ID SENT ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0001 18. అంతరిక్ష పరిశీలన : దుర్బిణి (టెలిస్కోప్‌/దూరదర్శీ) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0003 - కాంతి రూపాలు ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0005 - అంతరిక్షంలోని దుర్బిణి ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0007 - దుర్బిణి మరియు దుర్బిణి(టెలిస్కోప్‌) రకాలు ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0009 - భారతీయ అంతరిక్ష అనుసంధాన కేంద్రం (ఇస్రో) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0013 1. ఆకాశం మరియు అంతరిక్షంలో ఎట్టి భేదం ఉంది? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0015 2. అంతరిక్ష పరిశీలన అనగా నేమి? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0016 దాని ప్రాముఖ్యత ఏమిటి? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0018 చాల ప్రాచీన కాలం నుంచి మానవుడు సూర్యున్ని మరియు రాత్రి పూట ఆకాశంలోని చంద్రున్ని, చుక్కల వైపు కుతూహలంగా చూడటం ప్రారంభించాడు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0019 సాధారణ కళ్ళతో చేసే పరిశీలన మరియు విస్తృత ఊహా శక్తి సహాయంతో అతడు కళ్ళకు కనిపించే ఆకాశాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాడు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0020 ఆకాశంలోని చుక్కలు, నక్షత్రాల స్థితి కాలక్రమేనా మారుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0021 మరి ఈ స్థితులకు మరియు బుతు చక్రాలకు ఏదో సంబంధం ఉందని మానవుని మనసుకు తట్టింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0022 వ్యవసాయానికి బుతు చక్రాల వివరాలు అవసరం ఉండుటం వల్ల ఈ ఆకాశ వీక్షణం అతనికి ఉపయోగ పడ సాగింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0023 నక్షత్రాల స్థితి నావికులకు కూడా దిశా దర్శకంగా ఉపయోగ పడసాగింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0024 ఆకాశ పరిశీలన ద్వారా కలిగిన అసంఖ్యాకమైన ప్రశ్నలకు జవాబులు శోధించుటకు మానవుని తీవ్రమైన ప్రయత్నం మొదలయింది. కాని ఆకాశం లోని గ్రహాలు లేక చుక్కలను అతి దగ్గరగా చూడటానికి అతని వద్ద ఎటువంటి పరికరం అందుబాటులో లేదు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0026 గెలీలియో టెలిస్కోప్‌ కనిపెట్టిన తర్వాత గత 400 సంవత్సరాలలో టెలిస్కోప్‌ సాంకేతికలో మరియు మొత్తం మీద ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0028 అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికతలో మానవుడు తీసుకున్న ప్రచండమైన పురోగమనం వల్ల నేడు ఈ విశ్వంలోని అత్యంత విస్మయమైన చిత్రాలు మన ముందు నిలిచి ఉన్నాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0029 పరిశోధించుటకే గాక మన నిత్య జీవనంలో అనేక సౌకర్యాల ఏర్పాట్లకు అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికత నేడు మనకు ఉపయోగపడుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0030 అంతరిక్ష పరిశీలనకు టెలిస్కోప్‌ను ఉపయోగిస్తారు. కాని ఒకే టెలిస్కోప్‌ సహాయంతో అంతరిక్షాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయవచ్చునా? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0031 అంతరిక్ష పరిశీలనకు వేర్వేరు టెలిస్కోపులు ఎందుకు ఉపయోగించాల్సి ఉంటుంది? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0032 అంతరిక్షంలోనే టెలిస్కోప్‌ను నిలబెట్టవచ్చునా? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0033 ఇలా అనేక విషయాల వెనుక గల విజ్ఞానాన్ని మనం ఈ పాఠం ద్వారా నేర్చుకోబోతున్నాం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0037 కళ్ళద్ధాలు తయారు చేసిన హాన్స్‌ లిపర్శ్ అనే పరిశోధకుడు 1608లో రెండు కటకాలను ఒకదానికొకటి ఎదురగా పట్టుకొని చూసినప్పుడు దూరంలో ఉన్న వస్తువు దగ్గరగా కనిపిస్తుందని పరిశోధించి మొట్టమొదటి టెలిస్కోపును తయారు చేశాడు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0038 ఆ తర్వాత 1609లో గెలీలియో టెలిస్కోపును తయారు చేసి దానిని అంతరిక్ష పరిశోధనకు ఉపయోగించాడు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0039 కళ్ళకు కనిపించే వాటికంటే అధిక చుక్కలు (తారలు) ఈ అంతరిక్షంలో ఉన్నాయనే విషయం అతనికి తెలిసింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0040 టెలిస్కోపు సహాయంతో అతడు గురు గ్రహానికి 4 ఉపగ్రహాలు, సూర్యునిలో గల మచ్చలు మొదలగు విషయాలను పరిశోధించాడు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0042 కాంతి యొక్క వివిధ రూపాలు ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0044 కాంతి అనగా విద్యుత్‌ అయస్కాంత వికిరణాలు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0045 ఇందులో తరంగ దైర్ఘ్యం (Wavelength) అనేది కాంతి యొక్క ఒక ధర్మం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0046 ఏ కాంతి తరంగ దైర్ఘ్యం దాదాపు 400 nm నుంచి 800 nm మధ్యలో ఉంటుందో ఆ కాంతినే మన కళ్ళు చూడగల్గుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0047 దానినే మనం దృశ్య కాంతి తరంగం అంటాం. కాని ఈ తరంగ దైర్ఘ్యం కాకుండా వేరొక తరంగ దైర్ఘ్యం కలిగి ఉన్న కాంతిని మనం చూడ లేము. ఎందుకంటే మన కళ్ళకు ఆ కిరణాలను గ్రహించే శక్తి లేదు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0048 దీనిని గూర్చి తెలుసుకొనుటకు దిగువ పట్టికను చదవండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0050 page-209 ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0052 రూపం | తరంగ దైర్ఘ్యం ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0054 రేడియో తరంగాలు (Radio Waves) | సుమారు 20 cm కంటే ఎక్కువ ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0056 సూక్ష్మ తరంగాలు (Micro Waves) | 0.3 mm – 20 cm ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0058 పరారుణ తరంగాలు (Infrared Waves) | 800 nm – 0.3 mm ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0060 దృశ్య కాంతి కిరణాలు (Visible light Rays) | 400 nm – 800 nm ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0062 అతి నీలలోహిత కిరణాలు Ultraviolet Rays) | 300 pm – 400 nm ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0064 ఎక్స్‌-కిరణాలు (X-rays) | 3 pm – 300 pm ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0066 గామా కిరణాలు (Gamma Rays) | 3 pm కంటే తక్కువ ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0068 1 nm (నానోమీటర్‌) = 10^- 9 m మరియు 1 pm (పికోమీటర్‌) = 10^- 12 m ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0070 వీటిలో కేవలం 'దృశ్య' కాంతి కిరణాలను చూసే సామర్థ్యం మన కళ్ళకు ఉంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0071 అందువల్ల అంతరిక్షం నుంచి వచ్చే 'దృశ్య" కాంతిని చూడ్డానికి మనం “దృశ్య-కాంతి టెలిస్కోపు” అనగా సాధారణ కటకం లేదా అద్దంతో తయారుచేసిన దుర్బిణిని (టెలిస్కోపు) వాడుతాం. కాని అనేక ఖగోళ వస్తువుల నుంచి దృశ్య కాంతియే కాకుండ ఇతర రకమైన కాంతి కూడా వెలువడుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0072 రేడియో తరంగాలు, ఎక్స్‌-కిరణాలు, గామా కిరణాలు మొదలగు రకములైన కాంతి కిరణాలు గ్రహించుటకు మరియు వాటి మూలాల గురించి అభ్యసించుటకు మనకు వేర్వేరు టెలిస్కోపులు అవసర పడుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0074 టెలిస్కోప్‌/దూరదర్శీ (Telescopes) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0076 దృశ్య-కాంతి టెలిస్కోప్‌ (Optical Telescopes) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0078 చాలామటుకు దృశ్య-కాంతి టెలిస్కోపులలో రెండు లేదా అంతకంటె ఎక్కువ కటకాలు అమర్చబడి ఉంటాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0079 పటం 18.1ని చూడండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0080 ఖగోళ వస్తువుల నుంచి వెలువడే అత్యధిక కాంతి కేంద్రికృతమై వెళ్ళుటకు వస్తు విశేష కటకాలు పెద్ద ఆకారం గలవి ఉంటాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0081 ఈ కేంద్రీకృతమైన కాంతి నుంచి ఖగోళ వస్తువుల విశాలమైన ప్రతిమను తయారు చేసే కటం, అనగా, నేత్రిక కటకం (Eye piece lens) చిన్న పరిమాణంలో ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0082 కాంతి కిరణాలు వాతావరణంలో నుంచి కటకంలోకి లేదా కటకం నుంచి వాతావరణంలోకి వెళ్ళేటప్పుడు వాటి మార్గం మారుతుంది. అనగా అవి వక్రీభవనం చెందుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0083 కావున ఈ దుర్బిణిలను “వక్రీభవన దుర్బిణి' (Refracting Telescope) అంటారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0085 కటకాల సహాయంతో వస్తువుల ప్రతిబింబాల నిర్మాణం ఎలా జరుగుననే విషయం గురించి మనం వచ్చే సంవత్సరంలో నేర్చుకొందాం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0086 సాధారణ ఆకాశ పరిశీలనకు ఈ రకమైన దృశ్య కాంతి టెలిస్కోపు ఉపయోగంగా ఉన్నప్పటికి ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0088 1. జనకం నుంచి వచ్చే అత్యధిక కాంతిని ఏకీకృతం చేసి జనకం యొక్క తేజోవంతమైన ప్రతిబింబాన్ని పొందవలెనన్న వస్తు విశేష కటకం యొక్క వ్యాసం మిక్కిలి పెద్దగా ఉండటం అవసరం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0089 కాని ఇలాంటి పెద్ద కటకాలు తయారు చేయడం కష్టతరమైనది. అయితే అలా చేసినప్పటికి వాటి బరువు కూడా చాలా పెరుగుతుంది మరియు ఆకారం మారుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0091 2. టెలిస్కోపులో రెండు కటకాలు రెండు వ్యతిరేక చివరలకు ఉండటం వలన కటకం ఆకారం పెరుగుతుంది. అలా ఆ దుర్బిణి పొడవు కూడా పెరుగుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0093 ౩. కటకాల ద్వారా తయారైన ప్రతిబింబాలలో రంగుల దోషం ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0095 page-210 ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0097 దృశ్య-కాంతి టెలిస్కోపులో (optical telescope) వచ్చే సమస్యలను తొలగించడానికి పుటాకార దర్పణంతో టెలిస్కోపుని తయారు చేయవచ్చును. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0098 ఇందులో కాంతి పుటాకార దర్పణం ద్వారా పరావర్తనం(Reflection) చెందుట వలన ఈ దుర్బిణిని 'పరావర్తన దుర్బిణి' (Reflecting Telescope) అని అంటారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0099 ఇందులో, వస్తువుల యొక్క తేజోవంతమైన ప్రతిబింబాలను పొందుటకు పెద్ద దర్పణం అవసరముంటుంది. కాని పెద్ద దర్పణాన్ని తయారు చేయటం దానితో పోల్చితే సులభమైనదే. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0100 అంతే కాకుండా అనేక ముక్కలను కలిపి కూడా పెద్ద దర్పణాన్ని తయారు చేయవచ్చును. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0101 దీని బరువు కూడా అంతే పరిమాణం గల కటకాన్ని కంటే తక్కువ ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0102 దర్పణం ద్వారా తయారైన ప్రతిబిం‍భాలలో రంగుల దోషం ఉండదు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0103 సాధారణ కళ్ళతో ఎప్పుడు చూడనటువంటి అత్యంత దూరంలో ఉన్న తారలు (Stars) మరియు గెలాక్సిని (Galaxies) (ఆకాశగంగా) మనం ఇలాంటి అతిపెద్ద దుర్బిణి ద్వారనే చూడగల్గుతాం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0105 పుటాకార (concave) దర్పణంపై ఆధారపడిన దుర్బిణిలలో న్యూటన్‌ పద్ధతిగల మరియు క్యాసెగ్రెన్‌ పద్ధతి గల దుర్బిణిలు చలామణిలో ఉన్నాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0106 పటం 18.2లో చూపిన విధంగా న్యూటన్‌ పద్ధతిలో అంతరిక్షం నుంచి వచ్చే కాంతి కిరణాలు పుటాకార దర్పణం ద్వారా పరావర్తనం ద్వారా కాంతి జనకం చెందుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0107 ఈ పరావర్తిత కిరణాలు దర్పణం యొక్క నాభి వద్దకు ఏకీకృతంగా వచ్చుటకు ముందు ఒక సమతల దర్పణం వాటి మార్గాన్ని మారుస్తుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0108 దానివల్ల ఈ కిరణాలు దుర్పిణికి స్టూపాకార లంబ దిశలో ఒక బిందువు గుండా కలిసి వస్తాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0109 అక్కడ ఉన్న 'నేత్రిక పేరుగల ప్రత్యేకమైన కటకం ద్వారా మనం వస్తువు యొక్క అధికరణ ప్రతిబింబాన్ని చూడవచ్చును. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0111 పటం 18.3లో చూపిన విధంగా క్యాసెగ్రెన్‌ పద్ధతిలో కూడా పుటాకార దర్చణమే వాడబడి ఉంటుంది. కాని ఇచ్చట పుటాకార దర్పణం ద్వారా పరావర్తితమైన కిరణాలు ఒక కుంభాకార (convex) దర్చణం ద్వారా మళ్ళీ పుటా కార దర్పణంవైపు పరావర్తితం అవుతాయి మరియు పుటాకార దర్చణానికి దాని కేంద్రం వద్ద గల రంధ్రం గుండా ఆవలి వైపునకు వెళ్ళి నేత్రికపై పడుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0112 నేత్రిక సహాయంతో మనం ఆ కాంతి జనకం యొక్క అధికరణ ప్రతిబింబాన్ని పుటాకార దర్పణం చూడవచ్చును. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0114 భారతదేశంలో రెండు మీటర్ల వ్యాసం గల కొన్ని దుర్బిణిలు అనేక సంవత్సరాల నుంచి ఉపయోగంలో ఉన్నాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0115 భారతదేశంలో అన్నిటి కంటే పెద్దది, 3.6 మీటర్ల వ్యాసం గల దుర్బిణి ఆర్యభట్టా వీక్షణ విజ్ఞాన పరిశోధన సంస్థ, నైనితాల్‌లో నెలకొల్పబడి ఉంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0116 ఇది ఆసియాలోనే దృశ్య కాంతి యొక్క అన్నిటి కంటే పెద్ద దుర్బిణి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0118 page-211 ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0120 రేడియో దుర్బిణి (Radio Telescope) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0122 అనేక ఖగోళ వస్తువుల నుంచి దృశ్య కాంతియే కాకుండ రేడియో తరంగాలు కూడా వెలువడుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0123 ఈ తరంగాలను మనం సాధారణ కళ్ళతో చూడలేము. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0124 కావున ఈ తరంగాలను గ్రహించుటకు ప్రత్యేకమైన దుర్బిణిలను వాడుతారు. వీటిని “రేడియో దుర్బిణిలు” (Radio Telescope) అంటారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0125 రేడియో దుర్బిణి అనేది ఒక విశిష్ట ఆకారంగల (Paraboloid shape) డిష్‌ నుంచి లేదా ఇలాంటి అనేక డిష్‌ల సముదాయంతో తయారు చేయబడి ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0126 “దృశ్య కాంతి దుర్బిణి' మాదిరిగా ఈ డిష్‌ యొక్క వక్రతల భాగం పై నుంచి రేడియో తరంగాలు పరావర్తనం చెందుతాయి. తిరిగి అవి డిష్‌ యొక్క నాభి కేంద్రం దగ్గర కేంద్రీకృతం చేయబడుతాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0127 అక్కడ ఈ తరంగాలను గ్రహించ గలిగే ఒక యంత్రం(Receiver) అమర్చబడి ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0128 ఆ యంత్రం గ్రహించిన విషయం కంప్యూటర్‌కు తెలుపబడుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0129 ఈ కంప్యూటర్‌ ఆ వివరాలను విశ్లేషించి రేడియో తరంగాల జనకం యొక్క స్వరూప చిత్రాన్ని తయారు చేస్తుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0130 మన ఇంటి పైనున్న డిష్‌ అంటినా ఇదే విధంగా పని చేస్తుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0132 పూణెకు దగ్గర నారాయణ్‌ గావ్‌ వద్ద Giant MeterWave Radio Telescope (GMRT) అనే పేరు గల అతిపెద్ద రేడియో దుర్బిణి నెలకొల్పబడింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0133 గ్రహ, నక్షత్రాల నుండి వచ్చే మీటర్లలో తరంగ దైర్ఘ్యం గల రేడియో తరంగాలను ఉపయోగించి ఖగోళ వస్తువులను అభ్యసించుటకు ఈ దుర్బిణిని నెలకొల్పారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0134 ఈ దుర్బిణి దాదాపు 30 ప్యారబోల ఆకారం గల దుర్బిణిల సమూహం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0135 ఇందులోని ప్రతి దుర్బిణి యొక్క వ్యాసం 45 మీటర్లు ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0136 ఈ దుర్బిణిని మహా కాయ దుర్బిణి అని పిలుస్తారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0137 ఎందుకంటే ఇందులోని 30 దుర్బిణిలను 25 km వ్యాసంగల క్షేత్రంలో కూర్చు చేయబడినది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0138 25 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఒకే దుర్చిణి ఉన్నట్లుగా ఈ డిజైన్ కనిపిస్తుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0139 అనగా 25 km వ్యాసంగల దుర్బిణి ద్వారా ఎంత సమాచారం లభిస్తుందో అంత సమాచారం ఈ 30 దుర్బిణిల సమూహం ద్వారా లభిస్తుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0140 GMRT అనేది భారతీయ వైజ్ఞానిక మరియు సాంకేతిక నిపుణులు అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన ప్రపంచ హోదా గల పరిశోధన సాధనం. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0141 ఈ దుర్బిణి ద్వారా సౌర కుటుంబం, సౌర గాలులు, స్పందకాలు, మహా స్ఫోటకాలు మరియు తారల మధ్యగల హైడ్రోజన్‌ మేఘాల గురించి పరిశోధన చేస్తారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0142 ఈ దుర్బిణిని ఉపయోగించుకొనుటకు ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రజ్ఞులు భారతదేశానికి వస్తుంటారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0144 అంతరిక్షంలోని దుర్బిణి (Telescopes in Space) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0146 అంతరిక్షంలోని వివిధ ఖగోళ వస్తువుల నుంచి వచ్చే దృశ్య-కాంతి మరియు రేడియో తరంగాలు భూమి వాతావరణంలో నుంచి భూ ఉపరితలం వరకు చేరుకుంటాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0147 అందువల్ల దృశ్య-కాంతి మరియు రేడియో దుర్బిణిని ఈ భూ ఉపరిభాగంపై నెలకొల్పుతారు. కాని ఇలా భూ ఉపరిభాగంపై గల దుర్బిణి ద్వారా మంచి చిత్రాలను పరిశీలించుటలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0149 page-212 ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0151 అంతరిక్షం నుంచి దృశ్య-కాంతి వాతావరణం గుండా ప్రయాణించి భూతలానికి చేరుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0152 ఈ ప్రయాణ కాలంలో ఈ కాంతి కొంత వాతావరణంలో శోషించబడుతుంది. మన వరకు చేరే కాంతి తీవ్రత తగ్గుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0153 ఇంకొక సమస్య ఏమిటనగా, వాతావరణం లోని ఉష్ణోగ్రత మరియ పీడనాలలోని మార్పుల వల్ల వాతావరణంలోని గందరగోళం అయినట్లయితే దాని నుంచి వచ్చే దృశ్య-కాంతి కిరణాలు స్థిరంగా ఉండవు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0154 అంతే కాకుండా, పగలు సూర్యుని వెలుతురు ఉండటం వల్ల అకాశ పరిశీలన సాధ్యపడదు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0155 మేఘాలతో కమ్ముకొన్న వాతావరణం, రాత్రిపూట పట్టణాలలోని దీపాల వెలుతురు మొదలగు విషయాలు కూడా ఆకాశ పరిశీలనలో ఆటంకం ఏర్పరుస్తాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0156 ఈ సమస్యను తొలగించడానికి దృశ్య-కాంతి దుర్బిణిని పర్వతంపై నిర్జన స్థలంలో స్థాపిస్తారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0157 కాని ఈ సమస్యలన్నీ పూర్తిగా నివారించాలనుకుంటే ఇలాంటి దృశ్య-కాంతి దుర్పిణిని అంతరిక్షంలోనే నెలకొల్పితే బాగుంటుంది! ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0158 అంతరిక్షంలో ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు గనుక, లభించే కాంతి కిరణాల మూల ప్రతిబింబం చాల స్పష్టంగా మరియు స్థిరంగా ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0159 ఈ ఆలోచనను శాస్త్రజ్ఞులు వాస్తవంగా నిరూపించారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0161 1990 సంవత్సరంలో అమెరికాలోని నాసా(N.A.S.A.) ఎక్స్‌-కిరణాలను గ్రహించి వాటి మూలాలను గూర్చి సంస్థ వారు 'హబల్‌' అనే దృశ్య-కాంతి దుర్బిణిని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0162 ఈ దుర్బిణి 94 ఇంచుల వ్యాసం కలిగి భూ ఉపరితలానికి 589 కిలోమీటర్ల దూరం నుంచి భూమిచుట్టు ప్రదక్షిణ చేస్తుంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0163 ఇంకను ఈ దుర్బిణి ప్రయోజనకరంగా ఉంది. ఈ దుర్బిణి సహాయంతో చేసిన పరిశీలనల ద్వారా అనేక ముఖ్యమైన పరిశోధనలు జరిగాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0165 ఎక్స్-కిరణాలను గ్రహించి వాటి మూలాలను గూర్చి అభ్యసించడానికి 1999 సంవత్సరంలో అమెరికాలోని “నాసా” సంస్థ వారు 'చంద్ర'-ఎక్స్‌-కిరణ దుర్చిణిని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0166 ఎక్స్‌-కిరణాలను పరావర్తనం చెందింప చేయునటువంటి ప్రత్యేక దర్పణాలను ఉపయోగించి ఈ దుర్బిణిని తయారు చేశారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0167 ఈ చంద్ర-దుర్బిణి నక్షత్రాలు మరియు గెలాక్సీల గురించి చాల ఉపయోగకరమైన సమాచారాన్ని అందించింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0168 'చంద్ర' అనే ఈ పేరును ప్రసిద్ధిచెందిన భారతీయ శాస్త్రవేత్త చంద్ర శేఖర్‌ ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0170 సుబ్రమణ్యం గారి గౌరవార్థంగా ఇవ్వబడినది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0172 భారతీయ అంతరిక్ష అనుసంధాన కేంద్రం (ఇస్రో) Indian Space Research Organization(ISRO), బెంగళూరు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0174 ఈ సంస్థ 1969లో స్థాపించబడింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0175 ఇక్కడ ముఖ్యంగా కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేయుటకు మరియు వాటిని ప్రవేశపెట్టుటకు అవసరమైన సాంకేతికను అభివృద్ధి పరుస్తారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0176 ఇప్పటి వరకు ఇస్రో అనేక ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0177 స్వతంత్ర భారతదేశంలో విజయవంతం అయిన కార్యక్రమాలలో ఇస్రో సంస్థ వారి కార్యాలే అగ్రస్థానంలో నిలిచాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0178 అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం సాధించిన ప్రగతి జాతీయ మరియు సామాజిక అభివృద్ధిలో ఒక గొప్ప మైలురాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0179 దూర ప్రసారం (Telecommunication), దూర చిత్ర వాణి ప్రసారం(Television Broadcasting) మరియు వాతవరణ శాస్త్ర-సేవా (Meteorological services) కోసం INSAT మరియు GSAT ఉపగ్రహ శ్రేణులు పని చేస్తున్నాయి . ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0180 అందువలనే దేశంలో అంతటా దూర చిత్ర వాణి, దూర ధ్వని మరియు ఇంటర్‌నెట్‌ సేవా, అందుబాటులో ఉన్నవి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0181 ఈ శ్రేణులలోని EDUSAT ఉపగ్రహం కేవలం విద్యారంగానికి ఉపయోగపడుతుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0182 దేశంలోని ప్రకృతి వనరుల నియంత్రణ మరియు నిర్వహణ (Monitoring and Management of Natural Resources) అలాగే ఆపత్కాల నిర్వహణ వ్యవస్థ (Disaster Management) వంటి వాటికొరకు IRS ఉపగ్రహాల శ్రేణి క్రియాశీలంగా ఉన్నాయి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0184 సంకేత స్థలం : www.isro.gov.in ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0186 page-213 ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0188 అస్ట్రోస్యాట్‌(Astrosat) ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0190 భారతీయ అంతరిక్ష అనుసంధాన కేంద్రం ద్వారా 2015లో అస్ట్రోస్యాట్‌ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0191 ఈ ఉపగ్రహంపై అతి నీలలోహిత కిరణాలు మరియు ఎక్స్‌-కిరణాలను గ్రహించే దుర్బిణి మరియు ఇతర పరికరాలను అమర్చారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0192 దీనిలోని అధిక భాగాలు భారతదేశంలోనే తయారు చేయబడినవి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0193 ఈ రకమైన ఉపగ్రహం ప్రపంచంలోనే అద్వితీయంగా నిలిచింది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0194 దీని ద్వారా లభించిన సమాచారాన్ని ఉపయోగించుకొని భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు విశ్వంలోని వివిధ ఘటకాలపై పరిశోధన చేయుచున్నారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0198 హబల్‌ మరియు చంద్ర దుర్బిణిల మాదిరి ఇతర అనేక దుర్బిణిలు అంతరిక్షంలో క్రియాశీలంగా ఉన్నాయి. వాటి గురించి వివరాలు సేకరించండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0202 1. ఖాళీలలో సరియైన పదాన్ని పూరించండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0204 అ) దృశ-కాంతి యొక్క తరంగ ధైర్యం సుమారు ..... నుంచి ..... మధ్యన ఉంటుంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0206 ఆ) GMRT యొక్క పని ...... తరంగాలపై ఆధారపడి ఉంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0208 ఇ) ఎక్స్‌-కిరణాలకు సంబందించిన ఒక దుర్బిణికి ..... ఈ శాస్త్రజ్ఞుని పేరు పెట్టారు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0210 ఈ) అంతరిక్ష పరిశీలనకు మొట్టమొదటి దుర్బిణిని ...... అనే శాస్త్రజ్ఞుడు ఉపయోగించాడు. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0212 ఉ) భారతదేశంలోని దృశ్య-కాంతి యొక్క అన్నిటికంటే పెద్ద దుర్బిణి .......... వద్ద నెలకొల్పబడి ఉంది. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0214 2. జతపరచండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0216 'అ' భాగం ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0218 అ. ఎక్స్‌-కిరణాలు ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0220 ఆ. దృశ్య-కాంతి దుర్బిణి ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0222 ఇ. భారతీయ రేడియో దుర్బిణి ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0224 ఈ. కృత్రిమ ఉపగ్రహాల విడుదల ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0226 'ఆ' భాగం ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0228 a. GMRT ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0230 b. ఇస్రో ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0232 c. హబల్ ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0234 d. చంద్ర ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0236 3. భూ ఉపరితలంపై పెట్టిన దృశ్యకాంతి దుర్బిణిని ఉపయోగించుటలో కలిగే సమస్యలేమిటి? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0237 ఈ సమస్యలను ఎలా తొలగించవచ్చును? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0239 4. పుటాకార దర్పణం, సమతల దర్పణం, కుంభాకార దర్పణం మరియు కటకం మొదలగు పరికరాలను ఉపయోగించి ఏ రకమైన దుర్బిణిని తయారు చేయుట సాధ్యమవుతుంది? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0240 దాని రేఖాకృతిని గీయండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0242 5. పటాన్ని పరిశీలించి జవాబులు ఇవ్వండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0244 అ. పటంలో చూపిన దుర్చిణి ఏ రకమైనది? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0246 ఆ. దుర్బిణిలోని ముఖ్య కటకాలకు పేర్లు రాయండి? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0248 ఇ. దుర్బిణి ఏ రకమైన దర్పణంపై ఆధారపడి ఉంది? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0250 ఈ. ఈ రకమైన దర్పణం ఆధారంగా వేరొక రకమైన దుర్బిణి పేరేమి? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0252 ఉ. పై దుర్బిణిలో పని ఎలా జరుగుతుంది? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0254 6. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0256 అ. గెలీలియో దుర్బిణి నిర్మాణాన్ని వివరించండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0258 ఆ. రేడియో దుర్బిణి నిర్మాణాన్ని వివరించండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0260 ఇ. దృశ్య-కాంతి దుర్బిణిని పర్వతంపై నిర్జన స్థలంలో ఎందుకు నిలబెడుతారు? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0262 ఈ. ఎక్స్‌-కిరణాల దుర్బిణి భూమిపై ఎందుకు పనిచేయలేదు? ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0266 భారతదేశంలోని వివిధ ఖగోళ పరిశీలన కేంద్రాల వివరాలను సేకరించి తరగతిలో ప్రదర్శించండి. ebs_phy-antrish-avalokan-page-209-214-translation-hin2tel_0268 page-214