12.txt 5.25 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష

https://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B9%E0%B0%A4,_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6_%E0%B0%AA%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్)  (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష.
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది.
దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి)  అనేవారు.
వివిధ రాష్ట్రాలు, కళాశాలలూ గతంలో స్వంతంగా నిర్వహించుకుంటూ ఉన్న ప్రవేశ పరీక్షలన్నిటినీ రద్దుచేసి, వాటి స్థానంలో నీట్-యుజిని నిర్వహిస్తున్నారు.
ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల కోసం నీట్ (యుజి) ని ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహిస్తోంది.
ఇది, పరీక్షా ఫలితాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్‌కు అందిస్తుంది.
2019 కి ముందు, అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ప్రోమెట్రిక్ టెస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ఈ పరీక్షను నిర్వహించేది.
2019 సెప్టెంబరులో ఎన్‌ఎంసి చట్టం 2019 ను అమలు చేసిన తరువాత, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (జిప్మెర్) తో సహా భారతదేశంలోని మెడికల్ కాలేజీలన్నిటిలో ప్రవేశానికి నీట్-యుజి సాధారణ ఆల్ ఇండియా ప్రవేశ పరీక్షగా మారింది.
అప్పటి వరకు ఎవరికి వారే ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారు.
భారతదేశం అంతటా 66,000 ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్లలో ప్రవేశానికి జరిపే ఒకే ప్రవేశ పరీక్ష, నీట్-యుజి.
ఈ పరీక్షను వివిధ భాషల్లో రాయవచ్చు.
2018 లో 80% మంది అభ్యర్థులు ఇంగ్లీషులో రాయగా, హిందీలో 11%, గుజరాతీలో 4.31%, బెంగాలీలో 3%, తమిళంలో 1.86% మందీ నీట్‌ పరీక్ష రాశారు.
పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి.
ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఒక్కొక్కదాని నుండి 45 ప్రశ్నలు, బయాలజీ నుండి 90 ప్రశ్నలూ ఉంటాయి.
ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు వస్తాయి.
ప్రతి తప్పుకూ ఒక మార్కు కోసేస్తుంది అంటే మైనస్ 1 మార్కు అన్నమాట.
పరీక్ష వ్యవధి 3 గంటలు, గరిష్ఠ మార్కులు 720.
నీట్ కింద ఇచ్చే మొత్తం సీట్ల సంఖ్య 66,000.
నీట్ ర్యాంకు ఆధారంగా విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంటుంది.