58.txt 5.16 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
డి.కె.చదువులబాబు

https://te.wikipedia.org/wiki/డి.కె.చదువులబాబు

డి.కె.చదువులబాబు తెలుగు కథా రచయిత.
వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి.
వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘిక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి.
నిజానికి వీరు మొదట బాలసాహిత్యాన్ని అందుకుని ఒక యజ్ఞంలా కథలు రాసి, ఆ తరువాత సాంఘిక కథలవైపు, పెద్దల కథలవైపు దృష్టి సారించారు.
వీరి కథలు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, విశాలాంధ్ర, వార్త, జాగృతి, ప్రజాశక్తి మొదలగు ప్రముఖ పత్రికలలో రెగ్యులర్‌గా ప్రచురిస్తున్నాయి.
2003లో బాలల కథలు అనే సంపుటిని ప్రచురించారు.
ఆయన పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో జూన్ 1 1967 న జన్మించాడు.
ప్రస్తుతం ఆయన వీరు పొద్దుటూరు లో స్థిరపడ్డాడు.
ఒక వైపు సాంఘిక కథలు రాస్తూనే మరోవైపు బాలసాహిత్యంపై కృషిచేస్తున్నారు.
చందమామ, బొమ్మరిల్లు (పత్రిక), బాలమిత్ర, బాలజ్యోతి, బాలభారతం(పత్రిక), బాలతేజం, బుజ్జాయి, అటవిడుపు, చిన్నారి, మొదలగు బాలల పత్రికల్లో సుమారు 250 కథలు ప్రచురితమైనాయి.
ఆయన వివిధ వార్తాపత్రికలలో సుమారు 50కి పైగా సాంఘిక కథలు రాసాడు.
పిల్లలకోసం విజ్ఞానాన్ని అందించే "మాటలకొలువు" శీర్షికను బాలల పత్రికల్లో నిర్వహించాడు.
బాలల నవలలు రాసాడు.
శ్రీ వెంకటేశ్వర నాటక కళామండలి స్థాపించి "మర్మలోకం", "సమలోకం" అనే సాంఘిక నాటకాలను రచించి దర్శకత్వం వహించి ప్రదర్శింపజేసారు.
వీరి "కనువిప్పు" కథను మహారాష్ట్ర ప్రభుత్వం వారు హైస్కూలులోని విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు.
1994లో పల్లకి వారపత్రిక నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో వీరి "అమ్మకథ" ప్రథమ బహుమతి పొందింది.
స్టేట్ టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన కథల పోటీలో వీరి కథ "నేను సైతం(మాష్టారు గారి బడి)" ప్రథమ బహుమతి పొందింది.
ఆయన రచనా ప్రస్థానంలో ఎన్నో సత్కారాలు పొందాడు.
"సాహితీ సౌరభం" మొదలగు సంకలనాల్లో వీరి రచనలు చోటు చేసుకున్నాయి.
2005లో కాటన్ మర్చంట్స్ అసోసియేషన్ వారి రజతోత్సవంలో "విశిష్ట వ్యక్తి" సన్మానం పొందాడు.
వివిధ పత్రికల్లో ప్రచురించిన వీరి 300 కథల నుండి 150 కథలను ఎన్నికచేసి ఆరు కథా సంపుటాలుగా ప్రచురించారు.
మనసున్న మనిషి (సాంఘిక కథలు)
బాలల కథలు (కథా సంపుటి)
బంగారు రెక్కలు, అప్పు-నిప్పు (బాలల కథలు - విశాలాంధ్ర వారి ప్రచురణ)
విజయ రహస్యం (కథా సంపుటి)
చిన్నారి మనసు (కథలు - విజ్ఞాన విషయాలు)
కడప జిల్లా సాహితీమూర్తులు