ID SENT ebs_bekal_0002 గమ్యస్థానం పేరు ebs_bekal_0004 బేకల్ ebs_bekal_0006 ట్యాగ్లైన్ ebs_bekal_0008 భూమిపై స్వర్గం ebs_bekal_0010 సందర్శించడానికి ఉత్తమ సమయం ebs_bekal_0014 ఉద్ధరణ ebs_bekal_0016 కోస్తా తీరంలోని బేకల్ పట్టణం, కేరళలో ఉంది, ఇది 17 వ శతాబ్దపు కోట, ఆకర్షణీయమైన, రమణీయమైన బ్యాక్ వాటర్స్ కు ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0018 గమ్యస్థానం (ముఖ్య వివరణ) ebs_bekal_0020 తేనె వర్ణ బీచులు, నిర్మలమైన జలపాతాలు, స్వచ్ఛంగా కనిపించే అందమైన బ్యాక్ వాటర్స్ మధ్య పచ్చరాయి పొదిగినట్లు ఉండి, కేరళ కేంద్ర భాగంలో తలదాచుకొని ఉన్న ఈ కోస్తా తీర బేకల్ పట్టణం, ఏకాంతంగా ఉండే ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ebs_bekal_0021 భవ్యమైన 300 సంవత్సరాల పురాతన బేకల్ కోటకు నిలయమైన ఈ పట్టణం, నిర్మలమైన సముద్ర తీరాలతో నిండి ఉంది, ఈ బీచులు మనోహరమైన సూర్యాస్తమయాల దృశ్యాలను, జల క్రీడలు ఇంకా ప్రకృతి అందాలను ఆనందిస్తూ సాగించే నడకలకు ఉత్కంఠభరితమైన అవకాశాలను అందజేస్తాయి. ebs_bekal_0022 ఈ పట్టణం, గ్రానైట్ విగ్రహాలు, కొబ్బరి ఉత్పత్తులు ఇంకా చెక్కపై చెక్కిన బొమ్మలు వంటి ప్రత్యేకమైన హస్తకళలలో ప్రతిబింబించే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ebs_bekal_0023 బేకల్ పట్టణం సమీపంలోని కన్నూర్, కోజికోడ్ వంటి సుందరమైన ప్రదేశాలకు ప్రవేశ ద్వారం కూడా. ebs_bekal_0025 స్థానిక కన్నడ రచయిత రామ నాయక్ ఒకసారి 'బేకల్' అనే పేరు “బలియాకులం” నుండి వచ్చింది అనీ, బలియాకులం అంటే 'పెద్ద రాజభవనం', అనీ రాశారు. ebs_bekal_0026 ఇది ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఒక రాజభవనంకు సంకేతం అవుతుంది. ebs_bekal_0027 కాలక్రమేణా, 'బలియాకులం', 'బేకులం'గా, ఆ తరువాత, 'బేకల్' గా మారింది. ebs_bekal_0031 బేకల్ కోట (వారసత్వ సంపద) ebs_bekal_0033 ప్రత్యేకమైన తాళంచెవి రంధ్రం ఆకారపు నిర్మాణానికి పేరుగాంచిన బేకల్ కోటను క్రీ.శ. 1650 లో కేలాడికి చెందిన శివప్ప నాయక నిర్మించారు. ebs_bekal_0034 ఈ కోటలో రాజభవనాలు లేదా భవనాలు లేవు, ఎందుకంటే ఇది ఎప్పుడూ పరిపాలనా కేంద్రంగా లేదు, కానీ ఇప్పటికీ కేరళలో అతిపెద్దది, ఇంకా బాగా సంరక్షించబడిన కోటలలో ఒకటిగా ఉంది. ebs_bekal_0035 సముద్ర మట్టానికి 130 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట దాని వాస్తుకళకు గాను, దాని పరిసరాల సాటిలేని అందానికి గాను దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ebs_bekal_0036 పర్యాటకులు కోటకు సమీపంలో ఉన్న పరిశీలన బురుజు(అబ్జర్వేషన్ టవర్) ను సందర్శించవచ్చు, ఆ బురుజుకు పరిశీలనకు వీలుగా రంధ్రాలు ఉన్నాయి, అక్కడ నుండి మీరు అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. ebs_bekal_0037 కోట సమీపంలో ఉన్న ఇతర ఆకర్షణలలో ఆంజనేయ ఆలయం ఉంది, ఇది దాని తాపీపని అలాగే ఎర్రమట్టితో చేసిన రెండు తేయ్యం శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0038 పర్యాటకులు సమీపంలోని అందమైన బేకల్ బీచ్ ను కూడా సందర్శించవచ్చు, ప్రశాంత దృశ్యాల మధ్య సేదతీరి, కొత్త శక్తిని పొందడానికి ఇది ఒక అనువైన ప్రదేశం. ebs_bekal_0040 బేకల్ బీచ్ (ప్రకృతి) ebs_bekal_0042 బేకల్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ప్రశాంతమైన బేకల్ బీచ్, ప్రశాంత దృశ్యాల మధ్య సేదతీరి, కొత్త శక్తిని పొందడానికి సరైన ప్రదేశం అని చెప్పవచ్చు. ebs_bekal_0043 ఇది భారతదేశంలోని అత్యుత్తమ తెల్లని ఇసుక గల బీచ్లలో ఒకటి, ఇది నిజంగా ఆనందాన్ని కలిగించే ప్రదేశం. ebs_bekal_0044 ఈ బీచ్, ఎత్తైన ప్రదేశంపైన గర్వంగా నిలుచొని ఉన్న బేకల్ కోట యొక్క అద్భుతమైన దృశ్యాలను అందజేస్తుంది. ebs_bekal_0045 సముద్రం మీదుగా సూర్యుడు అస్తమించే