దళితబంధు_పథకంhttps://te.wikipedia.org/wiki/దళితబంధు_పథకంతెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది.పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.2021, ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదలజేయడం ద్వారా ఈ పథకం ప్రారంభించబడింది.దళితుల కోసం 2021 సంవత్సరం బడ్జెట్‌లో 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం' పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు 2021, ఫిబ్రవరి 10న నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు.2021లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్‌మెంట్ స్కీం కోసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టారు.2021, జూలై 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ‘దళిత సాధికారత అమలు పైలట్ ప్రాజెక్టు ఎంపిక అధికార యంత్రాంగం విధులు’ అనే అంశంమీద ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఈ పథకానికి 'తెలంగాణ దళితబంధు పథకం' అనే పేరును కేసీఆర్ ఖరారు చేశాడు.ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై 2021, జూలై 26న ప్రగతి భవన్ లో తొలి అవగాహన సదస్సును జరిగింది.కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు, 15 మంది రిసోర్సు పర్సన్స్ ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.2021, ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించాడు.ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా వార్షిక బడ్జెటులో 20 వేల కోట్లను కేటాయించనున్నారు.రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకొని, నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపికఈ పథకం ద్వారా తెలంగాణలోని పదిహేను పదహారు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధిలబ్ధిదారుడి నుండి రూ.10వేలతో ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటుచేసి, లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి సహాయం అందజేతపథకం అమలు తీరును గమనించేందుకు ఆరుగురితో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలలో దళిత బంధు కమిటీల ఏర్పాటుమొదటగా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా 2021, సెప్టెంబరు 14న రూ.10లక్షల చొప్పున 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసింది.మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేసారు.దళితబంధు పథకంలో భాగంగా సీఐపీఎస్, పీఎంఎంఎస్‌వై సహకారంతో 2021 డిసెంబరు నెలలో జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్త ప్రభాకర్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో దళిత బంధుకు అర్హత సాధించిన దళిత యువతకు చేపల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవస్థాపకతలో నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.తమకు వచ్చే దళిత బంధు నిధులలో శిక్షణలో నేర్చుకున్న మెళకువలతో ఫిషరీస్ యూనిట్లు ఏర్పాటు చేసుకోని, చేపల ఉత్పత్తి, పెంపకం చేయనున్నారు.2022, ఫిబ్రవరి 19న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధు లబ్ధిదారులలో 146 మంది లబ్ధిదారులకు రూ.15.30 కోట్ల విలువైన 63 యూనిట్లను (51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్ ట్రాక్టర్, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమం-పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు.కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కొనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ సునీల్‌రావు, టీఆర్‌ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.2022, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి 2వేల మంది లబ్ధిదార్లకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు.