యూనివర్సిటీ_గ్రాంట్స్_కమిషన్_(భారతదేశం)https://te.wikipedia.org/wiki/యూనివర్సిటీ_గ్రాంట్స్_కమిషన్_(భారతదేశం)యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా (ఆంగ్లం: University Grants Commission of India) అనేది UGC చట్టం ప్రకారం భారత ప్రభుత్వంలోని ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ.ఇది ఉన్నత విద్య ప్రమాణాలు.సమన్వయం, నిర్ణయం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది.ఇది భారతదేశంలోని విశ్వవిద్యాలయాలకు గుర్తింపును అందిస్తుంది.గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు నిధుల పంపిణీ చేస్తుంది.దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది.పూణే, భోపాల్, కోల్‌కతా, హైదరాబాద్, గౌహతి, బెంగళూరులలో ఆరు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.HECI అని పిలువబడే మరొక కొత్త నియంత్రణ సంస్థతో భర్తీ చేయాలనే ప్రతిపాదన భారత ప్రభుత్వం పరిశీలనలో ఉంది.నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో JRF క్లియర్ చేసిన వారందరికీ UGC డాక్టోరల్ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.సగటున, కమిషన్ ద్వారా డాక్టోరల్, పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌ల కోసం ప్రతి సంవత్సరం ₹725 కోట్లు ఖర్చు చేస్తారు.కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఉపాధ్యాయుల నియామకాల కోసం UGC, CSIRతో కలసి NET నిర్వహిస్తోంది.ఇది జూలై 2009 నుండి గ్రాడ్యుయేషన్ స్థాయిలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బోధించడానికి NET అర్హతను తప్పనిసరి చేసింది.అయితే, PhD ఉన్నవారికి ఐదు శాతం సడలింపు ఇవ్వబడింది.యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలపై ఉన్నత విద్య కోసం అక్రిడిటేషన్‌ను క్రింది పదిహేను స్వయంప్రతిపత్త చట్టబద్ధమైన సంస్థలు పర్యవేక్షిస్తాయి:ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) / నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (INC)డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI)సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి (CCH)సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (CCIM)నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఇన్స్టిట్యూట్స్ (NCRI)కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్వివిధ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (SCHE)