అమ్మఒడి,_కె.సి.ఆర్._కిట్_పథకంhttps://te.wikipedia.org/wiki/అమ్మఒడి,_కె.సి.ఆర్._కిట్_పథకంఅమ్మఒడి, కె.సి.ఆర్.కిట్ పథకం తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.2017, జూన్ 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిచబడింది.2017-18 బడ్జెటులో ఈ పథకానికి 605 కోట్ల రూపాయలు కేటాయించబడింది.గర్భిణిలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడంకోసం, ప్రసవానంతరం ఇంటికి చేరడంకోసం ప్రభుత్వం ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటుచేసింది.102 నంబరుకు ఫోన్ చేస్తే ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనం గర్భిణీ ఇంటిముందుకు వస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో అమ్మఒడి పథకం కోసం 250 వాహనాలు పనిచేస్తున్నాయి.గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు చెకప్‌లకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావటం, డెలివరీ అయ్యాక తల్లీబిడ్డను ఇంటికి చేరవేయడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు 102 వాహనం ద్వారా నిర్వహిస్తారు.ఈ పథకానికి రూ.561 కోట్లు కేటాయించారు.సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తుంది.గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం జరిగి శిశువుకు 10 నెలల వయసు వచ్చేంతవరకూ నాలుగు విడతలలో అనగా గర్భం దాల్చిన ఐదు నెలలలోపు డాక్టరు పరీక్ష అనంతరం రూ.3000, ప్రసవ సమయంలో ఆడ శిశువుకు రూ.5000, లేదా మగ శిశువుకు రూ.4000, శిశువుకు వ్యాధినిరోధక టీకాలు 14 వారాల వయసులో రూ.3000,, 10 నెలల వయసులో రు.2000 చొప్పుననాలుగు విడతలలో రూ.12,000 రూపాయలను అందిచడంతోపాటు, ఆడిపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నది.ప్రసవం తర్వాత రెండు వేల రూపాయల విలువచేసే 16 రకాల వస్తువులు (బిడ్డకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్, దోమతెర, చిన్నబెడ్, రెండు బే బీడ్రెస్‌లు, తల్లికి రెండు చీరలు, టవళ్ళు) ఉండే కేసీఆర్ కిట్‌ను కూడా ఇస్తుంది.2022 జనవరి 17 నాటికి కెసీఆర్ కిట్స్ పథకం ద్వారా లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10 లక్షలు దాటింది.ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థికసాయం అందించడంతోపాటు సామాజికంగా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి.ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెరిగడంతోపాటు మాతా శిశు మరణాలకు అడ్డుకట్టపడింది.ప్రైవేట్‌కు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకోవడంతో ఒక్కొక్కరికి సగటున రూ.40 వేల దాకా ఆదా అవుతోంది.ఈ పథకం ద్వారా ప్రతిఏటా 2 లక్షలమందికి సాయం అందిస్తుండగా, ఈ ఐదేళ్ళకాలంలో 1,700 కోట్ల రూపాయల కిట్లు అందజేయబడ్డాయి.గర్భిణుల కుటుంబాలకు దాదాపు రూ.4,500 కోట్లు ఆదా అయింది.ఇప్పటివరకు కిట్ల రూపంలో ప్రభుత్వం తరఫున రూ.263 కోట్లు విలువైన వస్తువులను అందించడం జరిగింది.2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమ ప్రభుత్వం అమలుచేసిన కెసిఆర్ కిట్ పథకాన్ని ఒకానొక విజయంగా చెప్పుకుంటూండగా, ప్రతిపక్షాలు కెసిఆర్ కిట్ కేవలం ఒకానొక సంక్షేమ పథకం అనీ, సాధారణంగా ప్రతీ ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలు అమలుచేస్తాయని దీన్నొక గొప్పగా చూపించుకోవడం తగదని విమర్శించాయి.తెలంగాణ ప్రభుత్వ పథకాలు