ID SENT ebs_baidyanath_0002 బైద్యనాథ్ దేవ్ ఘర్ ebs_baidyanath_0004 ట్యాగ్ లైన్: బైద్యనాథ్ భగవానుడి భూమి ebs_baidyanath_0006 సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్ నుండి మార్చి వరకు ebs_baidyanath_0010 ఒక చారిత్రక ప్రదేశం మరియు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బైద్యనాథ్-దేవ్ ఘర్ లేక బైద్యనాథ్ ధామ్, బైద్యనాథుడు లేదా పరమశివుడి నివాసంగా ప్రసిద్ధి చెందింది. ebs_baidyanath_0014 జార్ఖండ్‌లోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం, బైద్యనాథ్ దేవఘర్ ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉంది. ebs_baidyanath_0015 దేశంలో, జ్యోతిర్లింగం (శివుడిని సూచించే పుణ్యక్షేత్రం) మరియు శక్తిపీఠం (సతీ దేవి యొక్క శరీర భాగాలు పడిపోయిన మందిరం) రెండింటినీ కలిగి ఉన్న ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన బైద్యనాథ్ ఆలయం, యాత్రికుల హృదయాలలో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా నిలిచిపోయింది. ebs_baidyanath_0016 పురాతన హిందూ గ్రంథాలైన పురాణాలలో పేర్కొనడం వల్ల ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. ebs_baidyanath_0018 హిందూ పంచాంగంలోని ఐదవ నెల అయిన శ్రావణ మాసం ఆంగ్ల కాలమానానికి సమాన మాసాలైన జూలై, ఆగస్టు మాసాల్లో శ్రావణమాస జాతర సందర్భంగా దేవ్ ఘర్ సందర్శకులతో కిటకిటలాడుతుంది. ebs_baidyanath_0019 ఈ సమయంలో, గంగా నది నుండి పొందిన పవిత్ర జలాన్ని శివుడికి అర్పించడానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. ebs_baidyanath_0020 బౌద్ధ మఠాల శిథిలాలు ఇక్కడ ఉన్నందున, బౌద్ధ మత విశ్వాసులకు కూడా దేవ్ ఘర్ అదే విధమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ebs_baidyanath_0021 ఇక్కడి ప్రకృతి దృశ్యం చాలా రమణీయమైనది. శీతాకాలంలో ఈ ప్రదేశం మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందుతుంది. ebs_baidyanath_0025 బాబా బైద్యనాథ్ ధామ్ (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0027 జ్యోతిర్లింగం (పరమశివుడి భక్తితో కూడిన ప్రాతినిధ్యం) మరియు శక్తిపీఠం (శక్తి దేవత యొక్క శరీర భాగాలు పడిపోయిన స్ధలం) గా పూజింపబడుతున్న, పట్టణంలోని ప్రముఖ ఆలయమైన, బాబా బైద్యనాథ్ ఆలయం ప్రతి సంవత్సరం భక్తులను తండోపతండాలుగా ఆకర్షిస్తుంది. ebs_baidyanath_0028 ఈ ఆలయం దేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి, ఇది పరమశివుడికి అంకితం చేయబడింది. ebs_baidyanath_0029 ఇక్కడ గణేశుడు ఇంకా పార్వతి దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ebs_baidyanath_0030 ఇక్కడ ప్రార్థనలు తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమవుతాయి, ఇక్కడి ప్రధాన అర్చకుడు మొదట షోడశోపచారాలతో (పదహారు సేవలు) తో పూజలు చేస్తారు. ebs_baidyanath_0031 తర్వాత, భక్తులను భగవంతుడిని పూజించడానికి అనుమతిస్తారు. ebs_baidyanath_0032 పురాణ గాథల ప్రకారం, లంకేశ్వరుడైన రావణుడు, ఇక్కడ తన పది తలలను ఒక్కొక్కటిగా ఆ పరమశివుడికి అర్పించాడట. ebs_baidyanath_0033 'ఇది చూసిన భగవంతుడు భూమిపైకి దిగివచ్చి రావణుడి గాయాలను నయం చేశాడట.' ebs_baidyanath_0034 'అందువలన, శివుడిని ' వైద్య్' అని పిలుస్తారు, 'వైద్య్' అంటే వైద్యుడు లేదా గాయాలని నయం చేసేవాడు అని అర్ధం. ebs_baidyanath_0035 ఈ పవిత్ర భూమికి సంబంధించి ఈ విధమైన అనేక పురాణగాథలు ఉండగా, చరిత్ర కూడా దీని ప్రాముఖ్యతను రుజువు చేస్తుంది. ebs_baidyanath_0036 గుప్త రాజవంశం యొక్క చివరి రాజు అయిన ఆదిత్యసేన గుప్తుని పాలనలో క్రీ.శ. 8 వ శతాబ్దం నుండి ఈ ఆలయ ప్రస్తావాన ఉంది. ebs_baidyanath_0037 మొఘల్ కాలంలో, అంబర్ పాలకుడైన రాజా మాన్ సింగ్, ఇక్కడ ఒక చెరువును నిర్మించాడని చెబుతారు, దీనిని మాన్ సరోవర్ అని పిలుస్తారు. ebs_baidyanath_0038 ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది, ఇది 72 అడుగుల ఎత్తు కలిగి ఉండి, ఒక పిరమిడ్ ఆకార గోపురంతో కూడిన ఒక సాదా రాతి నిర్మాణం. ebs_baidyanath_0039 గోపురం పై భాగాన పంచశూలంతో (త్రిశూల ఆకారంలోని ఐదు కత్తులు) ఉన్న మూడు ధృఢమైన బంగారు కలశాలు స్థాపించి ఉన్నాయి. ebs_baidyanath_0040 చంద్రకాంత మణి అనబడే ఎనిమిది పూరేకుల కమలం కూడా ఉంది. ebs_baidyanath_0042 నౌలఖా మందిర్ (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0044 అందమైన నౌలఖా ఆలయం రాధా, కృష్ణులకు అంకితం చేయబడింది, అలాగే ఇది ప్రధాన పట్టణం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_baidyanath_0045 దీని నిర్మాణం చాలా వరకు పశ్చిమ బెంగాల్, బేలూర్ లోని రామకృష్ణ ఆలయం లాగా కనిపిస్తుంది. ebs_baidyanath_0046 ఈ మందిరంలో 146 అడుగుల ఎత్తులో ఉన్న దేవతల అందమైన విగ్రహాలు ఉన్నాయి. ebs_baidyanath_0047 కోల్‌కతాకు చెందిన రాజకుటుంబమైన పథురియా ఘాట్‌కు చెందిన రాణి చారుశీల ఇచ్చిన తొమ్మిది లక్షల రూపాయల విరాళంతో నౌలఖా మందిర్ నిర్మాణం ప్రారంభమైంది, అందువల్ల ఈ ఆలయానికి తొమ్మిది లక్షలు ('నౌ' అంటే తొమ్మిది మరియు 'లఖ' అంటే లక్ష) అనే అర్ధం ఉన్న పేరు వచ్చింది. ebs_baidyanath_0049 ఈ ఆలయంలో సాధువు బాలానంద బ్రహ్మచారి విగ్రహం కూడా ఉంది. ఈ సాధువు సలహా ప్రకారమే మందిర నిర్మాణం జరిగింది. ebs_baidyanath_0050 తన భర్త ఆకస్మికంగా మరణించిన తరువాత, మహారాణి తన ఇంటిని విడిచివెళ్ళిపోయినట్లు పురాణ గాథ. ebs_baidyanath_0051 నిరాశ నిస్పృలతో ఒంటరితనానికి లోనైన ఆమె, సాధువుని కలుసుకుంది, అప్పుడే సాధువు తనని ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. ebs_baidyanath_0053 నందన్ పహాడ్ (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0055 ప్రసిద్ధ నంది ఆలయానికి ఆతిథ్యమిస్తున్న నందన్ పహాడ్ అనేది పట్టణం అంచున ఉన్న ఒక కొండ, ఇది ప్రసిద్ధ శివాలయానికి అభిముఖంగా ఉంటుంది. ebs_baidyanath_0056 బాబా బైద్యనాథ్ ధామ్ స్టేషన్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనిని భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు. ebs_baidyanath_0057 నందన్ పహాడ్ లో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి, వీటిలో చాలావరకు పరమశివుడు, పార్వతి దేవి, గణేశుడు ఇంకా కార్తికేయుడి అందమైన విగ్రహాలు ఉన్నాయి. ebs_baidyanath_0058 పురాణ గాథల ప్రకారం, ఒకసారి రావణుడు బలవంతంగా శివ ధామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, ద్వారపాలకుడైన నంది (శివుడి వాహనమైన ఎద్దు) అతన్ని ఆపాడట. ebs_baidyanath_0059 'రావణుడు కోపంతో అతన్ని ఈ స్థలం వద్ద విసిరేశాడట, అందువల్ల ఈ కొండను నంది పేరుతో పిలుస్తారు.' ebs_baidyanath_0060 ఈ కొండ పట్టణం యొక్క అందమైన దృశ్యాలను అలాగే అద్భుతమైన సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను కూడా సమర్పిస్తుంది. ebs_baidyanath_0061 ఇక్కడ ఈత కొలనులు, ఆట స్థలాలు ఇంకా నౌకా విహార సౌకర్యాలు కలిగి ఉన్న ఎన్టర్టెయిన్మెంట్ పార్క్ కూడా ఉంది. ebs_baidyanath_0063 త్రికుట్ (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0065 త్రికుటా పర్వతం (కొండ) హిందువులకు ఆధ్యాత్మిక ప్రదేశం, ఇది దేవ్ ఘర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_baidyanath_0066 'కొండకు మూడు ప్రధాన శిఖరాలు ఉన్నందున, దీనికి త్రికుటాచల్ ('త్రి' అంటే మూడు అని అర్ధం) అని పేరు పెట్టారు.' ebs_baidyanath_0067 సుమారు 2,470 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ, శివుడికి అర్పించే వెలగ పండు దళాలను సేకరించడానికి శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) ఇక్కడకు వచ్చే వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ebs_baidyanath_0068 అందువల్ల ఈ స్థలాన్ని శివుని తోట అని కూడా పిలుస్తారు. ebs_baidyanath_0069 ఈ ప్రదేశంలో త్రికూటాచల్ మహాదేవ ఆలయం అని పిలవబడే శివుడికి అంకితం చేయబడిన ఒక ఆలయం ఉంది, ఇది మయూరాక్షి నది ముఖద్వారం వద్ద ఉంది. ebs_baidyanath_0070 ఇక్కడ, మీరు త్రిశూలి దేవత యొక్క పీఠాన్ని కూడా చూడవచ్చు. ebs_baidyanath_0071 ఇది, పక్కనే చల్లని ప్రవాహం ప్రవహిస్తున్న, ఒక నిర్మలమైన ప్రదేశం. ebs_baidyanath_0073 రిఖియాపీఠ్ (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0075 ఈ చిన్న, మారుమూల గ్రామం హిందూ యాత్రికులకు ఒక నిధి వంటిది. ebs_baidyanath_0076 బాబా బైద్యనాథ్ ధామ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిఖియాపీఠ్ ను, శ్రీ శ్రీ పంచ దశ్నాం పరమహంస్ అలఖ్బరాహ్ అని కూడా పిలుస్తారు, ఇది దేశంలోని అతిపురాతన యోగా ఆశ్రమాలలో ఒకటి. ebs_baidyanath_0077 స్వామి శివానంద సరస్వతి అనుచరుడైన స్వామి సత్యానంద సరస్వతిచే స్థాపించబడిన ఈ ఆశ్రమం అనేక మంది జ్ఞానోదయమయిన జ్ఞానులకు నిలయం. ebs_baidyanath_0078 దీనిని తపోభూమి అని పిలుస్తారు, ఇది స్వామి సత్యానంద యొక్క ప్రబల ఆధ్యాత్మిక ఆచరణలు, నిష్ఠల ప్రదేశం. ebs_baidyanath_0079 ఈ ప్రదేశాన్ని ఆవరించిన శాంతి, ప్రశాంతత ఋషి మునుల ఉనికి అలాగే వారి ఆధ్యాత్మిక ఆచరణలే కారణమని చెప్పవచ్చు. ebs_baidyanath_0080 పీఠ్ అనే పదానికి ఉన్నత విద్య యొక్క స్థానం అని అర్ధం, అందువల్ల రిఖియాపీఠ్, రిషి అనే పదం నుండి నిష్పాదించబడిన రిఖియా పదం పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం, వేదాలు, ఉపనిషత్తులు ఇంకా పురాణాలలోని వేద పరంపరను కొనసాగిస్తున్న ఋషుల ద్వారా ప్రచారం చేసిన ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, దానితో పాటు కులం, మతవిశ్వాసం, జాతీయత, మతం ఇంకా స్త్రీ పురుష జాతులతో సంబంధం లేకుండా అందరికీ ఆధునిక నైపుణ్యాలను అందించడం. ebs_baidyanath_0081 ఈ ఆశ్రమాన్ని సీతా వివాహం సందర్భంగా, అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించబడే పెద్ద జాతర నిర్వహించబడే సందర్భాలలో తప్పక సందర్శించాలి. ebs_baidyanath_0083 తపోవన్ (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0085 తపోవన్ కొండలు దేవ్ ఘర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, ఇక్కడ తపో నాథ్ మహాదేవ్ అనబడే ఒక శివాలయం ఉంది. ebs_baidyanath_0086 పగులు ఉన్న ఒక శిల ఇక్కడి మరో ఆకర్షణ, ఈ శిల యొక్క లోపలి తలంపైన హనుమంతుడి చిత్రాన్ని చూడవచ్చు. ebs_baidyanath_0087 కుంచెను రాతి పగుళ్లలోకి చొప్పించి ఏదైనా గీయడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి, అందుకే ప్రత్యేకంగా దీనిని ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ebs_baidyanath_0088 కొండ కింద, ఒక చిన్న కొలను (జలాశయం) ఉంది, ఇక ఇక్కడ సీతాదేవి స్నానం చేసేదని నమ్ముతారు. ebs_baidyanath_0089 అందువలన, దీనికి స్థానిక ప్రజలు సూక్త్ కుండ్ లేదా సీతా కుండ్ అని నామకరణం చేశారు. ebs_baidyanath_0091 ''తపోవన్'' అనే పదానికి ధ్యానం చేసుకునే వనం అని అర్థం, ఇక గతంలో, ఇది 'నాగాలకు (సాధువులకు) ధ్యానం చేసుకునే ప్రదేశంగా (తపోభూమి) ఉండేది ఆట.' ebs_baidyanath_0092 అందువలన, దీనికి తపోవన్ అని నామకరణం చేశారు. ebs_baidyanath_0094 బాసుకీనాథ్ ఆలయం (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0096 బాసుకీనాథ్ ఆలయాన్ని బాబా భోలే నాథ్ యొక్క ఆస్థానం అని నమ్ముతారు. ebs_baidyanath_0097 ఇక్కడ శివ పార్వతుల ఆలయాలు ఎదురెదురుగా నిర్మించబడ్డాయి. ebs_baidyanath_0098 ద్వారాలు తెరిచేటప్పుడు, భక్తులను ద్వారాల నుండి దూరంగా వెళ్ళమని కోరడం జరుగుతుంది, ఎందుకంటే, ఇక్కడ ద్వారాలను తెరవగానే శివ పార్వతులు ఒకరినొకరు కలుస్తారని నమ్ముతారు. ebs_baidyanath_0099 బాసుకీనాథ్ ఈ ప్రాంతంలోని పురాతన ఆలయాలలో ఒకటి, ఇది జర్మండి గ్రామానికి సమీపంలో ఉంది. ebs_baidyanath_0100 ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం శ్రావణ (హిందూ పంచాంగంలోని ఒక నెల) మేళా (జాతర) జరిగే సమయం, అదే జూలై, ఆగస్టు మధ్య అన్నమాట. ebs_baidyanath_0101 ఈ సమయంలో ఈ ప్రదేశం భక్తులతో నిండి ఉంటుంది. ebs_baidyanath_0102 ఎక్కడ చూసినా కాషాయవస్త్రాలు-ధరించిన యాత్రికులే దర్శనమిస్తారు, ఇక కొంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ జాతర ఒక అనువైన సమయం. ebs_baidyanath_0104 సత్సంగ్ ఆశ్రమం (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0106 భారతదేశంలోని ప్రధాన మత సంస్థలలో ఒకటైన సత్సంగ్ ఆశ్రమానికి ప్రపంచవ్యాప్తంగా 2,000 పైగా శాఖలు ఉన్నాయి. ebs_baidyanath_0107 సత్సంగ దేవఘర్ అనేది, హిమైత్‌పూర్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) నుండి దేవ్ ఘర్‌కు వలస వచ్చిన ఠాకూర్ అనుకూల్‌చంద్ర ప్రారంభించిన ప్రధాన శాఖ. ebs_baidyanath_0108 ఆశ్రమంలో గదులు, శయనాగారాలతో పెద్ద భవనాలు ఉన్నాయి. ebs_baidyanath_0109 సందర్శకులకు వసతులు అందుబాటులో ఉన్నాయి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ebs_baidyanath_0110 దాని భవన సముదాయంలోనే, దానికి ఆనందబజార్ అనే ఒక ఉచిత వంటగది, మ్యూజియం, ఇంకా ఒక జంతుప్రదర్శనశాలలు ఉన్నాయి, ఇవి సందర్శకులకు తెరిచి ఉంటాయి. ebs_baidyanath_0112 సత్సంగ్ దాని వివిధ దాతృత్వ కార్యకలాపాల కారణంగా ప్రజాదరణ పొందింది. ebs_baidyanath_0113 చివరికి, సత్సంగ్ కెమికల్ వర్క్స్ అను సంస్థ ఉనికిలోకి వచ్చింది, ఇది శ్రీ శ్రీ ఠాకూర్ సూత్రాల ఆధారంగా మందులను తయారు చేస్తుంది. ebs_baidyanath_0114 నెమ్మదిగా, ఇది సత్సంగ్ ప్రెస్ మరియు సత్సంగ్ పబ్లిషింగ్ హౌస్ లుగా విడిపోయింది. ebs_baidyanath_0115 ఇది రాధాస్వామి శాఖతో కూడా సంబంధం కలిగి ఉంది. ebs_baidyanath_0117 ప్రభు జగద్బంధు ఆశ్రమం (ఆధ్యాత్మికం) ebs_baidyanath_0119 మత బోధకుడైన ప్రభు జగద్బంధు (లేదా జగత్బంధు) కు అంకితం చేయబడిన ప్రభు జగద్బంధు (లేదా జగత్బంధు) ఆశ్రమం, తపోవన్ వెళ్లే మార్గంలో దేవ్ ఘర్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_baidyanath_0120 ఇందులో ప్రభు జగత్బంధు యొక్క రాతి ఆలయం ఉంది. ebs_baidyanath_0121 శ్రీశ్రీ బంధుసుందర్ అని కూడా పిలువబడే ప్రభు జగత్బంధు ప్రేమ సందేశాన్ని బోధించారు. ebs_baidyanath_0122 ఈ రోజు ఆయన అనుచరులు మహానామ్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు, వారు రాధాస్వామి శాఖకి చెందినవారు. ebs_baidyanath_0123 1871 లో, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లోని ఒక చిన్న కుగ్రామంలో జన్మించిన ప్రభు జగద్బంధు 1921 సెప్టెంబర్ 17 న అమరత్వం పొందారు. ebs_baidyanath_0124 ఆయన అనుచరులు ఆయనని శ్రీకృష్ణుడి అవతారం అని నమ్ముతారు. ebs_baidyanath_0126 చల్లని, సహజమైన వాతావరణంలో కొద్దిసేపు గడపాలని అనుకునే వారు ఈ ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. ebs_baidyanath_0127 అంతర్గత ఆధ్యాత్మికతతో తిరిగి కలవడానికి ఇది గొప్ప ప్రదేశంగా చెబుతారు. ebs_baidyanath_0131 విమాన ప్రయాణం: సమీప విమానాశ్రయం దేవ్ ఘర్ నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోధ్ గయా వద్ద ఉంది. ebs_baidyanath_0132 దీనిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని అంటారు. ebs_baidyanath_0134 రైలు ప్రయాణం: దేవ్ ఘర్ ప్రధాన భారతీయ నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది, బైద్యనాథ్ ధామ్ జంక్షన్ నగరంలోని ప్రధాన రైల్ హెడ్. ఈ స్టేషన్‌లో నియమిత రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ebs_baidyanath_0136 రోడ్డు ప్రయాణం: దేవ్ ఘర్ దాని సమీప నగరాలకు వాహనాలు నడిపేందుకు వీలుగా ఉన్న మంచి రోడ్లతో అనుసంధానించబడి ఉంది. ebs_baidyanath_0137 రాంచీ, పాట్నా మొదలైన ప్రదేశాల నుండి దేవ్ ఘర్ కు నియమిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.