60.txt 14.3 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74
తెలంగాణ_ఆసరా_పింఛను_పథకం

https://te.wikipedia.org/wiki/తెలంగాణ_ఆసరా_పింఛను_పథకం

తెలంగాణ ఆసరా పింఛను పథకం, వృద్ధుల, వికలాంగులకు ఇవ్వవలసిన పింఛను కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది.
ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్.ఐ.వి.
- ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు.
దేశంలోనే బీడి కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
పింఛన్లను పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ.
1000, వికలాంగులకు రూ.500 నుంచి 1500 రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించారు.
రెండవ సారి ఎన్నికల తరుణం లో  మరోసారి పింఛన్లను పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  డిసెంబర్, 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ.
2,016, వికలాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించారు.
ఈ పెరిగిన పింఛన్లు 2019, ఏప్రిల్ 1 నుండి ఇవ్వబడుతున్నాయి.
2020, మార్చి 8 ఆదివారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వృద్దులకు ఇచ్చేపెన్షన్ అర్హత వయసును 65 ఏళ్ళ నుండి 57 ఏళ్ళకు తగ్గించింది.
దీంతతో ఆసరా లబ్దిదారుల సంఖ్య 7 నుంచి 8 లక్షలకు పెరిగింది.
ఈ పథకంకోసం 2019-20లో రూ.
9402 కోట్లు కేటాయించగా, 2020-21 బడ్జెట్‌లో రూ.
2356 కోట్లు పెంచి రూ.11758 కోట్లు కేటాయింపులు చేశారు.
అర్హత వయసు కుదించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా ఏడు లక్షలమందికి లబ్ది చేకూరనుంది.
దాంతోపాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిష్కరిస్తూ దాదాపు మరో లక్ష మందికి ఆసరా అందనుంది.
దీనివల్ల ఈ పథకంలో లబ్ది దారుల సంఖ్య దాదాపు 47 లక్షలకు చేరింది.
2016-17 బడ్జెటులో ఆసరా పింఛన్లకు 4,693 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
2017-18 బడ్జెటులో ఆసరా పింఛన్లకు 5,330 కోట్ల రూపాయలు కేటాయించబడింది.వృధ్ధులు - 12,27,824 మంది
వికలాంగులు - 4,92,680 మంది
వితంతువులు - 14,33,837 మంది
చేనేత కార్మికులు - 36,872 మంది
కల్లు గీత కార్మికులు - 62,164 మంది
బీడి కార్మికులు - 4,07,374 మంది
ఒంటరి మహిళలు - 1,33,936
HIV రోగులు - 32,718
మలేరియా - 14,907
కళాకారులు - 30,487 మంది
మొత్తం - 38,42,312 మందిజిల్లాలా వారిగా ఇస్తున్న ఫింఛన్ల సంఖ్య
వృద్ధులు: ది.
01.04.2019 నుండి 57 సంవత్సరాలు ( ది.
31.03.2019  వరకు  65  సంవత్సరాలు) లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృధ్ధులు ఆసరా పింఛను పథకానికి అర్హులు.
జనన ధ్రువీకరణ పత్రము లేదా ఆధార్ కార్డు లేదా వయస్సుని సూచించే ఏదైనా ఇతర పత్రములు ధరఖాస్తుకు అవసరమవుతాయి.
పైన తెలిపిన పత్రాలు లేకపోతే గవర్నమెంటు అధికారి లభ్ధిదారుని పిల్లల వయస్సు, మనుమలు, మనుమరాళ్ళ వివాహ వయస్సు ఆధారంగా గుర్తించవచ్చు అలా గుర్తించలేని పరిస్థితిలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు.
చేనేత కార్మికులు: 50 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వారు అర్హులు.
వితంతువులు: 18 సంవత్సరాలు నిండినవారై, భర్త మరణ ధ్రువీకరణ పత్రము కలిగిన వారు అర్హులు.
నిర్ధారణ సమయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి.
మరణ ధ్రువీకరణా పత్రం లేకపొతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలల్లో ధ్రువీకరణ పత్రం పొందాలి.
లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజి సెక్రెటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి.
కల్లు గీత కార్మికులు: 50 సంవత్సరాలు నిండినవారై ఉండాలి.
లబ్ధిదారుడు కల్లు గీత కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి.
వికలాంగులు: వీరికి వయస్సుతో సంబంధం లేదు.
కనీసం 40 శాతం వైకల్యం కలిగి ఉండాలి.
వినికిడి లోపం ఉన్నవారైతే 51 శాతం వైకల్యం కలిగి ఉండాలి.
వికలాంగులకు అందించే SADAREM సర్టిఫికెట్ లో 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు.
హెచ్.ఐ.వి - ఎయిడ్స్ ఉన్నవారు: యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు అర్హులు.
వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరమవుతాయి.
వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం ఆసరా పింఛను పథకాన్ని ప్రారంభించారు.
మిగతావారు ఈ ఆసరా పింఛను పథకానికి అనర్హులు.
ఈ క్రింద  పేర్కొన బడినవారు ఆసరా పింఛను పథకానికి అనర్హులు:
3 ఎకరాల సాగునీటి సదుపాయం ఉన్న భూమి/ 7.5 ఎకరాల బీడు భూమి ఉన్నవారు
ప్రభుత్వ/ప్రభుత్వ రంగ / ప్రైవేటు రంగ /కాంట్రాక్టరు ఉద్యోగం ఉన్న పిల్లలు కలవారు
వైద్యులు, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన పిల్లలు కలవారు
పెద్దవ్యాపార సంస్థలు (నూనె మిల్లులు, బియ్యం మిల్లులు, పెట్రోలుపంపులు, షాపు యజమానులు) ఉన్న వారు
ఇప్పటికే ప్రభుత్వం నుండి పింఛను పొందుతున్నవారు
తేలికపాటి, భారీ వాహనములు కలిగినవారు
జీవన శైలి, వృత్తి, ఆస్తుల ఆధారంగా అనర్హులని అధికారులచే గుర్తించబడ్డ కుటుంబాలు  మొదలైన వారు  ఆసరా పింఛను పథకానికి అర్హులు కాదు.
ఈ క్రింద  పేర్కొన బడినవారు ఆసరా పింఛను పథకానికి అర్హులు:
ఆది వాసి, అసహాయ గిరిజన గ్రూపుల వారు
మహిళల నేతృత్వంలోని కుటుంబాలు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు
వికలాంగుల కుటుంబాలవారు
వికలాంగులు, వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా పింఛనుకు కుటుంబములో ఒక్కరు మాత్రమే అర్హులు
భూమి లేని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కళాకారులు (కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి) మురికి వాడల ప్రజలకు, రోజు వారీ వేతనం మీద ఆధార పడే వారు, పూలు, పండ్ల వ్యాపారులు, రిక్షా కార్మికులు, పాము మంత్రం వేయువారు, చెప్పులు కుట్టేవారు, నిరాశ్రయులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందినవారు.
ఇళ్ళు లేని వారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో తాత్కాలిక గృహ నివాసాలను ఏర్పాటు చేసుకున్నవారు
వృధ్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తుల నేతృత్వంలోని కుటుంబాలు  మొదలైన వారుగ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతి సెక్రెటరి/విలేజి రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టరు దరఖాస్తులను పరిశీలిస్తారు.
మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ/జోనల్ అధికారి, దరఖాస్తులను పరిశీలించి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా పింఛను మంజూరు చేస్తారు.
లబ్ధిదారులను గుర్తించే క్రమంలో గృహ సర్వే సమాచారాన్ని, జనాభా లెక్కలను, వికలాంగులు, వితంతువులు, వృధ్ధులు, కమ్యూనిటీలకు చెందిన వివిధ వర్గాలను పరిగణలోనికి తీసుకుంటారు.
దరఖాస్తు పరిశీలనలో లేదా ఆకస్మిక తనిఖీలో ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నచో, అటువంటి వారిపై క్రమశిక్షణా చర్య తీసుకుంటారు లేదా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు.టోల్ ఫ్రీ నంబరు: 1800-200-1001