అమ్మ_ఒడి_పథకంhttps://te.wikipedia.org/wiki/అమ్మ_ఒడి_పథకంఅమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పేద తల్లి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020, జనవరి, 9న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించాడు.అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి.లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలిఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.