112.txt 2.08 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
మెడికల్_కౌన్సిల్_ఆఫ్_ఇండియా

https://te.wikipedia.org/wiki/మెడికల్_కౌన్సిల్_ఆఫ్_ఇండియా

భారతదేశ వైద్య విధానంలో ఉన్నత ప్రమాణాల కోసం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
ఈ కౌన్సిల్ భారతదేశంలో వైద్య అర్హతలకు గుర్తింపునివ్వటం, వైద్య కళాశాలలకు నిపుణత హోదానివ్వటం, వైద్య అభ్యాసకులను నమోదు చేయటం, వైద్య ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తుంది.
భారతదేశ వైద్య మండలిని ఆంగ్లంలో సంక్షిప్తంగా ఎంసిఐ (MCI) అంటారు.
MCI యొక్క గవర్నర్ల బోర్డు ప్రస్తుత చైర్మన్ డాక్టర్ ఆర్.కె.శ్రీవాత్సవ.
భారత మెడికల్ కౌన్సిల్ చట్టం, 1933 క్రింద భారతదేశ వైద్య మండలి 1934లో మొదట స్థాపించబడింది.
ఈ కౌన్సిల్ తరువాత భారత మెడికల్ కౌన్సిల్ చట్టం, 1956 క్రింద పునర్నిర్మించబడి పూర్వపు చట్టం స్థానంలోకి మార్చబడింది.
ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ భారతదేశ అధ్యక్షునిచే అధిగమించబడి దాని విధులు గవర్నర్ల బోర్డుకు అప్పగించబడ్డాయి.
జాతీయ వైద్య గ్రంథాలయం