భారత_జాతీయ_ఎస్సీ_కమిషన్https://te.wikipedia.org/wiki/భారత_జాతీయ_ఎస్సీ_కమిషన్భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ 2006 ఫిబ్రవరి 19న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను విభజించి ఏర్పాటు చేశారు.షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌ను భారత రాజ్యాంగంలోని 338వ అధికరణం పరిధిలో ఏర్పాటు చేశారు.ఇది రాజ్యాంగం పరిధిలో షెడ్యూల్డ్ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది.జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.ఇందులో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి.ఈ కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు.వీరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారై ఉండాలి.కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు.ప్రస్తుత కమిషన్ పదవీకాలం మూడేళ్లు.వీరిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికె ఉంటుంది.షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడంషెడ్యూల్డ్ కులాల సాంఘిక - ఆర్థిక అభివృద్ధికి వివిధ ప్రణాళికల రూపకల్పనకు కేంద్ర, #రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.ఈ కమిషన్‌కు ఏదైనా కేసును విచారించే విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేయడం.