ID SENT ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0001 13. కార్బన్ : ఒక ముఖ్యమైన మూలకం ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0003 - కార్బన్-ఉనికి ధర్మాలు, రూపాంతరాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0005 - కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్ – ఉనికి, ధర్మాలు, ఉపయోగాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0007 - హైడ్రోకార్బన్ ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0011 1. మూలకాలు అనగా ఏమి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0012 మూలకాల యొక్క వివిధ రకాలు ఏవి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0014 2. ఏ పదార్థమైన పూర్తిగా దహనము చెందిన తర్వాత చివరకు ఏమి మిగులుతుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0016 3. కార్బన్ ఏ రకపు మూలకం? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0017 దీనికి సంబంధంచి సమాచారం చెప్పండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0019 గత తరగతిలో మీరు కార్బన్ అలోహ మూలకం అని అధ్యయనం చేసారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0020 కార్బన్ ప్రకృతిలో ఏయే సంయోగ పదార్థాలలో లభిస్తుంది అనే సమాచారం కూడా మీరు తెలుసుకున్నారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0024 1. ఒక ఆవిరి పాత్రలోకి కొంచెం పాలు తీసుకోండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0025 ఆవిరి పాత్రను బన్ సెన్ జ్వాలకం (బర్నర్) సహాయంతో వేడిచేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0026 పాలు పూర్తిగా మరిగించిన తర్వాత ఆవిరి పాత్ర అడుగున ఏమి మిగిలుతుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0028 2. వేర్వేరు పరీక్షనాళికలలోకి పంచదార, ఉన్ని, వాడిపోయిన పత్రాలు, వెంట్రుకలు, విత్తనాలు, పప్పులు, కాగితము, ప్లాస్టిక్ లను స్వల్ప పరిమాణంలో నమూనాలు తీసుకొండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0029 ప్రతి పరీక్షనాళికను వేడి చేసి పదార్థాలలో జరిగే మార్పులను పరిశీలించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0030 ప్రతి పరీక్షనాళకలో చివరకు మిగిలే నల్లటి పదార్థం దేనిని చూపిస్తుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0032 కార్బన్(Carbon) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0034 ప్రకృతిలో విస్తార పరిమాణంలో లభించే కార్బన్ మూలకం స్వేచ్ఛగా మరియు సంయోగస్థితిలో లభించును. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0035 కార్బన్ అలోహ మూలకం యొక్క వివిధ ధర్మాలను మనం ఈ పాఠములో అధ్యయనం చేద్దాం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0037 మీరు నిత్య జీవితములో ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పదార్థాలు/వస్తువులను ఉపయోగిస్తారో లేక తినడానికి ఉపయోగించే పదార్థాల జాబిత తయారు చేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0038 ఈ క్రింది పట్టికలో పదార్థాల/ వస్తువులను విభజించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0040 1. కార్బన్ సంకేతం – C ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0042 2. పరిమాణు సంఖ్య – 6 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0044 3. పరమాణు భారం – 12 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0046 4. ఎలక్ట్రాన్ విన్యాసం – 2,4 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0048 5. సంయోజకత – 4 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0050 6. అలోహ మూలకం ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0052 ఇపుడు చివర పట్టికలోని వస్తువుల జాబితా చూడండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0053 ఈ జాబితాలో ఆహార పదార్థలు, బట్టలు, మందులు, ఇంధనాలు, కర్ర వస్తువులు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0054 వీటన్నింటిలో కార్బన్ వైవిధ్య భరిత ముఖ్యమైన ఘటకం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0058 సంయోగ పదార్థం అనగా ఏమి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0059 సంయోగ పదార్థాలు ఎలా తయారవుతాయి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0061 మొక్కలు మరియు జంతువుల నుంచి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా లభించే సంయోగ పదార్థాలను “సేంద్రియ సంయోగ పాదార్థాలు ” అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0062 అదేవిధంగా ఖనిజ లవణాల నుంచి లభించే సంయోగ పదార్థాలను “అసేంద్రియ సంయోగ పదార్థాలు” అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0063 మన అనువంశీక ధర్మాలను ఒక తరం నుంచి రెండవ తరానికి సంక్రమింపచేసే కణంలోని DNA మరియు RNA లలో కూడా కార్బన్ ఒక ముఖ్యమైన ఘటకంగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0069 జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు వ్హోలర్ అనే అతడు అమోనియం సాయనెట్ అనే అసేంద్రియ సంయోగ పదార్థాలు నుంచి యూరియాను సంశ్లేషణ (synthesis) చేశాడు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0070 అప్పటి నుండి అసేంద్రియ సంయోగ పదార్థాల నుంచి అధిక పరిమాణంలో సేంద్రియ సంయోగ పదార్థాలను తయారు చేస్తున్నారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0071 ఈ సంయోగ పదార్థాలన్నిటిలో కార్బన్ ఒకటే ముఖ్యమైన మూలకం అనే విషయం స్పష్టమైనది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0072 అందువలన, సేంద్రియ రసాయన శాస్త్రాన్ని కార్బన్ సంయోగ పదార్థాల రసాయన శాస్త్రం అని కూడా అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0074 కార్బన్ ఉనికి (Occurrence of Carbon) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0076 లాటిన్ భాషలో ‘కార్బో’ అనగా బోగ్గు అని అర్థం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0077 దీనిని బట్టి ‘కార్బన్’ పేరు ఈ మూలకంగా పొందింది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0078 ప్రకృతిలో కార్బన్ స్వేచ్ఛగా మరియు సంయోగస్థితిలో లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0079 స్వేచ్ఛాస్థితిలో కార్బన్ వజ్రం, గ్రాఫైట్ స్థితిలో లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0080 క్రింది సంయోగ పదార్థాలలో కార్బన్ సంయోగస్థతిలో ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0082 1. కార్బన్ డయాక్సైడ్, కార్బోనేట్ రూపంలో ఉదాహరణకు కాల్షియం కార్బోనేట్, మార్బల్, క్యలమైన్(ZnCO_3) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0084 2. శిలాజ ఇంధనాలు – నేలబొగ్గు, పెట్రోలియం సహజ వాయువు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0086 3. కార్బన్ పోషకాలు – కార్బోహైడ్రేటులు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0088 4. ప్రకృతి ధారాలు – పత్తి, ఉన్ని, పట్టు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0090 విజ్ఞాన సీసా ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0092 భూమి కవచం (పొర)లో సుమారు 0.27% కార్బన్ కార్బోనేట్, బొగ్గు, పెట్రోలియం స్వరూపంలో ఉండును. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0094 కాని వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ రూపంలో సుమారు 0.03% ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0096 మహా సముద్రాల అడుగు భాగంలో కొన్ని రకాల మొక్కలు నీటిలోని కార్బన్ కాల్షియం కార్బోనేట్ గా రూపాంతరం చేస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0098 కార్బన్ యొక్క ధర్మాలు (Properties of Carbon) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0100 కార్బన్ యొక్క రూపాంతరత ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0102 రూపాంతరత (Allotropy) – ప్రకృతిలో కొన్ని మూలకాలు ఒకటి కంటె ఎక్కువ రూపాలలో లభిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0103 వాటి రసాయనిక ధర్మాలు ఒకే విధంగా ఉన్నప్పటికి భౌతిక ధర్మాలు భిన్నంగా ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0104 మూలకాల యొక్క ఈ ధర్మాన్ని ‘రూపాంతరత ’ అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0105 కార్బన్ తో పాటు సల్ఫర్, ఫాస్పరస్ మూలకాలు కూడా రూపాంతరతను ప్రదర్శిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0107 కార్బన్ యొక్క రూపాంతరాలు (Allotropes of Carbon) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0109 అ. స్ఫటిక రూపాలు (Crystalline forms) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0111 1. స్ఫటిక రూపంలోని పరమాణువుల నిర్మాణం క్రమంగా మరియు స్థిరంగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0113 2. వీటి ద్రవీభవన మరియు భాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0115 3. స్ఫటిక రూపంలోని కార్బన్ స్థిరమైన భౌతిక నిర్మాణం, పదునైన అంచులు మరియు బల్లపరుపు ఉపరితల భాగాన్ని కలిగి ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0117 కార్బన్ కు మూడు స్ఫటిక రూపాంతరాలు ఉన్నాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0119 1. వజ్రం (Diamond) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0121 భారతదేశంలో వజ్రాలు గోవల్ కొండ (కర్నాటక) మరియు పన్నా (మధ్యప్రదేశ్)లలో ముఖ్యంగా లభిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0122 భారతదేశం వలె దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బెల్జియం, రష్యా, అమెరికా దేశాలలో కూడా వజ్రాలు లభిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0126 నిర్మాణం : వజ్రం ప్రతి కార్బన్ పరమాణువు చుట్టు నాలుగు కార్బన్ పరమాణవులు సంయోజనీయ బంధాలతో బంధించబడి ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0127 ఈ దృఢమైన త్రిమితీయ నిర్మాణం వల్ల వజ్రానికి కఠినత్వం ప్రాప్తిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0131 1. తేజోవంతమైన మరియు శుద్ధమైన వజ్రం ప్రకృతిలో ఉన్న అన్ని పదార్థాలలో కెల్లా అతి కఠినమైన పదార్థం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0133 2. వజ్రం యొక్క సాంద్రత 3.5 g/cm^3. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0135 3. ద్రవీభవన స్థానం 3500 °C. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0137 4. ఆక్సిజన్ తో 800 °C వద్ద వజ్రాన్ని వేడి చేస్తే CO_2 బయటికి విడువబడుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0138 ఈ చర్యలో CO_2 తప్ప ఏ పదార్థం తయారు కాదు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0140 5. ఏ ద్రావణంలో కూడా వజ్రం కరగదు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0142 6. వజ్రం పై ఆమ్లాలు/ క్షారాలు ఎటువంటి ప్రభావాన్ని చూపవు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0144 7. వజ్రం అధమ విద్యుత్ వాహకంగా ఉంటుంది. ఎందుకంటే అందులో స్వేచ్ఛా ఎలక్ట్రానులుండవు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0148 1. గాజును కోయడానికి మరియు పెద్ద రాళ్ళకు రంధ్రాలు చేసే పరికరాలలో వజ్రాన్ని ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0150 2. అలంకార వస్తువులను తయారు చేయడానికి వజ్రాన్ని ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0152 3. కళ్ళకు శస్త్ర క్రియ చేసే పరికరాలలో వజ్రాన్ని వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0154 4. వజ్రపు పొడిని మరొక వజ్రాన్ని మెరిపించడానికి వాడతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0156 5. ఆకాశంలో మరియు కృత్రిమ ఉపగ్రహాలలోని వికిరణాల నుంచి రక్షణ ఇచ్చే కిటికీల తయారిలో వజ్రాలను ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0158 చరిత్రలోకి తొంగిచూడగా ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0160 ఒకానొక కాలములో భారత దేశము ‘కొహినూర్’ వజ్రానికి చాలా ప్రసిద్ధి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0161 ఈ వజ్రం గుంటూరు (ఆంధ్రప్రదేశ్) లోని కొల్గుర్ గనిలో 13వ శతాబ్దంలో లభించింది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0162 దాని బరువు 186 క్యారెట్లు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0164 2. గ్రాఫైట్ (Graphite) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0166 ప్రకృతి గ్రాఫైట్ రష్యా, న్యూజిలాండ్, అమెరికా మరియు భారత దేశంలో కన్పిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0167 గ్రాఫైట్ ను నికోలాస్ జాక్స్ క్యాంటీ 1795 సంవత్సరంలో కనుగొన్నాడు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0168 పెన్సిల్ లో వాడే లెడ్ కూడా గ్రాఫైట్ మరియు మట్టి నుంచి తయారు చేయబడుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0170 నిర్మాణము : గ్రాఫైట్ లో ప్రతి కార్బన్ పరమాణువు ఇతర మూడు కార్బన్ పరమాణువులతో బంధితమై గ్రాఫైట్ నిర్మాణం షట్కోణ తలంగా తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0171 గ్రాఫైట్ స్ఫటికాలు అనేక పరమాణవుల పొరలతో తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0172 పీడనాన్ని కల్గిస్తే గ్రాఫైట్ పొరలు ఒకదాని మీద ఒకటి జారుతాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0173 గ్రాఫైట్ యొక్క ఒక పరమాణు పొరను ‘గ్రాఫిన్’ అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0179 పరికరాలు : పెన్సిల్, విద్యుత్తు తీగ, బ్యాటరీ/ఘటం చిన్న బల్బు, నీరు, కిరోసిన్, పరీక్ష నాళిక, పెన్సిల్ లోని లెడ్ మొదలగునవి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0181 కృత్యము: ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0183 1. పెన్సిల్ లోని లెడ్ తీసి, ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0184 చేతితో స్పర్శించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0185 దాని రంగు ఎలా ఉన్నది చూడండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0186 దానిని చేతిలో విరిచి చూడండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0188 2. పటంలో చూపిన మాదిరిగా పరికరాలను అమర్చండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0189 విద్యుత్తును పంపించి, ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0190 పరిశీలించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0193 3. ఒక పరీక్ష నాళికలో నీటిని తీసుకొండి, రెండవ పరీక్ష నాళికలో కిరోసిన్ తీసుకోండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0194 రెండు పరీక్ష నాళికలలో పెన్సిల్ లెడ్ ను పొడిచేసి వేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0195 ఏమి కనిపిస్తుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0197 గ్రాఫైట్ ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0199 1. ప్రకృతిలో లభించే గ్రాఫైట్ నల్లగా, మెత్తగా, పెళుసుగా మరియు మృదువుగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0201 2. గ్రాఫైట్ లోపల అన్ని పొరలలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు తిరుగుతు ఉండటం వలన ఇది ఉత్తమ విద్యుద్వాహకంగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0203 3. పొరల నిర్మాణం వల్ల వీటిలో కాగితం పై స్పష్టంగా రాసే సామర్థ్యం ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0205 4. గ్రాఫైట్ సాంద్రత 1.9 నుంచి 2.3 g/cm3 ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0207 5. గ్రాఫైట్ చాలా మటుకు ద్రావణాలలో కరగదు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0209 గ్రాఫైట్ ఉపయోగాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0211 1. గ్రాఫైట్ ను కందెన తయారికి ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0213 2. కార్బన్ ఎలక్ట్రొడులను తయారు చేయడానికి గ్రాఫైట్ ను వాడతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0215 3. గ్రాఫైట్ ను రాసే పెన్సిల్ లలో ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0217 4. రంగు, పాలిష్ లలో కూడా గ్రాఫైట్ ను వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0219 5. బాగా వెలుతురు నిచ్చే ఆర్క్ ల్యాంపులలో గ్రాఫైట్ వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0221 3. ఫుల్లెరిన్ (Fullerene) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0223 ఫుల్లెరిన్ కార్బన్ యొక్క రూపాంతరం ప్రకృతి తక్కువ పరిమాణంలో లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0224 ఫుల్లెరిన్ ను మసిలో, తారల మధ్య అక్కడక్కడ ప్రదేశాలలోని మేఘాలలో అలాగే భూగర్భం యొక్క నిర్మాణంలో లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0225 బకమిన్ స్టర్ ఫుల్లెరిన్ (Buck minster fullerence) (C_60). ఇది ఫుల్లెరిన్ కు మొదటి ఉదాహరణ. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0226 రిచర్డ్ బకమిన్ స్టర్ ఫులర్ అను వాస్తు శాస్త్రజ్ఞుడు చేసిన గోళాకార గుమ్మటం యొక్క నిర్మాణాన్ని బట్టి కార్బన్ యొక్క రూపాంతరానికి ఫుల్లెరిన్ అను పేరు వచ్చింది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0228 C_60 ఫుల్లెరిన్ కార్బన్ రూపాంతరాన్ని పరిశోధించి నందుకు హరాల్డ్, క్రోటో, రాబర్ట్ కర్ల్ మరియు రిచార్డ్ స్మాలీలకు 1996 సంవత్సరపు రసాయన శాస్త్రం యొక్క నోబెల్ బహుమతి ఇవ్వబడింది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0230 C_60, C_70, C_76, C_82 మరియు C_86 ఇవి ఫుల్లెరిన్ కు మరికొన్ని ఉదాహరణలు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0231 ఈ రేణువులు కొద్ది పరిమాణంలో కాటుకలో లభించును. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0237 1. ఫుల్లెరిన్ అణువులు బకీబాల్, బకీట్యూబ్స్ రూపంలో కనిపిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0239 2. ఒక ఫుల్లెరిన్ అణువులో సాధారణంగా 30 నుంచి 900 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0241 3. ఫుల్లెరిన్ కార్బన్ ద్రావణిలలో కరుగుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0242 ఉదాహరణ: కార్బన్ డైసల్ఫైడ్, క్లోరో బెంజిన్. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0246 1. ఫుల్లెరిన్ ను ఇన్సులేటర్ల (విద్యుత్ నిరోధకాలు) లో ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0248 2. జల శుద్ధీకరణలో ఫుల్లెరిన్ ఉత్ప్రేరకంగా వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0250 3. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఫుల్లెరిన్ అతి వాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0252 ఆ. స్ఫటిక రహిత రూపాంతరాలు (Non-crystalline / Amorphous forms) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0254 ఈ రూపంలో కార్బన్ అణువుల నిర్మాణం క్రమరహితంగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0255 నేల, బొగ్గు, కోక్ అను నవి కార్బన్ యొక్క స్ఫటిక రహిత రూపాంతరాలు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0257 నేల బొగ్గు : ఇది శిలాజ ఇంధనం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0258 దీనిలో కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సీజన్ ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0259 స్వల్ప పరిమాణంలో నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ లు ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0260 ఇవి ఘన రూపంలో లభిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0261 ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0263 అ. పీట్ : బొగ్గు తయారిలో మొదటి సోపానం పిట్ తయారగుట. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0264 దీనిలో నీటి పరిమాణం ఎక్కువగా మరియు కార్బన్ పరిమాణం సుమారు 60% కంటే తక్కువ ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0265 కాబట్టి, తక్కువ ఉష్ణం లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0267 ఆ. లిగ్నైట్ : భూమి లోపల పెరిగే పీడనం మరియు ఉష్ణోగ్రత వల్ల పీట్ లిగ్నైట్ గా రూపాంతరం చెందుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0268 దీనిలో కార్బన్ పరిమాణం సుమారు 60 నుంచి 70% ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0269 బోగ్గు తయారయ్యే రెండవ సోపానం అనగా లెగ్నైట్. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0271 ఇ. బీట్యూమినస్ : బొగ్గు తయారి యొక్క మూడవ సోపానంలో బీట్యూమినస్ తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0272 దీనిలో కార్బన్ పరిమాణం సుమారు 95% ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0274 ఈ. ఆంథ్రాసైట్ : శుద్ధ రూప బొగ్గుగా ఆంథ్రాసైట్ ను గుర్తిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0275 ఈ బొగ్గు కఠినంగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0276 దీనిలో కార్బన్ పరిమాణం సుమారు 95% ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0278 2. చార్కోల్ (Charcoal) : జంతువుల నుంచి తయారయ్యే ఈ చార్కోల్ జంతువుల ఎముకలు, కొమ్ములు మొదలగు వాటి నుంచి తయారు చేస్తారు. అయితే మొక్కల నుంచి తయారయ్యే చార్కోల్ కర్రలను అసంపూర్ణంగా గాలిలో మండించినప్పుడు తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0280 బొగ్గు యొక్క ఉపయోగాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0282 1. కర్మాగారాలు మరియు గృహాలలో బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0284 2. కోక్, కోల్ గ్యాస్ మరియు కోల్తార్ పొందటానికి బొగ్గును ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0286 3. విద్యుత్తును ఉత్పత్తి చేయుటకు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గును ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0288 4. జల శుద్ధీకరణ, అలాగే సేంద్రియ పదార్థాల శుద్ధీకరణలో చార్కోల్ ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0290 3. కోక్ : రాతి బొగ్గు నుంచి కొల్ గ్యాస్ తీసిన తర్వాత మిగిలిన శుద్ధమైన బొగ్గును కోక్ అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0292 కోక్ ఉపయోగాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0294 1. గృహ సంబంధమైన ఇంధనంగా వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0296 2. క్షయ కారిణిగా (Reducing Agent) కోక్ను ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0298 3. నీటి గ్యాస్ (CO+H_2) మరియు ప్రొడ్యూసర్ గ్యాస్ (CO+H_2+CO_2+ N_2) అను వాయు రూప ఇంధనాల తయారీలో కోక్ ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0302 హైడ్రో కార్బన్లు : మౌలిక కార్బన్ సంయోగ (సేంద్రియ) పదార్థాలు (Hydrocarbons : Basic Organic Compounds) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0304 చాలా మటుకు కార్బన్ సంయోగ పదార్థాలలో కార్బన్ తో పాటు హైడ్రోజన్ మూలకం ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0305 ఈ మౌలిక సేంద్రియ సంయోగ పదార్థాలను ‘మౌలిక సంయోగ పదార్థాలు’ గా గుర్తిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0306 వీటిని హైడ్రో కార్బన్లు అని కూడా అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0308 కార్బన్ లో 2, 4ల ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0309 అందువల్ల, కార్బన్ పరమాణువు యొక్క రెండవ కక్ష్యలో 4 ఎలక్ట్రానులు లభిస్తే చివరి కక్ష్యలో అష్టకం పూర్తి అయితే సమీప జడవాయువు (2,8) మాదిరిగా స్థిరత్వాన్ని పొందుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0310 కాని ఇలా జరుగుచుండగా ఎలక్ట్రానులను ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా భాగస్వామ్యంగా ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0311 అందువల్ల కార్బన్ సంయోజకత 4 ఉంది. అనగా అది రెండవ కార్బన్ తో లేక రెండవ మూలకం యొక్క పరమాణువుతో ఎక్కువలో ఎక్కువ నాలుగు సమయోజనీయ బంధాలను (Covalent Bond) తయారు చేసుకోగలదు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0313 కార్బన్ ప్రతి ఒక ఎలక్ట్రాన్ చొప్పున నాలుగు హైడ్రోజన్ పరమాణువులతో నాలుగు C-H ఎలక్ట్రానులను పంచుకొని నాలుగు బంధాలను తయారు చేసినపుడు మిథేన్ CH_4 అణువు తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0315 సమయోజనీయ సంయోగ పదార్థాల ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0317 1. సమయోజనీయ సంయోగ పదార్థాల భాష్పీ భవన స్థానాలు మరియు ద్రవీ భవన స్థానాలు తక్కువ ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0319 2. సాధారణంగా ఇవి నీటిలో కరుగవు. కాని సేంద్రియ ద్రావణిలలో కరుగుతాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0321 3. వీటిలో ఉష్ణం మరియు విద్యుత్తు తక్కువ పరిమాణంలో ప్రవహిస్తాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0323 సంతృప్త మరియు అసంతృప్త హైడ్రోకార్బన్ (Saturated and Unsaturated Hydrocarbons) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0325 కార్బన్ పరమాణువు ప్రత్యేకమైన ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0326 అది ఇతర కార్బన్ పరమాణువులతో సమయోజనీయ (covalent) బంధాన్ని ఏర్పరచుకొని కార్బన్ పరమాణువుల శృంఖలాన్ని(గొలుసు) తయారు చేసుకోగలదు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0327 ఏ హైడ్రోకార్బన్ల పరమాణువులన్నిటి మద్య కేవలం ఏక బంధం ఉండునో వాటిని “సంతృప్త హైడ్రోకార్బన్” అని అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0328 ఉదాహరణ : ఇథేన్ (C_2H_6) అనగా (CH_3-CH_3), ప్రొపేన్ (CH_3-CH2-CH_3) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0330 కొన్ని హైడ్రోకార్బన్లలో రెండు కార్బన్ పరమాణువుల మధ్య బహు బంధాలు ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0331 ఈ బహు బంధాలు లేక త్రి బంధాలుగా ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0332 ఏ హైడ్రోకార్బన్లలో కనిష్ఠంగా ఒక బహుబంధం ఉంటుందో వాటిని ‘అసంతృప్త హైడ్రోకార్బన్లు’ అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0333 ఉదాహరణ : ఇథిన్ (H_2C = CH_2), ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0335 ఇథిన్ (HC ≡ CH) CH), ప్రొపీన్ (CH_3-CH = CH_2), ప్రోపైన్ (CH_3-C ≡ CH) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0339 రెండు కార్బన్ పరమాణవులలో సమయోజనీయ బంధం ఉన్నపుడు ఆ పరమాణువులపై ఆవేశం నిర్మాణమవుతుందా? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0340 రెండు కార్బన్ పరమాణువులలోని ఏక బంధం బలంగా మరియు స్థిరంగా ఎందుకుంటుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0342 కార్బన్ యొక్క ద్రావణీయత (Solubility of Carbon) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0346 పరికరాలు : 3 శంక్వాకార పాత్రలను, స్టర్రర్స్ (కలిపే సాధనాలు) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0348 రసాయన పదార్థాలు : నీరు, కిరోసిన్ మంచి నూనె, బొగ్గు పొడి మొదలగునవి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0350 కృత్యము : మూడు శంఖు పాత్రలను తీసుకోని వరుసగా వాటిలో మంచి నూనె, నీరు మరియు కిరోసిన్ తీసుకోండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0351 ప్రతి శంకు పాత్రలో సగం చెమ్చా బొగ్గు పొడిని వేసి స్టర్రర్ సహాయంతో కలపండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0352 మూడు శంకు పాత్రలలోని ద్రావణాలను ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0360 1. నీరు, కిరోసిన్ మరియు మంచి నూనె వీటిలో ఏయే ద్రావణాలలో బొగ్గు పొడి కరుగుతుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0362 2. కార్బన్ యొక్క ద్రావణీయత విషయంగా మీరు ఏమని అంచనా వేయవచ్చు? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0364 3. కార్బన్ ఏ ద్రావణంలోను ఎందుకు కరుగదు? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0366 ఆక్సిజన్ తో కార్బన్ చర్య (Reaction of Carbon with Oxygen) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0370 పరికరాలు : బొగ్గు, అగ్గిపెట్టె, తడి నీలి లిట్మస్ మొదలగునవి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0372 కృత్యం : బొగ్గును కాల్చండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0373 బొగ్గును మండిస్తే దాని నుంచి వెలువడే వాయువు పై తడి లిట్మస్ ను ఉంచండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0374 పరిశీలనలను నమోదు చెయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0376 1. బొగ్గును మండించిన తర్వాత అది గాలిలోని ఏ వాయువుతో చర్య జరుపుతుంది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0378 2. తయారయ్యే పదార్థాలు ఏవి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0380 3. లిట్మస్ కాగితంలో ఏ మార్పులు జరుగుతాయి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0382 4. పై కృత్యంలో జరిగే రసాయనిక చర్యను రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0384 పరికరాలు : పరీక్ష నాళికలు, స్ట్రాలు, సున్నపు తేట మొదలగునవి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0386 కృత్యం : ఒక పరీక్ష నాళికలో తాజా సున్నపు తేటను తీసుకొండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0387 స్ట్రా సహాయంతో తేటలోకి ఊదండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0388 తేటను పరిశీలించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0390 ఏమి కనిపించింది? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0391 మార్పునకు కారణమేమి ఉండవచ్చు? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0395 అణు ఫార్ములా : CO_2, అణు భారం : 44 ద్రవీభవన స్థానం :-56 °C ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0397 ఉనికి : గాలిలో కార్బన్ డయాఆక్సైడ్ స్వేచ్ఛా స్థితిలో ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0398 నిశ్వాసం ద్వారా బయటపడే CO_2 గాలిలో సుమారు 4% ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0399 చాక్ పీస్, షాబాదిరాళ్ళలో CO_2 సంయోగస్థితిలో ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0400 కర్ర, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల యొక్క ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0401 దహనం వల్ల CO_2 బయటికి విడుదలవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0403 పరికరాలు : స్టాండు, గుండ్రని గాజు కుప్పె, థిసిల్ గారాటు, వాయు పాత్రలు, ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0407 రసాయనాలు : కాల్షియం కార్బోనేట్, షాబాది రాళ్ళముక్కలు/చలువరాళ్ళు, కాలని సున్నం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0413 1. పటంలో చూపిన విదంగా పరికరాలను అమర్చండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0414 అమర్చేటప్పుడు గుండ్రని గాజు కుప్పెలో CaCO_3 వేసి ఉంచండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0416 2. థిసిల్ గరాటు ద్వారా సజల HCl ను గాజు కుప్పెలో పోయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0417 థిసిల్ గరాటు కొన ఆమ్లంలో మునుగు నట్లు జాగ్రత తీసుకొండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0419 3. CaCO_3 మరియు సజల HClల మధ్య చర్య జరిగి CO_2 తయారగును. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0420 ఈ వాయువును నాలుగు లేదా ఐదు వాయు పాత్రలలో నింపండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0421 పై చర్య యొక్క ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0423 రసాయనిక సమీకరణం క్రింది విధంగా ఉంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0425 CaCO_3 + 2HCl → CaCl_2 + H_2O + CO_2 ↑ ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0427 కార్బన్ డయాక్సైడ్ యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0429 1. పై ప్రయోగంలో తయారైన వాయువు రంగును చూడండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0431 2. వాయు పాత్రలోని వాయువు యొక్క వాసనను చూడండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0433 (కృత్యం 3 నుంచి 7 కొరకు వేర్వేరు వాయు పాత్రలను వాడండి.) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0435 3. వాయు పాత్ర మూతను తీసి, దానిలోకి కొంచెం సున్నపు తేటను వేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0437 4. ఒక మండుతున్న క్యాండిల్ను వాయు పాత్రలో పెంటండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0439 5. కొంచెం సార్వత్రిక సూచికల ద్రావణము CO_2 తో నింపబడిన వాయు పాత్రలో పోసి కలపండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0441 6. వాయు పాత్రలో కొంచెం నీరు పోసి, వాయు పాత్రను కలపండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0443 7. నీలి మరియు ఎరుపు లిట్మస్ కాగితాన్ని తడిచేసి CO_2 వాయు పాత్రలో వేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0445 పై కృత్యాల పరిశీలనలను క్రింది పట్టికలో నమోదు చేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0447 CO_2 యొక్క భౌతిక ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0449 CO_2 యొక్క రసాయనిక ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0453 CO_2 సాంద్రతను గాలితో పోలిస్తే ఎక్కువ ఎక్కువనా? తక్కువనా? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0455 page-145 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0457 అ. పై ప్రయోగంలో నీరు మరియు కార్బన్ డయాక్సైడ్లలో జరిగే రసాయనిక చర్యల సమీకరణం రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0459 ఆ. CO_2 వాయుపుత్రలో పొడిసున్నం వేసినపుడు జరిగే రసాయనిక చర్య సమీకరణాన్ని రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0461 కార్బన్ డయాక్సైడ్ యొక్క మరికొన్ని రసాయనిక ధర్మాలు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0463 1. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క జల ద్రావణంలో కార్బన్ డయాక్సైడ్ ను పంపించినచో సోడియం కార్బోనేట్ లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0464 (సోడియం కార్బోనేట్ – ఉతికే సోడా) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0466 రసాయన సమీకరణం ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0468 2NaOH + CO_2 → Na_2CO_3 + H_2O ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0470 2. సోడియం కార్బోనేట్ యొక్క నీటిలోని ద్రావణంలోకి CO_2 పంపినచో సోడియం బై కార్బోనేట్ లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0471 (సోడియం బై కార్బోనేట్ – తినే సోడా) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0475 Na_2CO_3 + H_2O + CO_2 → 2NaHCO_3 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0477 కార్బన్ డయాక్సైడ్ ఉపయోగాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0479 1. బుస బుస అని పొంగే శీతల పానీయాలు తయారు చేయుటకు CO_2 ను వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0481 2. ఘనరూప కార్బన్ డయాక్సైడ్ ను శీతలీకరణ పెట్టెలలో పాలు మరియు పాల ఉత్పతులను చల్లబరుచుటకు, ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0482 అలాగే సినిమా – నాటకాలలో పొగ మంచు పరిమాణం ఏర్పాటు చేయుటకు ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0484 3. అగ్ని మాపక యంత్రాలలో రసాయనిక చర్య ద్వారా ఏర్పడే లేక పీడనం క్రింద ఉంచిన CO_2 ను ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0486 4. కాఫి నుంచి కఫిన్ తీసి వేయడానికి CO_2 ను వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0488 5. ద్రావణిగా ద్రవరూప CO_2 ను అత్యాధునిక పర్యావరణ అనుబంధ డ్రైక్లీనింగ్ ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0490 6. మొక్కలు గాలిలోని CO_2 ను కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకొంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0492 సాంప్రదాయక అగ్ని మాపక యంత్రం (Regular Fire Extinguisher) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0494 సాంప్రదాయక అగ్ని మాపక యంత్రంలో సోడియం బై కార్బోనేట్ పొడి ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0495 ఒక గాజు సీసాలో సజల సల్ఫూరిక్ ఆమ్లం ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0496 యంత్రం యొక్క పిడిని నొక్కగానే సీసా పగిలి సిసా నుండి సల్ఫ్యూరికామ్లం సోడియం బై కార్బోనేట్ పై పడుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0497 అప్పుడు వీటిలో రసాయనిక చర్య జరిగి CO_2 విడుదలై బయటికి వస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0499 CO_2 అగ్ని మాపక యంత్రం అనునది తుప్పు పట్టకుండా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0500 అలాగే విద్యుత్ ప్రవాహానికి ప్రతి బంధకంగా ఉంటుంది. దానివల్ల విద్యుత్తు పరికరాలకు మరియు యంత్రాలకు తగులుకుండ మంటలలో ఈ అగ్నిమాపక యంత్రమును వాడతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0502 CO_2 అగ్ని మాపక యంత్రాన్ని తక్కువ పరిమాణంలోని మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0503 అధిక పరిమాణంలో అంటుకున్న మంటలను ఆర్పుట చేయిదాటి పోయినపుడు CO_2 అగ్నిమాపక యంత్రం సరిపోదు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0504 ఆధునిక అగ్నిమాక యంత్రాలలో ద్రవ రూప మరియు ఘన రూప CO_2 ను పీడనాన్ని కింద నింపుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0505 పీడనాన్ని తగ్గించినచో వాయు రూప స్థితికి చేరి నాళం నుంచి వేగంగా బయటికి వస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0507 `రసాయనిక చర్య ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0509 2NaHCO_3 + H_2SO_4 → Na_2SO_4 + 2H_2O + 2CO_2 ↑ ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0511 ఇపుడు వేర్వేరు రకాల అగ్నిమాపక యంత్రాలను వాడుతున్నారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0512 వాటిని CO_2 వల్ల మంటలు ఎలా ఆర్పుతారో దానికి సంబంధించిన అధిక సమాచారం తెలుసుకోండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0514 page-146 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0516 మీథేన్ – అణు ఫార్ములా CH_4, అణు భారం – 16 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0518 ఉనికి ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0520 1. సహజ వాయువులో సుమారు 87% మీథేన్ వాయువు ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0522 2. జీవ పదార్థాలలో గాలి లేనప్పుడు జరిగే విచ్ఛిన్నం వలన ఇది తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0524 3. బయోగ్యాస్లో కూడా మీథేన్ ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0526 4. బొగ్గు గనులలో కూడా మీథేన్ వెలువడుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0528 5. బురద/ చిత్తడి నేల ఉపరితలం భాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0529 అందువలన దీనిని ‘మార్ష వాయువు’ అని కూడా అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0531 6. ప్రయోగశాలలో హైడ్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ మిశ్రమాన్ని 300 °C వద్ద నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో వేడి చేసినప్పుడు మిథేన్ వాయువు తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0533 7. సహజ వాయువు యొక్క అంశిక స్వేదన క్రియ ద్వారా శుద్ధ స్థితిలోని మీథేన్ ను పొందవచ్చును. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0535 మీథేన్ భౌతిక ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0537 1. మీథేన్ ద్రవీభవన స్థానం – 182 °C. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0539 2. మీథేన్ యొక్క భాష్పీభవన స్థానం – 161.5°C ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0541 3. ఇది రంగు లేని వాయువు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0543 4. ద్రవ రూప మీథేన్ సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0545 5. మీథేన్ చాలా కొద్ది పరిమాణంలో నీటిలో కరుగుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0546 కాని గ్యాసోలిన్, ఈథర్, ఆల్కహాల్ వంటి సేంద్రియ ద్రావణిలో ఎక్కువగా కరుగుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0548 6. గది ఉష్ణోగ్రత వద్ద మీథేన్ వాయు స్థితిలో ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0550 మీథేన్ యొక్క రసాయనిక ధర్మాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0552 1. మీథేన్ అత్యధిక దహనశీల వాయువ. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0553 అందువలన ఇది మండునపుడు ఆక్సీజన్ తో చర్య జరిగి నీలి రంగు జ్వాల లభిస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0554 ఈ చర్యలో 213 kcal/mol ఉష్ణం బయటికి వస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0555 మీథేన్ వాయువు పూర్తిగా మండుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0559 CH_4 + 2O_2 → CO_2 + 2 H_2O + ఉష్ణం ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0561 2. క్లోరినేష్న్ (Chlorination) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0563 అతినీలలోహిత కిరణాల సమక్షంలో 250 °C నుంచి 400 °C ఉష్ణోగ్రత వద్ద మీథేన్ మరియు క్లోరిన్ వాయువుల మధ్య చర్య జరిగి ముఖ్యంగా మిథిల్ క్లోరైడ్ (క్లోరోమిమీథేన్) మరియు హైడ్రోజన్ క్లోరైడ్ తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0564 ఈ చర్యను మీథేన్ క్లోరినేషన్ అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0566 మీథేన్ ఉపయోగాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0568 1. సహజ వాయువు స్థితిలోని మీథేన్ ను వస్త్ర పరిశ్రమలు, ఆహార ప్రక్రియ పరిశ్రమలు,పెట్రోలియం శుద్ధీకరణ మొదలగు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0570 అన్నింటి కంటే చిన్న పొడవు గల హైడ్రోకార్బన్ కావడం వలన మీథేన్ జ్వలనం నుంచి వెలువడిన CO_2 పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0571 కాబట్టి దీనిని గృహసంబంధ ఇంధనంగా వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0573 3. ఇథేనాల్, మిథైల్ క్లొరైడ్, మిథిలీన్ క్లోరైడ్ అలాగే అమోనియా మరియు అసిటిలిన్ వంటి కార్బన్ సంయోగ పదార్థాల తయారిలో మీథేన్ ను ఉపయోగిస్తారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0575 1776 నుంచి 1778 మధ్య అలేగ్జాండ్రో వోల్టా అనునతడు చిత్తడినేలలోని వాయువును అధ్యయనం చేస్తున్నప్పుడు మీథేన్ వాయువును పరిశోధించినాడు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0577 page-147 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0579 సాంకేతిక సమాచారపు ప్రసారంతో జోడింపు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0581 కార్బన్ మరియు దాని విస్తృత సమాచార విషయంగా రిపోర్టు తయారు చేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0582 దీని కొరకు నోట్ ప్యాడ్, వర్డ్ మొదలగు కంప్యూటర్ ప్రణాళికను వాడండి మరియు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0583 తయారు చేసిన రిపోర్టు ఇతరులకు పంపండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0585 సంకేత స్థలం https://www.boundless.com/chemistry/, www.rsc.org/learn-chemistry ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0587 బయోగ్యాస్ యంత్రం : బయోగ్యాస్ యంత్రంలో జంతువుల పేడ, ఆకులు అలములు, తడి చెత్త మొదలగు అవాయు బాక్టీరియాల ద్వారా విచ్చిన్నమవుతాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0588 వాటి నుంచి మీథేన్ వాయువు తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0589 దీనినే “బయోగ్యాస్” అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0590 బయోగ్యాస్ వంట చేయుటకు అతి చౌక ఇంధన ప్రత్యామ్నాయం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0591 బయోగ్యాస్ యంత్రాన్ని విద్యుత్తు తయారికి కూడా వాడుతారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0592 బయోగ్యాస్ లో సుమారు 55- 60% మీథేన్ మరియు మిగిలిన భాగం కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0593 బయోగ్యాస్ ఉపయోగించడానికి అధిక అనుకూలమైన ఇంధనం అంతేగాకుండా గ్యాస్ తయారవుతున్నపుడు ఇందులో మేలు రకమైన ఎరువు కూడా తయారవుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0595 బయోగ్యాస్ నిర్మాణ ప్రక్రియ : ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0597 బయోగ్యాస్ నిర్మాణ ప్రక్రియ అవాయు రకంగా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0598 ఇది రెండో దశలలో జరుగుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0600 1. ఆమ్లాల తయారి (Production of Acids) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0602 చేతిలోని జీవ విచ్ఛిన్న శీల సంక్లిష్ట సేంద్రియ సంయోగ పదార్థాల పై బాక్టీరియా చర్య జరిపి సేంద్రియ ఆమ్లాలను (Organic Acids) తయారు చేస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0604 2. మీథేన్ వాయువు తయారి Methane Gas Production) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0606 మిథేనోజెనిక్ బాక్టీరియా సేంద్రియ ఆమ్లాల పై చర్య జరిపి మీథేన్ వాయువును ఏర్పరుస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0608 CH_3COOH → CH_4 + CO_2 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0610 సమాచారం పొందండి ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0612 బయోగ్యాస్ యంత్రం ఉన్న చోట దర్శించండి. యంత్రము యొక్క ప్రత్యేక పని తీరును తెలుసుకొని, దాని ద్వారా ఏయే విద్యుత్తు ఉపకరణాలు పని చేస్తాయో సమాచారం పొందండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0614 page-148 ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0618 1. దిగువ ఇవ్వబడిన పర్యాయాల్లో సరియైన పర్యాయాన్ని ఎన్నుకొని వాక్యాలు పూర్తి చేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0620 (ఏకబంధం, అన్ని ద్విబంధం, అయానిక్, కార్బన్, ఇచ్చిపుచ్చుకొను, హైడ్రోజన్, బహుబంధం, భాగస్వామ్యంగా, సేంద్రియ, సమయోజనీయ) ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0622 అ. కార్బన్ పరమాణువు ఇతర పరమాణువులతో....... బంధం చేస్తుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0623 ఈ బంధం రెండు పరమాణువులలో ఎలక్ట్రానులు........ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0625 ఆ. సంతృప్త హైడ్రోకార్బనులలో అన్ని కార్బన్ బంధాలు అనునవి .........గా ఉంటాయి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0627 ఇ. అసంతృప్త హైడ్రోకార్బనులలో కనీసం ఒక బంధం ...........గా ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0629 ఈ. అన్ని సేంద్రీయ పదార్థాలలో అత్యావశ్యకమైన మూలకం ............ ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0631 ఉ. హైడ్రోజన్ మూలకం చాలా మటుకు ............ పదార్థాలలో ఉంటుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0633 2. క్రింది ప్రశ్నలకు జవాబు రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0635 అ. కార్బన్ మరియు వాటి సంయోగ పదార్థలను ఇంధనంగా ఎందుకు ఉపయోగిస్తారు? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0637 ఆ. కార్బన్ సంయోగ పదార్థాలు ఏయే రూపంలో లభిస్తాయి? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0639 ఇ. వజ్రం యొక్క ఉపయోగాలు రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0641 3. భేదాలు రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0643 అ. వజ్రం మరియు గ్రాఫైట్ ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0645 ఆ. కార్బన్ యొక్క స్ఫటిక మరియు స్ఫటిక రహిత రూపాంతరాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0649 అ. గ్రాఫైట్ అనేది విద్యుద్వాహకం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0651 ఆ. గ్రాఫైట్ ను ఆభరణాలలో ఉపయోగించరు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0653 ఇ. సున్నపు తేటలోకి CO_2 వాయువును పంపించినచో సున్నపు తేట పాల వలె మారుతుంది. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0655 ఈ. బయోగ్యాస్ పర్యావరణ స్నేహి ఇంధనం. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0657 5. స్పష్టీకరిచండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0658 “SEG273” ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0659 అ. వజ్రం, గ్రాఫైట్ మరియు ఫులెరిన్ అనేవి కార్బన్ యొక్క స్ఫటిక రూప రూపాంతరాలు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0661 ఆ. మీథేన్ ను మార్ష్ వాయువు అంటారు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0663 ఇ. పెట్రోల్, డిజిల్, నేల బొగ్గులు శిలాజ ఇంధనాలు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0665 ఈ. కార్బన్ యొక్క వివిధ రూపాంతరాల ఉపయోగాలు. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0667 ఉ. అగ్నిమాపక యంత్రంలో CO_2 వాయువు ఉపయోగాలు వివరించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0669 ఊ. CO_2 యొక్క వ్యవహారిక ఉపయోగాలు వివరించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0671 6. ప్రతి దానికి రెండు భౌతిక ధర్మాలు రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0673 అ. వజ్రం ఆ. బొగ్గు ఇ.కార్బన్ యొక్క స్ఫటిక రూపాలు ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0675 7. క్రింది రసాయనిక చర్యలను పూర్తి చేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0677 1. ...... + ...... → CO_2 + H_2O + ఉష్ణం ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0679 2. ...... + ...... → CH_3Cl + HCl ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0681 3. 2 NaOH + CO_2 → ...... + ...... ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0683 8. క్రింది ప్రశ్నలకు విస్తృత రూపంలో జవాబు రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0685 అ. బొగ్గు రకాలను తెలుపుతు వాటి ఉపయోగాలు రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0687 ఆ. గ్రాఫైట్ విద్యుద్వాహకం అని నిరూపించే చిన్న ప్రయోగాన్ని రాయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0689 ఇ. కార్బన్ ధర్మాలను స్పష్టీకరించండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0691 ఈ. కార్బన్ ను వర్గీకరణ చేయండి. ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0693 9. కార్బన్ డయాక్సైడ్ ధర్మాలను ఎలా పరీక్షించి చుస్తారు? ebs_che-carbon-ek-mahtpurn-tatv-page-138-149-translation-hin2tel_0697 బయోగ్యాస్ యంత్రం యొక్క మాడల్ తయారు చేసి గ్యాస్ తయారు చేసే ప్రక్రియను తరగతిలో ప్రదర్శించండి.