ID SENT ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0002 వన్యప్రాణుల సంరక్షణతో పాటు, మీరు చల్సా తేయాకు తోటలను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ మీరు మీ కుటుంబం, స్నేహితుల కోసం ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు సువాసనగల రకరకాలైన టీలను తీసుకెళ్లవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0004 జల్దాపారా నేషనల్ పార్క్ (వన్యప్రాణి) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0006 ఈ పచ్చని జాతీయ ఉద్యానవనం తూర్పు హిమాలయాల పర్వత ప్రాంతంలో ఉంది, గొప్ప వృక్షసంపద (ప్రధానంగా పొడవైన ఎలిఫెంట్ గ్రాస్), వివిధ రకాల వన్యప్రాణులను కలిగి ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0007 ఏనుగు మీద లేదా 4x4 సఫారి జీపులో ప్రయాణం ఉద్యానవనంలో తిరగడానికి ఏకైక మార్గం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0009 216 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవి ఆసియా ఒంటి-కొమ్ము ఖడ్గమృగానికి నివాసం. అంతరించిపోతున్న ఈ జంతువు స్థితిని బట్టి, ఈ ఉద్యానవనాన్ని 1941 లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0010 నేడు, ఈ అభయారణ్యం కాజీరంగా నేషనల్ పార్క్ తరువాత దేశంలో అత్యధిక ఖడ్గమృగం జనాభా కలిగి ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0012 పులి, అడవి దున్న, సాంభార్, మొరిగే జింక, మచ్చల జింక, హాగ్ జింక, అడవి పంది మొదలైన ఇతర జంతువులను ఇక్కడ చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0013 ఇక్కడ కనిపించే పక్షులలో బెంగాల్ ఫ్లోరికాన్, తురాయిగల డేగ, నెమలి, కౌజుపిట్ట, లెస్సర్ పైడ్ హార్న్బిల్ మొదలైనవి ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0014 ఈ ఉద్యానవనంలో తాచు పాము, గెక్కో, కొండచిలువ, మానిటర్ బల్లి మొదలైన సరీసృపాలతో పాటు ఎనిమిది రకాల తాబేళ్లు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0016 తోర్షా నది, అలాగే ఇతర చిన్న నదులచే పెరుగుతున్న ఒక గడ్డి మైదానమైన జల్దాపారా జాతీయ ఉద్యానవనం జీవవైవిధ్యపు నిధి. ఇది చాలా అరుదైన జంతువులకు, పక్షులకు నిలయం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0018 లోలెగావ్ (ప్రకృతి) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0020 1,675 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన, రమణీయమైన ప్రదేశమైన లోలెగావ్‌ను, కాఫర్ అని కూడా పిలుస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0021 ఇది హిమాలయ శిఖరం చిట్ట చివరలో ఉంది. దీని చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0022 ఇక్కడికి చేరుకోవడానికి దట్టమైన అడవి గుండా చెక్క వంతెనపై కనోపీ వాక్స్ (చెట్ల మీద ఏర్పర్చిన వంతెనల మీద నడక) గుండా నడవాలి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0024 పక్షి ప్రేమికులకు ఒక చిన్న స్వర్గం. ఇది రంగురంగుల తోటలు, వికసించే ఆర్కిడ్ పుష్పాలను ఇక్కడ చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0025 హామ్లెట్ యొక్క అనేక కేంద్రాల నుండి కాంచన్‌జంగా, ఇతర హిమాలయ శిఖరాల యొక్క అద్భుతమైన దృశ్యాలు చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0026 సింగలీలా శ్రేణి మంచుతో కప్పబడిన శిఖరాల దృశ్యాన్ని, సూర్యోదయాన్ని అందించే ఒక పరిశీలన కేంద్రమైన ఝండీ దారాను సందర్శించడానికి సందర్శకులు కొంత సమయం కేటాయించాలి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0027 ఎకో పార్కులో షికారు చేయండి లేదా వేడి, రుచికరమైన అల్పాహారం తినండి. ఈ విధంగా లోలెగావ్ మిమ్మల్ని అనేక విధాలుగా ఆకర్షిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0029 నగరపు సందడి నుండి దూరంగా ఉండటం వలన, ఈ ప్రదేశం ప్రకృతితో ఒకటిగా ఉండి, డార్జిలింగ్ యొక్క కోల్పోయిన సన్నివేశాల కోసం శోధించడం ద్వారా ఇంద్రియాలను శాంతింపచేసే అవకాశాన్ని అందిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0031 బెంగాల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం (వారసత్వ సంపద, వన్యప్రాణులు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0033 సహజమైన కళాఖండాలు, శిలాజాల యొక్క ఉత్తమ సేకరణలలో ఒకదాన్ని ప్రదర్శించే బెంగాల్ నేచురల్ హిస్టరీ మ్యూజియం, మెరుగైన నిర్వహణ కోసం 2015 లో పశ్చిమ బెంగాల్ జూ అథారిటీలో చేర్చబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0035 నేడు, ఇది అనేక జాతుల పక్షులు, క్షీరదాలు, కీటకాలు, చేపలు, సరీసృపాల చర్మాలు, ఎముకలు, కొమ్ములు, ఇతర శరీర నిర్మాణ భాగాల భారీ సేకరణను కలిగి ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0036 ఈ మ్యూజియంలో కొన్ని నిజమైన పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి. వీటిని కృత్రిమ సహజ వాతావరణంలో ఉంచారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0038 హిమాలయా గోధుమరంగు కలప గుడ్లగూబ, ఉత్తర మచ్చల గుడ్లగూబ, ఉత్తర గోధుమరంగు చేప గుడ్లగూబ, నెమళ్ళు, ఈగలు పట్టేవి, మైనా, నైట్ జార్, థ్రష్, వార్బ్లెర్, ఫ్లైకాచర్, కింగ్‌ఫిషర్, స్నైప్, వుడ్‌పెక్కర్, స్విఫ్ట్, నీల్తావా, నీటి పక్షి, బార్బెట్, హార్న్ బిల్, కోకిలతో పాటు కొన్ని పెద్ద పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0040 110 రకాల గుడ్లు, 35 జాతుల పాములు, 57 రకాల చేపలతో పాటు 400 కు పైగా జాతులకు చెందిన 820 నమూనాల పక్షులు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0041 సీతాకోకచిలుకలను, పక్షులను ప్రదర్శించడానికి ఒక బొటానికల్ గార్డెన్ కూడా ఈ మ్యూజియంలో ఉన్నది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0043 ఈ మ్యూజియం ముఖ్యంగా విద్యార్థులతో, విద్యావేత్తలతో ప్రసిద్ధి చెందింది. వీరు వారాంతాల్లో కొన్ని గంటలు ఆనందించే దృశ్య అభ్యాసం కోసం వస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0045 అబ్జర్వేటరీ హిల్ (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0047 పేరు సూచించినట్లుగా, అబ్జర్వేటరీ హిల్ నుండి డార్జిలింగ్ యొక్క అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0048 ఇది డార్జిలింగ్ యొక్క మాల్ ప్రాంతంలో ఉన్నది. దాని ఎత్తైన ప్రదేశం 15 నిమిషాల ఆరోహణ మాత్రమే. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0050 ఇది డోర్జే లింగ్ మఠపు మొదటి స్థావరం. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న బౌద్ధ సమాజానికి ఇది చాలా ముఖ్యమైనది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0051 బౌద్ధమతం ప్రకారం రక్షక దేవుడికి నిలయమైన మహాకల్ ఆలయం అని పిలువబడే ఒక హిందూ మందిరం ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0053 ఈ ఆలయంలో మూడు శివలింగాలు ఉన్నాయి, 1785 లో స్వయంగా వెలిశాయని అంటారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0054 ఇవి పవిత్ర త్రిమూర్తులు అయిన-బ్రహ్మ దేవుడు, విష్ణువు, మహేశ్వరుడుని సూచిస్తాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0056 ఇది కాకుండా, శిఖరాగ్రంలో హనుమంతునికి, సిద్ధి సాయి బాబాకు అంకితం చేయబడిన అనేక కోవెలలు ఉన్నాయి. భక్తి గంటల ఆహ్లాదకరమైన శబ్దాలతో పాటు రంగురంగుల ప్రార్థనా పతాకాలు, మీ సెలవు జ్ఞాపకాలకు సరైన చట్రాన్ని అందిస్తాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0057 మీరు ప్రధాన ఆలయానికి వెళ్ళేటప్పుడు, మార్గంలో పర్వతాలలో నివసించే ఉల్లాసభరితమైన కోతులను మీరు చూస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0059 ఘుమ్ (ఘూమ్) మఠం (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0061 ఘుమ్ మఠం అని కూడా పిలువబడే యి ఘా చోలింగ్ గోంపా, గెలుప్కా అని పిలువబడే బౌద్ధుల పసుపు సంప్రదాయానికి చెందినది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0062 బౌద్ధ సమాజానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇది బహుశా డార్జిలింగ్ లోని అత్యంత ప్రఖ్యాత, ప్రసిద్ధ చిహ్నం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0064 ప్రాథమిక ఆకర్షణ 15 అడుగుల ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0065 స్వామి యొక్క ఈ ప్రత్యేక విగ్రహాన్ని మైత్రేయ బుద్ధ లేదా గ్యాల్వా షామోవా అని పిలుస్తారు. దీని అర్థం భవిష్యత్తు బుద్ధుడు లేదా రాబోయే బుద్ధుడు అని. దీనిని 1875 లో నిర్మించారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0066 ఈ పట్టణంలోని బుద్ధుడి విగ్రహాలలో ఇది అతి పెద్ద, పురాతన విగ్రహాలలో ఇది ఒకటి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0067 ఇది టిబెట్ నుండి తెచ్చిన మట్టితో తయారు చేయబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0068 విగ్రహం ముందు రెండు భారీ నూనె దీపాలు ఏడాది పొడవునా వెలుగుతూ ఉంటాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0069 చెన్రెజిగ్ (అవలోకితేశ్వర), కరుణ బుద్ధుడు, మఠానికి చెందిన గెలుగ్పా శాఖ స్థాపకుడు సోంగ్ఖాపా వంటి అనేక బుద్ధ దేవతలు, లామా చిత్రాలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0071 ఈ మఠం బుద్ధుని అచ్చు ప్రతుల భారీ సేకరణను కలిగి ఉన్నది. ఇందులో కంగ్యూర్-టిబెటన్ బౌద్ధ సువార్త-కు సంబంధించిన 108 సంపుటాలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0072 ఇది కాక, దాని వెనుక వైపు ఒక పచ్చని లోయను చూపుతుంది. ఇక్కడ నుండి మీరు కాంచన్‌జంగా పర్వతం యొక్క అద్భుతమైన శిఖరాన్ని చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0074 బోకార్ నెగో చోఖోర్ లింగ్ మఠం (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0076 బోకార్ నెగో చోఖోర్ లింగ్ మఠం 1984 లో స్థాపించబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0077 ఇది మొదట్లో ఒక చిన్న ఆశ్రయ కేంద్రంగా ప్రారంభించబడింది. అయితే కాలక్రమేణా, ఇది ప్రాముఖ్యతలో, పరిమాణంలో పెరిగింది. ఇప్పుడు షాక్యముని బుద్ధుని బోధలను అధ్యయనం చేయడానికీ, ప్రచారం చేయడానికి అంకితమివ్వబడిన 500 మందికి పైగా సన్యాసులకు విద్య, నివాసంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0079 సన్యాసులకు టిబెట్ భాష, వ్యాకరణం, చేతివ్రాతతో పాటు ఆధ్యాత్మికతకు సంబంధించిన వివిధ అంశాలను బోధిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0080 వారు బౌద్ధమత ప్రార్ధనలు, ఆరాధనలను కూడా అధ్యయనం చేస్తారు. వారి సంప్రదాయాల అంశాలు, అభ్యాసాలపై శిక్షణ ఇస్తారు. వీటిలో విస్తృతమైన ప్రార్థనలు చేయడం, విభిన్న వాయిద్యాలను ఎలా వాయించాలో నేర్చుకోవడం, ఆచార నృత్యాలు చేయడం, వైవిధ్యమైన చేతి సంజ్ఞలలో ప్రావీణ్యాన్ని సంపాదించుకోవడం (ముద్రలు అని కూడా పిలువబడే), శ్రావ్యమైన శ్లోకాలను సమీక్షించడం ఉంటాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0082 ప్రతి నెల, సన్యాసులు టిబెట్ బౌద్ధమతపు కర్మ కాగ్యు, నింగ్మా సంప్రదాయాల ద్వారా సంరక్షించబడిన పద్ధతులలో తీవ్రమైన శిక్షణ పొందుతారు. ఇందులో ఇసుక మండలాన్ని నిర్మించడం, సాంప్రదాయ సంగీతాన్ని వాయించడం, వివరణాత్మక సమర్పణలు సృష్టించడం, మరిన్ని ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0083 సన్యాసులు కాలచక్ర, హేవాజ్రా వ్యాఖ్యానాలను కలిగి ఉన్న తంత్రాలలో కూడా బోధనను పొందుతారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0085 అదనంగా, ప్రతి సంవత్సరం రెండు ప్రధాన సంఘటనలను చూస్తుంది-గొప్ప వసంత వ్యాఖ్యానం, గొప్ప వేసవి వ్యాఖ్యానం-ఈ సమయంలో బౌద్ధమతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన గ్రంథాలు, వినయ (సన్యాస శిష్యుల నియమావళి), సూత్రాలు (బుద్ధుని వాస్తవ ఉపన్యాసాలు) ప్రదర్శించి బోధిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0087 సాలూగరా మఠం (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0089 సాలూగరా సిలిగురి శివార్లలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇది దాని పేరున్న మఠానికి ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0091 దీనిని టిబెట్ లామా అయిన కలు రింపోచే నిర్మించారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0092 మఠపు ప్రత్యేకత బౌద్ధమతపు ఐదు అవశేషాలను కలిగి ఉన్న 100 అడుగుల స్తూపం. వీటిని బౌద్ధ సమాజ సభ్యులు ఎంతగానో పూజిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0093 దీనిని గ్రేట్ ఇంటర్నేషనల్ తాషి గోమాంగ్ స్తూపం అని కూడా పిలుస్తారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సందర్శిస్తారు. ఇది చూడటానికి ఒక అద్భుతమైన దృశ్యం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0095 దలైలామా అనుచరులు సలుగర మఠాన్ని స్థాపించారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0096 చుట్టూ ఉన్న గోడలు ధ్యానం చేసే బుద్ధుని రంగురంగుల వర్ణనలను కలిగి ఉంటాయి. లోపలి భాగంలో పాలిష్ చేసిన చెక్క నేల ఉంటుంది. ఇక్కడ భక్తుల కోసం ప్రార్థన చాపలు ఉంచారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0098 మొత్తం వాతావరణం అంతా పూర్తిగా శాంతితో, ప్రశాంతతతో ఉంటుంది. భక్తులు, ఇక్కడ నివసించే సన్యాసులు హిమాలయాల అందమైన నేపథ్యం నడుమ ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0099 మీరు ప్రధాన భవనానికి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలలో షికారు చేయవచ్చు లేదా సలుగర దృశ్యాన్ని, ప్రశాంతతను ఆస్వాదించవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0101 భూటియా బస్టీ మఠం (ఆధ్యాత్మికం) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0103 భూటియా సాంచికా మఠం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురాతన నగరమైన డార్జిలింగ్ పేరులేని ప్రాంతంలో ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0105 ఈ మఠం సిక్కిం చేత ప్రభావితమైన సాంప్రదాయ టిబెటన్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0106 ఇది ఇప్పుడు బౌద్ధుల రెడ్ సెక్ట్ కి చెందినది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0107 లోపలి భాగం బుద్ధుని జీవితాన్ని చిత్రీకరించే చక్కటి కుడ్యచిత్రాలను ప్రదర్శిస్తాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0108 దలైలామా, తారా దేవి, ఇంకా వెయ్యి చేతులు, కళ్ళతో ఉన్న దేవత లక్ష్మీశ్వరి చిత్రాలను కూడా మీరు చూస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0110 టిబెట్ భాషా లిపి, సంస్కృతి, సంప్రదాయాలు మొదలైన వాటిపై వేలాది పుస్తకాలు నిల్వ ఉన్న గ్రంథాలయాన్ని కూడా మీరు సందర్శించవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0111 ప్రధాన ఆకర్షణ “ది టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్” యొక్క అసలు కాపీ. ఇది మంచి స్థితిలో భద్రపరచబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0113 మఠంలో ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధించబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0115 ఈ మఠాన్ని 1761 లో లామా డోర్జే రిన్జింగ్ నిర్మించారు. ఇది మొదట టిబెట్ బౌద్ధమతపు కగ్యు క్రమము‌తో సంబంధం ఉన్న టిబెటియన్ బౌద్ధమతానికి సంబంధించిన నింగ్మా సంప్రదాయం క్రింద సిక్కిం ఫోడాంగ్ మఠంలో భాగం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0116 చివరికి దీనిని 1879 లో డార్జిలింగ్‌కు తరలించారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0117 "#SEG135" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0118 అబ్జర్వేటరీ హిల్ ఇప్పుడున్న చోట చాలా ఎత్తుగా ఉండేది. కానీ 19 వ శతాబ్దంలో గూర్ఖా దండయాత్రలో నాశనం చేయబడింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0119 1934 లో భూకంపం సంభవించి కొత్త భవనం కూడా పూర్తిగా నాశనమైంది. సిక్కిం చోగ్యల్ దానిని పునర్నిమించడానికి ముందుకు వచ్చి సహాయము చేసారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0120 "#SEG136" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0121 రాక్ గార్డెన్, గంగా మాయ పార్క్ (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0122 "#SEG137" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0123 రాక్ గార్డెన్, గంగా మాయ పార్క్ డార్జిలింగ్ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కొత్తగా జోడించిన రెండు పర్యాటక ప్రదేశాలు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0124 బార్బోటే రాక్ గార్డెన్ అని కూడా పిలువబడే రాక్ గార్డెన్, మానవ నిర్మిత మెట్లు మెట్లుగా అమర్చిన తోట. ఇది వివిధ స్థాయిలలో రాళ్ళను కత్తిరించి అమర్చినది. ఇది ప్రధాన నగరానికి దిగువన ఉన్న లోయలో ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0125 "#SEG138" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0126 ఉద్యానవనానికి వెళ్లే దారి ఒక కనువిందు. ఎందుకంటే ఈ పచ్చని లోయ మెత్తటి మేఘాల కింద దోబూచులాడుతూ అద్వతీయమైన దృశ్యాన్ని ఇస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0127 అందాన్ని, పరిసరాల ప్రశాంతతను ఆనందించడానికి సందర్శకులు పైకి వెళ్ళవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0128 రాళ్ల మీదనుండి అందమైన జలపాతం క్రిందకి జారుతూ దిగువన నిర్మలమైన కొలనును ఏర్పాటు చేస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0129 సందర్శకులు గంటల కొద్ది కూర్చుని డార్జిలింగ్ సహజ సౌందర్యాన్ని ఆనందించవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0130 "#SEG139" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0131 రాక్ గార్డెన్ నుండి మరింత క్రింద గంగా మాయ ఉంది. ఇది పర్యాటకులు తరలి వచ్చే మరో మనోహరమైన ఆకర్షణ. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0132 ఈ సహజ స్వర్గం చుట్టూ పచ్చని కొండలు ఉన్నాయి. దీని మధ్యలో ఒక అందమైన లోయ ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0133 ఇది వృక్ష జంతుజాలపు గొప్ప సేకరణను కలిగి ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0134 ఈ ప్రదేశం గుండా ప్రవహించే సహజ సెలయేరుపై నిర్మించిన మనోహరమైన వంతెనలు, అద్భుతమైన చిత్రపటాల లాగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికీ ఆనందించడానికి పరిపూర్ణ చిత్రపు జ్ఞాపకాలను తీసుకోవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0135 "#SEG140" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0136 హ్యాపీ వ్యాలీ టీ గార్డెన్ (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0137 "#SEG141" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0138 1854 లో స్థాపించబడిన, హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్ డార్జిలింగ్ అందమైన తేయాకు తోటల మధ్య ఇరుకైన లోయ క్రిందకి వెళ్లే రహదారి చివరలో ఉంది. పట్టణంలో తేయాకు సాగును ప్రచారం చేసిన ఘనత తరచూ దీనికి లభిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0139 "#SEG142" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0140 ఈ రోజు, ఈ సంస్థ సేంద్రీయ వ్యవసాయానికి ఒక అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. భారతదేశానికి ఇష్టమైన పానీయం ఎలా ఉంటుందో చూడటానికి సందర్శకులను ఆహ్వానిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0141 ఎస్టేట్ యాజమాన్యం దశాబ్దాలుగా చేతులు మారినప్పటికీ, దాని నిర్వహణ, అందాన్ని జాగ్రత్తగా నిర్వహించబడుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0142 నిజానికి, ఇక్కడి కొన్ని టీ పొదలు 100 సంవత్సరాలకు పైగా ఉన్నాయి! ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0143 "#SEG143" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0144 ఈ ఎస్టేట్ చౌక్ బజారు నుండి ఒక చిన్న ప్రయాణం. ఇది 270 ఎకరాల సారవంతమైన భూమిలో విస్తరించి ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0145 ఉద్యోగులు వారి ఖాళీ సమయంలో దగ్గర ఉండి చూపిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0146 టీ-రుచితో ఈ సందర్శన ముగుస్తుంది. ఇది టీ ఉత్పత్తి, సంస్కృతి చరిత్రలో వాడిపోవడం, చదునుచేయడం, పులియబెట్టడం, ఎండబెట్టడం లాంటి ప్రతి ప్రక్రియలను చూడదానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0147 "#SEG144" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0148 మీరు ప్రాంగణంలోని జ్ఞాపిక దుకాణాల నుండి ప్రామాణికమైన డార్జిలింగ్ టీ కి సంబంధించిన వివిధ రుచులను కూడా కొనుగోలు చేయవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0149 తప్పనిసరిగా కొనాల్సిన వాటిలో ఒకటి SFTGFOP ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0150 "#SEG145" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0151 (సూపర్ ఫైన్ టిప్పీ గోల్డెన్ ఫ్లవరీ ఆరెంజ్ పెకో). ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0152 సాధారణ రకాన్ని ఫ్యామిలీ మిక్స్చర్ అంటారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0153 "#SEG146" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0154 చౌరాస్తా (చేయవలసిన పనులు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0155 "#SEG147" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0156 నగరం నడిబొడ్డున మాల్ అని పేరు పొందిన చౌరాస్తా ఉన్నది. ఎండలో కూర్చొని చుట్టుపక్కల ఉన్న పర్వతాల అద్భుతమైన దృశ్యాలను, డార్జిలింగ్ లోయల అద్భుతమైన దృశ్యాలను ఆనందించడానికి మాల్ చౌరాస్తాలో ఒక లాంజ్ (విశ్రాంతి గది) ఉన్నది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0157 ఈ కొండ పట్టణంలో సంభాషణకు కార్యకలాపాలకు కేంద్ర బిందువు ఇది. ఇక్కడ స్థానికులు, పర్యాటకులు ఒక అల్పాహారం, షాపింగ్ లేదా రుచికరమైన టిబెట్ టీని త్రాగుతూ సుందరమైన దృశ్యాలను ఆనందించడానికి కలిసి వస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0158 మంచి మంచి వస్తువుల శ్రేణిని అందించే వింతైన బుటీక్ లు, దుకాణాల చుట్టూ ఉన్న వ్యక్తులతో ఈ వీధి సందడిగా ఉంటుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0159 చౌరాస్తా మరొక వైపు దేవదారు చెట్లతో కప్పబడి, మధ్య మధ్యలో బెంచీలు ఉంటాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0160 హిమాలయ శిఖరాలను చూస్తూ ప్రజలు మాట్లాడుకోవడం, అల్పాహారం తినడం మీరు తరచుగా చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0161 స్థానికులు పిల్లలకు పోనీ రైడ్‌లు అందిస్తారు-ఇది పిల్లలకు చాలా ఆనందంగా ఉంటుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0162 ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మీరు చౌరాస్తా నుండి జ్ఞాపికలను కూడా కొనుగోలు చేయవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0163 "#SEG148" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0164 జల్పాయిగురి (విహారయాత్ర) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0165 "#SEG149" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0166 డార్జిలింగ్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి మొదటి చూపులోనే మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0167 ఇరుకైన గట్ల గుండా నదులు ప్రవహించడంతో పాటు పచ్చని అటవీప్రాంతం, పెద్ద తేయాకు పొలాలు, నేపథ్యంలో గొప్ప హిమాలయాలతో ఇది స్వర్గంగా మారుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0168 నిజంగా ఈ ప్రదేశం పర్యాటకులకు ఒక బంగారు ఘని అనవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0169 "#SEG150" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0170 జల్పాయిగురిలో వృక్షజాలం, జంతుజాలం ​​అధికంగా ఉన్న జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వీటితో పాటు బుక్సా వద్ద కొన్ని జీవవైవిధ్య నిల్వలు ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలోని అరుదైన పక్షులలో ఒకటైన నీలిరంగు మెడ క్రేన్‌ను చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0171 రూపంగ్ లోయ ట్రెక్కింగ్ చేసేవారికి బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని గగుర్పాటు కలిగించే, సవాలుగా ఉండే ట్రెక్స్‌ను నిర్వహిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0172 అదనంగా, జలేశ్వర్, జటిలేశ్వర్ వద్ద పురాతన దేవాలయాలు, బుక్సా కోట వద్ద ఒక ఖైదీల కారాగరం ఉన్నాయి. ఇక్కడ స్వాతంత్య్ర పూర్వ యుగంలో ప్రజలు ఖైదు చేయబడ్డారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0173 "#SEG151" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0174 తేయాకు తోటలకు చాలా ప్రసిద్ధి చెందిన జల్పాయిగురి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని అతిపెద్ద టీ ఎస్టేట్లకు నిలయంగా ఉంది. వాణిజ్య వినియోగం కోసం తాజా, సువాసనగల టీ ఆకులను పండిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0175 "#SEG152" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0176 కుర్సియాంగ్ (విహారయాత్ర) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0177 "#SEG153" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0178 సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో డార్జిలింగ్ శివార్లలో ఉన్న కుర్సియాంగ్ ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0179 'కుర్సియాంగ్' అనే పదానికి తెలుపు ఆర్కిడ్ స్థానం అని అర్ధం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0180 దాని కొండ వాలులలో వికసించే మనోహరమైన తెల్లటి ఆర్కిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0181 "#SEG154" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0182 కుర్సియాంగ్, కంచన‌జంగా పర్వతం (ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వత శిఖరం), కబ్రూ, జన్నూ, అలాగే తీస్తా, మహానంద నదుల అద్భుతమైన దృశ్యాలకు నిలయమై అభివృద్ధి చెందుతున్న ఒక చిన్న పట్టణం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0183 కుర్సియాంగ్ పచ్చికభూములు గుండా ఈలలు వేస్తూ పట్టాల మీద మెల్లగా నడిచే ఈ టాయ్ ట్రెయిన్, యువ, వృద్ధ ప్రేమ జంటలకి ప్రేమ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0184 "#SEG155" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0185 ఈ ప్రదేశం డార్జిలింగ్ కంటే తక్కువ ఎత్తులో ఉండటం వలన, వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0186 ఈ హిల్ స్టేషన్ లో సైలామైండర్ సరస్సు వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇది బ్రిటిష్ వారికి ఇష్టమైన పడవ విహార ప్రదేశాలలో ఒకటి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0187 ఈ సరస్సులో సైలామైండర్ కి సంబంధించిన అరుదైన, అంతరించిపోతున్న జాతులను కూడా కల్గి ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0188 "#SEG156" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0189 ఇది కాకుండా, ఎముకల, చెక్క కళాఖండాలు, ఆనకట్ట, అటవీ గృహాలు మొదలైన నమూనాలతో కూడిన అటవీ మ్యూజియం ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0190 అంతే కాదు, కుర్సియాంగ్లో డౌహిల్స్ గర్ల్స్ స్కూల్, విక్టోరియా బాయ్స్ స్కూల్ వంటి అద్భుతమైన, ప్రఖ్యాత బ్రిటిష్ పాఠశాలలు ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0191 "#SEG157" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0192 కుర్సియాంగ్ ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణం గతంలో చాలా మంది ప్రముఖ వ్యక్తులను ఆకర్షించింది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0193 గురు రవీంద్రనాథ్ ఠాగూర్ తన అత్యంత ప్రసిద్ధ పాటలను, కవితలను ఇక్కడ స్వరపరిచారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0194 స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదా ఈ స్థలాన్ని తన నివాసంగా చేసుకుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0195 మార్క్ ట్వైన్ కూడా ఇక్కడ కొంత సమయం గడిపాడు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0196 ఏదేమైనా, కుర్సియాంగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వలన అత్యంత ప్రాచుర్యం పొందింది. బ్రిటిష్ వారు ఇక్కడ ఒక బంగ్లాలో అతన్ని ఖైదు చేసారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0197 ఈ బంగ్లా ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. నేతాజీ ఉపయోగించిన ఫర్నిచర్ ఇతర వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0198 "#SEG158" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0199 చారిత్రాత్మకంగా, కుర్సియాంగ్ 1835 లో బ్రిటిష్ వారికి అప్పగించబడింది. 1980 లో డార్జిలింగ్ హిమాలయా రైల్వే (డిహెచ్ఆర్) టాయ్ ట్రెయిన్ పట్టాలు దీనికి విస్తరించే వరకు పర్యాటకులు చేత ఇది ఎక్కువగా గుర్తించబడలేదు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0200 "#SEG159" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0201 బాగ్డోగ్రా (విహారయాత్ర) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0202 "#SEG160" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0203 మంచుతో కప్పబడిన హిమాలయాల దృశ్యాలతో పాటు పచ్చటి తేయాకు తోటలతో నిండిన బాగ్డోగ్రా నగరం, మధ్య-వేసవి సెలవుదినాల కోసం అనువైన ప్రదేశం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0204 ఇది డార్జిలింగ్, సిలిగురి, సిక్కిం లకు దగ్గరగా ఉండి, పశ్చిమ బెంగాల్ లోని అనేక ఉత్తర నగరాలకు ప్రధాన ప్రవేశ ద్వారం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0205 "#SEG161" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0206 అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రంగా కాకుండా, బౌద్ధ మతము ప్రభావం వల్ల గాలిలో శాంతి భావం ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0207 అదనంగా, దుర్గా పూజ, కాశీ పూజ వంటి ప్రధాన పండుగలను నగరంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు, ఇది గొప్ప సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0208 బాగ్డోగ్రాలో సెవోకేశ్వరి కాళి ఆలయం, సలుగర మఠం సందర్శించదగినవి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0209 "#SEG162" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0210 మీరు పట్టణానికి దగ్గరగా ప్రవహించే తీస్తా నదిపై రాఫ్టింగ్‌కు కూడా వెళ్ళవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0211 బాగ్డోగ్రా నుండి పైకి వచ్చే మార్గంలో మీరు మెరిసే సోమ్గో సరస్సును కూడా చూడవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0212 "#SEG163" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0213 కోరోనేషన్ బ్రిడ్జ్ నుండి తీస్తా నది యొక్క అద్భుతమైన ఫోటోలను తీయండి, లేదా సూర్య సేన్ పార్క్ లేదా మధుబన్ పార్క్ పరిమితుల మధ్య ప్రశాంతంగా, విశ్రాంతిగా షికారు చేయండి; ఉమ్రావ్ సింగ్ బోట్ క్లబ్ వద్ద నిర్మలమైన పడవ ప్రయాణానికి వెళ్ళండి; చివరకు, సైన్స్ సిటీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వివిధ మొక్కలు, అన్యదేశ వృక్షజాలం గురించి తెలుసుకోండి. ఇవే కాకుండా మీరు బాగ్డోగ్రాలో చూడటానికి అనేకం ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0214 ఇది డార్జిలింగ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0215 "#SEG164" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0216 తుక్పా (ఆహారం, వంటకాలు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0217 "#SEG165" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0218 తుక్పా అనేది టిబెట్ వారి వేడి నూడిల్ సూప్. దీనిని మాంసం, గుడ్లు, కూరగాయలతో వండి పెద్ద గిన్నెలో వడ్డిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0219 ఇది రుచికరమైన, ఇష్టమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0220 భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ సూప్ శీతాకాలంలో సరైన భోజనం. ఇది లోపలి నుండి మీకు వేడినిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0221 "#SEG166" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0222 తుక్పాలో చాలా రకాలు ఉన్నాయి. సాంప్రదాయ వంటకంలో మాంసం (సాధారణంగా కోడి లేదా పంది మాంసం) ఉంటుంది. అయితే రెస్టారెంట్లలో అనేక శాఖాహార ఎంపికలను కూడా ప్రవేశపెట్టారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0223 మీరు కూరగాయల ఉడకబెట్టిన గంజితో పాటు పుట్టగొడుగు, ఉల్లి కాడలు, క్యారెట్, క్యాబేజీ, ఇతర కూరగాయలను ఉపయోగించవచ్చు. ఆపై మీకు ఇష్టమైన మసాలా దినుసులను (ప్రధానంగా కారం పొడి) జోడించి రుచికరమైన, పోషకమైన, ఆత్మ సంతృప్తికరమైన విందు చేయవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0224 "#SEG167" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0225 షా ఫలీ (ఆహారం, వంటకాలు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0226 "#SEG168" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0227 షా ఫాలీ అనేది ఒక రకమైన టిబెట్ పాట్ స్టిక్కర్ (డంప్లింగ్). దీనిని మాంసం (సాధారణంగా ఈశాన్యంలో గొడ్డు మాంసం లేదా పంది మాంసం) తో నింపుతారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0228 దీనిని ఏదైనా కూర లేదా పచ్చడి లేదా కూరగాయలతో కూడా వడ్డిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0229 షా ఫాలీతో సంపా (కాల్చిన బార్లీ) ను, జున్ను లేదా వెన్నతో వడ్డిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0230 మీరు దీన్ని ప్రాథమిక రతాంగ్ సూప్‌తో కూడా తినవచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన, కడుపు నింపే భోజనం అవుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0231 "#SEG169" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0232 దీని తయారీ చాలా సులభం- అల్లం, వెల్లుల్లి ముక్కలు, బోక్ చోయ్, ఆకుపచ్చ ఉల్లి గడ్డలు, ఇతర కూరగాయలు ప్రధాన ప్రోటీన్‌తో పాటు సోయా సాస్‌తో కలుపుతారు. ఆ తరువాత పిండిని ఈ మిశ్రమంతో నింపి తేలికగా వేయిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0233 "#SEG170" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0234 ఈ చిరుతిండి డార్జిలింగ్‌లో చాలా ఇష్టమైన వంటకం. పట్టణంలోని వివిధ చోట్లలో పెద్దా చిన్న రెస్టారెంట్లు దీని రకాలను విక్రయిస్తాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0235 ఇది పండుగలు, ఇతర వేడుకల సమయంలో కూడా ఇష్టమైన ఆహారం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0236 "#SEG171" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0237 మోమోస్ (ఆహారం, వంటకాలు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0238 "#SEG172" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0239 మోమోస్ బహుశా డార్జిలింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన చిరుతిండి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0240 ఈ రుచికరమైన కుడుములు సాధారణంగా పిండితో తయారు చేస్తారు. మాంసం లేదా కూరగాయలతో నింపి ఉడికించాలి లేదా వేయించాలి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0241 మాంససాహార మోమోస్ కోడి లేదా పంది మాంసం కూరుడు కలిగి ఉంటాయి. శాఖాహార మోమోలు క్యాబేజీ, జున్ను, ఇతర కూరగాయలను కలిగి ఉంటాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0242 మోమోస్ ని స్పష్టమైన సూప్, కొన్నిసార్లు పచ్చళ్ళ (ఊరగాయ) తో వడ్డిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0243 "#SEG173" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0244 మోమో చరిత్రను నెవార్ సమాజం వలె పాతది. వీరు టిబెట్‌కు తరచుగా వాణిజ్యం కోసం ప్రయాణించేవారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0245 వీరు ఈ చమత్కారమైన కుడుముల గురించి తెలుసుకుని వాటిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0246 అవి ఇప్పటికీ ఈశాన్యంలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, మోమోస్ ఇప్పుడు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా పాకింది. మోమో అమ్మకందారులు అంగడులను ఏర్పాటు చేశారు. ఈ పూర్తిగా రుచికరమైన ఆహారం ఆధారంగా పెద్ద ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0247 "#SEG174" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0248 టిబెటియన్ టీ (ఆహారం, వంటకాలు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0249 "#SEG175" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0250 టిబెట్‌లో పో చా అని పిలువబడే టిబెటియన్ టీ బహుశా భారతదేశంలోని చల్లని ప్రాంతాలలో, ముఖ్యంగా ఈశాన్య, హిమాలయా ప్రాంతాలలో ఎక్కువగా ఇష్టపడే పానీయం. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0251 "#SEG176" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0252 ఈ రుచికరమైన, ఆహ్లాదకరమైన పానీయం, సువాసన, రుచులను కాపాడటానికి టీ సంచులలో ఉంచిన పొడవైన టీ ఆకులతో తయారుచేయబడింది. ఇంట్లో తయారుచేసిన కొంచెం వెన్నను కలిపి, చలిని దూరంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0253 ఇది తీయగా కంటే ఉప్పగా ఉంటుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0254 మరొక రకం అల్లం, తేనెతో చేసిన లెమన్ (నిమ్మ) టీ. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0255 "#SEG177" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0256 టిబెట్ ఆచారంలో, అతిథులకు వడ్డించే టీ ప్రతిసారీ అతిథి గుటక తీసుకున్నప్పుడు దానిని మరల నింపుతూనే ఉంటారు. తద్వారా కప్ ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0257 దాని మూలాలు 7 వ శతాబ్దం వరకు గుర్తించగలిగినప్పటికీ, 13 వ శతాబ్దానికి చెందిన ఫాగ్మోడు రాజుల సమయం వరకు ఇది దాని ప్రస్తుత రూపాన్ని పొందలేదు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0258 "#SEG178" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0259 చాంగ్, తోంబా (ఆహారం, వంటకాలు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0260 "#SEG179" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0261 ఛాంగ్ అని కూడా పిలువబడే చాంగ్, తోంబా బార్లీ, జొన్నలు లేదా బియ్యపు గింజలను ఈస్ట్ తో పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0262 ఈ పానీయాలు వెదురుతో తయారు చేసిన గ్లాసులో అందిస్తారు. ఇక వీటిని సాంప్రదాయకంగా వెదురు పైపుతో తాగుతారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0263 వేసవిలో సామాన్య ఉష్ణోగ్రత వద్ద దీనిని సేవిస్తారు. అయితే శీతాకాలంలో వేడి వేడిగా అందిస్తారు. ఈ విధంగా చలిని నివారించడానికి దీనిని ఉపయోగిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0264 "#SEG180" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0265 చాంగ్ బీర్ మాదిరిగానే ఉంటుంది. దీనిని సగం పులియబెట్టిన బార్లీ విత్తనాలను పెద్ద పాత్రలో నిల్వ చేసి ఈస్ట్ జోడించడం ద్వారా తయారు చేస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0266 ఈ మిశ్రమాన్ని గ్లమ్ అని కూడా అంటారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0267 ఇది ఏల్ లాంటి రుచి కలిగి శరీరాన్ని లోపలి నుండి వేడెక్కిస్తుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0268 ఇది డార్జిలింగ్‌లోని చాలా తినుబండారాల అంగడిలో వడ్డిస్తారు. స్థానికుల ప్రతి భోజనంతో పాటు ఇది ఉంటుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0269 "#SEG181" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0270 సెల్ రోటీ (ఆహారం, వంటకాలు) ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0271 "#SEG182" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0272 ఇవి తడి బియ్యం పిండితో తయారు చేసి చదును చేసిన గుండ్రని బ్రెడ్ డోనట్స్ ని చేసి తరువాత నూనెలో వేయిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0273 ప్రైవేట్ కార్యక్రమాలు లేదా విందుల సమయంలో స్థానిక గృహాలలో సాధారణంగా తయారుచేసే సెల్ రోటీని, సాధారణంగా వెన్న, జున్ను లేదా పచ్చడితో వడ్డిస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0274 ఈ రోటీ రుచిలో తియ్యగా ఉంటుంది. డార్జిలింగ్ పట్టణంలో విస్తృతంగా జరుపుకునే దశీన్, తిహార్ పండుగలలో పెద్ద మొత్తంలో తయారు చేస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0275 "#SEG183" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0276 బియ్యపు పిండిలో పాలు, చక్కెర, అరటి పండ్లు, యాలకులు, నెయ్యి, వెన్న, ఇతర రుచులను కలిపి పిండిని తయారు చేస్తారు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0277 ఈ మిశ్రమాన్ని వేడి నూనెలో పోసి బంగారపు రంగులోకి వచ్చి బాగా కరకరలాడేలా అయ్యేంత వరకు వేయించాలి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0278 "#SEG184" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0279 డార్జిలింగ్ దాదాపు ఏడాది పొడవునా చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, సెల్ రోటీ దాదాపు 20 రోజులు నిల్వ చేయవచ్చు. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0280 కాబట్టి, ఇది ప్రత్యేక సందర్భాలలో స్నేహితులకు, కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇవ్వబడుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0281 "#SEG185" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0283 "#SEG186" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0284 విమానంలో: డార్జిలింగ్ నుండి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్డోగ్రా లో సమీప విమానాశ్రయం ఉన్నది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0285 ఇది అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0286 "#SEG187" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0287 రైలు ద్వారా: సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పాయిగురి (ఎన్‌జెపిఎ). ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతుంది. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0288 ఈశాన్యం వైపు వెళ్లే చాలా రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0289 "#SEG188" ebs_tourism-darjeeling-part2-translation-hin2tel_0290 రోడ్డు మార్గం: సిలిగురి మార్గం ద్వారా డార్జిలింగ్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపుతుంది.