అల్లోపతీhttps://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A4%E0%B1%80కొన్ని వైద్యనిఘంటువుల నిర్వచనం ప్రకారం అల్లోపతి లేదా అల్లోపతిక్ వైద్యము అనగా సంప్రదాయపద్ధతుల్లో ఋజువుచేయబడిన వైద్యవిధానాలను వాడి వ్యాధులను నయం చేయడం.భారతదేశంలో అల్లోపతి అనే పదాన్ని లేదా వైద్యవిధానాన్ని సంప్రదాయక వైద్యవిధానాలనుండి వేరు పరచడానికి వాడతారు (ముఖ్యంగా ఆయుర్వేదం నుండి వేరు చేయడానికి) .దీనినే నవీన వైద్యమని పిలుస్తారు.హిపోక్రటీస్‌ను (క్రీ.పూ.460-360) నవీనవైద్యశాస్త్ర పితగా పేర్కొంటారు.వైద్యాన్ని మానవాతీత శక్తుల భావన నుండి తప్పించి, వ్యాధులపైన, ఆరోగ్యము పైన సహేతుకమైన వివరణలను ఇచ్చాడు.వ్యాధి ఒక సహజమైన ప్రక్రియ అని, వ్యాధి లక్షణము అనేది శరీరము వ్యాధిపై చూపే ప్రతిచర్య అని వివరించాడు.హిపోక్రటీస్ తరువాత గాలెన్ (సా.శ.2వ శతాభ్ధము) శరీరనిర్మాణము గురించి వివరించాడు.ఆపై ఎందరో - లియోనార్డొ డావిన్సీ, ఏండ్రియన్ వెసాలియస్, విలియం హార్వే వంటి శాస్త్రవేత్తలు నవీన వైద్య విధానానికి పునాదులు వేసారు.సా.శ.1819వ సంవత్సరములో రెనిలెనక్ స్టెతస్కోపును కనుగొని వైద్యరంగములో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారము చుట్టాడు.చికిత్సా పద్ధతులలో కూడా చాలా మార్పులు జరిగాయి.ఎడ్వర్డ్ జెన్నర్, లూయీస్ పాశ్చర్, వాక్స్‌మన్ వంటి వారు సూక్ష్మజీవనాశకాలపై పరిశోధనలు సాగించారు.వైద్యవిజ్ఞాన శాస్త్రములో అనేక బహుముఖ ఆవిష్కరణలు జరగడము వలన ఆధునిక వైద్యములో జరిగిన పరిణామాల్ని వివరించడము కూడా కష్టమైనది.శస్త్రచికిస్తలో కూడా మార్పులు వచ్చాయి.నీధింగ్ బెర్నాన్డ్ గుండె మార్పిడిని, జె.డి.హార్డీ ఊపిరితిత్తుల మార్పిడిని, ఆర్.సి.విల్లెహెరీ క్లోమ మార్పిడినీ, స్టార్‌జెల్ కాలేయ మార్పిడి చేయడంలో సఫలీకృతులయ్యారు.20 వ శతాబ్దములో ముఖ్యముగా వైద్య రంగములో కంపూటర్లు మొదలుకొని రోగనిర్ధారణ పరీక్షలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్, సి.టి స్కాన్, ఎమ్.ఆర్.ఐలు వచ్చాయి.రోగ నిర్ధారణ శీఘ్రముగానూ - అంతే వేగముతో మందులూ, సెలైన్లు, ఇంజక్షన్లు వంటివి వాడడంతో రోగం కూడా శీఘ్రగతిన నివారణ అవుతుంది.