ప్రసాద్_పథకంhttps://te.wikipedia.org/wiki/ప్రసాద్_పథకంప్రసాద్ పథకం - భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి పరచడం తద్వారా మతపరమైన పర్యాటక అనుభవాన్ని సుసంపన్నం చేసే పథకం.తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని 2014-15లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.ప్రసాద్(PRASHAD) పథకం అనగా తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (Pilgrimage Rejuvenation And Spirituality Augmentation Drive).ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, అన్నవరం, సింహాచలం, తెలంగాణలోని రామప్ప, భద్రాచలం, జోగులాంబ పుణ్యక్షేత్రాలను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసి ప్రసాద్ పథకం కింద అభివృద్ధి కార్యకరమాలు జరుపుతుండగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాలనుంచి మరికొన్ని ప్రాంతాలను పర్యావరణ పర్యాటక ప్రదేశాలుగా మలిచేందుకు వినతులు వస్తున్నాయి.ప్రసాద్ పథకం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని (CFA) అందిస్తుంది.ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 100% ఖర్చులను భరిస్తుంది.అలాగే నిరంతర నిర్వహణకై పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు సమకూర్చుకోవాలి.తీర్థయాత్రలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధించడం.స్థానిక కళలు, సంస్కృతి, హస్తకళలు, వంటకాలు మొదలైన వాటిని ప్రోత్సహించడం,.పుణ్యక్షేత్రాలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం.తీర్థయాత్ర, మతపరమైన ప్రదేశం లేదా ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చగల సామర్థ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడంఅందుబాటులో ఉన్న స్థలాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడం లేదా భూ యజమానులు, వాటాదారులను సంప్రదించి భూమిని సమీకరంచడంఅమరావతి, ఆంధ్రప్రదేశ్అన్నవరం, ఆంధ్రప్రదేశ్సింహాచలం, ఆంధ్రప్రదేశ్రామప్ప, తెలంగాణభద్రాచలం, తెలంగాణజోగులాంబ, తెలంగాణఅమృత్సర్, పంజాబ్కేదార్నాథ్, ఉత్తరాఖండ్మధుర, ఉత్తర ప్రదేశ్వారణాసి, ఉత్తర ప్రదేశ్అజ్మీర్, రాజస్థాన్గయా, బీహార్కామాఖ్య , అస్సాంద్వారక, గుజరాత్పూరి, ఒడిశాకాంచీపురం, తమిళనాడువేలంకన్ని, తమిళనాడుగురువాయూర్, కేరళ