జాతీయ_వెనుకబడిన_తరగతుల_కమిషన్https://te.wikipedia.org/wiki/జాతీయ_వెనుకబడిన_తరగతుల_కమిషన్జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 ప్రకారం 1993 ఆగస్టు14న ఏర్పడింది.1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఇది 1955లో నివేదిక సమర్పించింది.1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫారసులు చేసేందుకు బి.పి.మండల్ అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది.ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.1979లో జనతాప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండల్ కమిషన్ సిఫారసులు అమలుకాలేదు.1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలుచేసింది.సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా శాశ్వత బీసీ కమిషన్‌ను 1993 ఆగస్టు14న ఏర్పాటు చేశారు.దేశంలో 2399 వెనుకబడిన కులాల ఉన్నాయి.జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.ఈ కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు.వీరిని ముందుగా తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించే రక్షణలు, ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసేందుకు కృషి చేయడం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయడం.వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి, వాటిని మెరుగుపరిచేందుకు సూచనలు చేయడం.బీసీ వర్గాల ప్రగతికోసం రూపొందించిన సిఫారసులను ఒక నివేదిక రూపంలో రాష్ట్రపతికి అందజేయడం, రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.కమిషన్ తన విధులను నిర్వహించే విషయంలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పులు, చేర్పులను సిఫారసు చేస్తుంది.బీసీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను సమీక్షిస్తుంది.ఏ వ్యక్తినైనా విచారణకు కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తుంది.వార్షిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.