గొర్రెల_పంపిణీ_పథకంhttps://te.wikipedia.org/wiki/గొర్రెల_పంపిణీ_పథకంగొర్రెల పంపిణీ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే పథకం.2018 మార్చి నాటికి లబ్ధిదారులకు 1 కోటి 28 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది.2017, జూన్ 20న సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ సమీపంలోని కొండపాకలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించాడు.కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను (ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది) అందజేశాడు.మొదటి విడతలో యూనిట్‌కు 1.25 లక్షల ఖర్చులో ప్రభుత్వం 75%, లబ్ధిదారుడు 25% ఖర్చు భరించాల్సివుంటుంది.గొల్ల, కురమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించబడింది.తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (టిఎస్‌ఎస్‌జిడిసిఎఫ్) ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయబడుతోంది.రాష్ట్రంలో గొర్రెల నికర జనాభాను పెంచడానికి ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను (నెల్లూరు బ్రౌన్ (డోరా), నెల్లూరు జోడిపి (ముఖం మీద నల్ల మచ్చలతో తెలుపు), డెక్కానీ, మద్రాస్ రెడ్ జాతలకు చెందినవి) కొనుగోలు చేస్తారు.అర్హత: తెలంగాణలోని కురుమలు, యాదవులకు అనుబంధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.గొర్రెల కాపరి సమాజానికి చెందిన 18 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తి ఈ పథకానికి అర్హులు.అర్హులైన వారికి ఒక యూనిట్ ఇవ్వబడుతుంది.సబ్సిడీపై గొర్రెలు తీసుకోవాలంటే గొర్రెల పెంపకం సొసైటీలలో తప్పనిసరి సభ్యత్వం ఉండాలి.మొబైల్ వెటర్నరీ యూనిట్లు: జంతువుల అనారోగ్యం, చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొబైల్ వెటర్నరీ యూనిట్లు ప్రారంభించబడ్డాయి.దీని టోల్ ఫ్రీ నెంబరు 1962.భీమా:గొర్రెలకు ₹ 5,000, పొట్టేలుకు ₹ 7,000 ల భీమా ఉంటుంది.పశుగ్రాసం: గొర్రెలకు పశుగ్రాసం అందించడానికి గడ్డి విత్తనాలపై ప్రభుత్వం నుండి 75% రాయితీ అందుతోంది.మొదటి విడత గొర్రెల పంపిణీ ఫలితాలు:రెండోవిడత గొర్రెల పంపిణీకి అర్హులైన లబ్ధిదారులు3,85,675 మందికాగా, ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించనున్నారు.పాత పద్ధతిలోనే గొర్రెల యూనిట్‌సంఖ్య ఉంటుండగా, గతంలో రూ.1.25,000గా ఉన్న యూనిట్ ధరను మాత్రం రూ.1,75,000 కు పెంచుతున్నారు.ఇందులో ప్రభుత్వం రూ.1,31,250 చెల్లిస్తుండగా లబ్ధిదారుడు రూ.43,750 భరించాల్సి ఉంటుంది.2018, మార్చి నాటికి 1 కోటి 28 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు.మొత్తంగా 7.61 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత కలిగిన రెండు లక్షల మంది సభ్యులకు గొర్రె యూనిట్లను అందజేశారు.గొర్రెల ఉత్పత్తిలో రాజస్తాన్‌ను అధిగమించి తెలంగాణ దేశంలో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.రెండువిడతల్లో కలుపుకుని తెలంగాణ గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.11వేల కోట్లు కేటాయించారు.గొర్రెల పంపిణీ సమయంలో ఈ పథకాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి.