13.txt 2.25 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8
జీవ ఔషధాలు

https://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5_%E0%B0%94%E0%B0%B7%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

టీకా మందులు, రీకాంబినెంట్ థెరప్యూటిక్ ప్రోటీన్లు మొదలైనవి జీవ ఔషధ ఉత్పత్తుల కిందకు వస్తాయి,ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 80కి పైగా జీవ ఔషధ సమతౌల్య కణాలు అభివృద్ధి ప్రక్రియలో ఉన్నాయి అనేక జీవ ఔషధాలకు మేధోసంపత్తి హక్కుల గడువు ముగుస్తున్నందున బయో సిమిలర్ల (జీవ ఔషధాలకు జనరిక్‌లు) విపణి గణనీయంగా వృద్ధి చెందనుంది.
భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం రసాయన ఔషధాల స్థానంలో జీవ ఔషధాలు రానున్నాయని.. ఈ నేపథ్యంలో బయో సిమిలర్ల విపణి విస్తరించగలదని నిపుణులు చెబుతున్నారు.
ఔషధ వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వాలు భావించడం, అనుకూలమైన నిబంధనలు, 2015 నాటికి 79 బిలియన్ డాలర్ల మార్కెట్ కలిగిన జీవ ఔషధాల పేటెంట్ల గడువు తీరనుండడం తదితర అంశాలు బయో సిమిలర్ల అభివృద్ధికి వూతం ఇవ్వనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 2014 చివరి నాటికి బయోసిమిలర్ల విపణి 1,940 కోట్ల డాలర్లకు చేరగలదని, 2020 నాటికి ఇది 5,500 కోట్ల డాలర్లకు ఎగబాకగలదని అంచనా.