47.txt 6.01 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38
జాతీయ_ఉపాధి_హామీ_పథకం

https://te.wikipedia.org/wiki/జాతీయ_ఉపాధి_హామీ_పథకం

మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డుజాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది.
చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడింది.
ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది.
సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి.
మరిన్ని వివరాలు భారత ప్రగతి ద్వారంలో ఉన్నాయి.
పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది.
దీనికి పల్లె ప్రాంతాల్లోని ప్రజలు సమీప కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఉపాధి వివరాల ఉత్తరం ద్వారా తెలియచేయబడతాయి.
దీనికొరకు, వ్యక్తులుబ్యాంకులలో ఖాతా తెరవవలెను.
వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.
దీనివలన, గ్రామీణ కూలీల వలసలు తగ్గటంతో.
పట్టణాలలో నిర్మాణ రంగ కార్యక్రమాలు కుంటుపడటం, లేక ఖర్చు పెరగడం జరుగుతున్నది.
నీటి నిలువలు, సౌకర్యాలు పెంచడం
నీటి కాలవలు (అత్యంత చిన్న చిన్న నీటిపారుదల పనులు)
సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ (చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
కరువు నివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం
వరదల నియంత్రణ, రక్షణ పనులు (నీళ్లు నిలిచిన స్థలాల్లో కాలవల ఏర్పాటుతో సహా)
రహదారుల అభివృద్ధి
గ్రామాల్లో అన్నివాతావరణాల్లో వాడుకొనేలా రహదారుల ఏర్పాటు.
భవనాల నిర్మాణం
పాఠశాల, ఆరోగ్య కేంద్రం భవనాలుదీనిలో భాగంగా దళితుల భూముల్లో పనికి అగ్రస్థానాన్ని ఇవ్వటంతో, అగ్రజాతి వారు కూడా దళితుల భూముల్లో పనిచేస్తుండటంతో, సమాజంలో మార్పులు కొన్ని చోట్ల వస్తున్నాయని, ఇటీవల పి.
సాయినాధ్ హిందూ పత్రికలో రాశారు.
ఈ పథకం అమలు, వివిధ రాష్ట్రాలలో వివిధ స్థాయిలలో ఉంది.
అవినీతి కూడా ఎక్కువగా వున్నట్లు ప్రభుత్వ నివేదికలలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం
మధ్యాహ్న భోజన పథకము
జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నగర పునర్నిర్మాణ యోజన
స్వచ్ఛ భారత్
జాతీయ సేవా పథకం
ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన
"భారత ప్రగతి ద్వారం".
 కొండెక్కిన ఉపాధి హామీ పథకం