అందమైన దృశ్యాలు దానికి తోడు కదిలే తాటి చెట్ల దృశ్యం, బీచ్ ప్రశాంత వాతావరణానికి తోడ్పడతాయి. ebs_bekal_0046 పర్యాటకులు సముద్ర ప్రశాంతమైన నీటిలో కూడా ఈత కొట్టవచ్చు, అలాగే చక్కగా ఒక వ్యవస్థిత రూపంలో ఉండేటట్లు చూసుకుంటున్న బేకల్ బీచ్ పార్కును సందర్శించవచ్చు, ఇది అనేక వినోద సదుపాయలను అందజేస్తుంది. ebs_bekal_0047 బీచ్ యొక్క విస్తరణ అయిన ఈ పార్క్ బేకల్ కోట పక్కన ఉంది. ebs_bekal_0048 ఈ పార్కులో కొన్ని ఫుడ్ స్టాల్స్(తినుబండారాలు అమ్మే చోటు) ఉన్నాయి, ఇక్కడ రుచికరమైన స్థానిక ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ebs_bekal_0049 పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండే ఈ బీచ్‌ను బేకల్ రిసార్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (బిఆర్‌డిసి) చూసుకుంటుంది, ఈ సంస్థ కాసర్గోడ్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_bekal_0051 కప్పిల్ బీచ్ (ప్రకృతి) ebs_bekal_0053 మలబార్ కోస్తా తీరంలో అంతగా ప్రాచుర్యం పొందని బీచ్‌లలో ఒకటైన కప్పిల్ బీచ్, ఒక అద్భుతమైన బీచ్-బ్యాక్‌వాటర్ ప్రదేశం. ebs_bekal_0054 సరుగుడు చెట్ల దట్టమైన తోటలు, బంగారు వర్ణ ఇసుకలు ఇంకా మెరిసే నీరు, అక్కడికి వచ్చే సందర్శకులను మంత్రముగ్ధులని చేస్తుంది. ebs_bekal_0055 కేరళ యొక్క గొప్ప రహస్యాల్లో ఒకటైన కప్పిల్ బీచ్, నిజంగానే ఒక మనోహరమైన ప్రదేశం. ebs_bekal_0056 అరేబియా సముద్రం యొక్క సుందర దృశ్యాలను వీక్షించడానికి పర్యాటకులు, బీచ్ వద్ద ఉన్న 'కోడి కొండ' పైకి ఎక్కవచ్చు. ebs_bekal_0057 బేకల్ కోట నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్, సూర్యాస్తమయాల అద్భుత దృశ్యాలను అందజేస్తుంది. ebs_bekal_0058 బీచ్ లో అరుదైన ఆల్చిప్పలను కూడా సేకరించవచ్చు, వాటిని వారు జ్ఞాపకాలుగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ebs_bekal_0059 అంతేకాక, పర్యాటకులు వరుసగా ఉన్న పచ్చని కొబ్బరి చెట్లుగల బీచ్ యొక్క పొడవైన ఇసుక విస్తీర్ణంలో ప్రకృతి అందాలని ఆనందిస్తూ సాగించే నడకను ఆనందించవచ్చు. ebs_bekal_0061 బేకల్ హోల్ ఆక్వా పార్క్ (చేయవలసిన పనులు) ebs_bekal_0063 బేకల్ హోల్ ఆక్వా పార్క్, ఉత్తర మలబార్ ప్రాంతంలో ఉన్న ఇలాంటి పార్కులలో ఏకైక పార్కు, ఇది దాని ఉత్కంఠభరితమైన వాటర్ రైడ్స్ ఇంకా నిర్మలమైన పరిసరాలతో సందర్శకులను ఆకర్షిస్తుంది. ebs_bekal_0064 బేకల్ బ్యాక్ వాటర్స్ సహజమైన విస్తీర్ణంలో ఉన్న ఈ వాటర్ పార్క్, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సేదతీరి, మంచి సమయం గడపడానికి గొప్ప ప్రదేశం. ebs_bekal_0065 ఈ పార్క్ ఒక అందమైన పిక్నిక్ స్థలంగా స్థానికులలో ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0066 పర్యాటకులు, వాటర్ సైకిల్స్ లేదా పెడల్లు గల పాత నౌకలలో విహారం వంటి సాహసోపేతమైన వాటర్ రైడ్స్ లో పాల్గొనవచ్చు. ebs_bekal_0067 మీరు తేలికపాటి క్యానోలు(పడవలు) కూడా అద్దెకు తీసుకోవచ్చు. ebs_bekal_0068 బేకల్ హోల్ ఆక్వా పార్క్, బేకల్ కోట నుండి రాయిని విసిరేంత దూరంలో ఉంటుంది, ఇది పట్టణంలో వినోదాత్మక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ebs_bekal_0070 వలియపరంబ బ్యాక్ వాటర్స్ (ప్రకృతి) ebs_bekal_0072 బ్యాక్ వాటర్ విరివిల ఏకాంత, అద్భుతమైన విస్తీర్ణం గల వలియపరంబా, దాని దృష్య ఆకర్షణలతో అబ్బురపరుస్తుంది. ebs_bekal_0073 కొత్త శక్తిని పొందడానికి, ప్రకృతిని ఆరాధించడానికి ఒక ఆహ్లాదకర ప్రదేశం, ఇది ప్రకృతి ప్రేమికులకు మంచి ఏకాంత ప్రదేశం. ebs_bekal_0074 దాని పచ్చని వృక్షజాలం, మెరిసే నీలిరంగు బ్యాక్ వాటర్స్ ఇక స్వచ్ఛమైన బీచ్ లు దీనిని వీడనీయవు. ebs_bekal_0075 వలియాపరంబా ఒక ప్రముఖ పర్యాటక బ్యాక్ వాటర్ రిసార్ట్ గా ఉద్భవించింది, ఇలా జరగడానికి