104.txt 4.92 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
భారత_జాతీయ_మానవ_హక్కుల_కమిషన్

https://te.wikipedia.org/wiki/భారత_జాతీయ_మానవ_హక్కుల_కమిషన్

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో భారత పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 1993 అక్టోబర్ 12న ఏర్పడింది.
ఈ కమిషన్​ రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణ భాద్యతలు చేపడుతుంది.
దేశంలోని ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, అతని హక్కులకు భంగం కలిగించినా, అన్యాయంగా ఎన్‌కౌంటర్‌‌ల పేరిట చంపినా ప్రశ్నించేందుకు రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
తప్పు చేసిన ఏ వ్యక్తినైనా చట్టపరంగానే శిక్షించాలి కానీ చట్టాన్ని తీసుకుని ఏ విధమైన చర్యలు పాల్పడరాదు.
అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారిస్తుంది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ బహుళ సభ్య సంస్థ.
దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు.
చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినవారై ఉండాలి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారు ఒక సభ్యుడిగా ఉంటారు.
మరో సభ్యుడు ఏదైనా హైకోర్టు నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్నవారై ఉండాలి.
పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్  చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు.
వీరి నియామకంలో ప్రధాన మంత్రి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ సలహా ఇస్తుంది.
భారత ప్రధాన మంత్రి (చైర్మన్)
కేంద్ర హోంశాఖ మంత్రి
లోకసభ స్పీకర్
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుజాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు.
ఏది ముందైతే అది వర్తిస్తుంది.
కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
మానవ హక్కులను పరిరక్షించడం
జైళ్లలో ఉన్న ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని మార్గదర్శకాలు ఇవ్వడం
మానవ హక్కుల రంగంలో పరిశోధన చేపట్టడం
ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం
కమిషన్‌కు సంవత్సరం కంటే ముందు జరిగిన విషయాలన విచారించే అధికారం లేదు