ID SENT ebs_badami_0002 బాదామి ebs_badami_0004 ట్యాగ్లైన్ ebs_badami_0006 ఒక పురావస్తు స్వర్గం ebs_badami_0010 జూలై నుండి మార్చి వరకు ebs_badami_0014 కర్ణాటకలోని బాదామి ప్రదేశం బండరాళ్లు, రాతితో కట్టిన దేవాలయాలతో వ్యాపించి, విచిత్ర ప్రకృతి దృశ్యాన్ని అందజేస్తుంది. ebs_badami_0018 రాతి భూభాగం యొక్క అద్భుతమైన విస్తీర్ణం, గుహాలయాలు, ఎర్ర ఇసుకరాయి కొండచరియలతో నిండిన, కర్ణాటకలోని బాదామి పట్టణం, రెండు మిట్టపల్లాలున్న ఇసుకరాయి కొండల మధ్య ఒక ఇరుకు మార్గంలో ఉంది. ebs_badami_0019 ఒడ్డున చెల్లాచెదురుగా దేవాలయాలను కలిగి ఉన్న, పురాతన, పవిత్రమైన అగస్త్య సరస్సు చుట్టూ స్థాపించబడిన, బాదామి, శిల్పాలు, కోటలు అలాగే గుహ దేవాలయాల రూపంలో మిగిల్చిన గొప్ప వారసత్వం యొక్క అద్భుతమైన గతం గురించి చెబుతుంది. ebs_badami_0020 మెరుగైన పట్టుకు సహాయపడే పగుళ్ళు గల బండరాళ్లు, ఇసుకరాళ్లతో ​​నిండిన ఈ పట్టణం, రాక్ క్లైంబింగ్(కొండలపైకి ఎక్కడం) కు ఒక కేంద్రం, ఇక ఇది, ఒడిదొడుకుగానున్న బండరాళ్లపైన వారి సాహసాలను పరీక్షించడానికి దూర ప్రాంతాల నుండి సాహసోపేత-ఔత్సాహికులను ఆహ్వానిస్తుంది. ebs_badami_0022 4 వ మరియు 8 వ శతాబ్దాల మధ్య బాదామిని తమ రాజధానిగా చేసుకున్న చాళుక్యుని సామ్రాజ్యం యొక్క అవశేషాలకు మరియు ద్రావిడ యుగానికి చెందిన అనేక పురావస్తు నిర్మాణాలకు బాదామి నిలయం. ebs_badami_0023 ఈ పట్టణం అప్పుడు ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది, ఇక పురాణగాథల ప్రకారం బంగారం, ఇంకా విలువైన రాళ్ళను ఇక్కడి సంతలో అమ్మేవారట. ebs_badami_0024 బాదామి ఒక పురావస్తు స్వర్గం, ఇక్కడ కనిపించే గొప్ప వాస్తుకళ అలాగే గూఢమైన శిల్పాలు ఈ ప్రాంతంలోని, రాష్ట్రకూటలు, పల్లవులు, మరాఠాలు వంటి శక్తివంతమైన రాజవంశాల పాలనకు సాక్ష్యంగా నిలిచాయి. ebs_badami_0025 వాస్తవానికి, బాదామిలోని కొన్ని దేవాలయాలు, దక్షిణ భారత వాస్తుశిల్పం ఇంకా ఉత్తర భారత నాగర్ శైలి యొక్క మిశ్రమ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ebs_badami_0026 బెంగళూరు నుండి 590 కిలోమీటర్లు, బీజాపూర్ నుండి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న బదామి గొప్ప చరిత్ర, అందమైన వాస్తుశిల్పం, పురాతన దేవాలయాలు, ఇంకా రాక్ క్లైంబింగ్ అవకాశాలతో సందర్శకులను అబ్బురపరుస్తుంది. ebs_badami_0030 గుహ దేవాలయాలు (ఆధ్యాత్మికం) ebs_badami_0032 బాదామి యొక్క ప్రఖ్యాత గుహ దేవాలయాలు దేశం అంతటి నుండి సందర్శకులను ఆకర్షిస్తాయి. ebs_badami_0033 6 వ మరియు 7 వ శతాబ్దాల నాటి ఈ దేవాలయాలు ఆ కాలపు చక్కని వాస్తుకళ శైలిని సూచిస్తాయి. ebs_badami_0034 నాలుగు గుహ దేవాలయాలు పెద్ద సముదాయాన్ని తలపిస్తాయి, ఇక వాటి అన్నింటిలో హిందూ దేవగణం నుండి దేవతల విభిన్న శిల్పాలతో, అద్భుతమైన చెక్కడాలు కలిగి ఉన్నాయి. ebs_badami_0035 వారి వాస్తుకళ ఉత్తర భారత, దక్షిణ భారత ద్రావిడ శైలి యొక్క సమ్మేళనం, ప్రతి గుహలో ఒక గర్భగుడి, చావడి, స్తంభాలు, ఒక వరండాలు ఉన్నాయి. ebs_badami_0037 మొదటి ఆలయం క్రీ.శ. 578 లో నిర్మించబడిందని నమ్ముతారు, 40 మెట్లు ఎక్కి దానిని చేరుకోవచ్చు. ebs_badami_0038 ఇది శివుడికి అంకితం చేయబడింది, దీనిలో 81 కి పైగా దేవుని శిల్పాలు ఉన్నాయి, అందులో కొన్ని 18 చేతులతో వున్న నటరాజు రూపాలు. ebs_badami_0039 ఈ గుహను ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ebs_badami_0041 రెండవ గుహను, త్రివిక్రముడి (మహాకాయుడి రూపం) రూపంలో చూపించబడిన విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ebs_badami_0042 ఇసుకరాయి కొండ యొక్క శిఖరం వద్ద దీనిని చూడవచ్చు. ebs_badami_0043 మూడవ గుహ ఒక కొండపై ఉంది, ఇది క్రీ.శ. 578 నాటిదని నమ్ముతారు. ebs_badami_0044 దీని ముందు భాగంలో దాదాపు 70 అడుగుల వెడల్పులో ఒక ఎత్తైన స్థలం ఉంది. ebs_badami_0045 ఈ ఆలయ ఆకృతి వాస్తుకళ యొక్క దక్కన్ శైలిని తలపిస్తుంది. ebs_badami_0046 ఈ ఆలయం, విష్ణుమూర్తి శిల్పాలకు నిలయం, ఇక్కడ విష్ణుమూర్తిని వివిధ అవతారాలలో చూపించబడింది. ఆ అవతారాలు: వరాహం (వరహా రూపం), నారసింహ (సగభాగం సింహం, సగభాగం మనిషి), త్రివిక్రముడు (మహాకాయుడి రూపం), హరిహర (హరి, పరమశివుడు). ebs_badami_0048 నాల్గవ గుహ దేవాలయం జైనుల 24 వ తీర్థంకరుడు (సాధువు) అయిన మహావీర భగవానుడికి అంకితం చేయబడింది, ఇది అన్నిటికంటే పెద్దది. ebs_badami_0049 ఇది 7 వ శతాబ్దానికి చెందినదని నమ్ముతారు, ఇక గర్భగుడిలో కూర్చున్న భంగిమలో మహావీరుడి విగ్రహాన్ని చూడవచ్చు. ebs_badami_0051 అగస్త్య సరస్సు (ప్రకృతి) ebs_badami_0053 నగరం శివార్లలో ఉన్న సువిశాల అగస్త్య సరస్సు గుహ దేవాలయాల క్రింద ఉంది. ebs_badami_0054 ఇది 5 వ శతాబ్దంలో ఏర్పడిందని అలాగే దీని నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. ebs_badami_0055 సరస్సును పవిత్రమైనదిగా భావిస్తారు, ఇక భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోడానికి నీటిలో మునుగుతారు. ebs_badami_0056 ఈ గుహ దేవాలయాలు సరస్సుకు నైరుతి దిశలో ఉన్నాయి, ఇక సరస్సు యొక్క తూర్పు తీరాన ప్రసిద్ధ భూతనాథ ఆలయం ఉంది. ebs_badami_0057 దేవాలయాల చివరి గుహ, సరస్సు యొక్క నిర్మలమైన దృశ్యాలకు అభిముఖంగా ఉంటుంది. ebs_badami_0058 ఆలయ శిలలపై కూర్చుని సరస్సు ఆవలి వైపు అస్తమిస్తున్న సూర్యుని అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ebs_badami_0060 పురాణగాథల ప్రకారం, చాళుక్యులు బాదామి చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు, వారి రాజ్య రాజధాని అయిన వతాపిని రాతితో చెక్కించారు, ఇది అగస్త్య సరస్సు యొక్క ఇరుకు కొండ కనుమ చుట్టూ వ్యాపించింది. ebs_badami_0061 రామాయణ మహాకావ్యంలోని అగస్త్య మహాముని పేరుని ఈ సరస్సుకు పెట్టబడింది అని చెబుతారు. ebs_badami_0063 రాక్ క్లైంబింగ్ (చేయవలసిన పనులు) ebs_badami_0065 బాదామిలో రాక్ క్లైంబింగ్ అనేది జీవితకాలం మరిచిపోలేని సాహసం. ebs_badami_0066 పట్టణం యొక్క రాతి భూభాగం, దూర ప్రాంతాల పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఇక దాని అనేక స్థాయిల సవాళ్ళు, తేలిక నుండి మధ్యమం నుండి కష్టతరం, అందరికీ రోమాంచిత అనుభూతిని కలగచేస్తాయి. ebs_badami_0067 ఎర్ర ఇసుకరాయి రాళ్ళలోని పగుళ్లు మంచి పట్టును ఇచ్చి, కొండలు ఎక్కడానికి తోడ్పడుతాయి. ebs_badami_0068 కొండలు ఎక్కడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఇక చిటుక్కున చేరేందుకు 150 కి పైగా మార్గాలు ఉన్నాయి, అయితే ఇవి వేరు వేరు కష్టాలతో కూడినవి. ebs_badami_0069 'ఇవి అధిరోహకులను సవాలు చేయడమే కాకుండా, ప్రకృతి ఒడిలో కొంత సమయం గడిపిన అనుభవాన్ని కూడా ఇస్తాయి.' ebs_badami_0070 కొన్ని మార్గాలు దేవాలయాలు అలాగే సుందరమైన దృశ్యాల గుండా సాగుతాయి, ఇక మీరు మీ కృషికి ఫలితం దక్కినట్లుగానే భావించవచ్చు. ebs_badami_0071 కొండలను కొత్తగా అధిరోహించే వారు, నిపుణులు ఇద్దరూ ఇక్కడ కొండలను ఎక్కవచ్చు, ఇక శిక్షణ అవసరమని భావించే వారికి శిక్షణ కూడా ఇస్తారు. ebs_badami_0072 అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కొండలను ఎక్కడానికి అనువైన సమయం. ebs_badami_0074 భూతనాథ ఆలయం (ఆధ్యాత్మికం) ebs_badami_0076 శివుడికి అంకితం చేయబడిన భూతనాథ ఆలయం, దేవాలయాల భూతనాథ సమూహంలోని రెండు ప్రధాన ఆలయాలలో ఒకటి, ఇది అగస్త్య సరస్సు వరకు విస్తరించి ఉంది. ebs_badami_0077 భూతనాథ అవతారంలో (ఆత్మల దేవుడు) ఇక్కడ దేవుడిని పూజిస్తారు. ebs_badami_0078 ఇసుకరాయితో నిర్మించిన ఈ ఆలయంలో దక్షిణ భారత ద్రావిడ, ఉత్తర భారత నాగర్ శైలులను ప్రతిబింబించే ఒక బహిరంగ మండపం (చావడి) ఉంది. ebs_badami_0079 దీని లోపలి మందిరాన్ని 7 వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు భావిస్తున్నారు. ebs_badami_0080 ఆలయం వెనుక భాగంలో, విష్ణుమూర్తి అవతారాలు, జైన చిత్రాలు చెక్కబడ్డాయి. ebs_badami_0081 ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఆకర్షణ, బాదామి గుహ దేవాలయాలు, ఇవి నాలుగు గుహ దేవాలయాల సమూహం. ebs_badami_0082 ఇవి వాస్తుశిల్పానికి చక్కటి నమూనాలు, ఇవి పరమశివుడు, విష్ణుమూర్తి మరియు మహావీర భగవానుడికి అంకితం చేయబడ్డాయి. ebs_badami_0088 హుబ్లి (106 కిమీ), అలాగే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గాం, బాదామికి సమీప విమానాశ్రయాలు. ebs_badami_0092 బాదామి హుబ్లి-సోలాపూర్ రైలు మార్గంలో వస్తుంది. ebs_badami_0093 ఈ స్టేషన్ బాదామి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ebs_badami_0097 ఈ పట్టణం, బీజాపూర్ మరియు హుబ్లికి వాహనాలలో ప్రయాణం చేసేందుకు వీలుగా మంచి రోడ్డుల ద్వారా, అనుసంధానించబడి ఉంది. ebs_badami_0098 బెంగళూరు నుంచి బాదామికి వెళ్ళడానికి సుమారు 12 గంటల రోడ్డు ప్రయాణం చేయవలసి ఉంటుంది.