27.txt 17.5 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78
కాళేశ్వరం_ఎత్తిపోతల_పథకం

https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం_ఎత్తిపోతల_పథకం

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.
దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు.
ఇది పూర్వపు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత - చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్.
సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.
2016, మే 2 దీనికి శంకుస్థాపన జరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు.
ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం.
కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే.
గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
ఇది ప్రాణహిత ,గోదావరి నదుల సంగమం వద్ద ఉంది.
ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత , దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా  తెలంగాణ రాష్ట్రంలోని 195 టిఎంసి నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడినది.
తెలంగాణ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకార ప్రాజెక్టు నిర్మాణానికి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వేదికల ద్వారా లంప్‌సమ్‌ కాంట్రాక్టు సిస్టం ఆధారంగా టెండర్లు పిలిచారని, ప్రాజెక్టు కోసం రూ.86వేల కోట్ల రుణాన్ని ఆర్థిక సంస్థలు మంజూరు చేశాయని, దాంట్లో 2021 డిసెంబరు నెల నాటికి రూ.56వేల కోట్లు విడుదల చేయగా.. 83శాతం పనులు పూర్తయ్యాయని 2021, డిసెంబరు 16న జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు.
తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది.
గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం.
వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, భూగర్భం లోనే  నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.. దీనికోసం మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ జరిపారు.
అటవి భూమి 3050హెక్టార్లను వినియోగించుకుంటున్నారు.
18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 134.5టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకు రానున్నారు.
ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్ధిరీకరణకు 34.5టీఎంసీల కేటాయిస్తారు.
కాళేశ్వరం నుంచి హైదరబాద్ తాగునీటికి 30టీఎంసీలు, గ్రామాల తాగునీటికి మరో 10టీఎంసీలు పారిశ్రామికంగా అవసరాలకు-16 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తారు.
అక్టోబర్‌ 31 నాటికి కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం 83.7 శాతం పూర్తవ్వగా, దీని కింద 18,25,700 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందనుంది.
అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరీకరించనున్నారు.
ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం - 80,500 కోట్లు
నిర్మాణాలు - 3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు
జిల్లాలు - 13
నీటీ నిల్వసామర్ద్యం - 140టీఎంసీ
ప్రధాన కాలువల డిస్టిబ్యూషన్ పొడవు - 1531కి.మీ
సొరంగాల పొడవు - 203కి.మీ
మొత్తం పంపులు - 82
అవసరమైన విద్యుత్తు - 4627.24
భూ సేకరణ - 80వేల ఎకరాలు
అటవి భూమి - 3050హెక్టార్లు
నిర్వాసిత కుటుంబాలు-తెలంగాణలో గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు.
ఈ ప్రాంతం ద‌క్క‌న్ పీఠ‌భూమి మీద ఉండటంతో న‌ది నుంచి నీటిని కాలువ‌ల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువ‌లో పోయాల్సిందే.
గోదావరి నది నుంచి తొంబై రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం కోసం కాళేశ్వరం పథకం రూపొందించబడినది , దీని కోసం వందల కి.మీ.
దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం చేస్తున్నారు ,ఇవి భారత దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు నీటిని పంపుల ద్వారా తోడటానికి ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ ఏర్పాటు చేశారు, దీనికోసం  భూగర్భంలోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.
18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు-134.5టీఎంసీ
స్ధిరికరణకు (గత ప్రాజెక్టులకు నీరు అవసరమైతే  ఇచ్చేటందుకు)-34.5టీఎంసీ
హైదరబాద్ తాగునీటికి-30టీఎంసీ
గ్రామాల తాగునీటికి-10టీఎంసీ
పారిశ్రామికంగా అవసరాలకు-16టీఎంసీమొత్తం 12 బ్లాక్లుగా ప్రాజెక్టును విభజించారు.
మేడిగడ్డ బ్యారేజి (21 జూన్, 2019 ప్రారంభం)
మేడిగడ్డ ఎత్తిపోతలు.
అన్నారం బ్యారేజి (22 జూన్, 2019 ప్రారంభం)
అన్నారం  ఎత్తిపోతలు.
