ID SENT ebs_tourism-delhi-part1-translation-hin2tel_0002 ఢిల్లీ ebs_tourism-delhi-part1-translation-hin2tel_0004 ట్యాగ్‌లైన్: భారతదేశం యొక్క మనోహరమైన రాజధాని ebs_tourism-delhi-part1-translation-hin2tel_0006 అక్టోబర్ నుండి మార్చి వరకు సందర్శించడానికి అనువైన సమయం ebs_tourism-delhi-part1-translation-hin2tel_0008 ఉద్ధరణ: భారతదేశపు రాజధాని ఢిల్లీ, అద్భుతమైన గతపు, అభివృద్ధి చెందుతున్న ఆధునికతల సమమిశ్రమం, ఉత్తేజకరమైన అనుభవాల మిశ్రమము. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0012 పాత స్మారక చిహ్నాలు, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యి ఉండే ప్రాంతాలు, శక్తివంతమైన సమకాలీన విశాల దృక్పథం గల ప్రపంచంతో మెల్లగా విలీనమవుతూ భారతదేశ రాజధాని ఢిల్లీ ఒక మనోహరమైన పర్యాటక కేంద్రంగా ఉద్భవించింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0013 యమునా నది ఒడ్డున ఉన్న ఢిల్లీ దాదాపు 1,000 సంవత్సరాల పురాతనమైనది. చూపరులకు ఇది వారసత్వపు, సమకాలీన అనుభవాలకు సంబంధించిన వశపరుచుకునే చిత్రవర్ణములను అందజేస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0014 పాత ఢిల్లీ శతాబ్దాల నాటి సొగసైన గత అందాల గొప్పతనాన్ని చాటుతుండగా, తరువాతి కొత్త ఢిల్లీ రాజధాని భారత ప్రజాస్వామ్యానికి గుండె అని పునరుద్ఘాటిస్తుంది. ప్రపంచంలోని మెట్రోపాలిటన్లలో అత్యంత అభివృద్ధి చెందుతున్న వాటితో వేగంలో పోటీపడగలదు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0016 పాత ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న రాజధానికి సంబంధించిన సందడిగా ఉండే ఈ పాత ప్రాంతం, దాని ప్రాచీనతను సంరక్షించుకొని, సచేతనమైన ఆహార సంస్కృతితో విస్మయము గొల్పుతూ, ప్రపంచంలోని అన్ని వస్తువలను అమ్మే వరుస దుకాణాలు గల సందుల తిరుగుళ్లు గలిగి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0017 పాత ఢిల్లీ గుండా షికారు చేయడం అనేది ఒక మరపురాని అనుభవం అని అనవచ్చు. ఎందుకంటే మీరు మొఘల్ వంటశాలలకు మూలాన్ని ఆపాదించే కొన్ని పురాతన వంటకాలను రుచి చూడవచ్చు. ఇంకా మీరు సరసమైన ధరలలో లభించే అందమైన హస్తకళలు, టోకు బట్టలు, కొనుగోలుదారులు చెప్పినట్లు చేసిన నగలను చూస్తున్నప్పుడు ఒక అతిముఖ్యమైన నిర్దిష్ట సంస్కృతి మీ మనుసులో చొచ్చుకుపోతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0019 ఒక పద్మవ్యూహం లాంటి చాందిని చౌక్ (మూన్లైట్ స్ట్రీట్) మధ్యలో, దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటైన అద్భుతమైన జామా మస్జిద్ ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0020 ఇక్కడి నుండి కొద్ది మైళ్ళ దూరంలో ఢిల్లీకి మకుటాయమానం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోట ఉంది. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ వారసత్వ సంపద. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0021 పాత కాలపు కోటల అపూర్వ సమ్మేళనాలైన ప్రాచుర్యం పొందిన కుతుబ్ మినార్, పురాతన దేవాలయాలు రాజధాని పురావస్తు రత్నాలుగా నిలుస్తాయి. ఇవన్నీ తమ సామ్రాజ్యాన్ని ఢిల్లీ నుండి పాలించిన గొప్ప మొఘల్ రాజులకు నివాళులు అర్పిస్తాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0022 ప్రాచుర్యం పొందిన ప్రభుత్వ నిర్మాణాలు, తళుకుబెళుకుల మాల్స్, విశాలమైన నివాస సముదాయాలు, ఖరీదైన రెస్టారెంట్లు మరియు కేఫ్‌లు, భవ్యమైన దేవాలయాలు, పచ్చని ఉద్యానవనాలతో నిండి ఉండే రాజధానికి చాలా ఆధునిక ప్రతిరూపమైన న్యూ ఢిల్లీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యపు అధికార కేంద్రానికి నిలయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0023 దాదాపు అన్ని భారతీయ రాష్ట్రాల ప్రామాణికమైన వంటకాలను ప్రయత్నించాలనుకునే ఆహార ప్రేమికులకు ఒక అనుకూల ప్రదేశం. ఢిల్లీ అంతర్జాతీయ స్థాయి నుండి స్థానిక రకాల వరకూ అన్ని రుచికరమైన వంటకాలను అందిస్తుంది. ఇది ఒక వివేచించే ప్రయాణికుడిని ఆకర్షిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0025 జాతీయ రాజధాని ఒక ప్రసిద్ధ షాపింగ్ కేంద్రం. ఇక్కడి మార్కెట్లు మీ అన్ని అవసరాలను తీరుస్తాయి. ఈ మార్కెట్లలో పుస్తకాలు, ఫాషనబుల్ బట్టలు, అందమైన ఆభరణాల నుండి ఉపకరణాల వరకూ, ఎలక్ట్రానిక్స్ నుండి చెప్పుల వరకూ అన్నీ దొరుకుతాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0026 పాతకాలపు నైపుణ్యమైన వస్త్రాలను ఎక్కువ మటుకు విక్రయించే దుకాణాలతో పాటు, కొనుగోలుదారులకు ఇప్పుడే ఫ్యాషన్ లోకి వచ్చిన ఎంపికలను అందించే చాలా ఉన్నత శ్రేణి దుకాణాలు, బ్రాండులకు ఢిల్లీ నిలయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0027 దేశ రాజకీయ కేంద్రంగా ఢిల్లీ ప్రముఖ స్థానం నిర్వివాదాంశం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0029 కేంద్రపాలిత ప్రాంతం అయిన ఇది కానట్ ప్లేస్, లోధి కాలనీ వంటి ప్రాంతాలతో పాటు భారత పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ లేదా రాష్ట్రపతి నివాసం, రాజ్ ఘాట్ (జాతి పిత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం) లాంటి విస్మయం కలిగించే నిర్మాణాలకు నిలయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0030 ఒక శతాబ్దానికి పైగా ఢిల్లీ భారతదేశ రాజధాని. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0031 పూర్వ కాలంలో గొప్ప శక్తివంతమైన పాలకులలో కొందరు పరిపాలించిన ఈ నగరం, హిందూ మహాకావ్యమైన మహాభారతములో దీని జాడలు కనిపిస్తాయి అని చరిత్ర చెబుతోంది. అప్పుడు ఇది పాండవుల నివాసమైన ఇంద్రప్రస్థంగా ప్రాచుర్యం పొందింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0033 1192 లో మహమ్మద్ ఘోరి అనే ఆఫ్ఘన్ యోధుడు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు (1206). ebs_tourism-delhi-part1-translation-hin2tel_0034 1398 లో, ఒక టర్కో-మంగోల్ పాలకుడు అయిన తైమూర్ ఈ నగరంపై దాడి చేసి తన రాజ్యాన్ని స్థాపించాడు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0035 తరువాత దీనిని లోదీ రాజవంశ యొక్క రాజులు పాలించారు. వీరు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చేతిలో ఓడిపోయారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0036 షాజహాన్ పాలనలో ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా మారింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0037 మొఘలుల కాలం మూడు శతాబ్దాలకు పైగా కొనసాగింది. తరువాత భారతదేశం బ్రిటీష్ వారి చేతుల్లోకి వచ్చింది. వారు తమ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి 1911 సంవత్సరంలో మార్చారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0038 తుగ్లక్ ఇంకా ఖిల్జీల వంటి ఇతర ప్రధాన రాజవంశాలకు కూడా ఢిల్లీ రాజధానిగా ఉండేది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0039 స్వాతంత్ర్యం తరువాత న్యూ ఢిల్లీ 1947 లో భారత గణతంత్ర రాజ్యానికి అధికారిక రాజధానిగా మారింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0043 ఎర్ర కోట (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0045 ఢిల్లీ మధ్యలో ఉన్న ఎర్రటి ఇసుకరాయితో చేసిన గంభీరమైన ఎర్ర కోట, మొఘలుల నిర్మాణ వారసత్వానికి నిదర్శనం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0046 ఖిలా-ఎ-ముబారక్ గా ప్రసిద్ధి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రపంచంలోని అత్యంత అందమైన స్మారక కట్టడాలలో ఒకటి. ఇది రాజభవనాలు, మంటపాలు, మసీదులతో నిండి ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0048 మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన రాజధాని షాజహానాబాద్ రాజభవన కోటగా నిర్మించిన ఈ ఎర్ర కోట, దాని భారీ గోడలకు ప్రసిద్ధి చెందింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0049 కోట నిర్మాణం ఇస్లామిక్, పర్షియన్, తైమురిద్ ఇంకా హిందూ శైలుల సమ్మేళన కలయికను ప్రతిబింబిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0050 దివాన్-ఎ-ఖాస్, షా మహల్, దివాన్-ఎ-ఆమ్ లేదా హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్, ఇంతియాజ్ మహల్ అని కూడా పిలువబడే రంగ్ మహల్ (అంతఃపురంలో ఒక భాగం) ప్రముఖ ఆకర్షణలు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0051 ఇక్కడ ఉన్న ఇతర స్మారక చిహ్నాలలో నౌబత్ ఖానా (డ్రమ్ హౌస్) ఒకటి. ఇక్కడ రాజ దర్బారుకు చెందిన సంగీతకారులు వాద్యాలు వాయించి, రాజ కుటుంబ సభ్యుల రాకను ప్రకటించేవారు. ఇంకా హమామ్ (రాజ కుటుంబీకుల స్నానాల గది), ముతమ్మన్ బుర్జ్ లేదా ముసమ్మన్ బుర్జ్ (చక్రవర్తి తన ప్రజలకు దర్శనమిచ్చే మినార్) స్మారక చిహ్నాలు ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0052 మొఘలుల శక్తి బలహీనపడిన తర్వాత, 1739 లో నాదిర్ షా నేతృత్వంలోని పర్షియన్లు ఈ కోటను దోచుకున్నారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0053 బంగారం, రత్నాలతో (విలువైన కోహినూర్ వజ్రంతో సహా) షాజహాన్ తయారు చేయించిన విలువైన నెమలి సింహాసనంతో సహా కోటలోని చాలా నిధులను ఆక్రమణదారులు దోచుకున్నారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0055 స్మారక చిహ్నాలతో పాటు, ఈనాడు పర్యాటకులను ప్రధానంగా ఆకర్షించేది సోన్ ఏ లూమియర్ అనబడే ఒక సౌండ్ అండ్ లైట్ షో. ఇది ప్రతి సాయంత్రం జరుగుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0056 మనోహరమైన ఈ ఒక గంట సుదీర్ఘ ప్రదర్శన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం చరిత్రను గురించి అలాగే వారి అద్భుతమైన గతం, వారి పతనానికి దారితీసిన సంఘటనల దశల సంగ్రహావలోకనం అందిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0057 ఈ కథనాన్ని మహా నటుడు అమితాబ్ బచ్చన్ రికార్డ్ చేశారు. ఇది ప్రదర్శనను మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0059 కోట ప్రవేశ ద్వారమైన లాహోర్ గేట్ ద్వారా చట్టా చౌక్ అనే షాపింగ్ ప్రాంతానికి చేరుకోవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0060 చౌక్ అనేది, రాజ కుటుంబీకుల దుస్తులు కుట్టే వారు, వ్యాపారులను ఉంచటానికి ఉపయోగించే ఒక కమాను గల మార్గం. దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబందించిన జాతీయ హస్తకళా వస్తువులు, దుస్తులు విక్రయించే దుకాణాలతో నిండి ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0061 ఎర్ర కోటలో అనేక సైనిక బ్యారక్‌లు ఉన్నాయని చాలా మందికి తెలియదు. వీటిని బ్రిటిష్ వారు పెంచి పోషించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0062 ఎరుపు, తెలుపు ఇసుకరాయితో తయారు చేయబడిన బ్యారక్స్ వలసరాజ్యాల నిర్మాణానికి చక్కటి నమూనాగా నిలుస్తాయి. వాటి గత కాలపు ఆకర్షణ తక్షణమే ఆకట్టుకుంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0063 1857 నాటి ఈ బ్యారాక్ లు, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను గద్దెదించిన తరువాత బ్రిటిష్ సైన్యం కోసం నిర్మించబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0064 బ్రిటీష్ పాలన ముగిసిన తరువాత, భారతీయ ఆర్మీ సిబ్బందిని ఉంచడానికి బ్యారక్ లను ఉపయోగించారు. 2003 తరువాత మాత్రమే సైన్యం వాటిని ఖాళీ చేసింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0065 ఈ రోజు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వారి సహకారంతో ఈ బ్యారక్లలో కొన్నిటిని మ్యూజియములు, ఆర్ట్ గ్యాలరీలుగా మార్చారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0067 ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్ గేట్ ప్రాకారాల నుండి భారత ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం ఎర్ర కోటను దేశంలోని అత్యంత ముఖ్యమైన స్మారక కట్టడాలలో ఒకటిగా చేస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0068 దీని వినూత్న ప్రణాళిక, అద్భుతమైన వాస్తుశిల్ప కళ రాజస్థాన్, ఢిల్లీ, ఆగ్రాలోని అనేక స్మారక చిహ్నాలకు ప్రేరణగా నిలిచింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0070 ఈ చారిత్రాత్మక కోట సందర్శన ఢిల్లీ గత కాలపు శ్రేష్ఠమైన అనుభవాన్ని అందిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0072 ఈ కోట నిర్మాణం 10 సంవత్సరాల వ్యవధిలో (1638-48) పూర్తయింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0073 ఇది ఒకప్పుడు యమునా నది ఒడ్డున ఉండేది. కాలక్రమేణా ఇది దూరమైంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0074 నహర్- ఎ-బిహిష్త్ లేదా స్వర్గపు నది అని పిలువబడే చెట్ల అంచుగల జలమార్గం కోట నుండి బయటకు వెళ్లిందని, దానికి నీరు యమునా నుండి వచ్చేదని చరిత్రకారులు సూచిస్తున్నారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0076 కుతుబ్ మినార్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0078 దాదాపు ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్య చరిత్ర అంత పురాతనమైన, ప్రాచుర్యం పొందిన ఈ కుతుబ్ మినార్, నగర ఆకాశంలో కనిపించే ఆకారం వ్యాపించి ప్రపంచంలోని ఎత్తైన ఇటుక మినార్. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0079 73 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఐదు అంతస్తుల మినార్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది మధ్యయుగ కాలం నాటి భారతదేశంలోని అద్భుతమైన భవనాల్లో ఒకటిగా నిలిచింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0080 మినార్ మొదటి మూడు అంతస్తులు ఎర్ర ఇసుకరాయిలో నిర్మించబడ్డాయి. అయితే నాల్గవ, ఐదవ అంతస్తులు మాత్రం పాలరాయి, ఇసుకరాయితో నిర్మించబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0081 ఐదు అంతస్తులూ ముందరికి పొడుచుకొని వచ్చిన బాల్కనీలతో అలంకరించబడి ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0083 ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఉన్న కుతుబ్ మినార్‌ను కుతుబ్-ఉద్-దిన్ ఐబాక్ ఆదేశానుసారం నిర్మించారు. అతను భారతదేశంలో మమ్లుక్ రాజవంశం (1206-1290) కు పునాది వేసాడు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0084 ఆఫ్ఘనిస్తాన్లోని ఘజనీ వద్ద ఉన్న విజయ స్తంభం నుండి ప్రేరణ పొందిన దీని నిర్మాణం క్రీ.శ 1192 లో ప్రారంభమైంది. కానీ దురదృష్టవశాత్తు కుతుబ్-ఉద్-దిన్-ఐబాక్ దాని నిర్మాణం పూర్తయేంతవరకూ జీవించలేదు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0085 ఈ మినార్ చివరకు అతని వారసులైన ఇల్తుతమిష్, ఫిరోజ్ షా తుగ్లక్ లు పూర్తి చేయించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0087 ఇక్కడున్న మరొక ఆకర్షణ కువ్వత్ ఉల్-ఇస్లాం మస్జిద్. ఇది చిన్న మినార్ పక్కనే ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0088 కుతుబ్-ఉద్-దిన్-ఐబాక్ నిర్మించిన ఈ మస్జిద్ అనేక స్మారక కట్టడాలను కలిగి ఉన్న కుతుబ్ సముదాయంలో మొదటి భవనంగా పరిగణించబడుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0089 వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది ఐరన్ పిల్లర్. దీనినే అశోక పిల్లర్ అని కూడా అంటారు. ఇది 4 వ శతాబ్దం నాటిది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0090 24 అడుగుల ఎత్తు, ఆరు టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఈ స్తంభం తుప్పు పట్టకుండా అధిక నిరోధకత ప్రదర్శించటానికి ప్రసిద్ధి చెందింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0091 మీరు స్తంభాన్ని మీ వెనుక నుండి వాటేసుకొని చేతులతో చుట్టగలిగితే మీరు కోరుకున్న ఏ కోరిక అయినా నెరవేరుతుందని ఈ సముదాయాన్ని సందర్శించే పర్యాటకులకు ఉన్న ఒక ప్రసిద్ధ నమ్మకం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0092 మహా నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం, చీని కమ్ లోని ఒక సన్నివేశంలో ఈ నమ్మకానికి ఉదాహరణగా చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0094 పర్యాటకులు అలాయి దర్వాజాను కూడా సందర్శించవచ్చు. ఇది ఎర్ర ఇసుకరాయితో నిర్మించిన గుమ్మటం గల ఒక ప్రవేశద్వారం. ఇది తెలుపు పాలరాయి పొదుగులతో అలంకరించబడి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0095 అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన ఈ గొప్ప స్మారక చిహ్నం, దీనిని నిర్మించిన నిపుణులైన టర్కిష్ చేతిపనులు చేసే వారి పనితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0096 కుతుబ్ మినార్ కంటే రెట్టింపు ఎత్తులో ఉండాలని కోరుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చేత ఆదేశానుసారం నిర్మించిన అలాయి మినార్ కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0097 దురదృష్టవశాత్తూ 1316 లో ఖిల్జీ మరణం తరువాత ఈ మినార్ నిర్మాణం నిలిచిపోయింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0098 ఈ రోజు మినార్ మొదటి అంతస్తులో రాళ్ళూ రప్పలతో చేసిన ఒక పెద్ద రాతి పనిని ఈ ప్రదేశంలో చూడవచ్చు. ఇది రాతి పొరలతో తాపడం చేద్దామన్న ఉద్దేశంలో చెయ్యబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0099 ఇల్తుతమిష్ సమాధిని ఆ చక్రవర్తే స్వయంగా నిర్మింపజేసాడు. ఇది ఢిల్లీలో నిర్మించిన మొదటి సమాధులలో ఒకటి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0101 పర్యాటకులు మెహ్రౌలి పురావస్తు పార్కుకు కూడా వెళ్ళవచ్చు. ఇది ఒకప్పుడు ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్య పాలకుడిగా ఉన్న గియాస్-ఉద్-దిన్ బాల్బన్ సమాధికి నిలయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0102 కుతుబ్ కాంప్లెక్స్‌లో జమాలీ కమాలీ మస్జిద్, ఒక సూఫీ సాధువు సమాధి ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0103 నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే మూడు రోజుల కుతుబ్ ఫెస్టివల్, శాస్త్రీయ నృత్యం, సంగీతాల మేలు కలయికతో నిజమైన జనాకర్షక ఉత్సవం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0105 హుమాయున్ సమాధి (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0107 చక్కగా తీర్చిదిద్దిన పచ్చిక బయళ్ళతో ఉండే భారీ హుమయూన్ సమాధి ఒక అద్భుతమైన స్మారక చిహ్నం. ఇది భారత ఉపఖండంలో నిర్మించిన మొదటి తోట సమాధి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0108 మొఘల్ వాస్తు కళకి పర్యాయపదమైన గొప్ప సమాధులలో మొదటిది. ఈ స్మారక చిహ్నం ప్రేమ, వాంఛల కాలాతీత గాథలను వివరిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0109 మొఘల్ చక్రవర్తి హుమాయున్ మొదటి భార్య, సామ్రాజ్ఞి హాజీ బేగం నిర్మించిన ఈ సమాధిలో చక్రవర్తితో పాటు అతని భార్య ఇద్దరి సమాధులు ఉన్నాయి. ఇది వారి శాశ్వత ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0111 పర్షియన్ వాస్తుశిల్పి మిరాక్ మీర్జా ఘియాస్ రూపొందించిన ఈ భవనం ప్రపంచపు నలుమూలల నుండి పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0112 మీరు దట్టమైన తాటిచెట్ల వరుస గల పచ్చిక బయళ్లలోకి ప్రవేశించినప్పుడు, మీకు అందమైన ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. ఇది ఫోటోగ్రఫీకీ గొప్ప నేపథ్యం అవుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0113 ఉద్యానవనాన్ని మళ్ళీ నడక మార్గాలు, నీటి మార్గాలతో కలిపి నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు. ఈ రూపకల్పన ఇస్లాం పవిత్ర పుస్తకం ఖురాన్లో పేర్కొన్న పారడైజ్ గార్డెన్‌కు పర్యాయపదంగా ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0114 ఈ నాలుగు ప్రధాన విభాగాలు 36 ఉప భాగాలుగా విభజించబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0116 స్మారక చిహ్నాన్ని చేరుకోవడానికి ఘనమైన ద్వారాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0117 చివరి ద్వారానికి సరిగ్గా ముందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఒక వీక్షణ గ్యాలరీని ఏర్పాటు చేసింది. ఇందులో స్మారక చిహ్నపు వైభవాన్ని ప్రతిబింబించే దాని పాత చిత్రాలు ఉంటాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0119 ప్రధాన భవనం ఎరుపు ఇసుకరాయితో నిర్మించబడింది. అయితే సమాధి మాత్రం తెలుపు, నలుపు పాలరాయితో తయారు చేయబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0120 ఒక ఆకర్షణీయమైన ద్వారం మిమ్మల్ని హుమయూన్ సమాధి గల కేంద్ర చావడికి తీసుకెళుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0121 ఈ చావడి చక్కగా చెక్కబడిన కిటికీలు, అందంగా రూపొందించిన పైకప్పుతో అలంకరించబడి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0122 పెద్ద వేదిక అనేక సమాధులతో నిండి ఉంటుంది. వీటిలో సామ్రాజ్ఞి అయిన హాజీ బేగం, యువరాజు దారా షికో సమాధులు కూడా ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0124 స్మారక చిహ్నపు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది హుమాయున్ ప్రియమైన క్షౌరకుడి సమాధిని కూడా కలిగి ఉండటం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0125 1857 లో బ్రిటిష్ వారు అతన్ని బంధించి బహిష్కరించడానికి ముందు ఈ స్మారక చిహ్నాన్ని చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆశ్రయానికి ఉపయోగించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0126 సముదాయానికి కుడి వైపున షేర్ షా సూరి ఆస్థానంలో ఒక సంస్థానాధిపతి అయిన ఇసా ఖాన్ సమాధి ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0127 ఇది లోది-యుగ నిర్మాణ శైలిని వివరిస్తుంది. ఇక దీనిని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0129 హుమాయున్ సమాధి ఢిల్లీలోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ అయిన హజ్రత్ నిజాముద్దీన్ దర్గాకు దగ్గరగా ఉంటుంది. ఇది 14 వ శతాబ్దపు సూఫీ సాధువు అయిన నిజాముద్దీన్ ఔలియా సమాధిపై నిర్మించిన పవిత్ర స్థలం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0131 ఇండియా గేట్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0133 దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళిగా నిలబడే అద్భుతమైన కమాను మార్గం అయిన ఇండియా గేట్ ఢిల్లీ కొండగుర్తులలో (లాండ్ మార్కులలో) ఒకటి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0134 ఇసుకరాయితో నిర్మించిన ఈ 42 మీటర్ల ఎత్తైన గేట్, దేశ రాజధానిలో దానికదే సాటి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0135 మొదటి ప్రపంచ యుద్ధంలో అమరవీరులైన భారత సైన్యపు 90,000 మంది సైనికుల పేర్లతోపాటు 1919 నాటి ఆఫ్ఘన్ యుద్ధంలో వాయువ్య సరిహద్దులో మరణించిన 13,516 మంది సైనికుల పేర్లతో గేట్వే గోడలు చెక్కబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0136 స్మారక చిహ్నపు పునాది ఎర్ర భరత్పూర్ రాళ్ళతో తయారు చేయబడింది. ఇండియా గేట్ ఆకృతి ఫ్రాన్స్ లోని ఆర్క్-ద-ట్రయంఫ్ ను పోలి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0138 ఇండియా గేట్ చుట్టూ చక్కగా పర్యవేక్షించే పచ్చిక బయళ్ళతో నిండి ఉంది. ఇవి కుటుంబాలకు ప్రసిద్ధ పిక్నిక్ వేదికగా ఉంటాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0139 మృదువైన బంగారు దీపాలలో స్నానం చేసినట్టుండే నక్షత్రాల మిలమిలలు లేని చీకటి సమయం ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి మంచి సమయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0141 ఈ గొప్ప స్మారక చిహ్నానికి పునాది 1921 లో డ్యూక్ ఆఫ్ కానాట్ వేసారు. దీనిని ఎడ్విన్ లూటెన్స్ రూపకల్పన చేసారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0142 ఒక దశాబ్దం తరువాత ఈ స్మారక చిహ్నాన్ని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ భారతదేశానికి అంకితం చేశారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0144 పాలరాయితో తయారు చేసిన అమర్ జవాన్ జ్యోతి ఇండియా గేట్ ముందు ఉంటుంది. దీనిని 1971 సంవత్సరంలో నిర్మించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0145 1971 డిసెంబర్‌లో ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు నివాళిగా దీనిని నిర్మించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0146 ఈ జ్యోతికి యూనిఫాం వేసుకున్న సైనికులు కాపలాగా ఉంటారు. ఆర్మీ హెల్మెట్ కిరీటంగా ఉన్న ఒక మెరిసే రైఫిల్ కూడా దానికి సమీపంలో ఉంచబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0148 అమర్ జవాన్ జ్యోతిపై రాష్ట్రపతి పూలమాల సమర్పించినప్పుడు, ఇండియా గేట్ విస్మయం కలిగించే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆతిథ్యమిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0149 దీని తరువాత రాజ్‌పథ్ వెంట గొప్ప కవాతు జరుగుతుంది. ఈ కవాతును కంటింజెంట్లు, ట్యాంకులు, శక్తివంతమైన ఫ్లోట్లు, ఆయుధాలు అన్నీ చక్కని వరుసలో నిర్వహించడాన్ని చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0150 పాఠశాల పిల్లలు, జానపద నృత్యకారులు కవాతులో పాల్గొని మొత్తం కార్యక్రమానికి సాంస్కృతిక స్పర్శను అందిస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0152 నేషనల్ జూలాజికల్ పార్క్ (చేయవలసిన పనులు) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0154 నేషనల్ జూలాజికల్ పార్క్ లేదా ఎక్కువగా ఢిల్లీ జూ అని పిలవబడే ఈ జూ ఓల్డ్ ఫోర్ట్ సమీపంలో ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0155 176 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇది వివిధ రకాల వృక్షజాలం, పక్షులతో పాటు 1,000 కి పైగా జంతువులకు నివాసం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0157 నీటిలో బద్ధకంగా ఈత కొడుతున్న భారీ నీటిగుర్రంను సందర్శించండి, చింపాంజీలు సరదాగా ఆడటం చూడండి, స్పైడర్ కోతి పొడవాటి చేతులు ఇంకా తోకలను మీ తల చుట్టూ అలంకారికంగా చుట్టడానికి ప్రయత్నించండి, లేదా ఆసియా సింహం దాని ఆవరణంలో అశాంతంగా ఆహారం కోసం తిరుగుతూ దాని అధికారం నిండిన గర్జన వినండి. ఇలాంటి చాలా సరదా అనుభవాలు ఢిల్లీ జూలో మీకోసం ఎదురుచూస్తున్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0158 రాయల్ బెంగాల్ టైగర్, చిత్తడి జింక, భారతీయ ఖడ్గమృగం, సాంగై జింక మొదలైనవి ఉండే ఆవరణలను తప్పక చూడవలసినవి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0159 పక్షుల పరిశీలకులు కొంగలు, నెమలులు వంటి వలస పక్షులను సందర్శించడం ఒక ఆసక్తికరమైన దృశ్యం అవుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0161 ఉత్కంఠభరితమైన అనుభవం కోసం పర్యాటకులు వివిధ రకాల బల్లులు, పాములకు నివాసమైన రెప్టైల్ హౌస్ (సరీసృపాల గృహానికి) వెళ్ళవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0163 జూను 1959 లో ప్రారంభించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0164 రాయల్ బెంగాల్ టైగర్, ఆసియా సింహం, చిత్తడి జింక, భారతీయ ఖడ్గమృగం వంటి జాతుల పరిరక్షణ పెంపకపు కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0165 జంతుప్రదర్శనశాలను చూడటానికి మంచి మార్గం బ్యాటరీ-కారును అద్దెకు తీసుకోవడం. ఇది అన్ని చోట్లను చూపిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0167 జూలో ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ వన్యప్రాణులపై రాసిన పుస్తకాల సేకరణ ఉంది. ఇవి ఈ జూ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0168 సందర్శకులు తాగునీరు మినహా ఇతర రకాల ఆహారాలను ప్రాంగణం లోపలికి తీసుకురావడానికి అనుమతి లేదు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0170 బహాయి లోటస్ టెంపుల్ (ఆధ్యాత్మికం) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0172 బ్రహ్మాండమైన కమలం ఆకారంలో నిర్మించిన బహాయి లోటస్ టెంపుల్ ప్రశాంతమైన విశ్రాంతి స్థలం. దీనికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0173 ఇది బహాయి మతానికి చెందినది. ఇది సర్వ మత సమానత్వం మరియు ఐక్యతా అనే విశ్వవ్యాప్త ఉద్దేశ్య లక్ష్యం కలిగినది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0174 అన్ని మతాలు, విశ్వాసాలకి చెందిన వ్యక్తులు లింగ బేధం లేకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించవచ్చు. వారి వారి మత మంత్రాలను జపించవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0175 1986 లో ఇరానియన్-కెనడియన్ వాస్తుశిల్పి అయిన ఫరీబర్జ్ సాహ్బా రూపొందించిన ఈ ఆలయం 27 తెల్ల పాలరాయి రేకులు కల కమలం పువ్వు ఆకారంలో ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0176 సుమారు 40 మీటర్ల ఎత్తు, 2,500 మందికి ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఉన్న సెంట్రల్ హాల్‌లోకి తొమ్మిది తలుపులు తెరుచుకుంటాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0177 సంధ్యా సమయంలో అద్భుతంగా కనిపించే తొమ్మిది నీటి కొలనులు ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0178 ఈ ఆలయం నిర్మాణ రూపకల్పన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0180 చాందిని చౌక్ (చేయవలసిన పనులు) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0182 పాత ఢిల్లీ ప్రాచీనతను కాపాడుతూ ఉండే చాందినీ చౌక్ సందడిగా ఉండే ఒక ప్రాంతం. ఇది దేశ రాజధానిలో అతి పురాతన ప్రదేశం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0183 ఎప్పుడూ జనాలతో కళకళలాడే సందడిగా ఉండే బజార్ అయిన చాందిని చౌక్, రుచికరమైన స్నాక్స్, స్వీట్స్, పిండి వంటకాలు అమ్మే, బట్టలతో సహా పలు ఉత్పత్తులు చవకగా అమ్మే చిన్న దుకాణాలతో నిండిన ఇరుకైన సందులతో గజిబిజిగా ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0184 ఈ మధ్యయుగ కాలపు షాపింగ్ సైట్లో లోకంలోని అన్ని సామానులు అంటే పరిమళ ద్రవ్యాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, కొవ్వొత్తులు, జీవనశైలి వస్తువులు, దేవ దేవతల విగ్రహాలు దొరుకుతాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0185 అంతేకాకుండా ఇది ఢిల్లీలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లలో ఒకదానికి విడిది ఇస్తుంది. ఇక్కడ సందర్శకులు అనేక వస్తువులపై భారీ తగ్గింపులు పొందవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0187 చాందినీ చౌక్ దాని ఆహారానికి బాగా ప్రాచుర్యం పొందింది. ఇది జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇతరుల వంటి అనేకమంది ప్రముఖులకు ప్రీతిపాత్రమైనది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0188 మీరు మార్కెట్ లోని గొప్ప వంటకాలని ఆస్వాదించాలనుకుంటే ముందుగా మెట్రో స్టేషన్ సమీపంలోని ఓల్డ్ ఫేమస్ జిలేబీ వాలాతో ప్రారంభించండి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0189 ఢిల్లీ శీతాకాలంలో మునిగి తేలుతూ మంచి వేడి వేడి నోటిలో కరిగిపోయే తియ్యటి జిలేబీలను రుచి చూడండి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0190 ఒక భ్రాంతిమూలక వాతావరణం కోసం ఆహార ప్రేమికులు పరాంఠే వాలీ గలీకి వెళ్ళవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0191 తాజా, వేడి వేడి పరాంఠేలను (పరాటా) విక్రయించే వరుస దుకాణాలతో ఉన్న చాలా సన్నని వీధి, తప్పక సందర్శించాల్సినది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0192 పుష్టికరమైన ఆలూ (బంగాళాదుంప ఇగురుతో వడ్డించిన డీప్ ఫ్రైడ్ పేస్ట్రీ), దాహీ భల్లా (పెరుగుతో వడ్డించే డీప్ ఫ్రైడ్ స్నాక్) లు కుడా లభిస్తాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0193 మీరు వేసవికాలంలో సందర్శిస్తే, పెద్ద గ్లాసు నిండా మసాలా నిమ్మరసం తప్పక తాగి తీరాల్సిందే. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0194 చాందిని చౌక్ ఆహారాంశాలలో ముఖ్యమైనది రబ్రీ ఫలుదా (వర్మిసెల్లితో పాటు ఇచ్చే తియ్యని చిక్కని పాల వంటకం). ebs_tourism-delhi-part1-translation-hin2tel_0195 ఇక్కడి చాలా దుకాణాలు 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. ఇవి మధ్యయుగపు ఢిల్లీ రుచిని అందిస్తూనే ఉంటాయి. అదే ఆ ప్రదేశాన్ని ప్రేమించేలా చేస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0197 చాందిని చౌక్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 17 వ శతాబ్దంలో నిర్మించాడు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0198 ఎర్రకోటకు ఎదురుగా విస్తరించి ఉండే ఇది, ఫతేపురి మసీదు యొక్క సుందర దృశ్యాన్ని అందజేస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0200 షాజహాన్ పాలనలో ఇక్కడ చంద్రాకారంలో ఉండే చెట్ల మధ్యగా ప్రవహించే కాలువ ఉండేది. అందుకే ఈ మార్కెట్ కు `చాందిని చౌక్’ అనే పేరు ఉన్నది. దీని అర్థం 'చంద్రకాంతి ప్రదేశము'. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0204 ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర హిందూ దేవాలయంగా గిన్నిస్ రికార్డ్స్‌ను కలిగి ఉన్న అక్షర్ ధామ్ ఆలయ సముదాయం అద్భుతమైన నిర్మాణ శిల్పం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0205 విశాలమైన విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ సముదాయం పైనుండి చూసినప్పుడు అద్భుతమైన స్వర్గపురిలాగా కనిపిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0206 ఈ ఆలయం గులాబీ ఇసుకరాయి, పాలరాయితో నిర్మించబడింది. ఇది చక్కగా అలరారే పచ్చిక బయళ్ళు, సహజమైన నీటి అంచులు, బహిరంగ ప్రాంగణాల మధ్య ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0207 ఇది సాంప్రదాయ హిందూ శైలి నిర్మాణంలో వాస్తు శాస్త్రం పంచరాత్ర శాస్త్రాలను అనుసరించి రూపొందించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0208 మీరు ఉత్కంఠభరితమైన ఈ సముదాయంలో షికారు చేస్తున్నప్పుడు గోడలపై అలంకరించిన జంతువులు, పువ్వులు, నృత్యకారులు, సంగీతకారులు, దేవ దేవతల క్లిష్టమైన శిల్పాలను చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0209 ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయిని రాజస్థాన్ నుంచి తీసుకువచ్చారు. ఇది 6,000 టన్నుల బరువున్నట్లు చెబుతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0210 ఈ నిర్మాణంలో ఉపయోగించిన ఇటాలియన్ కారారా పాలరాయి, భవ్యమైన ఆలయ సౌందర్యాన్ని పెంచుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0212 యజ్ఞపురుష్ కుండ్ వద్ద జరిగే సహజ్ ఆనంద్ వాటర్ షో అనబడే మ్యూజికల్ ఫౌంటెన్, ఉత్కంఠభరితమైన లైట్ అండ్ సౌండ్ షో ఈ ఆలయంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0213 రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన పురాతన హిందూ మత గ్రంథాల కథల వర్ణనలతో నిండి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0214 ఇది రంగురంగుల లేజర్‌లు, నీటి అడుగున మంటలు, వాటర్ జెట్‌లు ఇంకా వీడియో ప్రొజెక్షన్‌లను ఉపయోగించి చేసే ఒక అద్భుతమైన కూర్పు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0216 ఈ ఆలయం 140 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది 300 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0217 ఇక్కడ 234 అందంగా చెక్కిన స్తంభాలతో పాటు తొమ్మిది విస్తృతంగా చెక్కిన గోపురాలను కలిగి ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0218 ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 20,000 హిందూ దేవుళ్ళూ, దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి ప్రధాన మందిరం స్వామీనారాయణుడిది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0219 11 అడుగుల పొడవైన భగవంతుడి విగ్రహం ప్రధాన గోపురం క్రింద ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0220 ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్షర్‌ధామ్‌లోని ప్రతి విగ్రహాన్ని పంచ ధాతు అనే ఐదు లోహాల మిశ్రమంతో కలిపి చేసారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0221 3,000 టన్నుల బరువున్న 148 ఏనుగుల విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0223 ఈ ఆలయాన్ని పది ద్వారాల ద్వారా ప్రవేశించవచ్చు, ఇది 10 దిశలను సూచిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0224 ప్రధాన ద్వారం భక్తిద్వార్ లేదా భక్తి ద్వారం అని ప్రసిద్ది చెందింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0225 అక్షర్ ధామ్ నవంబర్ 6, 2005 న ప్రారంభించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0226 ప్రపంచవ్యాప్తంగా 8,000 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0228 జంతర్ మంతర్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0230 జైపూర్‌కు చెందిన మహారాజా జై సింగ్ II 1724 లో నిర్మించిన జంతర్ మంతర్ ఉత్తర భారతదేశపు రాజులు నిర్మించిన ఐదు ఖగోళ అబ్జర్వేటరీలలో (నక్షత్రావలోకనశాలలలో) ఒకటి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0231 రేఖాగణిత రూపాల అద్భుతమైన కలయికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాస్తుశిల్పులు, కళాకారులు, కళలకు సంబందించిన చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0232 ఇది మామూలు కన్నుతో నేరుగా ఖగోళ స్థానాలను చూసి పరిశీలించటం కోసం రూపొందించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0233 ఇది టోలెమేయక్ స్థాన ఖగోళ శాస్త్ర సంప్రదాయంలో ఒక భాగం. ఇది చాలా ప్రాచీన నాగరికతలలో సర్వ సాధారణ విషయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0235 జంతర్ మంతర్ లో 13 ఖగోళ పరికరాలు ఉన్నాయి. ఇవి గ్రహాలు, సూర్య చంద్రుల కదలికలు, సమయాలను అంచనా వేయడానికి ఉపయోగించబడతాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0236 ఖగోళ పదార్థాల గురించిన ఖచ్చితమైన అవగాహన కోసం ఖగోళ పట్టికలు, పటాలు సంకలనం చేయబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0237 జంతర్ మంతర్ లోని ప్రధాన ఆకర్షణలు మిశ్రా యంత్ర, సామ్రాట్ యంత్ర, జయప్రకాష్ యంత్ర. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0239 సామ్రాట్ యంత్రం ఒక పెద్ద సూర్య గడియారం, ఇది భూమి యొక్క అక్షానికి సమాంతరంగా నిలుస్తుంది మరియు సమయం యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0240 జయప్రకాష్ యంత్రం అర్ధగోళ ఆకారంలో ఉన్న పరికరం మరియు నక్షత్రాల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని లిఖిత సంకేతాలతో సమలేఖనం చేయడానికి ఉపయోగిస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0241 ఇక మిశ్రా యంత్ర సంవత్సరంలో అతి తక్కువ, అతి పొడవైన రోజులను కనుగొనడానికి వాడతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0242 ఈ పరికరాలన్నీ ఇటుక ఇంకా రాళ్ళూ రప్పలతో నిర్మించబడి సున్నంతో ప్లాస్టర్ చేయబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0243 పర్యాటకులు జంతర్ మంతర్‌కు తూర్పున ఉన్న ఒక చిన్న భైరవ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0245 కథనాల ప్రకారం మహారాజా సవాయి జై సింగ్ II కు ఖగోళ పదార్థాల కదలికలను తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ఉండేది. ఈ కారణం చేత వాటి దూరం, స్థానం, వేగాన్ని లెక్కించడానికి జంతర్ మంతర్ నిర్మాణాన్ని ఆదేశించాడని చెబుతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0247 రాష్ట్రపతి భవన్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0249 భారత రాష్ట్రపతి అధికారిక నివాసం అయిన రాష్ట్రపతి భవన్ ఢిల్లీలోని ప్రముఖ ప్రదేశం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0250 ఎడ్వర్డియన్ బరోక్ శైలి నిర్మాణంలో నిర్మించిన రాష్ట్రపతి భవన్, సాంప్రదాయిక మూలాంశాలతో అలంకరించబడింది, ఇది వారసత్వం మరియు అధికారాన్ని సూచిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0251 రాష్ట్రపతి భవన్ 321 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో అతిథి గదులు, రిసెప్షన్ హాల్స్, కార్యాలయాలు, సిబ్బంది, బాడీగార్డ్ల నివాసాలతో సహా 340 గదులు ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0253 రాష్ట్రపతి భవన్ 1929 లో నిర్మించబడింది. దీనిని ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ ఇంకా వైస్రాయ్ హౌస్ అని కూడా అంటారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0254 అంతకుముందు ఇది బ్రిటిష్ వైస్రాయ్ నివాసం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0255 నిర్మాణ కళకు అద్భుతమైన ఉదాహరణ అయిన రాష్ట్రపతి భవన్ 17 సంవత్సరాలలో నిర్మించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0256 రాష్ట్రపతి భవన్‌ రూపకల్పనను ఎడ్వర్డ్ లూటెన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ లు రూపొందించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0257 భవన్ లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండి,159 రకాల గులాబీలు, 60 రకాల బోగన్ విల్లాలు, అనేక రకాల పువ్వులను కలిగి ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0258 రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్‌కు సందర్శించడం కూడా ఒక ఆసక్తికరమైన అనుభవం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0259 ఇందులో ప్రధాన ఆకర్షణ రాష్ట్రపతికి సంబంధించిన ఒక పాత బగ్గీ(గుర్రపు బండి), దీనిని సజీవ గుర్రాల విగ్రహాలు పూర్తిగా వాస్తవమైనవిగా కనిపిస్తాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0260 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి జోర్డాన్ రాజు బహుమతిగా ఇచ్చిన మర్సిడీస్ కారును కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0261 చరిత్రను దగ్గర నుండి చూడటానికి పర్యాటకుల కోసం స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి అరుదైన ఛాయాచిత్రాలను ఒక టేబుల్‌పై ప్రదర్శించటం ఇక్కడ చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0262 ప్రాంగణంలోని ఒక గిఫ్ట్ కౌంటర్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రపతి అందుకున్న బహుమతులను ప్రదర్శిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0263 పర్యాటకులు ప్రత్యేకంగా 3-D హోలోగ్రాఫిక్ చిత్రాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేక చదరపు బాక్స్ ని చూసి విస్మయానికి గురవుతారు. వీటిని వివిధ అధ్యక్షుల ప్రసంగాలతో పాటు ప్రదర్శిస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0264 ఈ మ్యూజియంలో చాలా కిటికీలు ఉన్నాయి, ఇక్కడ ఇప్పటివరకు తయారు చేసిన అన్ని అధ్యక్షుల వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0266 దేశ రాజకీయ నాయకుల కన్నా చాలా ముందు, మహాత్మా గాంధీ 1931 లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు. ఆయనను లార్డ్ ఇర్విన్ ఆహ్వానించినప్పుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసనకు సూచకంగా ఆయన తన వెంట ఒక చిటికెడు ఉప్పు తీసుకెళ్ళారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0267 ఈ సమావేశం చివరకు 1931 నాటి గాంధీ-ఇర్విన్ ఒప్పందంతో ముగిసింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0269 జామా మస్జిద్ (ఆధ్యాత్మికం) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0271 భారతదేశంలో అతిపెద్ద మసీదులలో ఒకటైన జామా మస్జిద్ పాత ఢిల్లీలో ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0272 దీని నిర్మాణం 1644 లో ప్రారంభమయ్యింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీనిని పూర్తి చేసారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0273 ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో తయారైన ఈ అందమైన మసీదును మస్జిద్-ఎ-జహనుమా అని కూడా పిలుస్తారు. దీని అర్థం ప్రపంచ దృశ్యాన్ని మసీదు పర్యవేక్షిస్తుందని. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0274 మసీదు ప్రాంగణం ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. ఇక దీనిని ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు నుంచి మెట్లు ఎక్కి ప్రవేశించవచ్చు. ఇవి ఒకప్పుడు బజారులు, తినుబండారాల దుకాణాలు, వినోదంకు వేదికలుగా ఉండేవట. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0275 ఇక్కడి ప్రాంగణం ఎంత పెద్దదంటే, ఇది ఒకేసారి 25 వేల మంది భక్తులకు స్థానం కల్పించగలదు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0276 జామా మస్జిద్ 10 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. మూడు ద్వారాలు, రెండు 40 మీటర్ల ఎత్తైన చిన్న మినార్లు, నాలుగు పెద్ద మినార్లు ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0277 మినార్ల నుండి పాత ఢిల్లీకి చెందిన కోలాహలముగా ఉండే వీధుల అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0279 ఈ మసీదులో మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన అనేక అవశేషాలు ఉన్నాయి. ఇది సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0280 ఈ అవశేషాలలో కొన్ని దుప్పి చర్మం పై వ్రాసిన ఖురాన్, ప్రవక్త యొక్క చెప్పులు, పాలరాయి ఫలకంలో పొందుపరిచిన ప్రవక్త యొక్క పాదముద్ర, ఒక ఎర్రటి వెంట్రుక. ఇది ప్రవక్త యొక్క గడ్డం యొక్క జుట్టు అని చెప్పబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0282 జామా మసీదును ప్రఖ్యాత మొఘల్ వాస్తుశిల్పి ఉస్తాద్ ఖలీల్ రూపొందించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0283 పురాణాల ప్రకారం, పాత రోజుల్లో మసీదు యొక్క తూర్పు ద్వారం రాజ కుటుంబాలకు మాత్రమే ఉండేది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0285 ఇద్-ఉల్-ఫితర్, ఇద్-ఉల్-జోహా పండుగల సందర్భంగా, ఇది పెళ్లి కూతురులా మెరిసిపోతూ దేశ నలుమూలల నుండి తరలివచ్చే భక్తులతో సందడి ఉండే సమయం మసీదును సందర్శించడానికి అనువైన సమయం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0287 మసీదు, కన్నాట్ ప్లేస్ మరియు పార్లమెంట్ హౌస్, ఈ మూడింటినీ సరళ రేఖలో కనిపించే విధంగా లుటియెన్స్ మసీదును దాని రూపకల్పనలో చేర్చారని చెబుతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0288 ప్రార్థనల సమయంలో మసీదులో పర్యాటకులను అనుమతించరు. ఇక ప్రవేశం ఉచితం. మీరు కెమెరాను ప్రాంగణంలోకి తీసుకెళ్లాలంటే రుసుం చెల్లించాలి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0290 కనాట్ ప్లేస్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0292 ఢిల్లీ గుండె చప్పుడు అయిన కనాట్ ప్లేస్ ఒక వారసత్వ ప్రాంతం. ఇది జార్జియన్ శైలి నిర్మాణా నమూనాలో రూపొందించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0293 ఆహారశాలలు, ఉన్నత శ్రేణి దుకాణాలు, పార్లర్లు, థియేటర్లు, పుస్తకాల దుకాణాలతో నిండిన ఈ మార్కెట్ ఢిల్లీలో అనేక కార్యకలాపాలకు కేంద్రం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0294 రెండు కేంద్రీకృత వృత్తాలలో విస్తరించి ఉన్న కనాట్ ప్లేస్, మిరుమిట్లుగొలిపే నియాన్ సంకేతాలతో అలంకరించబడిన వివిధ విశాల దృక్పథం గల దుకాణాలు, కేఫ్‌లకి పూర్తి భిన్నంగా ఉండే ప్రాచీన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0295 ఏ రోజైనా సరే మీరు చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులను చాట్ అమ్మే వ్యక్తి దగ్గర నుండి చాట్ ను కొనుక్కొని తింటూ, వీధుల్లో సందడిగా తిరుగుతూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆనందిస్తూ చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0297 కనాట్ ప్లేస్‌ను స్టాల్స్, స్టోర్లు ఆక్రమించక ముందు, ఇది సినిమా కేంద్రంగా ఉండేది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0298 1920 లలో రష్యన్ బాలేలు, ఉర్దూ నాటకాలు, మూకీ చిత్రాలను ఇక్కడి వివిధ థియేటర్లలో ప్రదర్శించేవారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0299 రివోలి, ఓడియన్ వంటి వారసత్వ సినిమాహాల్లు ఇప్పటికీ వాటి ప్రాచీనతను కాపాడుతున్నాయి. ఇక ఈ విశాలమైన సినిమా థియేటర్లలో ఏదో ఒక దానిలో ఒక సినిమాను చూడడం అనేది ఒక మనోహరమైన అనుభవం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0301 కనాట్ ప్లేస్ లోని మరో ఆకర్షణ హనుమాన్ ఆలయం. ఇది దాని చుట్టుపక్కల ప్రాంతం వలె ఇది పురాతనమైనది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0302 దూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షించే ఈ ఆలయం మహాభారత పురాణంలో కూడా ప్రస్తావించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0303 ఇక్కడి ఆరాధకులు “శ్రీ రామ్ జై రామ్ జై రామ్” అనే మంత్రాన్ని 24 గంటలు నిరంతరం జపించినందుకు గాను ఈ ఆలయం గిన్నిస్ ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0305 సందడిగా ఉన్న మార్కెట్ మధ్య ఉన్న నిశ్శబ్ద, నిర్మలమైన ప్రదేశం అయిన గురుద్వారా బంగ్లా సాహిబ్ కనాట్ ప్లేస్ లో బహుశా అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణ. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0306 దీని ఎత్తైన బంగారు గుమ్మటం ఎండలో మెరుస్తూ ఉండటంతో మీరు దీనిని ఒక మైలు దూరం నుండి గుర్తించవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0307 మీరు ప్రాంగణంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని ఒక ప్రశాంత భావన ఆవహిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0308 గర్భగుడి లో ప్రార్థన తరువాత మీరు గురుద్వారా లోని ప్రశాంతమైన చెరువు పక్కన షికారు చేయవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0309 సంక్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడిన ఒక సహజమైన తెల్లని విశాల భవనం అయిన గురుద్వారా బంగ్లా సాహిబ్ తప్పక చూడవలసిన ప్రదేశం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0311 పర్యాటకులు ఉత్తర భారతదేశంలోని ఐదు ఖగోళ నక్షత్రావలోకనశాలలో(అబ్జర్వేటరీ) ఒకటైన జంతర్ మంతర్‌కు కూడా వెళ్ళవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0314 కొనాట్ ప్లేస్ యొక్క సెంట్రల్ పార్క్ మరొక ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0315 ఇక్కడ పచ్చని తోటలు ఉన్నాయి. ఇంకా అనేక ఫౌంటైన్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ఇక్కడ మీరు దేశంలో ఎత్తైన జెండాను కూడా చూస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0317 కనాట్ ప్లేస్ లోని ఏనుగు దంతపు తెలుపు భవ్య నిర్మాణంను బ్రిటిష్ వారు 1929 లో లుటియెన్స్‌ను ఢిల్లీకి మార్చాడానికి తయారు చేశారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0318 విక్టోరియా రాణి కుమారుడైన కనాట్ మొదటి డ్యూక్ పేరు దీనికి పెట్టబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0319 ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్యాలయ ప్రదేశాలలో ఒకటి. దీనిని సందర్శించే సందర్శకులకు వైవిధ్యానికి సంబంధించిన ఒక ప్రత్యేక కలయికను అందజేస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0320 చారిత్రక నిర్మాణల నుండి కొనుగోలుదారుల స్వర్గం వరకు, ఈ ప్రదేశం ఒక్కసారైనా ఢిల్లీ పర్యటనలో తప్పక చూడాల్సిన ప్రాంతం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0322 అగ్రసేన్ కి బావులీ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0324 అగ్రసేన్ కి-బౌలి అని పిలువబడే ఢిల్లీ సందడి మధ్యలో ఒక వింతైన మరియు నిర్మలమైన ప్రదేశం, ఇది రాజధాని చరిత్రను ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0325 ఇది 60 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు గల చారిత్రక దిగుడుబావి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0326 దాని వారసత్వ సంపద వ్యక్తిత్వం, సంక్లిష్టమైన నిర్మాణం, ప్రశాంతమైన వాతావరణం చలన చిత్ర నిర్మాతలకు కూడా నచ్చటంతో ఈ స్మారక చిహ్నం తరచుగా సినిమాలకు నేపథ్యంగా మారింది. దీనిని `సుల్తాన్', ` పీకె' వంటి సినిమాల్లో మనం చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0327 మీరు లోతైన బావిలోకి దిగుతున్నప్పుడు, అకస్మాత్తుగా చల్లదనం మిమ్మల్ని ఆలింగనం చేసుకోవటం మీకు తెలుస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0328 స్మారక చిహ్నం ఒకప్పుడు భూతాల నిలయంగా పేరుగాంచిందని తెలియగానే మీ వెన్నులో వణుకు కూడా పుట్టవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0329 కథనాల ప్రకారం బవులీలోని నీరు క్షుద్ర ప్రయోగాలతో నిండి ఉందని అందువలన దానిని చూస్తే చాలు ఎవరైనా తమనుతాము మైమరచిపోయి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారని చెబుతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0330 బవులీ (దిగుడుబావి) రెండు వైపులా వంపు గూళ్ళతో 108 మెట్లు, మూడు అంతస్తులలో ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0332 నేడు ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) రక్షిత స్మారక చిహ్నం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0333 దాని సృష్టికర్త గురించిన సమాచారం తెలియచేసే చారిత్రక రికార్డులు ఏవీ లేవు. కాని ఇది మహా రాజు అగ్రసేన్ చేత నిర్మించబడి, 14 వ శతాబ్దంలో అగర్వాల్ సమాజం పునర్నిర్మించినట్లు భావిస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0335 ఇస్కాన్ టెంపుల్ (ఆధ్యాత్మికం) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0337 ఢిల్లీలోని ఉన్న ఇస్కాన్ ఆలయం, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న దేవాలయాలలో ఇది ఒకటి. ఇది నిర్మాణ కళకు సరైన ఉదాహరణ. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0338 శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం కృష్ణ చైతన్య ఇంటర్నేషనల్ సొసైటీతో అనుబంధంగా ఉంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0339 ఈ ఆలయం నిర్మాణ వైభవానికి గాను ప్రసిద్ధి చెందింది. ఇది సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0340 దాని లోపలి గోడలు కృష్ణుడు, రాధా దేవి, శ్రీరాముడు, సీతా దేవిల జీవితాల దృశ్యాలను సూచించే రష్యన్ కళాకారులు గీసిన చిత్రాలతో అలంకరించబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0342 ఈ ఆలయపు ప్రధాన ఆకర్షణ దాని ప్రార్థన మందిరం, మ్యూజియం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0343 శ్రీకృష్ణుడు, రాధా దేవి, ఇతర దేవ దేవతల అందంగా చెక్కిన విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0344 ఈ మ్యూజియం మల్టీమీడియా ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదర్శనలు రామాయణం, మహాభారత కథలను అర్థం చేసుకోవడానికి సందర్శకులకు సహాయపడుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0345 హరే కృష్ణ శాఖ యొక్క తత్వశాస్త్రం, అభిప్రాయాలు, ఆచరణల గురించి సందర్శకులు తెలుసుకోవటానికి ఇవి సహాయపడతాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0346 భగవద్గీత బోధనలను వ్యాప్తి చేసే లక్ష్యంతో ఈ ఆలయం 1988 లో స్థాపించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0348 తీన్ మూర్తి భవన్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0350 తీన్ మూర్తి భవన్ పర్యాటకుల సంచారంలో చూడవలసిన ఒక ప్రసిద్ధ చారిత్రక స్థలం. ఇది ఒకప్పుడు భారతదేశపు మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి నివాసం. ఆయన 16 సంవత్సరాల పాటు (1964 లో ఆయన మరణించేంత వరకు) ఇక్కడ నివసించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0351 ఆ తరువాత ఈ ఇల్లు ఆయన జ్ఞాపకార్థంగా ప్రభుత్వానికి అంకితం చేయబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0352 ప్రాంగణంలో ముగ్గురు సైనికుల విగ్రహాలు ఉన్నందున ఈ భవనాన్ని ‘తీన్ మూర్తి’ అని అంటారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0353 ఈ ముగ్గురు సైనికులు మైసూర్, జోధ్పూర్ మరియు హైదరాబాద్ లన్సర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0354 మొదటి ప్రపంచ యుద్ధంలో సినాయ్, పాలస్తీనా, సిరియాలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు గౌరవార్థం 1922 లో వీటిని ఏర్పాటు చేసారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0356 తీన్ మూర్తి భవన్ ను బ్రిటిష్ వాస్తుశిల్పి అయిన రాబర్ట్ టోర్ రస్సెల్ 1930 లో బ్రిటిష్ సైన్యపు కమాండర్-ఇన్-చీఫ్ నివాస భవనంగా రూపొందించారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0357 పర్యాటకులు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, గ్రంథాలయాన్ని కూడా సందర్శించవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0358 ఇక్కడ మీరు నెహ్రూ యొక్క పాత కార్యాలయాన్ని కూడా చూడవచ్చు, ఇది అదే కళాఖండాలను, ఫర్నిచర్ ను ఉపయోగించి పున రూపకల్పన చేయబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0359 గ్రంథాలయంలో ఆధునిక భారతదేశ చరిత్రను సూచించే పుస్తకాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0360 ఇక్కడి మరో ఆకర్షణైన అయిన నెహ్రూ ప్లానిటోరియంకు ఆ ప్రాంతపు నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0361 ప్లానిటోరియపు స్కై థియేటర్‌లో మీరు ఆసక్తికరమైన ప్రదర్శనలు, ప్రెజేంటేషన్లను చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0363 గురుద్వారా బంగ్లా సాహిబ్ (ఆధ్యాత్మికం) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0369 ఇతర ప్రముఖ విశేషాలలో వంట ప్రాంతం, ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీ, పాఠశాలలు ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0370 సందర్శనకు వచ్చే భక్తులకు లంగర్ (ప్రసాదం) అందిస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0371 ఈ ఆహారాన్ని ఇక్కడ పనిచేసే గురు సిక్కులు తయారు చేస్తారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0373 గురుద్వారా ప్రాంతం ఒకప్పుడు అంబర్ పాలకుడు రాజా జై సింగ్ నివాసం అయిన జైసింగ్‌పురా ప్యాలెస్ అని పురాణ కథనం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0374 1664 లో, సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్ కృష్ణ సాహిబ్ ఈ ప్యాలెస్‌లో నివసించినట్లు చెబుతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0376 హజ్రత్ నిజాముద్దీన్ దర్గా (చేయవలసిన పనులు) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0378 హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ఢిల్లీలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. ఇది ముస్లిం సూఫీ సాధువు నిజాం-ఉద్-దిన్ ఆలియా (క్రీ.శ. 1238-1325) యొక్క దర్గా. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0379 ఇది సంక్లిష్ట జాలులు (జాలక తెరలు) పాలరాయి కమానులతో నిర్మించిన ఒక విశాలమైన ప్రాంగణంతో కూడిన అందమైన నిర్మాణం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0380 14 వ శతాబ్దం నాటి ఈ దర్గా ఇస్లామిక్ శైలి వాస్తుకళకు అనుగుణంగా నిర్మించబడింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0381 ఇది ఒక గుమ్మటం ఆకారంలో ఉన్న పైకప్పు కలిగి ఉన్న ఒక స్క్వేర్ ఆకారపు భవనం. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0382 ఇక్కడి ఒక ప్రత్యేక ఆకర్షణ 13 వ శతాబ్దపు గది. దీనిని హుజ్రా- ఎ-ఖదీమ్ అని అంటారు. ఇది ఇక్కడికి మీ సందర్శనను ఆసక్తికరంగా మారుస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0384 దర్గాకు దూర దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. వారు వారి కోరికలు తీరేందుకు జాలీలపై ఎర్రటి దారం కట్టడాన్ని చూడవచ్చు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0385 ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారు అగరుబత్తులు వెలిగించి గులాబీ రేకులను కూడా చల్లుతారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0386 దర్గాలో ఒక చాదర్ సమర్పించడం ముఖ్యంగా పవిత్రంగా పరిగణించబడుతుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0387 దర్గాను సందర్శించడానికి గురువారం మంచి రోజు. ఆ రోజు సాయంత్రం కవ్వాలీ ప్రదర్శనలు జరుగుతాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0388 ఈ దర్గా ఎంత ప్రాచుర్యం పొందిందంటే, 'బజరంగీ భాయిజాన్' (2015), 'రాక్‌స్టార్' (2011) వంటి అనేక సినిమాలకు ఈ దర్గా ఒక సినీ నేపథ్యంగా మారింది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0390 ఇక్కడి వాతావరణం చాలా ఆకర్షణీయంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది. దర్గా ప్రాంగణంలో ఉర్దూ, పెర్షియన్ గొప్ప సూఫీ కవులలో ఒకరైన అమీర్ ఖుస్రో సమాధి ఉన్నది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0391 అంతేకాకుండా, ఇక్కడ షాజహాన్ కుమార్తె జహానారా బేగం సమాధి ఉన్నది. రైస్ అత్గా ఖాన్ అనే ఒక సంస్థానాధిపతి సమాధి కుడా ఉన్నది. అతని భార్య మొఘల్ చక్రవర్తి అక్బర్ కు ఆహారం ఇచ్చే నర్సు అని చెబుతారు. వీటితో పాటు 18 వ శతాబ్దపు పాలకుడు ముహమ్మద్ షా రంగీలా సమాధి కూడా ఉన్నది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0393 రాజ్ ఘాట్ (వారసత్వ సంపద) ebs_tourism-delhi-part1-translation-hin2tel_0395 జాతి పితగా గౌరవించబడే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ జ్ఞాపకార్థం నిర్మించిన రాజ్ ఘాట్ ఒక పాలరాయి అరుగు. అక్కడ ఆయనను జనవరి 31, 1948 న దహనం చేసారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0396 యమునా నది ఒడ్డున ఉన్న రాజ్‌ఘాట్, చెట్లతో నిండిన చక్కగా తీర్చిదిద్దిన పచ్చని పచ్చిక బయళ్ళతో అందంగా అలంకరించబడి ఉంటుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0397 గాంధీజీ నశ్వరమైన అవశేషాలను ఈ ఘాట్ లో దహనం చేసారు. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0399 ఈ సమాధి ఆయన వ్యక్తిత్వానికి నిజమైన ప్రతిబింబంలాంటిది. ఇక ఆయనకు సంబంధించిన నిరాడంబరతను ప్రదర్శిస్తుంది. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0400 ఆయన భౌతిక శరీరాన్ని కాల్చిన చోట ఇటుక అరుగు, నల్ల పాలరాయి అరుగులు పాలరాయి ఆవరణముతో చుట్టుముట్టి ఉన్నాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0401 గాంధీజీ ఆఖరి పలుకులు అయిన ‘హే రామ్’ అనే పదాలు స్మారకం పైన చెక్కబడ్డాయి. ebs_tourism-delhi-part1-translation-hin2tel_0402 ఒక అఖండ జ్వాల దాని ప్రక్కనే ఉంటుంది.