశించాడు, కాని ఒక పావురం గుడ్డు అతని తలపై పడింది.' ebs_anantnag_0035 అది అమరత్వం పొందిందని మరియు ఈ గుహలో ఒక జత పావురాలను ఇప్పటికీ చూడవచ్చని చెబుతారు. ebs_anantnag_0036 దక్షిణ ముఖంగా వున్న ఈ గుహ 45 మీటర్ల ఎత్తు, 27 మీటర్ల లోతులో ఉంది. ebs_anantnag_0038 మార్తాండ దేవాలయం (వారసత్వ సంపద) ebs_anantnag_0040 సూర్య భగవానుడు లేదా భాస్కరుని గౌరవార్థం నిర్మించిన, విశాలమైన మార్తాండ (సూర్య దేవునికి మరొక పేరు) ఆలయ సముదాయం సూర్యవంశ రాజు అయిన లలితాధిత్య రాజుచే కట్టించబడిన అత్యంత అందమైన నిర్మాణాలలో ఒకటి. ebs_anantnag_0041 క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దంలో నిర్మించిన మార్తాండ దేవాలయం, ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన, అతిసుందరమైన గ్రీకు వాస్తునిర్మాణ శైలులను కలిగి ఉంది. ebs_anantnag_0042 ఇక్కడి రాతిస్తంభాలు, స్తంభాల పంక్తి, త్త్రెపత్రము ఆకారంలో గల ద్వారాలు మొదలైన వాటిలో దీర్ఘచతురస్రాలు మరియు త్రిభుజాలను సమృద్ధిగా వాడి ముఖమండపాన్ని తయారుచేసినట్లు కనిపిస్తుంది. అలాగే రెండోది సాధారణ బారోక్ నిర్మాణశైలిని ఉపయోగించారు. ebs_anantnag_0043 ఈ ఆలయ ప్రాంగణం స్తంభాలు మరియు ఆర్చీలతో, చుట్టూ ఆవరించిన మార్గాన్ని కలిగి వుంది. ebs_anantnag_0044 ఇవన్నీ కాశ్మీరీ హిందూ శైలి నిర్మాణంతో కలిసి అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించాయి. ebs_anantnag_0045 ఈ ఆలయం స్వర్ణ కాలం నాటి నుంచి, ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షింస్తుందని స్థానికుల నమ్మకం. ebs_anantnag_0047 డక్సుమ్ (ప్రకృతి) ebs_anantnag_0049 దట్టమైన అడవులు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలతో నిండిన డక్సుమ్, చెట్లతో కప్పబడిన పర్వతాలు మరియు పచ్చికభూములతో కప్పబడిన అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంది. ebs_anantnag_0050 సుమారు 2,438 మీటర్ల ఎత్తులో ఉన్న డక్సుమ్, అందమైన కోకర్‌నాగ్ జలాశయాల మధ్య ఉంది, ఇది అంతులేని ప్రశాంతతను అందిస్తుంది. ebs_anantnag_0051 బ్రెంగి నది యొక్క శ్రావ్యమైన ప్రవాహం ప్రశాంతమైన పరిసరాలతో సజావుగా విలీనం అవుతుంది అలాగే ఈ ప్రకృతిని వీక్షించటానికి నడక ఉత్తమ మార్గం. ebs_anantnag_0052 డక్సుమ్ పాదచారులకు మరల వెళ్ళి చూడాలనిపించే ప్రదేశం, ఎందుకంటే ఇక్కడ నుండి అనేక బాటలు ప్రారంభమవుతాయి. ebs_anantnag_0053 సింథన్ టాప్(పర్వతం*) మరియు సింథన్ పాస్‌లకు(మార్గాలకు*) వెళ్ళే కాలిబాట ముఖ్యంగా అందంగా ఉంటుంది. ebs_anantnag_0054 యాత్రికులు పచ్చని మరియు సుందరమైన ప్రదేశాలలో శిబిరాలను ఏర్పాటు చేసుకోవచ్చు మరియు నక్షత్రాల దుప్పటి క్రింద ఆహ్లాదకరమైన సమయం గడపవచ్చు. ebs_anantnag_0055 డక్సుమ్ యొక్క మరొక ఆకర్షణ బ్రెంగి నదిలో చేపలు పట్టడం, ఇది జల్లచేపలతో నిండి ఉంటుంది. ebs_anantnag_0056 అయితే, చేపలు పట్టడానికి ముందుగా అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. ebs_anantnag_0057 డక్సుమ్ అనంతనాగ్ నుండి 40 కిలోమీటర్లు మరియు శ్రీనగర్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_anantnag_0059 అచబల్ (ప్రకృతి) ebs_anantnag_0061 ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్ఞి నూర్ జహాన్‌కు వినోద ప్రదేశం అయిన సన్‌సాన్వర్ పర్వతం నుండి ప్రవహించే, అచబల్ వద్దనున్న జలాశయాలు, కళ్ళకు కనిపించే వాస్తవిక ఆహ్లాదాలు. ebs_anantnag_0062 ఈ పురాతన జలాశయాల చుట్టూ ప్రత్యేకమైన పెర్షియన్ శైలిలో నిర్మించిన మొఘల్ ఉద్యానవనాలు ఉన్నాయి. ebs_anantnag_0063 శ్రీనగర్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో కొండ దిగువన ఉన్న ఈ ఉద్యానవనంలో అందమైన చినార్ చెట్లు ఉన్నాయి. ebs_anantnag_0064 ' ఈ ఉద్యానవనంలో మూడు కాలువలు మరియు అనేక పౌంటైన్ల ద్వారా ప్రవహించే జలాశయాలు ఇక్కడ ఆకర్షణను మరింత పెంచుతాయి.' ebs_anantnag_0066 సమీపంలోని ఒక చిన్న గ్రామమైన దేవాల్గాం వద్ద సున్నపురాయి యొక్క పగుళ్లలో అదృశ్యమయ్యే బ్రెంగి నల్లా ఈ జలాశాయాల మూలం అని నమ్ముతారు. ebs_anantnag_0067 అచబల్ యొక్క ఇతర ఆకర్షణలు దాని మిద్దెఇల్లులు, సాంప్రదాయ చక్కదనం మరియు అలంకరించిన పొదలు. ebs_anantnag_0071 వాయు మార్గం: శ్రీనగర్ విమానాశ్రయం 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ebs_anantnag_0073 రైలు మార్గం: సమీప రైల్వేస్టేషన్ బనిహల్, 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_anantnag_0075 రోడ్డు మార్గం: అనంతనాగ్ అన్ని ప్రధాన నగరాలకు మోటర్ వాహనాలు నడిపేందుకు వీలైన రోడ్లు ద్వారా అనుసంధానించబడి ఉంది అలాగే ఎప్పుడూ బస్సులు సౌకర్యం ఉంటుంది.