జాతీయ_మహిళ_కమిషన్https://te.wikipedia.org/wiki/జాతీయ_మహిళ_కమిషన్జాతీయ మహిళ కమిషన్ 1990 చట్టం ప్రకారం 1990, ఆగస్టు 30న ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది, 1992 జనవరి 31వ తేదీన ఏర్పడిన శాసనబద్ధమెన సంస్థ.జాతీయ మహిళ కమిషన్‌లో ఒక చైర్మన్, 5 మంది సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు, వారి పదవీ కాలం 3 సంవత్సరాలు.ఈ కమిషన్‌లో ఒకరు ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన వారిని ఒక్కొక్కరిని నియమించాలి.వీరి నియామకం, తొలగింపు అధికారాలు రాష్రపతికే ఉంటాయి.మహిళల రక్షణలను పరిరక్షించి, పర్యవేక్షించడం.కేంద్ర ప్రభుత్వానికి మహిళ సంక్షేమానికి సంబంధించి సూచనలు ఇవ్వడం.పరివారక్ మహిళ లోక్ అదాలత్ ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయడం.వరకట్న నిషేధచట్టం 1961ని సమీక్షించి, ఆస్తి తగదాలను పరిష్కరించడంసెమినార్లు, వర్‌కషాపులు నిర్వహించి మహిళ సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించడంమహిళా కమిషన్ ఛైర్మన్ భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను కలిగి ఉంటారు.మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి, అవసరమైతే వాటికి సవరణలను సూచించడం.రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం.కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహిళాభివృద్ధి, ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం.మహిళా సమస్యలు, అత్యాచార ఘటనలపై అధ్యయనం చేసి, నేరస్థులకు తగిన శిక్ష పడేలా కృషి చేయడం.