వైఎస్‌ఆర్_నేతన్న_నేస్తం_పథకంhttps://te.wikipedia.org/wiki/వైఎస్‌ఆర్_నేతన్న_నేస్తం_పథకంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబరు 21 ఈ పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు.వైఎస్సార్ నేతన్న నేస్తంపథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి వారికి సంవత్సరం రూ.24 వేల ఆర్థిక సాయం చేయనున్నారు.ఈ పధకానికి అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు.వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందనున్నారు.ఈ పధకానికి ప్రభుత్వం రూ.196.27 కోట్లు కేటాయించారు.