102.txt 5.23 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28
నిద్రమాత్ర

https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0

నిద్ర మాత్రలు  నిద్ర పట్టడానికి వాడే ఒకరకమైన ఔషధము.రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, ఏవైనా ఒత్తిళ్లతో సతమతమైపోతున్నా.. వెంటనే గుర్తొచ్చేది నిద్రమాత్ర.
చాలామంది నిద్ర కోసం ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు.
తరచూ ఇవి వాడటం వల్ల అదే అలవాటుగా మారుతుంది.
కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.
అయితే, నిద్రమాత్రలు తరచూ మింగడం వల్ల వివిధ రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.
నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలేర్పడటం, తలనొప్పి, గుండెలో మంట, కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా అయిపోవడం.. మొదలైన సమస్యలు ఏర్పడతాయి.
కొంతమందిలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో నిద్రమాత్రలు మానేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
లేకపోతే వాంతులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్లు మసకగా కనిపించడం, దురద, ఛాతిలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం.. ఇలా పలు రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయి.
ఏదైనా అలవాటైతే మానడం చాలా కష్టం.
అలాగే ఒక్కసారి నిద్రమాత్రలు వేసుకోవడం మొదలు పెట్టి.. చాలా కాలం కొనసాగించారంటే ఇక అంతే సంగతులు.
ఆ అలవాటు మానడమూ అంతే కష్టం.
కాబట్టి నిద్ర పట్టడం లేదని మాత్రలు వేసుకొని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం కంటే ఒక్కసారి మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదో డాక్టర్‌కు వివరంగా చెబితే వారే చక్కటి సలహా సూచిస్తారు.
కొంతమంది  వైద్యుల  సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతుంటారు.
కానీ ఇది దీర్ఘకాలంగా కొనసాగితే వాటికే అలవాటు పడే అవకాశం ఉంటుంది.
అలాగే తరచూ వాడుతుంటే కొన్ని రోజులకు ఈ మాత్రల మోతాదు శరీరానికి సరిపోదు.
ఇంకా ఎక్కువ మోతాదు వేసుకుంటే గానీ నిద్రపట్టదు.
నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడి కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది.
కాబట్టి డాక్టర్ సలహా మేరకే నిద్ర మాత్రలు వాడినా వారు చెప్పిన జాగ్రత్తలు  తప్పక పాటించాలి.
గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి నిద్ర పట్టదు.
ఇలాంటి సమయాల్లో నిద్రమాత్రలు వేసుకోవడం అస్సలు మంచిది కాదు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వేసుకోకూడదు.
అలాగే నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత  డ్రైవింగ్ చేయకూడదు.
ఏ పానీయంలోనైనా నిద్ర మాత్రల్ని కలుపుకొని తాగకూడదు.