ID SENT ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0002 డార్జిలింగ్ ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0004 ట్యాగ్‌లైన్: కొండల రాణి ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0006 మార్చి నుండి మే వరకు, సెప్టెంబరు నుండి నవంబరు వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0008 ఉద్ధరణ: మనోహరమైన పర్వతాలు, మఠాల నుండి జాతీయ ఉద్యానవనాలు, సంగ్రహాలయాల వరకు, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ లో యాత్రికులకు చూడడానికి ఎన్నో స్థలాలు, దృశ్యాలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0012 నిటారుగా ఉన్న పర్వత శిఖరంపై విస్తరించి, మరకతపు పచ్చదనంగల తేయాకు తోటల అంతులేని విస్తీర్ణలతో నిండి ఉన్న పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ ఒక అసాధారణ హిల్ స్టేషన్. ఇది ఒక ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0013 ఇక్కడ అత్యంత ప్రధాన ఆకర్షణగా ఉన్న మనోహరమైన కంచనజంగా లేదా ఖంగ్‌చెంద్జోంగా ఉన్నది. ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైన శిఖరం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0014 కంచనజంగా మీదుగా అద్భుతమైన సూర్యోదయము, సూర్యాస్తమయములను చూడటానికి పర్యాటకులు సమీప శిఖరాలకు వస్తారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0016 డార్జిలింగ్ వలసరాజ్య-యుగపు వాస్తుశిల్పపు అవశేషాలను కలిగి ఉంది. అది దాని సొంత ఆకర్షణను ప్రదర్శిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0017 హిమాలయ రైలులో ప్రయాణించడం,140 సంవత్సరాల పురాతన డార్జిలింగ్ నగరాన్ని చూడడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ఇది హిల్ స్టేషన్ లోని, దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని విస్మయపరిచే ప్రకృతి దృశ్యాల గుండా తిరుగుళ్ళు తిరుగుతూ ప్రయాణిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0019 ఈ నగరం సాహసీకులకు కూడా ఒక నిధి. వారు సింగలీలా శిఖరం ట్రెక్కింగ్‌కు వెళ్లవచ్చు లేదా మౌంటెయిన్ బైక్ (సైకిల్) పై ఈ ప్రాంతాన్ని చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0020 పర్యాటకులు స్థానిక సంస్కృతిలోకి అడుగిడి, నగరంలోని సందడిగా ఉండే బజార్లలో చిరస్మరణీయమైన అనుభవాన్ని పొందవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0021 హస్తకళా ఉత్పత్తుల నుండి టిబెటియన్ స్మారకాల వరకు, అందుబాటు‌లో చాలా ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0023 ‘డార్జిలింగ్’ అనే పదం టిబెటియన్ పదాల నుండి వచ్చింది. ‘డోర్జే’ అంటే పిడుగు అని, ‘లింగ్’ అంటే భూమి అని అర్థము. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0024 అందువలన, డార్జిలింగ్‌ను పిడుగు భూమిగా సూచిస్తారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0025 1835 లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకోక ముందు, డార్జిలింగ్ కొంతకాలం సిక్కిం, నేపాల్‌లో భాగం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0026 ప్రారంభంలో, నగరాన్ని సిక్కిం రాజులు పాలించారు. వీరు గోర్ఖాలు లేదా స్థానిక యోధుల వంశానికి వ్యతిరేకంగా యుద్ధాలలో పాల్గొనేవారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0027 బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన కెప్టెన్ లాయిడ్ ను ఈ ప్రాంతంలో నియమించిన తరువాత, కొండల అందం పట్ల అతను ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. వెంటనే అతను ఒక ఆరోగ్య కేంద్రం నిర్మించాలని ప్రతిపాదించాడు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0028 ఆ విధంగా, డార్జిలింగ్‌లో వలసరాజ్యాల ప్రభావం ప్రారంభమైంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0029 19 వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వారి వేసవి విడిదిగా ఉపయోగపడిన డార్జిలింగ్, ప్రాముఖ్యతను సంతరించుకుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0033 డార్జిలింగ్ హిమాలయ రైలు (వారసత్వ సంపద) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0035 1999 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడి, టాయ్ ట్రెయిన్ అని ఆప్యాయంగా పిలువబడే డార్జిలింగ్ హిమాలయా రైలు (డిహెచ్ఆర్) 1881 లో ప్రారంభించబడింది. ఇక ఇది బియ్యం, ఇతర వస్తువుల రవాణాను సులభతరం తక్కువ ఖర్చుతో చేయడానికి ప్రారంభించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0036 ఇప్పుడు, ఇది డార్జిలింగ్ పర్యాటక పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికీ సవాలు చేసే భూభాగంలో ఇంజనీరింగ్ కి సంబంధించిన అత్యుత్తమ ఉదాహరణలలో ఇది ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0037 ఈ రైలు 600 మిమీ వెడల్పు గల ట్రాక్‌లో మాత్రమే నడుస్తుంది! ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0039 87 కిలోమీటర్ల మార్గం న్యూ జల్పాయిగురి, డార్జిలింగ్ మధ్య కొండలు మరియు దట్టమైన అడవుల అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0040 డార్జిలింగ్ హిమాలయా రైలు పరిణీత, బర్ఫీ, వంటి అనేక చిత్రాలలో కనిపిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0041 ప్రకృతి ఒడిలో ఈ పారిశ్రామిక అద్భుతానికి సంబంధించిన ప్రత్యక్ష అనుభవాన్ని పొందాల్సిందే. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0043 ఘుమ్ అనే చిన్న కుగ్రామం వరకు మెల్లగా కదిలే ఈ రైలు, ఈ రాష్ట్ర సౌందర్యాన్ని అనుభూతి చెందడానికి మిమ్మల్ని అనుమతిస్తూ చాలా దూరం నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0044 కిటికీ నుండి బయటికి వంగి సహజసిద్ధమైన లోయల అద్భుతమైన దృశ్యంలో, వాటి వెనుక నాటకీయంగా పెరుగుతున్న ఎత్తైన పర్వతాలు వీక్షిస్తుంటే, తాజా పర్వత గాలి మీ అలసటను దూరం చేయనిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0046 టైగర్ హిల్ (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0048 డార్జిలింగ్‌లో గొప్పవైన హిమాలయాలను చూడటానికి కొన్ని స్థలాల ఉన్నప్పటికీ, టైగర్ హిల్ ‌ను అధిగమించేవి ఏవీ లేవు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0049 డార్జిలింగ్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘమౌర్ పట్టణానికి 2,590 మీటర్ల ఎత్తులో ఉన్న టైగర్ హిల్, కాంచన్‌జంగా, హిమాలయాల ఇతర ముఖ్యమైన శిఖరాలపై సూర్యోదయం యొక్క మంత్రముగ్దులను చేసే దృశ్యాలను అందించడానికి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0050 ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా మీరు ఇక్కడ నుండి చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0052 టైగర్ హిల్ కు వెళ్ళడానికి తెల్లవారుజామున 4 గంటలకే జీపులు బయలుదేరుతాయి. ఇక అద్భుతమైన శిఖరాలను ఆటంకం లేకుండా చూడటానికి సాధారణంగా తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0053 సూర్యుడు ఆకాశంలోకి ఎక్కుతునప్పుడు, మంచుతో కప్పబడిన శిఖరాలు నీలం, గులాబీ, ఊదా రంగు కాన్వాసులుగా మారుతాయి, ఇవి ఉదయం సూర్యుడి బంగారు కిరణాల ద్వారా ప్రభావితమవుతాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0055 ఇక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు, మార్గనిర్దేశక పర్యటనలు చాలావరకు బటాసియా లూప్, ఘుమ్ మఠంతో సహా ఇతర ఆకర్షణల వద్ద ఆగుతాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0056 సూర్యోదయాలు సంవత్సరంలో మరే సమయంలోనైనా కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉండే శరదృతువు వసంతకాలంలో ముఖ్యంగా, ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, ఈ ప్రదేశానికి తరలి వస్తారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0058 బటాసియా లూప్ (వారసత్వ సంపద) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0060 డార్జిలింగ్ ప్రధానంగా ఒక పర్యాటక కేంద్రం. పెద్ద నగరాల కాలుష్యం, శబ్దం నుండి తప్పించుకోవాలనుకునే సందర్శకులను ఆకర్షించడానికి దాని అందమైన దృశ్యాలు, అద్భుతమైన వాతావరణం కనువిందు చేస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0061 అందువల్ల, దీని ఆకర్షణలన్నీ ఈ పట్టణంపై అనుగ్రహించిన దృశ్యాలపై కేంద్రీకృతమై ఉండటంలో ఆశ్చర్యం లేదు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0062 బటాసియా లూప్ అటువంటి అద్భుతంలో ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0064 ఈ ఇంజనీరింగ్ అత్యుత్తమ చిత్తరువు నగరపు అంచున ఉండి, నగరపు 360 డిగ్రీల వీక్షణను అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0065 ప్రసిద్ధ టాయ్ ట్రెయిన్ సుమారు 140 అడుగుల నిటారుగా ప్రవణత సాధించడానికి దీనిని 1919 సంవత్సరంలో ప్రారంభించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0067 ‘బటాసియా’ అనే పదం వాయు స్థలానికి అనువదిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0068 ఈ ప్రాంతంలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. దీనిలో జింగ్ కో, బిలోబా వంటి అరుదైన జాతుల మొక్కలతో పాటు, దేవదారు చెట్లు, రోడోడెండ్రాన్స్ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రాంగణంలోని ఎకో గార్డెన్‌లో వికసిస్తాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0070 దీని మధ్య స్వాతంత్ర్యం తరువాత యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యమైన గూర్ఖా సైనికులను గౌరవార్థం నిర్మించిన ఒక యుద్ధ స్మారకం ఉన్నది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0072 రంగీత్ వ్యాలీ కేబుల్ కార్ (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0074 రంగీత్ వ్యాలీ కేబుల్ కార్ ప్రాజెక్ట్ అని కూడా పిలువబడే డార్జిలింగ్‌లోని రోప్‌వే సింగామరీ, సింగ్లా బజార్ మధ్య విస్తరించి ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0075 ఇది 1968 లో ప్రారంభించబడింది. ఇది దేశంలోని పురాతన కేబుల్ కార్ ప్రాజెక్టుగా నిలిచింది; ఆధునిక నిర్మాణం యొక్క భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రాథమిక నిర్మాణంలో అనేక మార్పులు చేయబడ్డాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0076 ఇది పట్టణానికి 3 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న నార్త్ పాయింట్ వద్ద ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0078 ప్రారంభంలో, తేయాకు తోటలు, పట్టణాల మధ్య తేనీరు, ఇంకా ఇతర సామాగ్రిని కొండపైకి తరలించాలనే ఏకైక ఉద్దేశ్యంతో రోప్‌వేని ఏర్పాటు చేసారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0079 కేబుల్ కారు తేయాకులను ఏరే అవసరమైన వాటికి సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన వసతిని అందించింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0080 అయితే, ఇప్పుడు, కేబుల్ కారు ప్రతి పర్యాటకుడు ఎక్కాలని కోరుకునే ఒక ఆకర్షణగా మారింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0082 ఇతర రోప్‌వేల మాదిరిగా కాకుండా, ఇది 7,000 అడుగుల ఎత్తు నుండి 800 అడుగుల ఎత్తుకు దిగుతుంది (ఇది ఆరోహణ కాకుండా) లోయ గుండా ప్రవహించే రంగీత్ నది దృశ్యాన్నీ (అందుకే దాని పేరు), వెదురు బుట్టలను తగిలించుకొని పచ్చని తేయాకు తోటల్లో తాజా ఆకులను సేకరించే తేయాకులను పోగుచేసేవారిని మీకు చూపిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0083 మేఘావృతమైన రోజున, పర్వతాలు పాక్షికంగా చల్లని పొగమంచుతో కప్పబడినప్పుడు కూడా ఈ ప్రదేశపు వైభవం సరిపోలలేదు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0085 ప్రయాణీకులు డార్జిలింగ్ లోని చౌక్ బజారు నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగామరీ వద్ద కేబుల్ కారులో ఎక్కి తుక్వర్ వద్ద దిగవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0086 ఈ ప్రయాణమంతా అరగంట పడుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0088 హిమాలయా పర్వతారోహణ సంస్థ (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0090 1954 లో స్థాపించబడిన హిమాలయ పర్వతారోహణ సంస్థ భారతదేశంలోని ప్రముఖ పర్వతారోహకులకు శిక్షణ ఇచ్చింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0091 హిమాలయాల ప్రకృతి సౌందర్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, సాహసోపేత కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇంకా ప్రచారం చేయడానికి భారతీయ యువతను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రాథమిక లక్ష్యం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0093 ఇది మార్చి నుండి మే వరకు, సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు 28 రోజుల ప్రాథమిక, అధునాతన పర్వతారోహణ కోర్సును నడుపుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0094 అన్వేషణ-రక్షణ, సాహసం, ముందస్తు పర్వతారోహణ, నేత్రహీనుల కోసం ప్రత్యేక తరగతుల కోర్సులు కూడా ఇక్కడ నేర్పబడతాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0095 సాహసోపేతర శిఖరాలైన కామేత్ (7,758 మీ), సకంగ్ (7,317 మీ), రాఠౌంగ్ (6,679 మీ), గోరిచెన్ (6,488 మీ), చోముల్హరి (7,362 మీ), ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన-ఎవరెస్ట్ పర్వతం (8,848 మీ)- లాంటి వాటికి నియమిత సాహస యాత్రలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0097 ఈ సంస్థ యొక్క ఇతర ఆకర్షణీయమైన ఆకర్షణలలో పర్వతారోహణ మ్యూజియం ఉంది. ఇందులో 1922 మరియు 1924 నాటి ఎవరెస్ట్ పర్వత యాత్రల నుండి వివిధ వివరాలు, జ్ఞాపకాలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0098 ఎవరెస్ట్ పర్వత ఎత్తైన ప్రదేశానికి ఎక్కిన మొదటి వ్యక్తి అని చెప్పబడే టెన్జింగ్ నార్గేకు అంకితం చేయబడిన విగ్రహాన్ని క్యాంపస్‌లో చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0100 సింగలీలా హిల్స్ (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0102 డార్జిలింగ్, దాని తేనీరు, వాతావరణం, దృశ్యాలకే కాకుండా, ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గధామం లాంటిది. దేశంలో అత్యంత సవాలుగా ఉన్నప్పటికీ ప్రతిఫలదాయక ట్రెక్కింగ్‌లకు ఇది ఒక ప్రారంభ బిందువుగా ఉపయోగపడుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0104 అద్భుతమైన ట్రెక్కింగ్ బాటను అందించే డార్జిలింగ్‌లోని అనేక ప్రదేశాలలో, మంచుతో కప్పబడిన ఎవరెస్ట్, మకాలూ, కంచనజంగా, ల్హోత్సే శిఖరాల అద్భుతమైన దృశ్యాన్ని సింగలీలా హిల్స్ అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0105 ఈ ప్రాంతంలో పర్వతారోహణ 2,134 మీటర్ల ఎత్తులో ప్రారంభమై 3,636 మీ. వద్ద ముగుస్తుంది. పర్వతారోహణపు బాట ప్రతి మలుపు వద్ద జనావాసాలు లేని వనము, దాని అందం సందర్శకులను ఆకర్షిస్తాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0106 ఇది ఫోటోగ్రఫీకి కూడా అనువైన ప్రదేశంగా ఉపయోగపడుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0108 మీరు హిమాలయ ప్రాంతాలలో విలక్షణంగా కనిపించే అందమైన పుష్పించే పొదలు, మనోహరమైన చెట్లను, అలాగే సింగలీలా కొండలకు నివాసమైన చిన్న జంతువులను కూడా చూస్తారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0110 జాపానీ దేవాలయం, పీస్ పగోడా (శాంతి కోవెల) (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0112 నిప్పోన్జాన్ మ్యోహోజీ బౌద్ధ దేవాలయం అని కూడా పిలువబడే ఈ మందిరం 1972 లో నిర్మించబడింది. ఇది డార్జిలింగ్ పట్టణ కేంద్రానికి 10 నిమిషాల దూరంలోని జలపహాడ్ కొండపై ఉన్నది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0113 ప్రాచీన జాపానీ శైలి నిర్మాణాన్ని ప్రదర్శిస్తున్న ఈ శ్వేత భవనం సందర్శకులకు ప్రశాంతమైన, నిశ్శబ్దమైన పవిత్రస్తలాన్ని అందిస్తుంది. ఇక్కడ వారు ధ్యానం చేయవచ్చు, అంతర్గత శాంతిని పొందవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0115 ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, నిప్పోన్జాన్ మ్యోహోజీ- ప్రపంచ శాంతి కోసం బౌద్ధ క్రమం-వ్యవస్థాపకుడైన ఫుజి గురూజీ చిత్రం ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0116 హిరోషిమా-నాగసాకి విషాదానికి ఆయన సాక్ష్యం అని కూడా అంటారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0117 అతనికి గురూజీ బిరుదును మహాత్మా గాంధీ ప్రదానం చేశారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0118 ఈ ఆలయంలో మీరు బౌద్ధమతానికి సంబంధించిన లార్డ్ బుద్ధుని చిత్రాలను కూడా చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0120 మీరు ప్రార్థన సమయంలో ఒక నడకకు వెళితే (ఉదయం 4:30-6:30; సాయంత్రం 4:30-6:30), డ్రమ్ ప్లే చేసే ప్రతి బీట్‌తో ప్రార్థన గదిలో దైవత్వాన్ని అనుభవించే అవకాశం మీకు ఉంటుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0122 ఈ ఆలయానికి సమీపంలో శాంతి పగోడా ఉన్నది. ఇది బుద్ధుని యొక్క నాలుగు అవతారాలను (కూర్చోవడం, నిద్రించడం, నిలబడటం, ధ్యానం చేయడం) వర్ణిస్తుంది. ఇవి డార్జిలింగ్‌లోని ఎత్తైన స్వేచ్ఛా నిర్మాణాలు కూడా. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0123 దీని పునాది రాయిని 1972 లో ఫుజి గురూజీ చేత వేయబడింది. ఇక ఈ శాంతి పగోడా అనేది బుద్ధుని అవతారం. ఆయన శాంతి, అహింస బోధనలకు నిలయం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0125 సందక్ఫు (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0127 పశ్చిమ బెంగాల్ లోని ఎత్తైన శిఖరమైన సందక్ఫు సింగలీలా నేషనల్ పార్క్ అంచున, డార్జిలింగ్ నగరానికి వాయువ్య చివరలో సుమారు 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నుండి మీరు మంచుతో కూడిన హిమాలయాల విస్తృత దృశ్యాన్ని చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0129 సాహస ఔత్సాహికులకు ఒక స్వర్గం వంటి సందక్ఫు, తీస్తా నదిపై రివర్ రాఫ్టింగ్ అవకాశాలను అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0130 ఇక్కడి నుండి, మీరు ప్రపంచంలోని ఐదు ఎత్తైన శిఖరాలు ఎవరెస్ట్, కాంచన్‌జంగా, లోట్సే, మకాలూలను చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0131 మీరు ఎవరెస్ట్, కంచన‌జంగా మధ్య ముగ్గురు సోదరిలుగా ప్రఖ్యాతి గాంచిన మూడు శిఖరాలను చూడవచ్చు. దాని తూర్పున, టిబెట్ శిఖరాలైన నర్సింగ్, డోంగ్క్యా, చోళాలను స్పష్టంగా చూడగలరు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0132 అందువల్ల అనుభవజ్ఞులైన పర్వతారోహకులకు సందక్ఫు చాలా ఇష్టమైనది-ఈ ప్రయాణం సవాలుగా ఉన్నప్పటికీ, గమ్యం ఆ కష్టానికి ప్రతిఫలానిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0134 సందక్ఫు శబ్దతః అర్థం విష మొక్కల ఎత్తు అని. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0135 ఇక్కడ సమృద్ధిగా పెరిగే అకోనైట్ మొక్కలే దీనికి కారణమని చెప్పవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0136 అవి తిన్నప్పుడే విషపూరితం, కాబట్టి సందర్శకులు భయపడనవసరం లేదు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0137 రోడోడెండ్రన్ ఇంకా వెండి బొచ్చు అడవులు కలిగిన ఉన్న ప్రపంచంలోనే ఇది ఏకైక ప్రదేశం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0139 తీస్తా నదిలో రాఫ్టింగ్ (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0141 డార్జిలింగ్, దాని ఎత్తైన కొండలు, సవాలుగా ఉన్న రోడ్లు, ప్రవహించే నదులతో, మీ సాహసోపేత మనసును తృప్తిపరిచే దేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0142 సిక్కిం, డార్జిలింగ్ కొండలపై నుండి 172 కిలోమీటర్ల దూరం ప్రయాణించే తీస్తా నది అద్భుతమైన జల క్రీడలకు కేంద్రంగా ఉన్నది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0143 మీరు నది పక్కన తెల్లని ఇసుక దిబ్బలను చూడవచ్చు. ముఖ్యంగా తీస్తా, రంగీత్ నదుల సంగమం వద్ద, ఇది తెల్లని నీటి రాఫ్టింగ్‌కు ప్రధాన స్థావరం అవుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0144 నది చుట్టూ ఉన్న పెద్ద బండరాళ్లు ఈ క్రీడకు అనువైన ప్రదేశం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0146 వాటి తీవ్రత మారుతూ ఉన్నప్పటికీ రెండు నదులు రాఫ్టింగ్ కు సురక్షితమైనవిగా ప్రకటించబడ్డాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0147 తీస్తా ప్రశాంతమైన నది. ఇది నెమ్మదైన ప్రవాహాలతో శాంతంగా ఉంటుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0148 అందువల్ల, క్రొత్త అనుభవాన్ని వెతుకుతున్న ఔత్సాహికులకు, మొదటి సారి వాటర్ స్పోర్ట్స్‌లో ప్రయత్నించే వారికీ వారికి ఇది మంచిది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0149 మరోవైపు, రంగీత్, అడవి మలుపులు, వేగంగా కదిలే నీటితో అనుభవజ్ఞులైన రాఫ్టర్ లకు మాత్రమే. తెప్పను ఎలా తిప్పాలో మీకు తెలియకపోతే చాలా ప్రమాదకరం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0151 నిపుణులతో రాఫ్టింగ్ అనుభవాలను అందించే అనేక టూర్ కంపెనీలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0152 ఇవి ఈతగాళ్లకు, ఈత రానివారికి కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ ఏదో కొంత వినోదం ఉంటుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0154 పద్మజా నాయుడు హిమాలయా జంతుప్రదర్శనశాల (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0156 ఇది సరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు పేరు మీద ప్రారంభించబడింది. ఇది సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా కు సంబంధించిన ఎర్ర పాండా కార్యక్రమానికి కేంద్రం. మంచు చిరుతపులులు, టిబెటియన్ తోడేళ్ళు, తూర్పు హిమాలయ ప్రాంతంలోని అత్యంత అంతరించే ప్రమాదంలో ఉన్న ఇతర జంతు జాతులకు కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ లో కూడా సభ్యత్వం ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0157 హిమాలయాల విలువైన, అంతరించిపోతున్న జంతుజాలాలను పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో, పద్మజా నాయుడు హిమాలయా జంతుప్రదర్శనశాల 1958 లో స్థాపించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0159 నేడు, ఇది దేశంలోని ఉత్తమ జంతుప్రదర్శనశాలలలో ఒకటి. ఆసియా నల్ల ఎలుగుబంటి, మేఘ చిరుతపులి, ఎర్ర పాండా, గోరల్, నీలి గొర్రెలు, సివెట్, హిమాలయ తహర్, నక్క, టిబెటియన్ తోడేలు, వివిధ రకాల జింకలకు (కస్తూరి, మొరిగేవి, మొదలైనవి) నివాసం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0160 నక్షత్ర తాబేలు వంటి సరీసృపాలు, హిమాలయా న్యూట్ వంటి ఉభయచరాలు, నెమలి, మైనా, అడవి కోడి, చిలక మొదలైన సరీసృపాలు కూడా ఈ జంతుప్రదర్శనశాలలలో చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0161 జంతుప్రదర్శనశాలకు అనుసంధానించబడిన చిరుత పెంపక కేంద్రం (సందర్శకులకు మూసివేయబడింది) ప్రపంచంలోనే అత్యధికంగా సంరక్షించబడిన మంచు చిరుతపులుల జనాభాకు నివాసంగా ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0163 ఈ అద్భుతమైన జంతువుల పరిరక్షణా ప్రాముఖ్యతను, ఆవశ్యకతను గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఈ పార్క్ క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0165 లాయిడ్ బొటానికల్ గార్డెన్ (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0167 సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లాయిడ్ బొటానికల్ గార్డెన్ నగరంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0168 ప్రకృతి రంగుల యొక్క శక్తివంతమైన ప్రదర్శనను ఆనందించాలనుకునే ఎవరికైనా ఇది ఆనందానిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0169 వృక్షజాల సేకరణలో చైనా, జపాన్ నుండి తెప్పించిన ఆల్పైన్ మొక్కలు, అరుమ్ లిల్లీలు, జెరేనియమ్ లు, యాష్, బర్చ్, లిలాక్ లు ఉన్నాయి. ఆఫ్రికా నుండి తెప్పించిన క్రిప్టోమెరియాలు, రేగు, చెర్రీలు, మాగ్నోలియాలు, మేపుల్స్, వీపింగ్ విల్లోలు, దేవదారు చెట్లు, అమెరికా నుండి సైప్రెస్‌లు, బుల్ బోన్ మొక్కలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0170 ఇక్కడ గ్రీన్హౌస్ లో 150 రకాల ముండ్లజెముడు రకాలు, కండ గలవులు ప్రదర్శనలో ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0172 తోట మొత్తం పర్యాటకులకు నిధి పెట్టె అయితే, ఆర్కిడియం ప్రత్యేకంగా సందర్శించదగినది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0173 ఇందులో 2,500 ఆర్కిడ్లు ఉన్నాయి. వీటిలో 50 అరుదైన రకాలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0174 వీటిలో ఎక్కువ భాగం సింగలిలా నేషనల్ పార్క్ నుండి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇది 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సందక్ఫుకు వెళ్ళే మార్గంలో చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0176 ఇక్కడ మరో మూడు విలక్షణమైన విభాగాలు ఉన్నాయి-ఎగువ విభాగంలో మీరు డార్జిలింగ్ హిమాలయ వృక్షాలను చూస్తారు; మధ్య విభాగంలో ఆల్పైన్ చెట్లు, ఫెర్న్లు, కోనిఫర్‌ల పెద్ద ఎంపికకు నిలయం; దిగువ విభాగంలో ప్రసిద్ధ వీపింగ్ విల్లో ఉంది. చెట్టు ఏడుస్తుందనే భ్రమను సృష్టించే అటువంటి కొమ్మలు (క్రిందికి పడటం) కారణంగా పేరు పెట్టబడింది! ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0178 లాయిడ్ బొటానికల్ గార్డెన్ మీకు ప్రస్తుత వృక్షసంపదను చూపించడమే కాకుండా, ఇది చైనా నుండి డార్జిలింగ్‌కు తీసుకువచ్చిన రెండు సజీవ శిలాజ చెట్ల ద్వారా చరిత్రపూర్వ యుగాల్లోకి తొంగి చూడటానికి కూడా అనుమతిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0179 అదనంగా, రాష్ట్రంలోని వృక్షసంపదపై సాహిత్యం పుష్కలంగా ఉన్న విద్యార్థుల విభాగం, కొన్ని మొక్కల వివిధ ఔషధ గుణాలను అధ్యయనం చేయగల వైద్య వనం, మీరు తీరికగా షికారు చేస్తూ సహజమైన సిక్కిం అందాన్ని ఆరాధించేటప్పుడు రాక్ గార్డెన్ లో కూడా విహరించవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0181 బ్రిటిష్ బ్యాంక్ యజమాని విలియం లాయిడ్ పేరు మీద ఉన్న ఈ ఉద్యానవనం డార్జిలింగ్ ప్రజలకు ఆయన ఇచ్చిన బహుమతి. ఇది 1878 లో స్థాపించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0182 ఈ ప్రదేశం యొక్క ప్రధాన లక్ష్యం డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతం, సిక్కిం, దాని పొరుగు ప్రాంతాల యొక్క అరుదైన వృక్ష జాతుల దేశీయ జాతులను సంరక్షించడం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0184 లావా (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0186 సముద్ర మట్టానికి 2,138 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న కుగ్రామం అయిన లావా, శీతాకాలంలో హిమపాతం పడే పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రదేశాలలో ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0187 ఇది నియోరా వ్యాలీ నేషనల్ పార్కుకు ప్రవేశ కేంద్రంగా పనిచేస్తుంది. మార్గం ఎంత ఉత్కంఠంగా ఉంటుందో అంత రమణీయమైనది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0188 సూర్యరశ్మి ఆకుల కొమ్మల మధ్య నుండి దోబూచులు ఆడుతున్నప్పుడు, ఆల్పైన్ చెట్లు మీ ఆరోహణను అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది-ఇది నిజంగా ఒక చలనచిత్రం నుండి తీసినట్లుగా ఉంటుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0190 ప్రధానంగా కాలింపాంగ్, జాతీయ ఉద్యానవనానికి వెళ్ళే మార్గంలో ఆగే స్థలమైన లావా, మీరు రాత్రిపూట విశ్రాంతి తీసుకోవటానికి, ఈ గ్రామానికి అనుగ్రహించబడిన అద్భుతమైన దృశ్యాన్ని ఆనందించడానికి అనేక రకాల హోమ్‌స్టేలు, చిన్న హోటళ్లను అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0192 ఇప్పుడు, ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేసేవారు కూడా తరచూ వస్తున్నారు. ఎందుకంటే సమతార్ పీఠభూమికి ప్రసిద్ధ ట్రెక్ లావాకు సమీపంలో ఉన్న గోంపా దారా నుండి ప్రారంభమవుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0193 పక్షి వీక్షకులను ఇది చాలా ఆకర్షిస్తుంది. వారు నీలిరంగు రాబిన్లు, ఫించ్‌లు, రెన్ వార్బ్లర్‌లను చెట్ల గుండా ఎగురుతూ నీలపు ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని చూడగలరు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0195 లావా వివిధ రకాల వృక్ష జంతుజాలంతో పాటు ప్రకృతి అందాలను ఆనందించడానికి పరిసర వాతావరణాన్ని అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0196 సూర్యోదయాన్ని దర్శించేందుకు కూడా ఇక్కడ ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉంది-అదే రిష్యాప్. ఇది లావా నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ శిఖరాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0197 ఇక్కడ ఉన్నప్పుడు, కొండ అంచున ఉన్న నిర్మలమైన, ప్రశాంతమైన ప్రదేశం అయిన లావా మఠాన్ని చూడడం మర్చిపోవద్దు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0199 కోరోనేషన్ బ్రిడ్జ్ (వారసత్వ సంపద) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0201 ఈ కోరోనేషన్ బ్రిడ్జ్ ని 1937 లో కింగ్ జార్జ్ V పట్టాభిషేకానికి గుర్తుగా నిర్మించబడింది. ఈ పని బెంగాల్ పూర్వ గవర్నరైన జాన్ ఆండర్సన్ చేత ప్రారంభించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0202 ఇది తీస్తా, రంగీత్ నదుల సంగమం వద్ద సిలిగురిలోని సెవోకేశ్వరి కాళి మందిరానికి సమీపంలో ఉన్నది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0204 దీని ప్రాధమిక ఉద్దేశ్యం ఈశాన్య అందమైన హిల్ స్టేషన్లతో పాటు డూయార్స్ (హిమాలయ ఆధార ప్రాంతాలలోని ఒండ్రు వరద మైదానాలు), భూటాన్ లకు లింక్ అందించడం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0205 నేడు, ఇది డార్జిలింగ్ వంటి విరామ గమ్యస్థానాలకు ముఖ్యమైన సింహద్వారముగా ఉపయోగపడుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0207 తీస్తా నది వంతెన క్రింద ప్రవహిస్తుంది. వంతెన పైన నిలబడి సందర్శకులు ఎదురుగా పలకరించే పచ్చని కొండల దృశ్యాన్ని, దూరానా ఎత్తైన హిమాలయాలను, క్రింద తీస్తా నది పరవళ్లు తొక్కడాన్ని మీరు చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0208 ప్రకాశవంతమైన మెజెంటా రంగు బురుజులు దాని ఆకర్షణకు కేంద్రం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0210 కాంటిలివర్ వ్యవస్థ కారణంగా ఈ వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0211 ఒక చివర రెండు సింహాల ప్రతిమలు ఉన్నందున దీనిని స్థానికులు బాగ్ పూల్ అని కూడా అంటారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0213 టిబెట్ శరణార్థ స్వయం సహాయ కేంద్రం (వారసత్వ సంపద) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0215 నైపుణ్యం కలిగిన టిబెట్ హస్తకళాకారులు తయారుచేసిన అత్యుత్తమ తివాచీలను, తోలు ఉత్పత్తులను, ఉన్ని వస్త్రాలను పర్యాటకులు చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0216 దీని ఉత్పత్తుల ఖ్యాతి ఎలాంటిది అంటే, కేంద్రం ఇప్పుడు 36 కి పైగా దేశాలకు దీని సరుకులను ఎగుమతి చేస్తుంది! ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0217 సరసమైన ధరలకే మీరు విస్తృత శ్రేణి బట్టలు, చెక్క కళాఖండాలు, మరెన్నో కొనుక్కోవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0218 టిబెట్ శరణార్థ స్వయం సహాయ కేంద్రంలో 650 మంది శరణార్థులు ఉన్నారు. అందరూ హస్తకళలు, నేత పనిలో నిమగ్నమై ఉన్నారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0219 దీనిలో ఒక వృద్ధాశ్రమం, ఒక పాఠశాల, ఒక అనాథాశ్రయం, ఒక ఆసుపత్రి, ఒక టిబెట్ బౌద్ధ మఠం ఉన్నాయి. ఇక ఇక్కడ చేతిపనుల వర్క్‌షాప్‌లు కూడా క్రమం తప్పకుండా జరుగుతాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0220 అంతే కాదు, ఇక్కడ టిబెట్ చరిత్రను ప్రదర్శించే సజీవఫోటోగ్రాఫిక్ ప్రదర్శను నిర్వహిస్తారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0222 పరిశుద్ధుడైన దలైలామాను అనుసరించి స్థానభ్రంశం చెందిన టిబెట్ వాసులకు, పునరావాసం కల్పించడానికి 1959 లో ఈ కేంద్రం సృష్టించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0223 శరణార్థులు పూర్తిగా స్వావలంబన పొందదానికి ఇది ప్రత్యక్ష ఫలితం. ఎందుకంటే వారు ఒక విదేశీ దేశంలో కృపతో, సామర్థ్యంతో సర్దుబాటు చేసుకుంటున్నారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0225 ఈ కేంద్రాన్ని లెబాంగ్ కార్ట్ రోడ్ ద్వారా చేరుకోవచ్చు. ఇది ఒక కొండ పైభాగంలో ఆకుపచ్చ లోయ నుండి చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0226 ప్రారంభంలో, సంఘం ప్రధానంగా విరాళాలు, స్వచ్ఛంద సంస్థలు ద్వారా నిధులు సేకరించెది. అప్పుడప్పుడు ఫుట్‌బాల్ మ్యాచ్ ద్వారా కూడా నిధులను సేకరించబడతాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0227 తదనంతరం, కేంద్రం అభివృద్ధి, నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని మొదటి సభ్యులలో టెన్జింగ్ నార్గే ఒకరు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0229 లెబాంగ్ రేస్ కోర్సు (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0231 డార్జిలింగ్ శివార్లలో ఉన్న లెబాంగ్ రేస్ కోర్సు, 1885 లో కవాతులకు మైదానంగా నిర్మించబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0232 పూర్తి ల్యాప్‌ 480 గజాల దూరం ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న రేస్-కోర్సు ఇది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0233 సముద్ర మట్టానికి 1,809 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది ప్రపంచంలోని ఎత్తైన వాటిలో ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0235 లెబాంగ్ లోయ ఒక అందమైన ఆకర్షణ. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0236 డార్జిలింగ్ ప్రధాన పట్టణం క్రింద అందంగా ఉండి, ఇది మాల్ (సిటీ సెంటర్) పై నుండి కనిపిస్తూ, అద్భుతమైన ఫోటో కోసం బాగా పనిచేస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0237 1850 లలో ఈ ప్రాంతంలో తేయాకు తోటలు మొదట కనిపించాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0238 నేడు, జింగ్, బాదమ్‌తం, ఫూబ్‌షెరింగ్ వంటి తేయాకు తోటలు ఏడాది పొడవునా అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0240 కొన్ని ఉత్తేజకరమైన రేసులను చూడటానికి ఉత్తమ సమయం మే నుండి జూన్ వరకు, అక్టోబరు నుండి నవంబరు వరకు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0241 ఇక్కడ సందర్శించడం వలన డార్జిలింగ్ కి సంబంధించిన వివిధ సంస్కృతులు, సంప్రదాయాల గురించి ఒక అంతర్దృష్టిని ఇస్తుంది. ఎందుకంటే ఇది పండుగలకు కూడా ఉపయోగించబడుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0242 మీరు ఇక్కడ ఉన్నప్పుడు, గూర్ఖా స్టేడియం, గోలై బజార్, లెబాంగ్ క్రికెట్ బజార్లను చూడటం మర్చిపోవద్దు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0244 ఇస్కాన్ చంద్రోదయ ఆలయం (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0246 మహాప్రభువు ఆద్వర్యంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0247 ఇది శ్రీ చైతన్య జీవితాన్ని, రచనలను ప్రదర్శించే ఒక విభాగాన్ని కలిగి ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0248 గర్భగుడిలో విస్తృతంగా అలంకరించబడిన ఒక శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0250 పశ్చిమ బెంగాల్‌లోని హిందువులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి అయిన ఇస్కాన్ ఆలయం, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు బాగా ప్రాచుర్యం పొందింది. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుగుతుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0251 ఏడాది పొడవునా భక్తులతో నిండిన ఇస్కాన్ కార్యకలాపాలు, ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉండి, ప్రార్థనలలో, రోజంతా ఇక్కడ మోగే శ్లోకాలలో తమను తాము మైమరచిపోయేలా చేస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0253 పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉండి, చుట్టుపక్కల ఉన్న పర్వతాల గొప్ప దృశ్యాలను అందిస్తాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0254 మీరు ఈ మనోహరమైన ఆలయంలో కూర్చుని ధ్యానం చేయవచ్చు లేదా పరిసరాల అందాలను ఆనందించవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0256 హాంకాంగ్ మార్కెట్ (సాహసం) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0258 షాపింగ్ కి డార్జిలింగ్ చాలా ప్రసిద్ధి చెందింది. సిలిగురి పట్టణానికి సమీపంలోని హాంకాంగ్ మార్కెట్ అత్యంత ప్రసిద్ధ వాటిలో ఒకటి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0259 విదేశీ వస్తువులు, అంతర్జాతీయ బ్రాండ్ల ఎంపికను మీరు ఇక్కడ చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0260 దుస్తుల నుండి యంత్రపరికరాల వరకు, మార్కెట్ దిగుమతి చేసుకున్న వస్తువులను సరసమైన ధరలకు అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0262 హాంకాంగ్ మార్కెట్లో బట్టలు, బూట్లు, బ్యాగులు, ఉపకరణాలు, మరెన్నో కలగలుపుగా ఎంపిక చేసుకోవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0263 హిమాలయాల కథలతో పర్యాటకులను సందడి చేయడానికి చాలా ఆత్మీయంగా, ఆసక్తిగా ఉన్న దుకాణదారులతో మీరు మంచి భావంతో బేరం కుదుర్చుకుంటూ బేరాల కార్యకలాపంలో పాల్గొనండి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0265 వీధి విక్రేతలలో ఒకరి నుండి వేడి వేడి పానీయం లేదా రుచికరమైన చిరుతిండిని తీసుకుని, ఎల్లప్పుడూ ఉత్సాహంతో, సందడి చేస్తున్నట్లు అనిపిస్తున్న హాంకాంగ్ మార్కెట్ రంగురంగుల వీధుల్లో మీరు నడుస్తున్నప్పుడు, పశ్చిమ బెంగాల్ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందండి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0267 కాంక్రాజోర్ (ప్రకృతి) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0269 కాంక్రాజోర్ లో 9,000 హెక్టార్ల చెట్లతో నిండిన ప్రాంతం ఉంది. ఇందులో కుసుమ్, షాల్, టేకు మొదలైనవి ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0270 జీడిపప్పు, కాఫీ, నారింజ సాగుకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0271 అంతే కాదు, ఇది ట్రెక్కింగ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. దాని దట్టమైన అడవులలో, విస్తారమైన పొలాలలో ఒకరు ఆనందించడానికి రమణీయమైన ప్రదేశాలను అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0273 జార్గ్రామ్ ఉపవిభాగపు వాయువ్య చివరలో ఉన్న ఈ పచ్చని అడవి ఎత్తైన చెట్లతో నిండి ఉన్నది. ఇది ఎలుగుబంట్లు, అడవి పందులు వంటి జంతువులకు విస్తృతమైన పచ్చని ఆవరణను సృష్టిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0274 ప్యాంథర్ లు కొన్నిసార్లు ఇక్కడ కూడా కనిపిస్తాయని స్థానికులు అంటుంటారు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0276 చిన్న కాలువలు కాంక్రాజోర్ గుండా ప్రవహిస్తాయి. తద్వారా వృక్షసంపద పోషణ జరుగుతుంది. నేలకు ఆరోగ్యకరమైన పోషకాలను సరఫరా చేయబడతాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0277 ఇక్కడ కూడా పెద్ద చెరువులు ఉన్నాయి. ఇక్కడ జంతువులు తరచూ నీరు త్రాగటం, వారి పిల్లలతో ఆడుకోవడం చూడవచ్చు. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0279 చల్సా (ప్రకృతి, వన్యప్రాణులు) ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0281 హిమాలయాల పర్వత ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పట్టణం అయిన చల్సా, పచ్చని తేయాకు తోటలు, కొండలు, నదులు, అడవుల రమణీయమైన దృశ్యాన్ని అందిస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0282 ఇది డూయార్స్‌కు ప్రవేశ ద్వారం అని కూడా పేరు పొందింది. జల్ఢాకా నది ఒడ్డున ఉన్న బిందు, ఝలాంగ్, పరేన్ వంటి ఇతర ముఖ్యమైన హిల్ స్టేషన్లకు స్థావరంగా పనిచేస్తుంది. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0284 ఈ పట్టణంలో గోరుమారా జాతీయ ఉద్యానవనం, చప్రామారీ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0285 గోరుమారా జాతీయ ఉద్యానవనంలో 193 జాతుల పక్షులు, 7 జాతుల తాబేళ్లు, 22 రకాల సరీసృపాలు ఉన్నాయి. వీటితో పాటు 27 జాతుల చేపలు, అనేక రకాల వృక్షజాలాలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0286 ఈ జాతీయ ఉద్యానవనం మనోహరమైన ఆసియా ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి నివాసం. ebs_tourism-darjeeling-part1-translation-hin2tel_0288 చప్రామారీ వన్యప్రాణుల అభయారణ్యం అనేక వృక్షజాలాలను కలిగి ఉంది. వీటిలో హైనా, చిరుతపులులు, ఇండియన్ ట్రీపీ, థ్రష్, వైట్ బ్రెస్ట్ కింగ్‌ఫిషర్, అనుబంధ కొంగ, మొదలగు అనేక వలస పక్షులు ఉన్నాయి.