జాతీయ_వైద్య_కమిషన్https://te.wikipedia.org/wiki/జాతీయ_వైద్య_కమిషన్జాతీయ వైద్య కమిషన్ దేశంలో వైద్య విద్య మరియు వృత్తి యొక్క అత్యున్నత నియంత్రకం కోసం ఏర్పాటైన కమిషన్.జాతీయ వైద్య కమిషన్ బిల్లు - 2019ను పార్లమెంట్ ఆమోదించింది.మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ఏర్పాటు చేయడంతో ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ యాక్ట్ -1956 ప్రకారం ఏర్పాటైన ఎంసీఐ దాదాపు ఏడు దశాబ్దాల పాటు పని చేసి రద్దయ్యింది.యూజీ, పీజీ విద్య, సంబంధిత వైద్య సంస్థల సమీక్ష, ప్రమాణాలు, అభ్యాసకుల రిజిస్ట్రేషన్ ను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు రాష్ట్రపతి 9 ఆగష్టు 2019న ఆమోదం తెలిపాడు.ఎన్‌ఎంసీ పరిధిలో వైద్యవిద్యను నియంత్రించేందుకు మొత్తం నాలుగు బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డుపోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డుమెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్బోర్డు ఆఫ్ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్‌ఈ బోర్డులన్నీ స్వయంప్రతిపత్తి సంస్థలుగా వ్యవహరిస్తాయి.మెడికల్ అసెస్‌మెంట్, ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డుల్లో ఒక్కో దాంట్లో అధ్యక్షుడితో పాటు ఎనిమిది మంది సభ్యులుంటారు.దేశంలో వైద్యవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ బోర్డులు క్రియాశీలకంగా పనిచేస్తాయి.జాతీయ వైద్య కమిషన్ ఛైర్మన్‌గా డాక్టర్ సురేష్ చంద్ర శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది.ఆయన మూడేళ్ల పాటు ఛైర్మన్‌గా విధులు నిర్వహించనున్నాడు.జాతీయ వైద్య కమిషన్‌లో కార్యదర్శి, ఛైర్మన్‌తో పాటు, 10 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన 22 మంది పార్ట్‌టైమ్ సభ్యులు ఉంటారు.