ID SENT ebs_ayodhya_0002 గమ్యం పేరు ebs_ayodhya_0004 అయోధ్య ebs_ayodhya_0008 పురాణములకు జీవం పోసిన చోటు ebs_ayodhya_0012 అక్టోబర్ నుండి మార్చి మధ్య వరకు ebs_ayodhya_0016 శ్రీరామచంద్రుని జన్మస్థలంగా పూజింపబడుతున్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, హిందువులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ebs_ayodhya_0020 ఉత్తరప్రదేశ్‌లో పవిత్ర సరయూ నది ఒడ్డున విస్తరించి ఉన్న అయోధ్య, హిందూ ధర్మం యొక్క అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఒకటి, ఈ నగరానికి సంవత్సరం పొడవునా వేలాది మంది యాత్రికులు వస్తూనే ఉంటారు. ebs_ayodhya_0021 హిందూ మహాకావ్యమైన రామాయణంలో పేర్కొన్న విధంగా, ఈ నగరం రాముడి జన్మస్థలంగా పూజ్యనీయమైనది, ఈ నగరం ఆలయాలతో నిండి ఉంది, వీటిలో కొన్ని సరయు యొక్క ఘాట్లతో (మెట్లు ఉన్న నదీ తీరము) అనుసంధానించబడి ఉన్నాయి. ebs_ayodhya_0022 ప్రత్యేకంగా దీపావళి రోజున జరుపుకునే దీపోత్సవం సందర్భంగా ఇక్కడ లక్షలాది మట్టి దీపాలు వెలిగిస్తారు, ఆ దీపాల వెలుగుల్లో అయోధ్య నగరం చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. ebs_ayodhya_0023 ఆ దీపాలు సరయు నది మీద తేలియాడుతున్న దృశ్యం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ebs_ayodhya_0024 దీపావళి వేడుకల సమయంలో ఈ నగరాన్ని సందర్శించడం అత్యుత్తమ సమయం అని చెప్పవచ్చు, ఈ వేడుకల సందర్భంగా దేవాలయాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి, ఇక వీధులు పూర్తిగా పండుగ వాతావరణంతో సందడిగా ఉంటాయి. ebs_ayodhya_0026 అయోధ్య నలుగురు జైన తీర్థంకరుల (సాధువుల) జన్మస్థలంగా కూడా చెప్పబడుతుంది, ఇక ఈ నగరం ఇంకా దాని పరిసర ప్రాంతాలలో వ్యాపించి ఉన్న ఆలయాలు వారికి నివాళులు అర్పిస్తాయి. ebs_ayodhya_0028 లక్నో నగరానికి 135 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయోధ్య, సూర్యవంశ సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని, ఇది ప్రాచీన కాలంలో కౌశల దేశంగా పిలువబడేది. ebs_ayodhya_0029 దీని జంట నగరమైన ఫైజాబాద్ ను, అవధ్ నవాబు అయిన సాదత్ ఖాన్ స్థాపింపజేసాడు, ఇది తప్పక చూడవలసిన ప్రదేశం. ebs_ayodhya_0030 అందమైన కోటలు, సమాధులు ఇంకా మసీదులకు నిలయంగా ఉన్న ఈ నగరం చరిత్ర యొక్క సంగ్రహావలోకనం కల్పిస్తుంది. ebs_ayodhya_0034 కనక్ భవన్-ఆధ్యాత్మికం ebs_ayodhya_0036 టీకమ్‌గఢ్ యొక్క (ఇప్పుడు మధ్యప్రదేశ్) మహారాణి, వృష్భాను కుమారిచే నిర్మించబడిన, కనక్ భవన్ యొక్క అందమైన ఆలయం శ్రీరామచంద్రుడు ఇంకా అతని భార్య సీతాదేవికి అంకితం చేయబడింది. ebs_ayodhya_0037 రాజస్థాన్ మరియు బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సంపన్నమైన భవనములతో పోలి ఉన్న ఈ ఆలయాన్ని కొన్నిసార్లు సోన్-కే-ఘర్ మందిర్ అని పిలుస్తారు. ebs_ayodhya_0039 'శ్రీరాముడిని వివాహం చేసుకుని అయోధ్యకు వచ్చిన సీతాదేవికి, శ్రీరాముడి సవతి తల్లి అయిన రాణి కైకేయి, ఈ ఆలయాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పురాణ గాథ చెబుతుంది.' ebs_ayodhya_0040 'ఆలయం యొక్క కేంద్ర చావడి మూడు వైపులా తోరణాలు గల ద్వారాలు ఉన్నాయి, ఇక గర్భగుడిలో బంగారు కిరీటాలతో అలంకరించబడిన శ్రీరాముడు సీతాదేవిల విగ్రహాలు ఉన్నాయి.' ebs_ayodhya_0041 విగ్రహాలు భారీ బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించబడి ఉంటాయి, అందుకే ఈ ఆలయాన్ని కనక భవన్ అని పిలుస్తారు, ‘కనక్’ అంటే బంగారం అని అర్థం. ebs_ayodhya_0042 ఈ ఆలయాన్ని వారంలోని అన్ని రోజులలో ఉదయం 8 గంటల నుండి 11.30 వరకు మరియు సాయంత్రం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. ebs_ayodhya_0044 నాగేశ్వరనాథ్ ఆలయం (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0046 రామ్-కి-పైదిలో ఉన్న నాగేశ్వరనాథ్ ఆలయం అయోధ్య నగారానికి ప్రధాన ఆకర్షణ. ebs_ayodhya_0047 ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది అలాగే ఈ గర్భగుడిలో భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన (మహాశివుడి యొక్క భక్తిమయ రూపం) జ్యోతిర్లింగం ఉంది. ebs_ayodhya_0048 'ఈ ఆలయాన్ని శ్రీరామచంద్రుడి చిన్న కుమారుడైన కుశుడు నిర్మించాడని విశ్వసిస్తారు." ebs_ayodhya_0049 పురాణగాథ ప్రకారం, కుశుడు సరయు నదిలో స్నానం చేస్తుండగా, తన దండకడియం నీళ్ళలో పడిపోయిందట, అది ఒక నాగకన్యకు దొరికిందట, ఆమెనే ఆ తరువాత అతనితో ప్రేమలో పడిందట. ebs_ayodhya_0050 శివుని భక్తురాలైన ఆ నాగ-కన్య కోసం, కుశుడు ఈ శివాలయాన్ని నిర్మించాడట. ebs_ayodhya_0051 1750 లో నవాబ్ సఫ్దార్ జంగ్‌కు మంత్రిగా ఉన్న నావల్ రాయ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ebs_ayodhya_0052 శివరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించడం అత్యుత్తమ సమయం అని చెప్పవచ్చు, ఈ పండుగను ఇక్కడ గొప్ప ధార్మిక ఉత్సాహంతో జరుపుకుంటారు, అలాగే శివుడి బరాత్ (వివాహ ఊరేగింపు) కూడా వీధులలో నిర్వహిస్తారు. ebs_ayodhya_0054 హనుమాన్ గార్హి (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0056 హనుమాన్ గార్హి ఆలయం అయోధ్య యొక్క అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి, ఈ ఆలయంలో తన తల్లి అంజని ఒడిలో కూర్చున్న హనుమంతుడి అందమైన విగ్రహం ఉంది. ebs_ayodhya_0057 ఎంతగానో ఆదరణ పొందిన ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఏడాది పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ebs_ayodhya_0058 10వ శతాబ్దం నాటి ఈ ఆలయానికి చేరుకోవడానికి సందర్శకులు 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ebs_ayodhya_0059 పురాణ గాథ ప్రకారం, హనుమంతుడు ఇక్కడ ఒక గుహలో ఉండి రాముడి జన్మస్థలం అని నమ్ముతున్న రామకోటను రక్షించాడట. ebs_ayodhya_0060 ఈ అద్భుతమైన ఆలయ సముదాయాన్ని చదరపు ఆకారంలో ఉన్న కోటలా నిర్మించబడింది, ఇక ఈ కోట ప్రతి మూల వృత్తాకార బురుజులతో అలంకరించబడి ఉంది. ebs_ayodhya_0061 అయోధ్యలోని రాముని మందిరాన్ని దర్శించే భక్తులు ముందుగా హనుమాన్ గార్హిని దర్శించుకుని, ఆ తరువాత మాత్రమే శ్రీరాముని ఆశీర్వాదం పొందాలి అనేది ఎక్కువగా ఆచరణలో ఉన్న ఆచారం. ebs_ayodhya_0063 గులాబ్ బాడీ (చేయవలసిన పనులు) ebs_ayodhya_0065 ఫైజాబాద్ యొక్క అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటైన గులాబ్ బాడీ, ఒక ఆకర్షణీయమైన పచ్చని ఉద్యానవనం, ఇక్కడ, 1753 నుండి 1775 వరకు పరిపాలించిన అవధ్ మూడవ నవాబు అయిన షుజా ఉద్-దౌలా యొక్క భవ్యమైన సమాధి ఉంది. ebs_ayodhya_0066 పర్యాటక మజిలీలో ఈ ప్రదేశం వివిధ రకాల గులాబీలకు ప్రసిద్ది చెందింది, ఇది దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులు, వృక్షశాస్త్రజ్ఞులను ఆకర్షిస్తుంది. ebs_ayodhya_0067 'గులాబ్ బాడీ నవాబు పాలనలో ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగించబడేది.' ebs_ayodhya_0068 వాస్తుకళ యొక్క ఇస్లామిక్ శైలిలో నిర్మించిన, ఆశ్చర్యాన్ని కలగజేసే ఈ సమాధి ఉత్తరప్రదేశ్‌లో అత్యుత్తమంగా రూపొందించిన స్మారకాలలో ఒకటి. ebs_ayodhya_0069 'మీరు ఉద్యానవనంలోకి ప్రవేశించగానే, భారతదేశ జాతీయ చిహ్నంతో కూడిన పెద్ద స్తంభం మీకు స్వాగతం పలుకుతుంది.' ebs_ayodhya_0070 ఇరువైపులా కదలాడుతున్న కొబ్బరి చెట్లతో చక్కగా ఉన్న నడక మార్గం మిమ్మల్ని ఒక పురాతన తోరణం గల ప్రవేశద్వారం దిశగా తీసుకువెళ్తుంది. ebs_ayodhya_0071 ఉద్యానవనంలోకి ప్రవేశించడానికి, మీరు ఈ అద్భుతమైన ప్రవేశద్వారం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ebs_ayodhya_0072 ఈ ఉద్యానవనంలో ఒక అందమైన మసీదు, ఇక దాని పక్కనే ఒక చిన్న కావలికోట కూడా ఉన్నాయి. ebs_ayodhya_0073 సమాధి యొక్క కమాను మార్గాల గుండా నడవడం ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. ebs_ayodhya_0075 త్రేతా-కే-ఠాకుర్ (ఆధ్యాత్మికం, వారసత్వ సంపద) ebs_ayodhya_0077 అయోధ్యలో ఒక ప్రధాన ఆకర్షణ అయిన, త్రేతా-కే-ఠాకూర్ ఆలయం, త్రేతా యుగపు (హిందూ ధర్మం ప్రకారం మానవాళి యొక్క నాలుగు యుగాలలో రెండవది) దైవంగా విశ్వసించబడే శ్రీరాముడికి అంకితం చేయబడింది. ebs_ayodhya_0078 'అయోధ్యలోని నయా ఘాట్ వద్ద ఉన్న ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం కుల్లూ రాజు నిర్మించారు, ఈ ఆలయం అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది.' ebs_ayodhya_0079 ఈ ఆలయానికి అపారమైన ధార్మిక ప్రాముఖ్యత ఉంది. 'రావణుడిపై సాధించిన విజయాన్ని వేడుక జరుపుకునేందుకు శ్రీరాముడు ఇక్కడ "అశ్వమేధ యాగాన్ని" నిర్వహించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.' ebs_ayodhya_0081 ఈ ఆలయంలో శ్రీరామచంద్రడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు అలాగే రామాయణ మహాకావ్యంలోని ఇతర ముఖ్యమైన పౌరాణిక దేవతల విగ్రహాలు ఉన్నాయి. ebs_ayodhya_0082 ఈ విగ్రహాలన్నింటినీ ఒకే ఒక నల్ల రాతితో చెక్కారు. ebs_ayodhya_0083 హిందూ పంచాంగం ప్రకారం కార్తీకమాసంలో (అక్టోబర్-నవంబర్) పదకొండవ రోజు అయిన ఏకాదశి నాడు ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది, ఈ ఆలయాన్ని సందర్శించడానికి అదే అనుకూలమైన సమయం. ebs_ayodhya_0085 తులసి స్మారక్ భవన్ (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0087 అవధి భాషలో రామచరితమానాస్‌ను, హనుమాన్ చాలిసాను రచించిన గోస్వామి తులసీదాస్ జ్ఞాపకార్థం నిర్మించిన తులసీ స్మారక్ భవన్‌లో అయోధ్య శోధ్ సంస్థాన్ (అయోధ్య పరిశోధనా కేంద్రం) ఉంది. ebs_ayodhya_0088 ఇది అయోధ్య నగరం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సాహిత్య సంప్రదాయాలను అధ్యయనం చేసి, వివరించే సంస్థ. ebs_ayodhya_0089 ఈ భవన్‌లో రామాయణానికి సంబంధించిన కళలు మరియు హస్తకళల ఆధారంగా సంవత్సరం పొడుగునా ప్రదర్శన నిర్వహించబడుతుంది, అలాగే ఇక్కడ ఒక గ్రంథాలయం కూడా ఉంది. ebs_ayodhya_0090 ప్రతిరోజూ రామలీలాను ప్రదర్శిస్తారు, రామకథా పారాయణం కూడా జరుగుతుంది. ebs_ayodhya_0091 తులసి స్మారక్ భవన్ వివిధ ధార్మిక కార్యక్రమాలు, ప్రార్థన సమావేశాలతో పాటు అనుభవజ్ఞులైన కళాకారులు ప్రదర్శించే నాటకాలను నిర్వహిస్తుంది. ebs_ayodhya_0092 1988 లో, ఈ సంస్థ లోపల, రామ్ కాథ మ్యూజియం స్థాపించబడింది, ఇది శ్రీ రామచంద్రుని యొక్క పురాతన వస్తు సేకరణ ద్వారా నగరం యొక్క చారిత్రక కోణాన్ని వెలుగులోకి తెస్తుంది. ebs_ayodhya_0094 ఫైజాబాద్ (పూర్వ సంస్కృతి) ebs_ayodhya_0096 ఘాఘరా నది ఒడ్డున ఉన్న ఫైజాబాద్ అవధ్ నవాబుల చారిత్రక గతంతో ముడిపడి ఉంది, ఇది అయోధ్య నగరం సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ebs_ayodhya_0097 అవధ్ యొక్క రెండవ నవాబు అయిన సదాత్ ఖాన్ (1722 నుండి 1739) చేత స్థాపించబడిన ఫైజాబాద్ అందమైన కోటలు, సమాధులు మరియు మసీదులకు నిలయం. ebs_ayodhya_0098 చోటా కలకత్తాగా ప్రసిద్ది చెందిన ఫోర్ట్ కలకత్తా సందర్శనతో మీ యాత్రను ప్రారంభించండి. ebs_ayodhya_0099 ఈ నిర్మాణాన్ని 1764 లో అవధ్ నవాబు అయిన షుజా ఉద్-దౌలా (1754-1775) నిర్మించారు, బక్సర్ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయినప్పటికీ, నవాబ్ ఈ ప్రాంతంపై నియంత్రణ కోల్పోలేదని ఈ కోట నిర్మాణం సూచిస్తుంది. ebs_ayodhya_0100 నవాబ్ మరియు అతని బేగం మరణించేవరకు ఈ కోటలోనే నివసించారు. ebs_ayodhya_0101 వాస్తుకళ యొక్క మొఘల్ నిర్మాణశైలిలో నిర్మించిన ఈ కోట గోడలు స్థానిక మట్టితో తయారు చేయబడ్డాయి. ebs_ayodhya_0102 అయితే, కోటలో చాలా భాగం నేడు శిథిలావస్థలో ఉంది. ebs_ayodhya_0103 నవాబ్ షుజా ఉద్-దౌలా యొక్క భవ్యమైన సమాధిని కలిగి ఉన్న గులాబీల తోట అయిన గులాబ్ బాడీని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. ebs_ayodhya_0104 ఇది అనేక రకాల గులాబీలకు ప్రసిద్ధి చెందింది, ఇది దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులను, వృక్షశాస్త్రజ్ఞులను ఆకర్షిస్తుంది. ebs_ayodhya_0105 'నవాబు పాలనలో ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి గులాబ్ బాడీ ఉపయోగించబడేది.' ebs_ayodhya_0107 వాస్తుకళ యొక్క ఇస్లామిక్ శైలిలో నిర్మించిన ఈ సమాధి ఉత్తరప్రదేశ్‌లో అత్యుత్తమంగా రూపొందించిన స్మారకాలలో ఒకటి. ebs_ayodhya_0108 'మీరు ఉద్యానవనంలోకి ప్రవేశించగానే, భారతదేశ జాతీయ చిహ్నంతో కూడిన పెద్ద స్తంభం మీకు స్వాగతం పలుకుతుంది.' ebs_ayodhya_0109 ఇరువైపులా కదలాడుతున్న కొబ్బరి చెట్లతో చక్కగా ఉన్న నడక మార్గం మిమ్మల్ని ఒక పురాతన తోరణం గల ప్రవేశద్వారం దిశగా తీసుకువెళ్తుంది. ebs_ayodhya_0111 ఈ ఉద్యానవనంలో ఒక అందమైన మసీదు, ఇక దాని పక్కనే ఒక చిన్న కావలికోట కూడా ఉన్నాయి. ebs_ayodhya_0112 సమాధి యొక్క కమాను మార్గాల గుండా నడవడం ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. ebs_ayodhya_0114 'షుజా-ఉద్-దౌలా భార్య బహూ బేగం నివాసంగా ఉన్న సంపన్నమైన మోతీ మహల్ కూడా సందర్శించదగినది.' ebs_ayodhya_0115 చుట్టూ చక్కగా పరిశుభ్రంగా ఉంచిన ఉద్యానవనం, ఈ రాజభవనం మొఘల్ వాస్తుశిల్పానికి చక్కటి నమూనాగా నిలుస్తుంది, ఇక ఫైజాబాద్ యొక్క ఘనమైన గతం గురించి పూర్తిగా వివరిస్తుంది. ebs_ayodhya_0116 ఆమె సమాధి జవహర్‌బాగ్‌లో ఉంది, ఇక అవధ్‌లోని ఉత్తమ భవనాల్లో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. ebs_ayodhya_0117 ఆ సమయంలో దీని నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది. ebs_ayodhya_0119 'పర్యాటకులు, శ్రీరాముడి పాదముద్రను కలిగి ఉండడం చేత ప్రసిద్ధి చెందిన చక్రహర్‌జీ విష్ణు ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు, అంతేకాకుండా ఫైజాబాద్‌లోని మరో ప్రసిద్ధ ఆలయం అయిన 'రాజమందిరమును' కూడా సందర్శించవచ్చు. ebs_ayodhya_0121 గోరఖ్పూర్ (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0123 ఆధ్యాత్మికత, చరిత్రతో నిండిన గోరఖ్‌పూర్ ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగి ఉంది. ebs_ayodhya_0124 అయోధ్యకు 13 గంటల దూరంలో ఉన్న ఈ నగరం, ఇక్కడ ధ్యానాన్ని ఆచారించిన యోగి గోరక్నాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది, ఆయనను ప్రేరణగా భావించి, ఈ నగరానికి ఆయన పేరు పెట్టారు. ebs_ayodhya_0125 ఈ యోగి పేరుతో ఈ నగరం చుట్టూ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పురావస్తు, ఇంకా సహజ ప్రదేశాలు ఉన్నాయి. ebs_ayodhya_0126 ఈ నగరం అనేక దేవాలయాలతో నిండి ఉంది, వీటిలో అత్యంత ముఖ్యమైనది ఆరోగ్య మందిరం, ఇది ప్రాకృతిక చికిత్సలను అందజేస్తుంది. ebs_ayodhya_0127 పర్యాటకులు గోరఖ్‌పూర్ ఆలయం, ఇంకా 700 హెక్టార్లలో విస్తరించి ఉన్న రాంగఢ్ తాల్‌ అనబడే ఒక నిర్మలమైన సరస్సును కూడా చూడవచ్చు. ebs_ayodhya_0128 సాల్, సీక్వోయా చెట్ల దట్టమైన విరివి అయిన కుష్మి అడవిని చూడడానికి కూడా సందర్శకులు వెళ్ళవచ్చు. ebs_ayodhya_0129 మరో ముఖ్యమైన సందర్శించవలసిన ప్రదేశం వీర్ బహదూర్ సింగ్ ప్లానిటోరియం. ebs_ayodhya_0130 ఈ నగరం భగవద్గీతను ప్రచురించే గోరఖ్‌పూర్ ప్రెస్‌కు ప్రసిద్ధి చెందింది. ebs_ayodhya_0132 లక్నో నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరఖ్పూర్ తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ఒక ముఖ్యమైన నగరం. ebs_ayodhya_0133 ఇది ఒకప్పుడు మౌర్య, కుషాన్, శుంగ మరియు గుప్తుల సామ్రాజ్యాలలో ఒక భాగంగా ఉండేది. ebs_ayodhya_0135 రామ్‌కోట్ (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0137 ఒక కొండ పైన ఉన్న రామకోట ఆలయం అయోధ్యలో ప్రముఖ ఆరాధనా స్థలం. ebs_ayodhya_0138 ప్రముఖ విశ్వాసాల ప్రకారం, ఒక ఎత్తైన మిట్టపై నెలకొని ఉన్న ఈ పురాతన కోట, శ్రీరామచంద్రుని కోట ప్రదేశాన్ని సూచిస్తుంది. ebs_ayodhya_0139 ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూనే ఉంటారు, అయితే, హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం (మార్చి-ఏప్రిల్) లో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే శ్రీరాముని జయంతి అయిన శ్రీరామనవమి రోజు, ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అని చెప్పవచ్చు. ebs_ayodhya_0140 శ్రీరాముడి పట్ల తమ పూజ్యభావం చూపిస్తూ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇది ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ebs_ayodhya_0141 ఈ ఆలయం సంపూర్ణ నగర వ్యాపక సర్వదిగ్దర్శక దృశ్యాలను అందజేస్తుంది, అలాగే అద్భుతమైన దేవాలయాలు, ఇంకా సుందరమైన ఘాట్ల విహంగ వీక్షణాన్ని కూడా అందజేస్తుంది. ebs_ayodhya_0142 ఈ కోటను మహాబలి హనుమంతుడు ఒక రహస్య గుహ నుండి రక్షించాడని పురాణ గాథ. ebs_ayodhya_0143 ఈ ఆలయం వారంలోని అన్ని రోజులు తెరిచి ఉంటుంది. ebs_ayodhya_0144 ఉదయం 7 నుండి 11 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి 6 వరకు ఈ ఆలయాన్ని సందర్శించే వేళలు. ebs_ayodhya_0146 గుప్తార్ ఘాట్ (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0148 సరయూ నదీ తీరాన ఉన్న, గుప్తార్ ఘాట్ అపారమైన ధార్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ebs_ayodhya_0149 'పురాణగాథల ప్రకారం, శ్రీరాముడు భూమిని విడిచిపెట్టి, తన అసలు నివాసమైన ''వైకుంఠానికి'' తిరిగి వెళ్ళడానికి తను చివరిగా మునిగిన (జలసమాధి) నదీ ప్రదేశం ఇదే.' ebs_ayodhya_0150 సరయూ నదీ తీరాన ఈ ఘాట్‌లో మునిగితే వారి పాప ప్రక్షాళన జరిగి ప్రాపంచిక చింతల నుండి విముక్తి పొందుతారనేది భక్తులలో ఒక ప్రబలమైన నమ్మకం. ebs_ayodhya_0151 భక్తులు, పూజారులు శ్రీరామచంద్రుని ప్రశంసిస్తూ పాడే కీర్తనల వల్ల ఈ ఘాట్‌ శ్రీరామచంద్రుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ebs_ayodhya_0152 గుప్తార్ ఘాట్ సమీపంలో ఉన్న రాజా మందిర్, ఇంకా చక్రహర్‌జీ విష్ణు ఆలయాన్ని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు, ఇక్కడ జానకిరాముడు, చరణ్ పాదుకా, నరసింహ ఇంకా హనుమంతుని దేవాలయాలు వరుసగా ఉన్నాయి. ebs_ayodhya_0153 పరిశుభ్రంగా కాపాడబడుతున్న ఈ ఘాట్లు 19వ శతాబ్దం మొదటి భాగంలో రాజా దర్శన్‌సింగ్‌చే నిర్మించబడ్డాయి. ebs_ayodhya_0155 పాటన్ దేవి (ఆధ్యాత్మికం) ebs_ayodhya_0157 అయోధ్య శివార్లలో ఉన్న పాటన్ దేవి యొక్క సిద్ధపీఠం భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో (సతీదేవి యొక్క ఛేదింపబడిన శరీర భాగాలు పడిపోయిన పుణ్యక్షేత్రాలలో) ఒకటి, ఈ ప్రదేశం అపారమైన ధార్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ebs_ayodhya_0158 పురాణగాథల ప్రకారం, ఇది సతీదేవి యొక్క కుడి భుజం పడిపోయిన ప్రదేశం. ebs_ayodhya_0159 ఈ ఆలయం మహాభారతం మహాకావ్యంలోని మహాయోధుడైన కర్ణుడితో ముడిపడి ఉంది, అతను ఈ పుణ్యక్షేత్రం పక్కనే ఉన్న సూర్యకుండ్‌ను నిర్మించినట్లు నమ్ముతారు. ebs_ayodhya_0160 ఈ ఆలయాన్ని విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించారు, ఆ తరువాత 11వ శతాబ్దంలో శ్రావస్తి మహారాజు సుహెల్‌దేవ్ పునరుద్ధరించారు. ebs_ayodhya_0161 ప్రధాన దేవత యొక్క అద్భుత విగ్రహంతో పాటు ఈ ఆలయంలో కాళీదేవి, కాల భైరవుడు ఇంకా ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి. ebs_ayodhya_0162 ఈ ఆలయం తులసీపూర్ నుండి చౌధరీడీహ్ కు వెళ్లే మార్గంలో ఉంది. ebs_ayodhya_0164 ప్రభోసా (ఆధ్యాత్మికం, వారసత్వ సంపద) ebs_ayodhya_0166 కౌశాంబిలో ఉన్న ప్రభోసా కొండ, భారతదేశంలోని బౌద్ధులకు ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి. ebs_ayodhya_0167 బౌద్ధ సన్యాసులు మూడు నెలలపాటు ఎక్కడికీ ప్రయాణించకుండా ఒక్కచోటే ఉండి మౌనాన్ని పాటించే వస్సా (వర్షాకాలపు) ఏకాంతవాస మతాచారాలలో భాగంగా, బుద్ధ భగవానుడు తన ఆరవ వస్సా ఏకాంతవాసాన్ని గడిపిన ప్రదేశం ఇది అని నమ్ముతారు. ebs_ayodhya_0168 ఈ కొండను ప్రాచీన కాలంలో మంకులా అని కూడా పిలిచేవారట, ఇక 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ అశోక చక్రవర్తి నిర్మించిన స్తూపాన్ని కనుగొన్న చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన వృత్తాంతంలో ఈ ప్రదేశం పేరును ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. ebs_ayodhya_0169 'కొండ యొక్క రాతి మైదానం, గుహలతో నిండి ఉంది, వాటిలో అతిపెద్దది సీత కిటికీ(సీతాస్ విండో).' ebs_ayodhya_0170 బుద్ధు భగవానుడు ప్రభోసా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బస చేసిన ప్రదేశం ఇదే అయి ఉండవచ్చునని చరిత్రకారులు సూచిస్తున్నారు. ebs_ayodhya_0171 కొండపైకి ఎక్కినప్పుడు, పర్యాటకులు యమునా నది ఇంకా ప్రభోసా యొక్క విచిత్రంగా కనిపించే ఆలయం పట్టణ భవ్య దృశ్యాలను చూడవచ్చు. ebs_ayodhya_0173 వైశాలి (వారసత్వ సంపద) ebs_ayodhya_0175 ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన గణతంత్ర రాజ్యంగా పేరుగాంచిన వైశాలి, క్రీస్తుపూర్వం 500 నుండి మొదలుకొని నాలుగు కాలాలకుపైగా వెయ్యి సంవత్సరాల కాలపరిమితిలో ఉన్న ఒక పురావస్తు ప్రదేశం, ఇది టెర్రాకోట వస్తువులు, నాణేలు, ముద్రలు, ఆలయాలు అలాగే స్తూపాల విస్తృత సేకరణ నుండి కనుగొనబడింది. ebs_ayodhya_0176 వైశాలిలో అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కొల్హువా, ఇక్కడ మీరు ఒక భారీ ఇనుప స్తంభాన్ని చూడవచ్చు, దీనిని మౌర్య రాజవంశీయుడైన అశోక చక్రవర్తి నిర్మించినట్లు భావిస్తున్నారు. ebs_ayodhya_0177 'ఒక ఇటుక స్తూపం పక్కనే ఉన్న ఈ స్తంభాన్ని, బుద్ధ భగవానుడి చివరి ధర్మోపదేశానికి స్మృత్యంజలి ఘటిస్తూ, నిలబెట్టబడింది.' ebs_ayodhya_0178 బుద్ధ భగవానుడు నివసించేవారని చెప్పబడే, ఈ మఠం యొక్క శిథిలాలను అన్వేషించండి. ebs_ayodhya_0179 పురావస్తుశాస్త్రంపై ఆసక్తి ఉన్న వారిని ఉత్సాహపరిచే వైశాలి మ్యూజియంని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. ebs_ayodhya_0180 ఈ మ్యూజియంలో వైశాలిలోని వివిధ పురావస్తు ప్రదేశాలలో కనుగొనబడిన కళాఖండాల విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తారు. ebs_ayodhya_0181 మ్యూజియం పక్కనే, తగరంతో చేసిన ఒక వృత్తాకార పందిరి, స్తూపం యొక్క అవశేషాలను కాపాడుతుంది, ఇది ఒకప్పుడు బుద్ధ భగవానుడి చితి బస్మాన్ని కలిగి ఉండేదని విశ్వసిస్తారు. ebs_ayodhya_0182 మ్యూజియం సమీపంలో ఉన్న ప్రధాన ఆకర్షణ, లిచ్ఛవీ పాలకుల అభిషేక పుష్కరణిగా పిలువబడే పట్టాభిషేక తటాకం. ebs_ayodhya_0184 వైశాలి లిచ్ఛావి సామ్రాజ్యం (క్రీ.శ. 400 నుండి 750 వరకు) రాజధానిగా ఉండేది, ఇక పాటలిపుత్రపై (పాట్నా) మౌర్యుల, గుప్తుల ఆధిపత్యం ఉన్నప్పటికీ, వాణిజ్యం ఇంకా పరిశ్రమ ఇక్కడే బాగా వృద్ధి చెందింది. ebs_ayodhya_0186 పాల కాలానికి చెందిన(8 నుండి 12 వ శతాబ్దం వరకు) భావన్ పోఖర్ ఆలయం, ఇక్కడి మరో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ebs_ayodhya_0187 భావన్ పోఖర్ తటాకం యొక్క ఉత్తర తీరాన ఉన్న ఈ ఆలయం వివిధ హిందూ దేవతల విగ్రహాలతో అలంకరించబడి ఉంది. ebs_ayodhya_0188 ప్రపంచంలోనే అన్నిటికంటే ఎత్తైనదిగా భావించబడే విశ్వశాంతి స్తూపం లేదా శాంతి స్తంభం సందర్శనతో మీ యాత్రను పూర్తి చేయండి. ebs_ayodhya_0191 కుషినగర్ (విహారయాత్ర) ebs_ayodhya_0193 'ఈ పురాతన నగరానికి సంస్థాపక పాలకుడిగా ఉన్న శ్రీరాముని కుమారుడైన కుశుని పేరు మీద ఈ నగరానికి ఈ పేరు వచ్చింది.' ebs_ayodhya_0194 కుషినగర్ భారతదేశంలోని అతి ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. ebs_ayodhya_0195 బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ప్రాచీన మహాపరినిర్వాణ ఆలయం, ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. ebs_ayodhya_0196 ఈ ఆలయంలో 6 మీటర్ల పొడవు ఉండి, కుడి వైపుకు శయనించిన భంగిమలో ఉండే ఒక బుద్ధ భగవానుడి విగ్రహం ఉంటుంది. ebs_ayodhya_0197 ఇక్కడ బుద్ధభగవానుడు మోక్షానికి అత్యున్నత స్థితిని పొందాడని విశ్వసిస్తారు. ebs_ayodhya_0198 మహాపరినిర్వాణ ఆలయాన్ని సందర్శించిన తరువాత నగర చరిత్రకు సంబంధించిన లోతైన పరిజ్ఞానం పొందేందుకు కుషీనగర్ మ్యూజియాన్ని సందర్శించండి. ebs_ayodhya_0199 1992 లో స్థాపించబడిన ఈ మ్యూజియం, కుషినగర్‌లో బయటపడ్డ అనేక పురావస్తు తవ్వకాలను ప్రదర్శిస్తుంది. ebs_ayodhya_0200 వీటిలో శిల్పాలు, ముద్రలు, నాణేలు, పతాకములు, పురాతన వస్తువులు ఇంకా విగ్రహాలు ఉన్నాయి. ebs_ayodhya_0201 మ్యూజియంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రత్యేకత గాంధార శైలిలో నిర్మించిన బుద్ధ భగవానుడి పాలగచ్చు విగ్రహం. ebs_ayodhya_0202 ఈ మ్యూజియం నుండి పర్యాటకులు, బుద్ధ భగవానుడి దహన సంస్కారాలు జరిగిన ప్రదేశంగా సూచించబడే రామభార్ స్తూపాన్ని సందర్శించవచ్చు. ebs_ayodhya_0203 వరసుగా తాటి చెట్లతో చక్కగా ఉంచిన ఉద్యానవనం సన్నిధిలో ఉన్న ఈ స్తూపం, 50 అడుగుల పొడవు ఉంటుంది. ebs_ayodhya_0204 గుప్త రాజుల కాలంలో (క్రీ.శ. 319 నుండి 550 వరకు) నిర్మించిన సూర్య దేవాలయం ఇక్కడ ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం, ఈ ఆలయంలో విలువైన ఇంద్రనీలమణి రాయితో చెక్కబడిన సూర్య భగవానుని అందమైన విగ్రహం ఉంది. ebs_ayodhya_0205 కుషినగర్ అయోధ్య నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడకు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ebs_ayodhya_0207 కపిలవస్తు (విహారయాత్ర) ebs_ayodhya_0209 'కపిలవస్తు ముఖ్యమైన బౌద్ధ యాత్రికుల కేంద్రం, దీనిని బుద్ధ భగవానుడి తండ్రి అయిన శుద్ధోధనుడు పాలించినట్లు చెబుతారు.' ebs_ayodhya_0210 29 సంవత్సరాల వయస్సులో, యువరాజు గౌతముడు, అప్పట్లో బుద్ధ భగవానుడి పేరు, రాజభవనం వదిలి వెళ్ళిపోయాడు, జ్ఞానోదయం పొందిన తరువాత అదే 12 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చాడు. ebs_ayodhya_0211 ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అనుకూలమైన సమయం డిసెంబర్ అని చెప్పవచ్చు, ప్రతీ సంవత్సరం ఈ నెలలో 29 నుండి 31వ తారీఖు వరకు కపిలవస్తు బుద్ధ మహోత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహించబడుతాయి. ebs_ayodhya_0212 70వ దశకంలో జరిపిన తవ్వకాలలో బయటపడిన ప్రధాన స్తూపానికి సంబంధించిన పురావస్తు ప్రదేశం, ఇది ఇక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆకర్షణ. ebs_ayodhya_0213 తవ్వకాల్లో కొన్ని ముద్రలు ఇంకా చారిత్రాత్మక ప్రాధాన్యత గల ఇతర సామానులు కూడా బయటపడ్డాయి. ebs_ayodhya_0214 ఈ స్తూపాన్ని బౌద్ధ ధర్మ గొప్ప పోషకుడైన కుషన్ పాలకుడు, కనిష్కుడు పునరుద్ధరించారని చెబుతారు. ebs_ayodhya_0215 తవ్వకాలలో కనుగొనబడిన మహారాజు శుద్ధోధన రాజభవన శిథిలాలను కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. ebs_ayodhya_0216 కపిలవస్తు అయోధ్య నుండి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే ఇది ఒక గొప్ప అన్వేషణకు మంచి ప్రదేశం. ebs_ayodhya_0218 శ్రావస్తి (విహారయాత్ర) ebs_ayodhya_0220 పురాతన నగరమైన శ్రావస్తి బౌద్ధులకు ఒక ప్రధాన పుణ్యక్షేత్రం, ఇది భారతదేశం నుండే కాకుండా థాయ్‌లాండ్, జపాన్, చైనా మరియు శ్రీలంక వంటి విదేశాల నుండి కూడా భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. ebs_ayodhya_0221 రాప్తీ నదీ తీరాన విస్తరించి ఉన్న ఈ నగరం, ఒకప్పుడు కోశల రాజ్యానికి రాజధానిగా ఉండేది, ఈ రాజ్యాన్ని బుద్ధుని శిష్యుడైన మహారాజు పసేనది పరిపాలించాడు అని చెబుతారు. ebs_ayodhya_0222 ఈ పురాతన నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ఆకర్షణ చమత్కార స్తూపం, ఇక్కడ బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన సమయాన్ని గడిపినట్లు చెబుతారు. ebs_ayodhya_0223 ఆయన ధర్మోపదేశాలు మరియు బోధనలు శ్రావస్తిని బౌద్ధ అధ్యయనలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మార్చాయి. ebs_ayodhya_0224 'బుద్ధు భగవానుడి బోధనలకి స్మృత్యంజలి ఘటించడానికి ఆ ప్రదేశంలో ఒక స్తూపాన్ని నిలబెట్టడం జరిగింది.' ebs_ayodhya_0225 2004లో నిర్మించిన కొత్త స్తూపానికి పక్కనే ఆ పురాతన స్తూప శిథిలాలు ఉన్నాయి. ebs_ayodhya_0226 'తప్పక చూడవలసిన ఇతర పర్యాటక ప్రదేశాలలో అనాథ్ పిండికా స్తూపం, అంగులిమాల స్తూపం, ఇంకా ప్రాచీన జైన తీర్థంకర ఆలయం ఉన్నాయి.' ebs_ayodhya_0227 అంగులిమాల స్తూపం యొక్క అవశేషాలను పక్కీ కుటి అంటారు. ebs_ayodhya_0228 ఇది శ్రావస్తిలోని మహేత్ ప్రాంతంలో కనిపించే అతిపెద్ద మట్టిదిబ్బలలో ఒకటి. ebs_ayodhya_0229 'మెట్ల వలె కట్టిన ఈ స్తూపం, ఒక దీర్ఘచతురస్రాకార మైదానంలో నిర్మించబడింది, ఇది బుద్ధ భగవానుడి పట్ల పూజ్యభావం చూపేందుకు ప్రసేనజిత్తు మహారాజు నిర్మించినట్లు చెబుతారు.' ebs_ayodhya_0230 పర్యాటకులు శిథిలాలైన అనాథ్ పిండికా స్తూపం సమీపంలోని కచ్చి కుటిని కూడా సందర్శించవచ్చు. ebs_ayodhya_0231 శ్రావస్తి యొక్క అత్యంత ముఖ్యమైన తవ్వకాలలో ఒకటైన ఈ ప్రదేశం 2వ శతాబ్దం మరియు 12వ శతాబ్దం మధ్య వేర్వేరు కాలాలకి చెందిన నిర్మాణ అవశేషాలతో నిండి ఉంది. ebs_ayodhya_0232 శ్రావస్తి అయోధ్యకు 107 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే ఇది గొప్ప అన్వేషణకి ఒక మంచి ప్రదేశం. ebs_ayodhya_0234 చిట్టావ్యాసం ebs_ayodhya_0236 ఈ రుచికరమైన ఆహారాలని ఆస్వాదించండి ebs_ayodhya_0238 ఘాటైన నోరూరించే చాట్ నుండి తియ్యని పౌష్టిక లడ్డూల వరకు, అయోధ్యలో లభించే ఆహారాన్ని సరళంగా, రుచికరంగా ఉంటుంది. ebs_ayodhya_0240 ఆహారం, వంటకాలు ebs_ayodhya_0242 ఛాట్ ebs_ayodhya_0244 ఘాటుగా, కరకరలాడుతూ, తియ్యగా-పుల్లగా ఉండే, నోరూరించే చాట్‌ను అయోధ్యలో రుచి చూడవచ్చు. ebs_ayodhya_0245 ఈ వంటకాల్లో, పానీపూరీ, అదే, చింతపండు రసంతో వడ్డించే కరకరలాడే వేయించిన పూరీలు; కచోరీ, అంటే వేయించిన ఘాటైన మసాలల వంటకం; ఆలూటిక్కీ, అనగా ఉడికించిన బంగాళదుంపలు, బటానీలు ఇంకా వివిధ మసాలాలతో తయారుచేసిన వంటకం; పాప్డీచాట్, ఇది వేయించిన కరకరలాడే అప్పడాలపై పెరుగు, చింతపండు, సన్న కారం పూసను పైన వేసి అందించే నోరూరించే వంటకం; సమోసాలు, అంటే చట్నీతో తినే మసాలాను కూరిన పిండి వంటకాలు, ఉన్నాయి. ebs_ayodhya_0247 కచోరి ebs_ayodhya_0249 ఈ రుచికరమైన వీధి-ఫలహారం తయారు చేయడానికి, పెసరపప్పు లేదా మినపప్పు, శనగపిండి, మిరియాలు, ఎర్ర కారంపొడి, ఉప్పు ఇంకా ఇతర మసాలా దినుసులను వేయించి ఆ మిశ్రమాన్ని, మైదా పిండితో చేసిన గుండ్రని చదునైన బంతుల వంటి పదార్థాలలో నింపి, వాటిని నూనెలో వేయిస్తారు. ebs_ayodhya_0251 లడ్డూ ebs_ayodhya_0253 ధార్మిక లేదా పండుగ సందర్భాలలో వడ్డించే, లడ్డూలు శనగపిండి మరియు చక్కెరతో చేసిన బంతి ఆకారంలో ఉండే మిఠాయిలు. ebs_ayodhya_0255 ఉత్తర భారత ఆహారం ebs_ayodhya_0257 ఎన్నో రుచికరమైన వంటకాలతో ఉత్తర భారత థాలీలను అయోధ్య నగరం అంతటా వడ్డిస్తారు. ebs_ayodhya_0258 వీటిలో కొన్ని అన్నం, రోటీలు (భారతదేశపు బ్రెడ్) ఇంకా వివిధ రకాల అదనపు-ఆహార పదార్థాలు ఉంటాయి. ebs_ayodhya_0260 ఎలా చేరుకోవాలి ebs_ayodhya_0262 వాయు మార్గం ebs_ayodhya_0265 లక్నో, అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలు కూడా అయోధ్యకు చాలా దగ్గరలో ఉన్నాయి. ebs_ayodhya_0267 రైలు మార్గం ebs_ayodhya_0269 ఈ నగరం, మొఘల్ సారాయ్-లక్నో ప్రధాన రైలుమార్గంలో ఉత్తర రైల్వే బ్రాడ్ గేజ్‌ రైల్వే లైన్‌లో ఉంది. ebs_ayodhya_0273 మోటర్ వాహనాలు నడిపేందుకు వీలైన మంచి రోడ్డు మార్గాలు అయోధ్య నగరాన్ని సమీప నగరాలు మరియు పట్టణాలతో అనుసంధానిస్తాయి.