దగ్గు మందుhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B1%81దగ్గు మందు (cough medicine or cough and cold medicine, also known as linctus) అనగా దగ్గును తగ్గించడానికి వాడే మందు.ఇది సాధారణంగా సిరప్ రూపంలో గాని లేదా టాబ్లెట్లుగా గాని లభిస్తుంది.అమెరికా దేశంలో సుమారు 10% మంది పిల్లలు వారానికి ఒకసారైనా దగ్గు మందును వాడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నా, వాటి ప్రభావం గురించి సరైన సమాచారం లేదు.డెక్స్ట్రోమెథోర్ఫాన్ (DXM) దగ్గు, జలుబు నివారణలలో కనిపించే ఒక సాధారణ పదార్ధం.ఇది దగ్గును ఆపడానికి సహాయపడుతుంది.ఈ మందు సురక్షితమైనది , ప్రభావవంతం మైనది .డెక్స్ట్రోమెథోర్ఫాన్ ( DXM ) ను 1958 లో FDA ఆమోదించింది.ఈ మందు అందరికి చౌక ధరతో అందరికి లభిస్తుంది .ఈ మందు మోతాదులో వాడినప్పుడు ఎక్కువ దుష్ప్రభావాలు లేవు కానీ పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది .ఈ మందులలో ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి, ఇవి పెద్ద మొత్తంలో హానికరం.వీటిలో ఎసిటమినోఫెన్ లేదా డీకాంగెస్టెంట్స్ ఉన్నాయి.ఎక్కువ మోతాదులో డెక్స్ట్రోమెథోర్ఫాన్(DXM) ను ఆల్కహాల్‌తో కలపడం సురక్షితం కాదు.ఇది మరణానికి దారితీస్తుంది.కోడైన్,ప్రోమెథాజైన్ కలిగిన ప్రిస్క్రిప్షన్ దగ్గు మందుల దుర్వినియోగం తక్కువ సాధారణంగా దగ్గు మూడు నుండి నాలుగు వారాల్లోనే తగ్గి పోతాయి .దగ్గు చికిత్సకు మందులు వాడతారు, ఇది సాధారణంగా మీకు ఎగువ శ్వాసకోశ సంక్రమణ (యుఆర్టిఐ) ఉన్నప్పుడు సంభవిస్తుంది.దగ్గు మందు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.దగ్గు మందులు సాధారణంగా రెండు వర్గాలుగా విభజించబడ్డాయి అవి " ఛాతీ దగ్గుకు" పొడి లేదా చక్కిన దగ్గుకు" చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.ఎక్కువ శ్లేష్మం రావడం వల్ల ఛాతీ దగ్గు వస్తుంది .చాతి దగ్గుకు గైఫెనెసిన్, ఐపెకాకువాన్హా, అమ్మోనియం క్లోరైడ్, స్క్విల్ పదార్ధాలను కలిగి ఉన్న మందులను వాడటం వల్ల పేరుకుపోయిన శ్లేష్మం విచ్ఛిన్నం అవుతుంది.ఈ పదార్ధాలను" ఎక్స్‌పెక్టరెంట్లు" అంటారు.పొడి దగ్గుకు ఫోల్కోడిన్ , డెక్స్ట్రోమెథోర్ఫాన్ వంటి సహజ దగ్గు నిరోధించడానికి దగ్గును తగ్గించే మందులు.దగ్గుకు మనకు అందుబాటులో ఉండే వస్తువులతో తేనను గోరువెచ్చని నీటితో త్రాగడం, (రెండు టీస్పూన్ల తేనెను గోరువెచ్చని నీరు లేదా మూలికా టీతో ).వేడి నీరు త్రాగడం ,జలుబు లేదా ఫ్లూతో దగ్గు, ముక్కు కారటం , తుమ్ములను ఉపశమనం చేయడానికి వేడి పానీయాలు తీసుకోవడం ,ఆవిరి పీల్చడం,అల్లం టీ, అల్లం పొడి, తో ఉబ్బసం దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.వేడి నీరు, అల్లంతో టీ త్రాగడం ,జింక్, విటమిన్ సి,ఎచినాసియాతో మందులు రోగనిరోధక శక్తి కి వాడటం, వెచ్చని నీళ్లలో ఉప్పు వేసుకొని గార్గ్ చేయడం (ఇవి గొంతు వెనుక భాగంలో ఉన్న వైరస్లు,బ్యాక్టీరియాను తొలగించడానికి) వంటి సహజ వనరులతో దగ్గును కొంత మేర మనుషులు తగ్గించుకొనే ప్రయత్నం చేయవలెను