76.txt 7.03 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
తెలంగాణ_రాష్ట్ర_సమాచార_కమిషన్

https://te.wikipedia.org/wiki/తెలంగాణ_రాష్ట్ర_సమాచార_కమిషన్

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్, (ఆంగ్లం: Telangana State Information Commission) అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాచారం హక్కును పటిష్టంగా అమలుచేయడంకోసం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన కమిషన్.
దాఖలు చేసిన ఫిర్యాదులు, అప్పీళ్లతో పాక్షిక న్యాయవ్యవస్థగా ఈ కమిషన్ వ్యవహరిస్తుంది.
ఈ కమిషన్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, 5మంది రాష్ట్ర సమాచార కమిషనర్లు గవర్నర్‌చే నియమించబడతారు.
ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నేతగా సభ్యులుగా ఉన్న ఒక కమిటీ సిఫార్సుపై కమిషనర్ల ఎంపిక జరుగుతుంది.
సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు 13న తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కమిషన్ సభ్యుల ఎంపిక కోసం త్రిసభ్యకమిటీ ఏర్పాటు చేస్తూ 2017 సెప్టెంబరు 14న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చైర్‌పర్సన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ,  ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డిలను సభ్యులుగా నియమించబడ్డారు.
సమాచార హక్కు చట్టం, 2005 కింద అందిన ఫిర్యాదులు, వాటి ప్రతిస్పందనల గురించి రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ శాఖల నుండి కమిషన్ వార్షిక నివేదికను పొందాలి.
రాష్ట్ర సమాచార కమిషన్ సమాచార హక్కు చట్టం, 2005 అమలుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.రాష్ట్ర సమాచార కమిషన్ చట్టంలోని నిబంధనల అమలుపై నివేదికను సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పించడం
చట్టానికి సంబంధించిన ఏదైనా అంశంపై సహేతుకమైన కారణాలపై కమిషన్ విచారణకు ఆదేశించడం.
ఏ వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదునైనా స్వీకరించి విచారణ జరపడం
ఏదైనా ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయడంప్రగతిభవన్‌ వేదికగా సమావేశమైన త్రిసభ్యకమిటీ సభ్యుల ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్‌.
రాజా సదారాం, కమిషనర్‌గా బుద్ధా మురళి లను ఎంపికచేయగా 2017 సెప్టెంబరు 15న రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆమోదించి సభ్యులకు నియామక ఉత్తర్వులు జారీచేశాడు.
2020 ఫిబ్రవరిలో సీనియర్‌ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మూడేళ్లపాటు (వారికి 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) ఈ పదవిలో కొనసాగుతారు.
రాష్ట్ర సమాచార కమిషన్‌లోని ఏదైనా ఖాళీని ఖాళీ అయిన తేదీ నుండి ఆరు నెలలలోపు భర్తీ చేయాలి.
ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీతాలు, అలవెన్సులు, ఇతర సేవా నిబంధనలు, షరతులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానంగా ఉంటాయి.
ప్రధాన కమిషనర్‌: బుద్ధా మురళి
కమిషనర్లు: కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గుగులోత్ శంకర్‌నాయక్, సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌సమాచార కమిషన్ కు శాశ్వత భవన నిర్మాణంకోసం గచ్చిబౌలీలోని సర్వే నెంబరు 91లో ఎకరం స్థలాన్ని కేటాయించింది.
అధికారిక వెబ్సైటు