30.txt 1.86 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9
కొమరం_భీం_ప్రాజెక్ట్

https://te.wikipedia.org/wiki/కొమరం_భీం_ప్రాజెక్ట్

కొమరం భీం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌ మండలం అడ గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్ట్.
హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడైన కొమురం భీమ్ (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది.
2011, నవంబర్ 19న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు.
ఆదిలాబాదులోని అసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్‌, సిర్పూర్ మండలాలలోని 45,000 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243మీటర్లు కాగా, 2021, జూలై 15 న ప్రాజెక్టులోకి 241.8 మీటర్ల మేర నీరు వచ్చిచేరింది.