130.txt 1.91 KB
Newer Older
palash's avatar
palash committed
1 2 3 4 5 6 7 8 9
ఎండోస్కోప్

https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%AA%E0%B1%8D

ఎండోస్కోప్ అనగా ఎండోస్కోపీ విధానంలో శరీరం లోపల చూడటానికి ఉపయోగించే మైక్రో కెమెరా కలిగిన ఒక వెలుగునిచ్చే ఆప్టికల్, ఇది సాధారణంగా సన్నని, గొట్టపు పరికరం.
ఇది గొంతు లేదా అన్నవాహిక వంటి అంతర్గత అవయవాలు పరిశీలించుటకు ఉపయోగించబడుతుంది.
ఈ రకపు ప్రత్యేకమైన పరికరాలకు తరువాత ఏ అవయవ లక్ష్యంగా ఉపయోగించబడుతున్నవో ఆ అవయవ పేరు వచ్చేలా పేరు పెట్టబడ్డాయి.
ఉదాహరణలుగా మూత్ర కోశ అంతర్దర్శిని (మూత్రాశయం), మూత్ర పిండ అంతర్దర్శిని (కిడ్నీ), శ్వాస నాళ అంతర్దర్శిని (శ్వాసకోశం), కీలు లోపల దర్శిని (కీళ్ళు), పెద్దప్రేగుదర్శిని (పెద్దప్రేగు) ఉన్నాయి.
ఇది ఆర్థ్రోస్కోపి వంటి శస్త్రచికిత్సలలో చూసి పరిశీలించుకోవడానికి, రోగనిర్ధారణ చేసుకోవడానికి లేదా శస్త్రచికిత్సలు చేయడానికి ఉపయోగించవచ్చు.