66.txt 3.68 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
తెలంగాణ_బీసీ_కమిషన్

https://te.wikipedia.org/wiki/తెలంగాణ_బీసీ_కమిషన్

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బీసీల స్థితిగ‌తుల అధ్య‌య‌నం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్.
వెనుకబడిన కులాల సాధికారత, సంక్షేమంకోసం జిఓ నెం.
25 ప్రకారం 2016, అక్టోబర్ 10న ఈ కమిషన్ ఏర్పాటుచేయబడింది.
బీసీ కమిషన్ చైర్మన్‌, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది.
వీరికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించబడుతాయి.
చైర్మన్: బి.ఎస్.రాములు (సామాజికవేత్త, రచయిత)
సభ్యులు: వకుళాభరణం కృష్ణమోహన్ (రచయిత, వక్త), డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్, జూలూరు గౌరీశంకర్ (ప్రముఖ రచయిత, కవి)చైర్మన్: వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు (రచయిత, వక్త)
సభ్యులు:  సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.
కిశోర్ గౌడ్కమిషన్ స‌భ్యులు 2021 సెప్టెంబరు 1న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టారు.
వెనుకబడిన తరగతుల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని వచ్చే అభ్యర్థనలను, బిసి జాబితా నుండి ఏ కులాన్నైనా తొలగించాలని వచ్చే ఫిర్యాదులను ఈ కమిషన్ పరిశీలించి విచారణకు స్వీకరిస్తుంది.
2017-18లో ఈ కమిషన్ కు రూ.
3.58 కోట్లు కేటాయించబడ్డాయి.
ముస్లింలలో వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి రాష్ట్రమంతటా పర్యటించిన బీసీ కమిషన్ 21,435 ప్రాంతాల్లో పలువురిని కలిసి, వారి సామాజిక స్థితిగతులను పరిశీలించింది.
సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బీసీ-ఈకి చెందిన ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారని బీసీ కమిషన్ స్పష్టం చేస్తూ, మతం మారినా వెనుకబాటుతనం పోలేదని తెలియజేస్తూ ప్రభుత్వానికి 135 పేజీల నివేదికను సమర్పించింది.