80.txt 4.28 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
నవరత్నాలు_(పథకం)

https://te.wikipedia.org/wiki/నవరత్నాలు_(పథకం)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు.
ఆరోగ్యశ్రీ:ఈ పథకం వార్షిక ఆదాయం రూ.
5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.వైద్యం ఖర్చు రూ1,000 దాటితే వైద్య ఖర్చు ప్రభుత్వమే ఉచిత వైద్యం చేయిస్తుంది.
ఫీజు రీయంబర్స్‌మెంట్:ఈ పథకం పేదవారి విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది.
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.
20 వేలు ప్రతి విద్యార్ధికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తుంది.
పేదలందరికీ ఇళ్లు:ఈ పథకం ద్వారా ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఐదేళ్లలో 25 లక్షల  ఇళ్ళు కట్టిస్తారు.
వైయస్‌ఆర్ ఆసరా, వైయస్సార్ చేయూత:ఈ పథకం ద్వారా సున్నా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తుంది.ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.అలాగే వైయస్సార్ చేయూత  పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ  వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ.
75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది.
పించన్ల పెంపు:ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తారు.అవ్వా తాతల పింఛన్ రూ.
3,000 వరకు పెంచుకుంటూ పింఛన్లు ఇస్తుంది.
అమ్మఒడి:ఈ పథకం ద్వారా పిల్లలని బడికి పంపితే  ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.14,000 ఇస్తుంది.
వైయస్‌ఆర్ రైతు బరోసా:ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తారు.
పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తారు.పంట బీమా కూడ ప్రభుత్వమే చేలిస్తుంది.
వైఎస్సార్ జలయజ్ఞం:ఈ పథకం ద్వారా వై ఎస్ ఆర్ ప్రారంభించిన పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
మధ్యనిషేధం:ఈ పథకం ద్వారా మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి, మధ్యాన్ని 5 స్టార్ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేస్తుంది.