సుందిళ్ళ  బ్యారేజి (21 జూలై, 2019 ప్రారంభం)
సుందిళ్ళ  ఎత్తిపోతలు.
ఎల్లపల్లి నుంచి నంది మేడారం వద్ద గల మేడారం జలాశయం కు నీటీని మళ్ళించడం.
(5 ఆగస్టు, 2019 ప్రారంభం)
మేడారం  జలాశయం నుంచి సొరంగ మార్గం.
రాగం పేట వద్ద పంప్ హౌస్  నిర్మించడం.
మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు  నీటిని మల్లిచడం.
(11 ఆగస్టు, 2019 ప్రారంభం)
మధ్యమానేరు నుంచి అప్రోచ్ కాలువ త్రవ్వి హెడ్ రెగ్యులేటర్ నిర్మించడం.
అనంతసాగర్ రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం.
(11 మార్చి, 2020 ప్రారంభం)
రంగనాయకసాగర్ జలాశయం నుంచి అప్రోచ్ కాలువను నిర్మిచడం.
(24 ఏప్రిల్, 2020 ప్రారంభం)
కొండపోచమ్మ జలాశయం: 2020, మే 29న సిద్ధిపేట జిల్లా, మర్కూక్ గ్రామం దగ్గర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొండపోచమ్మ జలాశయానికి సంబంధించిన మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించాడు.కొన్ని వందల గ్యాలాన్ల నీటిని గోదావరి నది నుండి , కాల్వల నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైపులు అవసరం అవుతాయి, కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాలు ఉన్నాయి ఇందులో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యం తో నిర్మిస్తున్నారు, ఇందులో  ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)తోపాటు  ఎలక్ట్రో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్‌ గ్రేవ్స్, వెగ్‌ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి.
కాళేశ్వ‌రంలో వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు.
ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు.
2019, ఏప్రిల్ 24న ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం అండర్ టన్నెల్‌లోని మొదటి మోటర్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి 0.01 టీఎంసీల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేయబడింది.
నందిమేడారం పంప్‌హౌస్‌లోని 124.4 మెగావాట్ల  తొలి మోటర్ వెట్న్‌న్రు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ మధ్యాహ్నం 12.03 గంటలకు పూజలుచేసి ప్రారంభించడంతో  సర్జ్‌పూల్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రయోగం విజయవంతమైంది..
2019 జూన్ 21 న ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద  పూజ, హోమ క్రతువు జరిపిన తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర ప్రారంభోత్సవం .
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులను ప్రారంభించడం జరిగింది.
2016-17 బడ్జెటులో ఈ ప్రాజెక్టుకు 6,286 కోట్ల రూపాయలు కేటాయించబడింది.ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ కంటే సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణ చాలా క్లిష్టంగా మారింది,తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం కేంద్రం చ‌ట్టం ప్ర‌కారం కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో ద్వారా ఇస్తోంది.
దీనిపై ప‌లువురు నిర్వాసితులు అభ్యంత‌రాలు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాల వ‌ర‌కూ సేక‌రించాల్సి ఉంది .కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్​ హౌస్​​లను సక్సెస్​గా రన్​ చేసినా.. కొత్త ఆయకట్టుకు మాత్రం ఈ ప్రాజెక్టు నుండి నీరు రాలేదు, వర్షాల వలన ముందు తోడిన నీరంతా మళ్ళీ దిగువకు వదిలారు అని కొందరు విమర్శలు చేశారు,గ్రావిటీ మీద వచ్చే  శ్రీరాంసాగర్​ నీళ్లను ఉపయోగించకుండా ప్రభుత్వం భారీ ఖర్చుతో ఎత్తిపోతలు చేపట్టినది, పాజెక్టు నిర్మాణ వ్యయం వేలకోట్లు పెరిగినది ఇలా ప్రాజెక్టుకు అయిన ఖర్చు మీద వివాదాలు ఉన్నాయి.
అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు
అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు (తుమ్మిడిహట్టి ప్రాజెక్టు)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు