46.txt 5.08 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
జస్టిస్_షా_కమిషన్

https://te.wikipedia.org/wiki/జస్టిస్_షా_కమిషన్

జయంతిలాల్ చోతలాల్ షా (22 జనవరి 1906 - 4 జనవరి 1991) భారతదేశం పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి 1970 డిసెంబర్ 17 నుండి 1971 జనవరి 21 న పదవీ విరమణ చేసే వరకు.
అతను అహ్మదాబాద్లో జన్మించాడు.షా ఆర్.సి.లో పాఠశాల విద్యకు హాజరయ్యాడు.
అహ్మదాబాద్‌లోని పాఠశాల, తరువాత బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో చదువుకున్నారు.
1929 లో అహ్మదాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.
గాంధీ హత్య కేసులో నాథురామ్ గాడ్సే, ఇతర ముద్దాయిలను విచారించే న్యాయ బృందంలో అతను ఒకడు.
షా  1949 లో బొంబాయి హైకోర్టుకు వెళ్ళాడు, అక్కడ 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా ఉన్నాడు.
అక్టోబర్ 1959 లో,  భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.1970 డిసెంబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు.
భారత దేశం లో 1975 సంవత్సరంలో అత్యయిక పరిస్థితి అప్పటి ప్రధాన మంత్రి  శ్రీమతి ఇందిరా గాంధీ విధించారు .
అత్యయిక పరిస్థిలో జరిగిన అవక తవల పై శ్రీ మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యం లో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియమించబడింది
జస్టిస్ షా తమ తుది నివేదికను ( 6 ఆగష్టు 1978 )  కేంద్ర ప్రభుత్వమునకు అందచేసిన వాటిలో అత్యవసర ( ఎమర్జెన్సీ) పరిస్ధితి క్రింది వాటిలో జరిగిన పొరపాట్లు  విశదీకరించారు .
న్యాయ వ్యవస్థలలో , ప్రభుత్వ అధికారుల విధుల దుర్వినియోగం, వివిధ రాష్ట్రములలో జైళ్ళ లో వున్నా పరిస్థితులు , కుటుంబ నియంత్రణ కార్యకరములు  (( రాష్ట్రాల వారీగా ), వార్త పత్రికల ప్రచురణ లో  నిషేధములు , పలురకాల    అధికార దుర్వినియోగం వంటివి  తమ నివేదికలో పేర్కొన్నారు దీనికి 26 అధ్యాయాలు ,మూడు అనుబంధాలు  తో  ఉన్నాయి -  జస్టిస్ షా నివేదికలో  ప్రజాస్వామ్య సంస్థలకు, ప్రజాస్వామ్యం లో నైతిక విలువల పతనం, వారు చేసిన నష్టం గురించి కూడా  ఆందోళన వ్యక్తం చేసింది.
1980 లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, కమిషన్ నివేదిక కు ప్రాధ్యాన్యత లేకుండా పోయింది.
ఎరా సెజియాన్  మాటల్లో  “… ఇది పరిశోధనాత్మక నివేదిక కంటే ఎక్కువ, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారికి పని చేసే ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక నిర్మాణానికి భంగం కలిగించవద్దని,ఒక నిరంకుశ పాలనలో అణచివేయబడిన వారికి, ఉత్సాహపూరితమైన పోరాటం ద్వారా స్వేచ్ఛను విమోచించటానికి ఆశాజనక మార్గదర్శిగా ఉండటానికి ఇది ఒక  చారిత్రక పత్రం. . ”    అని  షా కమిషన్ నివేదికను పేర్కొన్నారు