69.txt 6.75 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27
తెలంగాణ_రాష్ట్ర_ఆహార_కమిషన్

https://te.wikipedia.org/wiki/తెలంగాణ_రాష్ట్ర_ఆహార_కమిషన్

తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ (ఆంగ్లం: Telangana State Food Commission) అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆహారం, పోషకాహార భద్రతను అందించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్.
తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని పొందడం ద్వారా మానవ జీవన చక్ర విధానంలో ఆహారం, పోషకాహార భద్రతను అందిస్తుందని జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, సెప్టెంబరు 10న భారత గెజిట్‌లో ప్రచురించబడింది.
ఆ చట్టంలోని సెక్షన్ 16లోని నిబంధనల ప్రకారం ఈ చట్టం అమలును పర్యవేక్షించడం, సమీక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆహార కమిషన్‌ ఏర్పాటును ప్రతిపాదించింది.
తెలంగాణ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ 2017 ఏప్రిల్ 10న జీవో నెం.02 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం, ప్రసూతి ప్రయోజనాలు (కేసీఆర్ కిట్) మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
జాతీయ ఆహార భద్రతా చట్టానికి సంబంధించి ప్రభుత్వ విధాన నిర్ణయాలను పాటించడంలో తనిఖీ చేయడం
చట్ట ప్రయోజనాలు, అర్హతల గురించి అవగాహన కల్పించేందుకు ప్రాంతీయ శిబిరాలను నిర్వహించడం
వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం పౌర సరఫరాల శాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం, పాఠశాల విద్యా శాఖల పనితీరుపై ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన చర్యలను తీసుకోవడంజాతీయ ఆహార భద్రత చట్టం, 2013 ప్రకారం పథకాల అమలును పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం
స్వయంచాలకంగా లేదా ఫిర్యాదు అందిన తర్వాత హక్కు ఉల్లంఘనలపై విచారించడం
జిల్లా ఫిర్యాదుల పరిష్కార అధికారి ఉత్తర్వులపై అప్పీళ్లను వినడం
ఆహారం, పోషకాహార సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం, వ్యక్తులు ఈ చట్టంలో పేర్కొన్న వారి అర్హతలను పూర్తిగా పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం, వారి ఏజెన్సీలు, స్వయంప్రతిపత్త సంస్థలు, అలాగే సంబంధిత సేవలను అందించడంలో పాలుపంచుకున్న ప్రభుత్వేతర సంస్థలకు సలహాలు ఇవ్వడం2017 ఏప్రిల్ 12న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.3 ద్వారా బీసీ కమిషన్ చైర్మన్‌, సభ్యులను నియమించడానికి ఎన్నిక కమిటీ ఏర్పాటయింది.
కమిటీ ఇచ్చిన ప్రతిపాదలనతో 2017 ఏప్రిల్ 17న జీవో నెం.
5 ద్వారా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ చైర్మన్, సభ్యులు 2017 మే 29న బాధ్యతలు స్వీకరించారు.
కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది.
2022 మే 28న కమిషన్ సభ్యుల పదవీకాలం మరో 5 ఏళ్ళపాటు (లేదా 65 ఏళ్ళ వయసు వచ్చేవరకు) పొడగించబడింది.
చైర్మన్: కొమ్ముల తిరుమల్ రెడ్డి
సభ్యులు: ఓరుగంటి ఆనంద్, భానోత్ సాంగులాల్, కొణతం గోవర్ధన్ రెడ్డి, రంగినేని శారద, ములుకుంట్ల భారతి.తెలంగాణలో ఆహార భద్రత వివరాలను ఎప్పటికప్పుడు అందిండంలో భాగంగా కమిషన్ వెబ్సైటును రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది.
2022, మే 27న తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.
అనిల్ కుమార్ చేతులమీదుగా ఈ వెబ్సైటు ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.
కొమ్ముల తిరుమల్ రెడ్డి
మేడే రాజీవ్ సాగర్అధికారిక వెబ్సైటు