11.txt 5.1 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
చిట్కా వైద్యాలు

https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE_%E0%B0%B5%E0%B1%88%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81


పల్లెటూళ్లలో, మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం.
పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లభ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే.
నాగరికత పెరిగే కొలది ఇంటి వైద్యం విలువ కోల్పోయింది.
చాలా జబ్బులకు ఇంట్లో తేలిగ్గా లభించే పదార్ధాలు వాడితే స్వస్థత చేకూరుతుంది.
ఇంటివైద్యం రోగాలు ప్రారంభదశలో వున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది.
రోగం తీవ్రత పెరిగితే తప్పని సరిగా డాక్టర్ని సంప్రదించాలి.
ఇంటి వైద్యం ద్వారా తగ్గించగలిగే జబ్బులుః
వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు మాయం.
పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి.
ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టే దాకా ఆవిరి పడితే చాలా తేడా కనిపిస్తుంది.
దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.
తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి.
దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
నాలుగు తులసి ఆకుల రసమ్ తాగాలి.ఎండు మిరపకాయల గింజలు కొన్ని పావు గ్లాసు నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి మాయం.
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా చక్కెర, ఒక చిటికెడు ఉప్పు వేసి, బాగా కలియబెట్టి త్రాగవలెను.
నీళ్లు ఎక్కువగా త్రాగాలి భోజనం అయిన వెంటనే సోపు గింజలు తినాలి
వచ్చినప్పుడు చెవిలో నీరు పోకుండా చూసుకోవాలి.
వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి
===మధుమేహము, నివారణ===
గ్లాసు మజ్జిగలో ఒక స్పూను నల్లఉప్పు కలుపుకొని తాగవలెను.
వేప ఆకులను తిన వలెను.