ముస్లిం_మహిళల_వివాహ_హక్కుల_రక్షణ_బిల్లు-_2017https://te.wikipedia.org/wiki/ముస్లిం_మహిళల_వివాహ_హక్కుల_రక్షణ_బిల్లు-_2017ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు- 2017 లేదా ట్రిపుల్ తలాక్ బిల్లును 28 డిసెంబర్ 2017 రోజున లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు.మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకునే ఈ దురాచారానికి స్వస్తి పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది.సుప్రీం ఆదేశాలతో ట్రిపుల్ తలాక్‌కు చరమగీతం పాడేలా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది.ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్దమని .ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రాథమిక హక్కులకు భంగకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించింది.తలాక్ చెప్పి విడాకులు తీసుకుంటే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, గరిష్ఠంగా మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామని ఈ బిల్లులో కేంద్రం పొందుపర్చింది.ట్రిపుల్ తలాక్ మహిళల హక్కులను హరిస్తోందని గత ఆగస్టు 22, 2017న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.దీనిపై చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తలాక్ ట్రిపుల్‌పై ఎర్పడింది.ఇందులో సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రవిశంకర్‌ప్రసాద్, రిపీపీ చౌదరిలు సభ్యులుగా ఉన్నారు.ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాఖ్ అని భర్త నోటితో చెప్పినా, రాత పూర్వకంగా తెలిపినా, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సప్ సందేశాలను పంపినా అక్రమమే.ఈ చట్టం ప్రకారం దోషిగా తేలితే మూడేండ్ల జైలుతోపాటు జరిమానా కూడా విధిస్తారు.↑ ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు- 2017."లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు".నమస్తే తెలంగాణ.