128.txt 5.63 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
సంగమేశ్వర_ఎత్తిపోతల_పథకం

https://te.wikipedia.org/wiki/సంగమేశ్వర_ఎత్తిపోతల_పథకం

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం ప్రాంతంలో నిర్మించబడుతున్న నీటిపారుదల పథకం.
సింగూరు జలాశయం కుడివైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి  సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌ నియోజకవర్గాలలోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం నిర్మించబడుతోంది.
330 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఇక్కడికి తరలించనున్నారు.
2022, ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో ఈ సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి (బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి కూడా) ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.
ఈ కార్యక్రమంలో ఆర్థిక - వైద్యారోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి, కె.మాణిక్‌రావు, చంటి క్రాంతికిరణ్, పద్మా దేవేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పి.వెంక‌ట్రామి రెడ్డి, శ్రీ ఫరూక్ హుస్సేన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మల్లన్నసాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని సింగూరుకు తీసుకువచ్చి, అక్కడి బ్యాక్‌ వాటర్‌ నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తారు.
సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, ఎల్లాపూర్‌ నుంచి మొదట నీటిని ఎత్తిపోసి కాల్వల ద్వారా జహీరాబాద్‌, అందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాలోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
ఈ పథక నిర్మాణంలో భాగంగా 147 మీటర్ల ఎత్తులో మూడు లిఫ్టులు, మూడు పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయడంతోపాటు 215 కిలోమీటర్ల మేర ఆరు కాల్వలను (రాయికోడ్‌ కెనాల్‌ (56.85 కిలోమీటర్లు), మునిపల్లి కెనాల్‌ (11.40 కిలోమీటర్లు), కంది కెనాల్‌ (44.85 కిలోమీటర్లు), జహీరాబాద్‌ కెనాల్‌(30.95 కిలోమీటర్లు), గోవిందాపూర్‌ కెనాల్‌ (19.15 కిలోమీటర్లు), హద్నూర్‌ కెనాల్‌ (51.80 కిలోమీటర్లు)) నిర్మించనున్నారు.
మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంతో నిర్మితమవుతున్న ఈ ఎత్తిపోతల పథక నిర్మాణానికి 6,293 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని, రూ.
2,653 కోట్లు ఖర్చవుందని, 140 మెగావాట్లు విద్యుత్తు వినియోగమవుతుందని అంచనా వేయబడింది.
ఆయకట్టు వివరాలు:
జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలు
ఆందోల్‌ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 66 గ్రామాల్లోని 65,816 ఎకరాలు
సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలు