గూడెం_ఎత్తిపోతల_పథకంhttps://te.wikipedia.org/wiki/గూడెం_ఎత్తిపోతల_పథకంగూడెం ఎత్తిపోతల పథకం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.దీనికి 2015, జూలై 5న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు.2009లో శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టులో భాగంగా గూడెం ఎత్తిపోతల పథకం మంజూరయ్యింది.కడెం ప్రాజెక్టు ఆయకట్టు చివరి ప్రాంతమైన మంచిర్యాల, లక్షెట్టిపేట, దం డేపల్లి మండలాల్లోని పంట పొలాలకు పూర్తి స్థాయి లో నీరందించడానికి ఈ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు.రూ.160.45 కోట్ల వ్యయంతో 30 వేల ఎకరాలకు సాగు నీరందించడానికి జనవరి 27,2009న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ పథకం ద్వారా మూ డు టీఎంసీల నీటిని కడెం ఆయకట్టులోని ప్రధాన కాలువ 57.90 కిలోమీటర్ వరకు మళ్లించాలని నిర్ణయించారు.రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఎత్తిపోత ల పథకం కొనసాగుతూనే ఉన్నాయి.గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.దండేపల్లి మండలంలో 13 గ్రామాలు, 11,202 ఎకరాలు, లక్షెట్టిపేట మండలంలో 22 గ్రామాలు, 12,498 ఎకరాలు, మంచిర్యాల మండలంలో 13గ్రామాలు, 6,300 ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది.గూడెం ఎత్తిపోతల పథకం."తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు".నమస్తే తెలంగాణ.