కారణమైన, ఆ ప్రదేశంలో నిండి ఉన్న ద్వీపాలకు ధన్యవాదాలు చెప్పాల్సిందే, అయితే ఇది ఇప్పటికీ చాలా ప్రశాంతంగా, వాణిజ్యీకరించబడనిదిగా ఉంది, అందుకే కొంచెం సేదతీరి, సమయం తీరికగా గడపడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు. ebs_bekal_0076 సూర్యాస్తమయ సమయంలో హాయినిచ్చే పడవ ప్రయాణం చేసి కదిలే కొబ్బరి చెట్లతో అలంకరించబడిన అందమైన ద్వీపాల గుండా వెళుతున్నప్పుడు ఈ ప్రదేశం యొక్క గొప్ప అందాలని చూడండి. ebs_bekal_0077 పర్యాటకులు బ్యాక్ వాటర్స్ సహజ సౌందర్యాన్ని అన్వేషించడానికి హౌస్ బోటులు అద్దెకు తీసుకోవచ్చు లేదా సార్వజనిక రేవుకట్ట ఎక్కి వెళ్ళవచ్చు. ebs_bekal_0078 మీరు తీరం ఒడ్డున పిక్నిక్ కూడా చేసుకోవచ్చు. ebs_bekal_0079 వలియపరంబా, కోస్తా తీర పట్టణం అయిన బేకల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_bekal_0081 అనంతపుర సరస్సు ఆలయం (ఆధ్యాత్మికం) ebs_bekal_0083 అబ్బురపరిచే అందాలు కలిగిన 9వ శతాబ్దానికి చెందిన అనంతపుర ఆలయం విష్ణుభగవానుడికి అంకితం చేయబడింది, ఇది ఒక సరస్సు మధ్యలో ఉంది. ebs_bekal_0084 కేరళలో ఉన్న ఏకైక సరస్సు ఆలయం, ఇది అనంతపద్మనాభ ప్రభువు అసలు నివాసంగా పరిగణించబడుతుంది. ebs_bekal_0085 ఆలయ గర్భగుడికి చేరాలంటే భక్తులు ఒక వంతెన దాటాల్సి ఉంటుంది. ebs_bekal_0086 ఈ సరస్సు ఆలయం, చుట్టూ ఉన్న చిన్న గుట్టలూ, కదిలే తాటి ఇంకా కొబ్బరి చెట్ల అద్భుతమైన దృశ్యాలను అందజేస్తుంది. ebs_bekal_0087 ఈ అందమైన ఆలయం యొక్క మరో విశేషం, బబియా అనబడే 150 సంవత్సరాల నాటి ఒక మొసలికి నిలయం కావడం, ఈ మొసలి ఆలయ సంరక్షకుడిగా ఉంటుంది అని భావిస్తారు. ebs_bekal_0088 ఆలయానికి వచ్చే సందర్శకులు మొసలిని తప్పక చూడాలనుకుంటారు. ebs_bekal_0089 అనంతపుర సరస్సు ఆలయం బేకల్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంటుంది, ఈ ఆలయానికి వాహనంలో ప్రయాణం కూడా అంతే అందమైన, మనోహరమైన అనుభూతిని ఇస్తుంది. ebs_bekal_0091 హోస్దుర్గ్ కోట (వారసత్వ సంపద) ebs_bekal_0093 కాసరగోడ్ జిల్లాలోని కొండ ప్రాంతం ఎన్నో ఆకట్టుకునే కోటలకు నిలయం, వీటిని సైనిక బురుజులుగా లేదా ముఖ్యమైన వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలుగా ఉపయోగపడేందుకు నిర్మించారు. ebs_bekal_0094 అలాంటి కోటలలో ప్రసిద్ధ హోస్దుర్గ్ కోట ఒకటి, ఇక్కేరి రాజవంశానికి చెందిన సోమశేఖర నాయక్ నిర్మించిన అనేక కథలుకథలుగా చెప్పుకునే కోటలలో ఇది ఒకటి. ebs_bekal_0095 ఇది కన్హగడ్ కోటగా ప్రసిద్ధి చెందింది, మంత్రముగ్ధులని చేసే దీని నిర్మాణం సందర్శకులను ఆహ్వానిస్తుంది. ebs_bekal_0096 కోట వృత్తాకార బురుజులు దాని ప్రాథమిక విశేషతలు, వీటిని దూరం నుండి చూడవచ్చు. ebs_bekal_0097 హోస్దుర్గ్ కోట అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రమైన నిత్యానందశ్రమానికి నిలయం, ఇందులో 45 గుహలు ఉన్నాయి. ebs_bekal_0098 పర్యాటకులు కోట పక్కనే ఉన్న కర్పూరేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ebs_bekal_0099 హోస్దుర్గ్ కోట బేకల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే కన్హాగడ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_bekal_0101 ఉల్లాల్ (ఆధ్యాత్మికం) ebs_bekal_0103 ఉల్లాల్ అనే విలక్షణ పట్టణం మతపరమైన సమృద్ధికి ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0104 ప్రధాన ఆకర్షణ అరేబియా సముద్రం పక్కన ఉన్న సోమనాథేశ్వర ఆలయం. ebs_bekal_0105 16వ శతాబ్దంలో ఉలాల్ మొదటి తుళువ రాణి అయిన అబాకా దేవి పాలనలో నిర్మించబడిన ఈ కట్టడం, దాని ప్రత్యేక దక్షిణ భారత వాస్తుకళా, ప్రశాంతమైన పరిసరాలకు సందర్శకులను ఆకర్షిస్తుంది. ebs_bekal_0106 మరో ఆకర్షణ సయ్యద్ మదనీ దర్గా, ఇక్కడ సూఫీ ఫకీరు సయ్యద్ మదాని సమాధి ఉంది, 400 సంవత్సరాల క్రితం మదీనా నుండి ఉలాల్ కు వచ్చి, పేదలకు ఆధ్యాత్మిక జ్ఞానం పొందడంలో సహాయపడిన వ్యక్తి ఈ సూఫీ ఫకీరు సయ్యద్ మదాని. ebs_bekal_0107 ప్రతి ఐదేళ్లకోసారి ఎంతో ఉత్సాహంగా జరిగే ఉర్సు ఉత్సవం సందర్భంగా భక్తులు ఈ దర్గాను తండోపతండాలుగా సందర్శిస్తారు. ebs_bekal_0108 1926 నాటి సెయింట్ సెబాస్టియన్ చర్చికి కూడా పర్యాటకులు వెళ్ళవచ్చు. ebs_bekal_0109 మంగళూరు చుట్టూ ఉన్న అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఇది ఒకటి, దీని అద్భుతమైన నిర్మాణంతో సందర్శకులను ఆకర్షిస్తుంది. ebs_bekal_0110 ఉల్లాల్ లోని ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో ఉలాల్ జామా మసీదు ఉంది, ఇది ఫకీరు సయ్యద్ మహమ్మద్ షరీఫుల్ మదానీ జ్ఞాపకార్ధంగా నిర్మించబడింది. ebs_bekal_0112 ఉల్లాల్ ఒకప్పుడు తుళు రాజ్యానికి రాజధానిగా ఉండేది, ఇది దేశంలోని అతి పురాతన పట్టణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ebs_bekal_0113 ఇది 15వ శతాబ్దంలో పోర్చుగీసు వారి పాలనలో కూడా ఉండేది, ఇక నగర వ్యాప్తంగా వారి ప్రభావాన్ని చూడవచ్చు. ebs_bekal_0115 మాలిక్ దీనార్ మసీదు (ఆధ్యాత్మికం) ebs_bekal_0117 సంప్రదాయ కేరళ శైలిలో నిర్మించిన ఈ చారిత్రక మాలిక్ దీనార్ మసీదును మాలిక్ ఇబ్న్ దీనార్ స్థాపించినట్లు చెబుతారు, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ముస్లింలలో ఈయన ఒకరుగా విశ్వసించబడుతుంది. ebs_bekal_0118 అద్భుతమైన నిర్మాణం, ఏటా, దీనార్ అలాగే అతని మొదటి వర్తకుల బృందం భారతదేశంలోకి అడుగిడడానికి గుర్తుగా ఒక గొప్ప వేడుకకు ఆతిథ్యం ఇస్తుంది. ebs_bekal_0119 1,500 సంవత్సరాల క్రితం దీనార్, అతని 12 మంది సహచరులు భారతదేశంలో అడుగుపెట్టారని, వారితో మతాన్ని తీసుకువచ్చారని పురాణ గాథ. ebs_bekal_0120 ఈ విధంగా మాలిక్ దీనార్ మసీదు పశ్చిమ గంగా వంశానికి చెందిన చేరమన్ పెరుమాళ్ పాలనలో క్రీ.శ. 642 లో నిర్మించబడింది. ebs_bekal_0121 ఈ కట్టడం లో చెక్క దూలాలు ఇంకా స్తంభాలపై గూఢమైన అరబిక్ చెక్కడాలు ఉన్నాయి. ebs_bekal_0122 ముఖ్యంగా ఉర్సు ఉత్సవం సందర్భంగా మసీదులో జనం కిక్కిరిసిపోతారు. ebs_bekal_0124 మల్లికార్జున ఆలయం (ఆధ్యాత్మికం) ebs_bekal_0126 కదిలే కొబ్బరి ఇంకా తాటి చెట్లతో నిండిన ఈ అ౦దమైన మల్లికార్జున ఆలయ౦, పరమశివునికి అంకితం చేయబడింది, ఇక అద్భుతమైన వాస్తుశిల్ప౦, ప్రశాంత వాతావరణంతో భక్తులను ఆకర్షిస్తో౦ది. ebs_bekal_0127 సమీపంలో ప్రవహించే కుంబలా నది, ఈ ప్రదేశ మనోహర సౌందర్యాన్ని పెంచుతుంది. ebs_bekal_0128 పురాణగాథ ప్రకారం, ఈ ఆలయంలోని శివుడి విగ్రహాన్ని హిందూ మహాకావ్యమైన మహాభారతంలోని పాండవులలో ఒకరైన అర్జునుడిచే ప్రతిష్టించబడింది. ebs_bekal_0129 ఈ ఆలయం మార్చి నెలలో జరిగే వార్షిక జాతర మహోత్సవానికి కూడా ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0130 ప్రతిరోజూ సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జరిగే యక్షగాన ప్రదర్శన, ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ebs_bekal_0131 ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏటా జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులను ఆహ్వానిస్తోంది. ebs_bekal_0132 కాసర్ గోడ్ పట్టణం కేంద్రంలో ఉన్న ఈ ఆలయానికి బేకల్ నుండి సులభంగా చేరుకోవచ్చు. ebs_bekal_0134 తలస్సెరీ (వారసత్వం) ebs_bekal_0136 వలసరాజ్య సంబంధి ఆకర్షణలో తడిసి, అందమైన పరిసరాల నడుమ ఉన్న కోస్తా తీర పట్టణం తలస్సేరి, క్రికెట్, సర్కస్, కేకుల భూమిగా ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0138 తలస్సేరీలో బ్రిటిష్ వారు ఎక్కువగా క్రికెట్ ఆడేవారట, ఇక భారతదేశంలో సర్కస్ ఈ పట్టణంలోనే పుట్టిందని చెబుతారు. ebs_bekal_0139 రుచికరమైన కేకులకు సరఫరా చేసే అనేక బేకరీలు, తలస్సేరీని కేకులను కొనేందుకు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశాలలో ఒకటిగా చేసింది. ebs_bekal_0141 కన్నూర్ జిల్లాలో ఉన్న ఈ అందమైన పట్టణం దాని ప్రాచీన కోటలు, అసాధారణ చర్చిలు, అద్భుతమైన బీచ్ లు, అలంకరించిన ఆలయాలతో సందర్శకులను ఆకర్షిస్తుంది. ebs_bekal_0142 'పారిస్ ఆఫ్ మలబార్' గా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ పాలనలో మలబార్ ప్రాంతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ebs_bekal_0144 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీచే నిర్మించబడిన తలస్సేరీ కోట, దాని ప్రత్యేక వాస్తుకళ, పాత ప్రపంచపు ఆకర్షణతో సందర్శకులను మంత్రముగ్ధులని చేసి విశేషంగా ఆకర్షిస్తుంది. ebs_bekal_0145 ఈ కోట, అందంగా చెక్కిన తలుపులు, పెద్ద కిటికీలు, ఆకర్షణీయమైన కుడ్యచిత్రాలతో అలంకరించబడి ఉంది. ebs_bekal_0146 కోట పక్కనే ఉన్న భవ్యమైన, తెలుపు రంగు ఆంగ్ల చర్చి లేదా సెయింట్ జాన్స్ ఆంగ్లికన్ చర్చి ఉంది, ఇది మలబార్ కోస్తా తీరంలో నిర్మించిన మొట్టమొదటి చర్చీలలో ఒకటి అని చెబుతారు. ebs_bekal_0147 తలస్సేరీలోని ముజ్హప్పిలాంగడ్ బీచ్ దేశంలోని అతిపెద్ద డ్రైవ్-ఇన్ బీచ్ లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో బీచ్లో కారు డ్రైవ్ ను ఆనందించవచ్చు, ఇది నిజంగా ఒక ఆనందకరమైన అనుభూతిని కలిగిస్తుంది. ebs_bekal_0149 చెక్కపై చెక్కడాలు (కళలు నైపుణ్యాలు) ebs_bekal_0151 కేరళలోని కాసరగోడ్ ప్రాంతం దేవాలయాలు, చర్చిలలో చెక్కపై చేసిన సంకీర్ణమైన చెక్కడాలకు ప్రసిద్ధి. ebs_bekal_0152 బేకల్ ఇంకా దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని దేవాలయాల తలుపులు దేవుళ్ళూ దేవతల ప్రతిమలతో చెక్కబడి ఉంటాయి, అయితే తలుపుల పైభాగంలో మాత్రం త్రిమితీయ చెక్క చెక్కడాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ebs_bekal_0153 చెక్క చెక్కడం ప్రక్రియలో, ముందుగా ఒక కాగితం ముక్కపై ఆకృతిని గీసీ ఆ తరువాత ఒక పదునైన కత్తిని ఉపయోగించి అంచుల వెంబడి కోయడం లాంటివి ఉంటాయి. ebs_bekal_0154 ఈ దశ నుంచి పొందిన ఆకృతి ముక్క(కట్ అవుట్) ఆకార రేఖలను(అవుట్ లైన్) గీయడానికి చెక్కపై పెట్టబడుతుంది, ఇక చివరిగా కళాకారులు చెక్కను వివిధ ఆకారాలు ఆకృతులలో చెక్కుతారు. ebs_bekal_0155 ఈ నమూనాను(టెంప్లెట్) కేవలం ఆకార రేఖను(అవుట్ లైన్) గీసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు, ఇక మీగితాదంతా కళాకారులు వారి స్వంత కల్పనాశక్తి, సృజనాత్మకత ఆధారంగా చెక్కడాలను చెక్కుతారు. ebs_bekal_0156 చెక్కతో చేసిన వస్తువులపై చెక్కడానికి ఉపయోగించే అత్యంత సాధారణ ఇతివృత్తాల్లో పౌరాణిక ఇతిహాసాలు, పూల నమూనాలు జంతువుల బొమ్మల వంటి దృశ్యాలు ఉన్నాయి. ebs_bekal_0157 కొందరు శిల్పులు బుద్ధభగవానుని బొమ్మలు, యేసు క్రీస్తు బొమ్మలు, కథక్కళి ముసుగులు, పెన్ స్టాండులు ఇంకా అలాంటి ఇతర వస్తువులను చెక్కడానికి నూకమాను చెక్కను ఉపయోగిస్తారు. ebs_bekal_0159 కొబ్బరి ఉత్పత్తులు (కళలు నైపుణ్యాలు) ebs_bekal_0161 బేకల్ ప్రకృతి దృశ్యం కదలాడుతున్న కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ebs_bekal_0162 ఇవి చాలా ఎక్కువ ఉండడం వల్ల, కేరళకు చెందిన నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు ఎన్నో యుగాలుగా తమ సృజనాత్మకతతో ప్రయోగాలు చేస్తున్నారు, ఫలితంగా వాళ్ళు కొబ్బరి చిప్పలతో అందమైన, పర్యావరణానుకూల ఉత్పత్తులను సృష్టిస్తున్నారు. ebs_bekal_0163 ఈ ఉత్పత్తులను రూపొందించే విధానం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి. ebs_bekal_0164 మొదట, గట్టి కొబ్బరి చిప్పను నునుపుగా చేసి, తరువాత ఈ పని కోసమే రూపొందించిన అంచుగల ఉపకరణాలను ఉపయోగించి కొబ్బరి చిప్పలని ముక్కలుగా చేసి వాటిపై చెక్కడం జరుగుతుంది. ebs_bekal_0165 గిన్నెలు, టీ పాత్రలు, కప్పులు, చెంచాలు, బూడిద-ట్రేలు వంటి రోజూ ఉపయోగించే వస్తువుల నుండి ల్యాంప్ షేడ్స్, పూల కుండీలు, వాల్ హ్యాంగింగ్స్, చాపల వంటి అలంకరణ వస్తువుల వరకు, బేకల్ లోని హస్తకళా దుకాణాలు కొబ్బరి చిప్పలతో చేసిన హస్తకళా వస్తువుల ఒక విస్తృత శ్రేణిని కలిగి ఉంటాయి. ebs_bekal_0166 కొబ్బరి చిప్పలతో చేసిన హుక్కాలు, పెద్ద పూల కుండీలు వంటి కొన్ని ఉత్పత్తుల అందాన్ని, మన్నికను పెంపొందించడానికి ఇత్తడిని కూడా ఉపయోగిస్తారు. ebs_bekal_0168 గ్రానైట్ విగ్రహాలు (కళలు నైపుణ్యాలు) ebs_bekal_0170 బేకల్ లోని ప్రతిభావంతులైన కళాకారులు గ్రానైట్ తో వివిధ దేవుళ్ళూ దేవతల విగ్రహాలను చెక్కడంలో తమ అద్భుతమైన పనితనం, నైపుణ్యానికి గాను పేరు పొందారు. ebs_bekal_0171 శతాబ్దాల నాటి ఈ హస్తకళను సుదూర ప్రదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు. ebs_bekal_0172 అలప్పుజ్హలోని బుద్ధ భగవానుడి కరుమాదికుటన్ విగ్రహం, రాష్ట్రంలోని శిల్పుల సృజనాత్మక ఔన్నత్యానికి చక్కని ఉదాహరణ. ebs_bekal_0173 11 వ శతాబ్దం నాటి ఈ విగ్రహం దృఢమైన నల్ల గ్రానైట్‌తో తయారు చేయబడింది. ebs_bekal_0175 ఈ విగ్రహాలను తయారు చేసే కళ తరతరాలుగా సాగుతుంది, ఇక ఒక శిల్పాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ebs_bekal_0176 ముడి పదార్థాన్ని సాధారణంగా తమిళనాడు, అంబసముద్రంలోని రాళ్ళగని నుండి తీసుకొస్తారు, తరువాత వాటిని చెక్కుతారు. ebs_bekal_0177 ఈ ప్రాంతంలోని వివిధ హస్తకళల దుకాణాలలో మీరు, సంకీర్ణంగా చెక్కిన అనేక రకాల గ్రానైట్ శిల్పాలను కొనుక్కోవచ్చు. ebs_bekal_0179 యోగా, ధ్యానం (చేయవలసిన పనులు) ebs_bekal_0181 యోగా అభ్యాసకులు అలాగే ధ్యానం ఇష్టపడే వారికి బేకల్ ఒక స్వర్గధామం అనవచ్చు. ebs_bekal_0182 కేరళ యోగా అధ్యయనాలు, నిర్విషీకరణ విధానాలు గత కొన్ని ఏళ్లుగా ప్రాచుర్యం పొందాయి, ఇక రాష్ట్రంలో అనేక యోగా సంస్థలు వెలిశాయి. ebs_bekal_0183 సుందరమైన బేకల్ పట్టణం యోగా వంటి చర్యలలో పాల్గొని ప్రకృతి ఒడిలో సేదతీరడానికి సరైన వాతావరణాన్ని అందజేస్తుంది. ebs_bekal_0184 నగర విలాసవంతమైన ఆరోగ్య కేంద్రాలు, స్పాలు వాటి సేదతీర్చే తాజా వాతావరణానికి గాను నగరాన్ని సందర్శించే ప్రయాణికులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ebs_bekal_0185 శిక్షణ పొందిన గురువుల నుంచి యోగాని నేర్చుకునే అనుభవం నిజంగా అతీతమైనది. ebs_bekal_0186 మీకు సంపూర్ణ నిర్విషీకరణ అవసరం అనిపిస్తే మీరు ఖచ్చితంగా బేకల్ కి రావలసిందే, అక్కడికి వచ్చి ఆ పట్టణ శాంతి, నిర్మలతలు మీ ఆరోగ్యాన్ని నయం చేసేందుకు వాటిని అనుమతించండి. ebs_bekal_0188 కన్నూర్ (విహారయాత్ర) ebs_bekal_0190 తరచుగా దాని సహజ సంపదలకు గాను కేరళ మకుటంగా పిలవబడే కన్నూర్, సాల్మన్ రాజుకు చెందిన ఓడల ద్వారా జెరూసలేంలోని ఒక గొప్ప ఆలయ నిర్మాణం కోసం కలప సేకరించిన ప్రదేశంగా విశ్వసించబడుతుంది. ebs_bekal_0191 దీనికి అరబ్బులు, రోమన్లు, గ్రీకుల కాలం నాటి నుండి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ebs_bekal_0193 తన ఘనమైన వారసత్వ సంపదను చక్కగా సంరక్షించుకుంటున్న కన్నూర్ దాని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పురాతన కోటలను చూడడానికి పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ebs_bekal_0194 దాని చరిత్రతో పాటు అబ్బురపరిచే బంగారు వర్ణ ఇసుక బీచ్‌లు, కొనుగోలు చేసేందుకు అనుకూలమైన అందమైన నేసిన వస్త్రాలను మీరు చూడవచ్చు. ebs_bekal_0195 ఇక్కడ ఉన్నప్పుడు, మీరు ఈ ప్రాంత ప్రసిద్ధ కళారూపమైన తెయ్యంను కూడా చూడవచ్చు. ebs_bekal_0196 కన్నూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నూర్ కోట లేదా సెయింట్ ఏంజిలోస్ కోట, 1505లో భారతదేశపు మొదటి పోర్చుగీసు వైస్రాయి డోమ్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా చే నిర్మించబడిన ఒక ప్రధాన ఆకర్షణ. ebs_bekal_0198 ఈ కోట కన్నూర్ వలసరాజ్య సంబంధి గతానికి నిదర్శనంగా నిలుస్తుంది, ఇక కన్నూరులో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ebs_bekal_0199 మొప్పిలా బే, అరక్కల్ మసీదు కూడా సమీపంలోనే ఉన్నాయి. ebs_bekal_0200 కన్నూర్ దాని సహజమైన బీచ్ లకు కూడా ప్రసిద్ధి చెందింది, వాటిలో ఒక డ్రైవ్-ఇన్ బీచ్ అయిన అత్యంత ప్రాచుర్యం పొందినది ముజప్పిలంగడ్. ebs_bekal_0202 పొడవైన బీచ్ లో కారులో డ్రైవింగ్ చేయడం అనేది నిజంగా ఒక రోమాంచిత అనుభూతిని కలుగజేస్తుంది. ebs_bekal_0203 కన్నూర్ లోని నాదల్ జంక్షన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎజ్రా బీచ్ బాగా ఉన్న బీచ్లలో ఒకటి. ebs_bekal_0204 కన్నూర్ దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇక పురాతన పెరళస్సేరి శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం కేరళలోని అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటి. ebs_bekal_0206 ఫోటోగ్రఫీకి సరైన చోటు అయిన ఈ ఆలయ కొలను అక్కడి ప్రధాన ఆకర్షణ. ebs_bekal_0207 సుబ్రమణ్య స్వామికి అంకితం చేయబడిన ఈ ఆలయం, తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ebs_bekal_0208 ప్రకృతి, వన్య మృగ ప్రేమికులకు, పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్న కన్నూర్ ప్రాంతంలో అరలం అభయారణ్యం ఉంది. ebs_bekal_0210 కన్నూర్ నుండి 55 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం అనేక రకాల వృక్ష జంతు జాలాలకు నిలయం. ebs_bekal_0211 సాధారణ వీక్షణలలో కొన్ని: జింకలు, ఏనుగులు, అడవి పందులు, బైసన్ ఇంకా వివిధ రకాల ఉడుతలు ఉన్నాయి. ebs_bekal_0212 కన్నూర్, బేకల్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక రెండు గంటల్లో సులభంగా చేరుకోవచ్చు. ebs_bekal_0213 కోజికోడ్ (విహారయాత్ర) ebs_bekal_0215 ఇదివరకు కాలికట్ అని పిలువబడే కోజికోడ్ కేరళలోని ఉత్తమ నగరాల్లో ఒకటి, దాని సహజమైన బీచ్‌లు, అసలుసిసలైన మలబార్ వంటకాలు దీనిని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మార్చాయి. ebs_bekal_0217 కప్పాడ్ బీచ్ కోజికోడ్‌లోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి. ebs_bekal_0218 1498, మే 27న, భారతదేశానికి పోర్చుగీసు చెందిన అన్వేషకుడు వాస్కోడిగామా రాకకు జ్ఞాపకార్థంగా ఒక రాతి స్మారక చిహ్నం ఉన్న ఈ బీచ్ వద్ద పర్యాటకులు వివిధ జల క్రీడలలో పాల్గొనవచ్చు. ebs_bekal_0219 ఇంకొక ప్రసిద్ధ ప్రదేశం కోజికోడ్ బీచ్, దీనిని పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు, వారు బాగా ఉన్న నడకదారిలో ఉదయం, సాయంత్రం షికారులు చేస్తారు. ebs_bekal_0221 ఈ సహజమైన బీచ్, స్నాక్స్, ఐస్ క్రీములు, స్థానికంగా తయారు చేసిన పానీయాలను విక్రయించే విక్రేతలతో నిండి ఉంటుంది. ebs_bekal_0222 మీరు ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనుకుంటే మాత్రం, మీరు బెయ్పూర్ బీచ్ కు వెళ్లవచ్చు, ఇక్కడ మీరు ప్రకృతి అందాలను చూస్తూ సాగించే నడకలని ఆనందించవచ్చు. ebs_bekal_0223 పక్షి వీక్షకులకు, వివిధ రకాల పక్షులు, చేపలకు నిలయమైన కలాలుండీ పక్షుల అభయారణ్యం, ఒక ఆకర్షణీయమైన ఎంపిక అనవచ్చు. ebs_bekal_0225 కోజికోడ్‌లో ఇరింగా క్రాఫ్ట్స్ విలేజ్ సందర్శన మీకు ఒక ఉత్తమ అనుభవాన్ని కలగజేస్తుంది, ఇక్కడ మీరు నైపుణ్యం కలిగిన శిల్పులు, చేతివృత్తులవారిని పని చేస్తూ చూడవచ్చు, అలాగే అందమైన హస్తకళలను కొనుగోలు చేయవచ్చు. ebs_bekal_0226 నగరానికి సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ సంగ్రహావలోకనం కోసం, ఈస్ట్ హిల్ పై ఉన్న పజస్సిరాజా మ్యూజియాన్ని సందర్శించండి. ebs_bekal_0228 రాష్ట్ర పురావస్తు శాఖ నిర్వహిస్తున్న ఈ మ్యూజియంలో, పురాతన కుడ్యచిత్రాలు, ప్రాచీన కంచులు, పాత నాణేములు ఇంకా చరిత్రపూర్వ నిర్మాణాల గొప్ప సేకరణ ఉంది. ebs_bekal_0229 మ్యూజియం పక్కన ఒక కళామందిరం (ఆర్ట్ గ్యాలరీ) ఉంది, ఇది ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ వేసిన కొన్ని ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తుంది. ebs_bekal_0230 కోజికోడ్ అద్భుతమైన జలపాతాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0232 నగరానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అరిప్పరా జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గదామం వంటిది, ఇక తెల్లని నీటిలో ర్యాఫ్టింగ్ వంటి అవకాశాలను కల్పిస్తూ సాహస ఔత్సాహికులను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. ebs_bekal_0233 మసాలా దినుసులతో పాటు, ఈ నగరం ఎంతో రుచికరమైన కోజికోడియన్ హల్వా, అరటికాయ చిప్స్, సూక్ష్మ స్నేక్ బోట్స్ వంటి ఆకర్షణీయమైన జ్ఞాపికలకు కూడా ప్రసిద్ధి చెందింది. ebs_bekal_0235 నగరంలోని ఎస్ ఎమ్(SM) స్ట్రీట్ మార్కెట్ మలబార్ ప్రాంతంలోని పురాతన మార్కెట్లలో ఒకటి, పర్యాటకులు కొనుగోలు చేసేందుకు ఇది గొప్ప అవకాశం కల్పిస్తుంది. ebs_bekal_0236 కోజికోడ్ బేకల్ నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇది గొప్ప ఒక రోజు విహారయాత్రకు అనువైనది. ebs_bekal_0241 రుచికరమైన బిర్యానీ నుండి తీపి హల్వా వరకు, బేకల్‌ లో మీరు ఎన్నో వంటకాలను ఆస్వాదించవచ్చు. ebs_bekal_0243 ఆహారం, వంటకాలు ebs_bekal_0245 బిర్యాని ebs_bekal_0247 మలబార్ బిర్యానీగా ప్రసిద్ధి చెందిన, ఇది మసాలాలతో గుమగుమలాడే అన్నంని పొరలుపొరలుగా పరచి, చికెన్, వేయించిన ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, నెయ్యి వేసి వండుతారు. ebs_bekal_0249 వంటకానికి కావలసిన అన్ని పదార్థాలను కలిపి, వండే పాత్రని తడిపిన పిండి ముద్దతో గట్టిగా మూసివేసి, నెమ్మదిగా ఆవిరిలో ఉడికిస్తారు; ఈ ప్రక్రియను దమ్ పద్ధతి అంటారు. ebs_bekal_0250 ఈ రుచికరమైన వంటకం చేసేందుకు అనేక విధానాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రం, ప్రాంతం తమ తమ విధానాలలో దీనిని వండుతారు. ebs_bekal_0251 మలబార్ విధానంలో నెయ్యి, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, జాజికాయ వంటి మసాలా దినుసులను ఎక్కువ పరిమాణంలో వాడుతారు, దీనివల్ల ఈ వంటకం గుమగుమలాడుతుంది. ebs_bekal_0252 అంతేకాకుండా, సాంప్రదాయ బిర్యానీ మాదిరిగా కాకుండా, ఈ ప్రత్యేకమైన విధానంలో ఖైమా లేదా జీరకాసల అని పిలువబడే చిన్న, సన్న బియ్యాన్ని ఉపయోగిస్తారు. ebs_bekal_0253 హల్వా ebs_bekal_0255 అరబిక్ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఈ ప్రతిష్టాత్మకమైన మిఠాయిని, బియ్యం లేదా పిండితో తయారుచేసి డ్రై ఫ్రూట్లతో అలంకరిస్తారు. ebs_bekal_0257 పాయసం ebs_bekal_0259 పాలు, బియ్యం, నెయ్యి, చక్కెర లేదా బెల్లంతో తయారుచేసిన పాయసం, తియ్యని, మీగడ గల వంటకం. ebs_bekal_0261 ఇది సాంప్రదాయకంగా డ్రై ఫ్రూట్లు, కొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్షలతో అలంకరించబడుతుంది. ebs_bekal_0262 బియ్యానికి బదులు తరచు వర్మిసెల్లినీ ఉపయోగిస్తారు. ebs_bekal_0263 ఎలా చేరుకోవాలి ebs_bekal_0267 సమీప విమానాశ్రయం కర్ణాటకలోని మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో బాగా అనుసంధానించబడి ఉంది. ebs_bekal_0271 సమీప రైల్వే స్టేషన్ 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరగోడ్ వద్ద ఉంది. ebs_bekal_0275 జిల్లాలో, రాష్ట్రంలో వాహనాలు నడిపేందుకు వీలుగా ఉన్న మంచి రోడ్డులతో బేకల్ బాగా అనుసంధానించబడి ఉంది.